బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్: రాజ్, యామిని పెళ్లి డేట్ ఫిక్స్, 60 రోజుల టైమ్- ఫోర్జరీ చేసిన కావ్య- సొంతింటికి రాజ్!-brahmamudi serial april 24th episode raj yamini wedding fix kavya forgery star maa brahma mudi today disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్: రాజ్, యామిని పెళ్లి డేట్ ఫిక్స్, 60 రోజుల టైమ్- ఫోర్జరీ చేసిన కావ్య- సొంతింటికి రాజ్!

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్: రాజ్, యామిని పెళ్లి డేట్ ఫిక్స్, 60 రోజుల టైమ్- ఫోర్జరీ చేసిన కావ్య- సొంతింటికి రాజ్!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి ఏప్రిల్ 24 ఎపిసోడ్‌లో రాజ్‌తో యామిని పెళ్లికి ముహుర్తం పెట్టి డేట్ ఫిక్స్ చేస్తారు యామిని తల్లిదండ్రులు. మరోవైపు రామ్‌ను కలిసిన కావ్య తన బాస్ రాజ్‌లా సంతకం పెట్టమంటుంది. కానీ, దానికి రామ్ ఒప్పుకోడు. దాంతో కావ్య రాజ్‌లా సంతకం ఫోర్జరీ చేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 24వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం రుద్రాణి గొడవ చేస్తుంది. రాజ్‌ను మాత్రం రప్పించరు. ఎవరిని పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారు అని రుద్రాణి అంటుంది. ఎవరు ఎవరిని చేయట్లేదు. మీకు కావాల్సింది డీల్ పూర్తి చేయడమేగా. 24 గంటల్లో డీల్ పూర్తి చేసి చూపిస్తాను అని కావ్య సవాల్ చేస్తుంది.

సాయంత్రం క్లారిటీ

అవునా, ఎలా చేస్తావ్ అని రుద్రాణి అంటే.. ఎలా చేస్తే మీకెందుకండి. మీకు కావాల్సింది డబ్బులు. అవి తీసుకొచ్చి వాళ్లకిస్తా అని కావ్య వెళ్లిపోతుంది. కావ్య అంటూ వెంటే అపర్ణ వెళ్తుంది. తెస్తా, సాధిస్తా అంటూ రోషంగా వెళ్లిపోయింది. కోట్లు అంటే రాజ్ వేసుకునే కోట్లు అనుకుంటుందా ఏంటీ అని రుద్రాణి అంటుంది. ఎందుకత్తా అంత తొందర. సాయంత్రం వస్తుందిగా. అప్పుడు క్లారిటీ వస్తుందిగా అని స్వప్న అంటుంది. అంత కాన్ఫిడెంట్‌గా రుద్రాణికి మాటిచ్చేసి వచ్చావ్ అని అపర్ణ అడుగుతుంది.

కాకపోతే ఆయన డెత్ సర్టిఫికేట్ కావాలంటుందా. పెద్దదని ఊరుకున్నా. లేకపోతే ఈరోజు ఆవిడ చేసిన పనికి చెంపలు పగలగొట్టేదాన్ని అని కావ్య అంటుంది. దాని సంగతి నేను చూసుకుంటే కానీ, రాజ్ వచ్చి డీల్ పూర్తి చేయడానికి వాడికి గతం గుర్తులేదుగా. 2 కోట్లు ఎలా ఇస్తావ్ అని అపర్ణ అడుగుతుంది. 2 కోట్లు ఇవ్వడానికి ఆయన రావాల్సిన అవసరం లేదు. నా పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే చాలు. పెండింగ్‌లో పనులు పూర్తి చేస్తాను అని కావ్య అంటుంది.

కానీ, నీ పేరు మీద ఇస్తున్నట్లుగా రాజ్ సంతకం చేయాలిగా. వాడికి వాడి పేరే గుర్తులేదు. ఎలా సంతకం చేస్తాడు అని అపర్ణ అంటుంది. తెలియట్లేదు. కానీ, ఎలాగోల సమస్య పరిష్కరిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు అని అపర్ణకు కావ్య భరోరా ఇచ్చి వెళ్తుంది. కారులో వెళ్తూ రాజ్‌కు కాల్ చేస్తుంది కావ్య. ఇంత ఉదయమే కాల్ చేస్తున్నారు. నాకు కలవాలని ఉన్నట్లుగానే తనకు కూడా కలవాలని ఉన్నట్లుంది అని రాజ్ సంతోషిస్తాడు.

ఇంపార్టెంట్ విషయమే

కావ్య కలవాలని అడిగితే.. మీరు కలవాలని అనుకుంటున్నారా. చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంది. దేనికి కలవడం అని రాజ్ అంటాడు. చెబితే గానీ కలవరా అని కావ్య అంటే.. చెబితే కలుస్తాను కదా అని రాజ్ అంటాడు. ఈయన నిజంగానే గతం మర్చిపోయారా. లేక మర్చిపోయినట్లు నటిస్తున్నారా. మొండితనం మాత్రం పోలేదు అని కావ్య అనుకుంటుంది. కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తుంటాను రండి. చెబితే షాక్ అవుతారు అని కావ్య కాల్ కట్ చేస్తుంది.

ఇంతగా అడుగుతుందంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయింటుంది అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు ఇంట్లో పంతులుతో రాజ్, యామిని పెళ్లికి ముహుర్తం పెట్టిస్తుంటారు యామిని తల్లిదండ్రులు. ఇద్దరి జాతకాలకు తగినట్లుగా ముహుర్తం కుదరాలిగా అని పంతులు అంటాడు. అల్లుడిగారిని రమ్మను. ముహుర్తం పెడుతున్నట్లు చెబితే బాగుంటుందని యామిని తండ్రి అంటాడు. ఇంతలో రాజ్ బయటకు వెళ్తుంటాడు.

రాజ్‌ను ఆపి పెళ్లికి మీ ఇద్దరి జాతకాలు చూపించి ముహుర్తం పెట్టుకుంటే అయిపోతుందని పిలిపించాం. నువ్ కూడా ఉంటే బాగుంటుందని ఉండమంటున్నాం అని వైధేహి అంటుంది. టైమ్ అవుతుందే అనుకున్న రాజ్ పెద్దవాళ్లు మీరున్నారుగా మళ్లీ నేనెందుకుండి. మీరు ఎలా అంటే అలానే, మీరు కానిచ్చేయండి అని రాజ్ వెళ్లిపోతాడు. నేను చెప్పానుగా, బావకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదని. వెంటనే పెళ్లి చేసేయండి అని యామిని అంటుంది.

60 రోజులే కదా

ముందు ముహుర్తం చూడని అని తండ్రి అంటాడు. వచ్చే నెల 26 తారీఖున దివ్యమైన ముహుర్తం ఉందని పంతులు చెబుతాడు. మనకు కూడా టైమ్ దొరుకుతుందండి అని వైధేహి అంటుంది. 2 నెలలు అంటే లేట్ అవుతుంది. వీలైనంత త్వరగా పెళ్లి చేస్తే మంచిదని యామిని అంటుంది. జాతకం ప్రకారం ముహుర్తం చేసి చేస్తేనే ఇద్దరు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు. కేవలం 60 రోజులే కదా అని వైధేహి అంటుంది. అదే ముహుర్తానికి మీరు ఖాయం చేయండి అని పంతులుకు చెబుతుంది వైధేహి.

రాజ్ ఇక నిన్ను నన్ను ఎవరు వేరుచేయలేరు. రెండు నెలల్లో ఒక్కటవుతున్నాం అని యామిని అంటుంది. మరోవైపు రాజ్ సంతకం ఎలా చేస్తారని కావ్య టెన్షన్ పడుతుంది. బిజీగా ఉన్నారా అని కావ్య అడిగితే.. నేను గతం మర్చిపోయి పీస్‌ఫుల్‌గా ఉన్నాను అని రాజ్ అంటాడు. తర్వాత నేను చిన్న తప్పు చేశాను. దాని వల్ల జాబ్ పోయేలా ఉంది అని కావ్య అంటే.. జాబ్ పోయే పని అంటే.. చిన్న తప్పు ఎలా అవుతుందండి. పెద్ద తప్పే చేసి ఉంటారు అని రాజ్ అంటాడు.

ఈయన పెట్టుకున్న రూల్స్ మాత్రం మర్చిపోవట్లేదు అని కావ్య అనుకుంటుంది. పెద్ద తప్పే జరిగిందండి అని కావ్య అంటుంది. ఏంటండి అది.. నా వల్ల అయినా హెల్ప్ చేస్తాను అని రాజ్ అంటే.. నిజంగా చేస్తారా అని రాజ్ చేయి పట్టుకుంటుంది కావ్య. దాంతో రాజ్ ఆశ్చర్యపోయి ఒప్పుకుంటాడు. సారీ అండి నేనేదో టెన్షన్‌లో అని కావ్య అంటే.. పర్లేదండి, చేతులేగా పట్టుకున్నారు అని రాజ్ అంటాడు. కాళ్లు కూడా పట్టుకోమంటారా ఏంటీ అని కావ్య అంటుంది. క్యాజువల్‌గా అన్నాను అని రాజ్ అంటాడు.

బాస్‌లాగా సంతకం చేయాలి

మా బాస్ ఫారెన్ వెళ్లారు. వెళ్తూ నన్నో డీల్ పూర్తి చేయమన్నారు. వెళ్తూ పవర్ ఆఫ్ అటార్నీ లెటర్ హెడ్ ఇస్తూ వెళ్లారు. కానీ, నేను అది పోగొట్టి తప్పు చేశాను. ఈ డీల్ పూర్తి చేస్తే కానీ మనీ రాదు. డబ్బు వస్తే కానీ రా మెటేరియల్ వాళ్లకు ఇవ్వలేం. ఇప్పుడు గనుక ఆయన సంతకం లెటర్ హెడ్ నా చేతిలో ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలను. మీరు అనుకుంటే అది తిరిగి తీసుకురాగలను అని కావ్య అంటుంది. మా బాస్ నాకు పవర్ ఆఫ్ అటార్ని ఇస్తున్నట్లుగా లెటర్ హెడ్ రెడీ చేశాను. మీరు మా బాస్‌లాగా ఒక సంతకం చేయాలి అని కావ్య అడుగుతుంది.

అమ్మో.. నన్ను ఫోర్జరి చేయమంటారా అని రాజ్ భయపడతాడు. మనం ఎవరిని మోసం చేయట్లేదుగా అని కావ్య అంటుంది. నా వల్ల కాదు. ఇలాంటి పనులంటే నా చేతులు వణికిపోతాయ్. మీ బాస్‌లాగా నేను సంతకం చేయడం తప్పండి అని రాజ్ అంటాడు. నాకోసం ఇంత చిన్న పని కూడా చేయలేరా అని కావ్య అడిగితే.. ఫోర్జరీ చేయలేనండి. కావాలంటే విషయం మీ బాస్‌కు చెప్పి ఫ్యాక్స్‌లో సైన్ చేసి ఇవ్వమనండి అని రాజ్ అంటాడు. ఆ బాస్ నువ్వేరా నా మొగుడా. ఎలా చెప్పాలి అని కావ్య అనుకుంటుంది.

నేను ఆ లెటర్ హెడ్ పోగొట్టానని తెలిస్తే నన్ను జాబ్ నుంచి తీసేస్తారు అని కావ్య అంటుంది. నా వల్ల కాదండి అని రాజ్ అంటాడు. నేనే ఏదోలా చేసుకుంటాను. మీరు వెళ్లండి అని కావ్య అంటుంది. దాంతో రాజ్ వెళ్తానని వెళ్లిపోతాడు. కావ్య షాక్ అయి బాధపడుతుంది. ఇప్పుడేం చేయాలి అని కంగారుపడుతుంది. ఆ సంతకం నేనే ప్రాక్టీస్ చేసి ఆ పవర్ ఆఫ్ అటార్నీ నేనే తెచ్చుకుంటాను అని కావ్య అంటుంది. కావ్య సంతకం చేస్తుంది.

లీగల్ పేపర్స్ పంపించారు

మరోవైపు రుద్రాణికి రా మెటేరియల్ వాళ్లు కాల్ చేసి కావ్య రెండు కోట్లు ఇచ్చేసిందని చెబుతాడు. అలా ఎలా చేస్తుంది. అలా చేయాలంటే పవర్ ఆఫ్ అటార్నీ తనపేరుపై ఉండాలిగా అని, తన ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి షాక్ అవుతుంది. మేము కూడా అదే అడిగాం. ఇకనుంచి మీతో బిజినెస్ చేయాలంటే మీ పేరు మీద అధికారం ఉండాలి అని. రాజ్ సర్ పూర్తిగా తనకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లు లీగల్ పేపర్స్ పంపించారు అని అతను అంటాడు. ఎప్పుడు రాజ్ సంతకం చేశాడు అని రుద్రాణి అంటుంది.

అది మీరు కావ్యనే అడగండి. అయినా మీ మాట విని అనవసరంగా మీ ఇంటికి వచ్చి కావ్య మేడమ్‌నే ఇబ్బంది పెట్టాను అని అతను అంటాడ. అలా చేయడంతోనేగా నీకు రెండు కోట్లు వచ్చిందని అతను అంటాడు. సరేగానీ కావ్య పంపించిన డాక్యుమెంట్స్ కాపీ నాకు మెయిల్ చేయమని రుద్రాణి అంటుంది. తర్వాత ఎంతకు తెగించావ్ కావ్య. రాజ్ చచ్చాడని ఒప్పుకుంటే వాడి సంతకం ఫోర్జరీ చేసి కంపెనీ బాధ్యతలను నువ్ తీసుకుంటావా. నువ్ చేసిన ఈ తప్పును ఎలా బయటపెడతానో చూడు అని రుద్రాణి అనుకుంటుంది.

కట్ చేస్తే.. హాల్లో అందరి ముందు డాక్యుమెంట్స్ వేస్తుంది రుద్రాణి. మళ్లీ ఏం సమస్య తీసుకొచ్చావ్ అని ప్రకాశం అంటే.. దీనికి నాకు ఏం సంబంధం లేదు. రాజ్ మీద ఒట్టు అని రుద్రాణి అంటుంది. దాంతో ఇందిరాదేవి చివాట్లు పెడుతుంది. సరే పాయింట్‌కు వస్తాను. ఈ సమస్యకు మూలం, ఆధారం అన్ని మీ ముద్దుల కోడలు కావ్యగారే తీసి చదువు అని సుభాష్‌కు చెబుతుంది రుద్రాణి. పవర్ ఆఫ్ అటార్నీ కావ్య పేరుమీదకు వచ్చిందని సుభాష్ అంటాడు.

రాజ్ ఎలా బతికొచ్చాడు

రాజ్ లేకుండా కావ్య పేరు మీద ఎలా వస్తుందని సీతారామయ్య అంటాడు. అంటే, కంపెనీ మీద పూర్తి హక్కులు కావ్య పేరు మీదకు వచ్చినట్లేనా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అవును, చెక్ పవర్ చేతికిచ్చినట్లు అని రుద్రాణి అంటుంది. షాక్ అయ్యారా, కావ్యకు ఇది ఎలా వచ్చిందని నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను అని రుద్రాణి అంటుంటే.. ఇంతలో కావ్య వస్తుంది. చనిపోయిన రాజ్ ఎప్పుడు బ్రతికొచ్చాడు. నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఎలా ఇచ్చాడు అని రుద్రాణి అడుగుతుంది.

తర్వాత దుగ్గిరాల ఇంటికి రాజ్ వస్తాడు. నేరుగా ఇక్కడికి వచ్చి ఆగానేంటీ, ఈ ఇంటికి నాకు సంబంధం ఏంటీ. ఏ సంబంధం లేకుంటే నాకు ఏదో తెలిసినట్లు అనిపిస్తుందేంటీ అని రాజ్ గేట్ తీసుకుని ఇంట్లోకి వస్తాడు. అది చూసి కావ్య షాక్ అవుతుంది. ఇక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం