Brahmamudi April 17th Episode: అపర్ణను కాపాడిన రాజ్- తల్లి బర్త్ డే చేసిన రామ్- ఉలిక్కిపడిన యామిని- అప్పు వార్నింగ్-brahmamudi serial april 17th episode aparna meets raj celebrates birthday star maa brahma mudi today disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 17th Episode: అపర్ణను కాపాడిన రాజ్- తల్లి బర్త్ డే చేసిన రామ్- ఉలిక్కిపడిన యామిని- అప్పు వార్నింగ్

Brahmamudi April 17th Episode: అపర్ణను కాపాడిన రాజ్- తల్లి బర్త్ డే చేసిన రామ్- ఉలిక్కిపడిన యామిని- అప్పు వార్నింగ్

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial April 17th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 17 ఎపిసోడ్‌లో గుడిలో రాజ్‌ను చూడగానే దగ్గరికి వెళ్తానని కావ్యను వేడుకుంటుంది అపర్ణ. సరేనని అంటుంది కావ్య. అపర్ణ కిందపడబోతుంటే రాజ్ కాపాడుతాడు. తర్వాత అపర్ణ బర్త్ డే చేస్తాడు రాజ్. మరోవైపు రుద్రాణికి అప్పు వార్నింగ్ ఇస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 17వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రుద్రాణికి ఇంటిల్లిపాది చివాట్లు పెట్టిన తర్వాత పైనుంచి అప్పు వస్తుంది. ఏం పొట్టి పోలీస్ ఎక్కడికి టింగు రంగా అని బయలుదేరావ్ అని రుద్రాణి అంటుంది. ఒక ఫ్యామిలీని ఇబ్బందిపెడుతున్న వాళ్లను పట్టుకునేందుకు అని అప్పు చెబితే.. అందులో మన జాతి రత్నాలు లేరా అని స్వప్న అంటుంది.

రుద్రాణికి అప్పు వార్నింగ్

మనల్ని కాదులే అని రాహుల్ అంటే.. దొంగలే దొంగలు కాదని అనడం చాలా ఫన్నీగా ఉందని స్వప్న వెళ్లిపోతుంది. అక్కా చెప్పినట్లు అలాంటి లిస్ట్‌లో మీ పేర్లు లేకుండా ఉండాలని కోరుకోండి. ఉంటే మాత్రం మీరు అంటున్న ఈ పొట్టి పోలీస్ పవర్ ఏంటో చూడాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అప్పు. దులిపేసుకున్నట్లు రాహుల్ చేస్తే.. దులిపేసుకున్నావా అని రుద్రాణి అంటుంది.

ఈ ఇంట్లో మనకు జరిగే అవమానాలను ఆ మాత్రం దులిపేసుకోకపోతే కష్టం మామ్ అని రాహుల్ అంటాడు. తర్వాత ఇద్దరూ అపర్ణ నార్మల్‌గా మారి గుడికి వెళ్లడంపై డౌట్ పడతారు. ఏదో తేడాగా ఉందని ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారు. మరోవైపు కావ్య పంపిన షర్ట్ వేసుకుని రాజ్ రెడీ అయి అద్దంలో చూసుకుంటాడు. ఎలా ఉందని అంటే.. రామ్ అంతరాత్మ సంక్రాంతి అల్లుడిలా స్టైల్‌గా ఉందని చెబుతాడు. కళావతి గారికి నచ్చుతుందా అని రామ్ అంటే.. ఈ గిఫ్ట్ ఇచ్చిందే ఆవిడరా అని అంతరాత్మ అంటాడు.

రాజ్ గతం మర్చిపోయిన అంతరాత్మతో మాట్లాడటం మాత్రం చూపించారు. హాల్లో యామిని తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది. రామ్‌ను చూసి ఆశ్చర్యపోతారు. ఈ డ్రెస్‌లో చాలా బాగున్నారని వైధేహి అంటుంది. ఏమైనా స్పెషలా అని యామిని తండ్రి అడిగితే.. గుడికి వెళ్తున్నాను అని రామ్ అంటాడు. యామినితో కలిసి వెళ్తున్నారా అని వైధేహి అంటే.. ఒక్కన్నే వెళ్తున్నాను అని రామ్ చెబుతాడు. ఏది ఏమైనా మీ డ్రెస్ అయితే చాలా బాగుంది. అమ్మాయి గిఫ్ట్‌గా ఇచ్చిందా అని అడుగుతుంది వైధేహి.

నీలోనే సమస్య ఉంది

లేదు మామ్, బావే బుక్ చేసుకున్నాడు. ఈ డ్రెస్ మమ్మీ డాడీకి ఎందుకు నచ్చిందో తెలియదు కానీ, నాకు అయితే అస్సలు నచ్చలేదు. ఏం బాగుంది నాన్న. మీ జెనరేషన్ వాళ్లు వేసుకునేలా ఉంది. బావ ఫిజిక్‌కు సూట్ అయ్యే అవుట్ ఫిట్ కాదు. చూడటానికి చాలా ఓల్డ్‌గా, చీప్‌గా, రెండు మూడు సార్లు వాడనట్లుగా ఉంది యామిని అంటుంది. దాంతో చూసే కళ్లను బట్టి ఉంటుంది యామిని. అందరికి నచ్చి నీకు మాత్రమే నచ్చలేదంటే నీలోనే ప్రాబ్లమ్ ఉన్నట్లు కదా అని రామ్ అంటాడు.

మోడ్రన్ డ్రెస్సులు ఫాలో అయ్యే నీకు ట్రెడిషనల్ డ్రెస్సుల గురించి ఏం తెలుస్తుంది అని రామ్ అంటాడు. ఏ గుడికి వెళ్తున్నావ్ అని యామిని అడిగితే.. శివాలయంకు అని అబద్ధం చెబుతాడు రామ్. గురువారం శివాలయంకు అని మనసులో అనుకుంటుంది యామిని. రాజ్ గుడికి వెళ్తాడు. గుడికి అని చెప్పాడుగా మళ్లీ ఏ గుడికి అని ఎందుకు అడగటం అని వైధేహి అంటుంది. తను అబద్ధం చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో తెలుసుకునేందుకు అని యామిని అంటుంది.

మరోవైపు గుడిలో రాజ్ కోసం కావ్యతో అపర్ణ ఎదురుచూస్తుంటుంది. ఇంతలో పూజారి వచ్చి పూజకు, అన్నదానంకు అని సిద్ధం చేశానని చెబుతాడు. వాడేంటే ఇంకా రావట్లేదు. కావ్య నిజం చెప్పు వాడికోసం ఇంట్లో ఏడుస్తున్నానని అబద్ధం చెప్పటం లేదు కదా అని అనుమానిస్తుంది అపర్ణ. అబద్ధం కాదు. ఆయనతో మాట్లాడాను. రావడానికి ఒప్పుకున్నారు అని కావ్య చెబుతుంది. నిన్ను నమ్మి వచ్చాను. వాడు రాకపోతే కనీసం ప్రసాదం కూడా ముట్టుకోను అని అపర్ణ అంటుంది.

అపర్ణ సంతోషం

అదిగో అనగానే వచ్చేశారు అని కావ్య చెబుతుంది. ఎక్కడ ఎక్కడ అంటూ చూస్తుంది అపర్ణ. కారులో నుంచి రామ్‌గా రాజ్ దిగుతాడు. రాజ్‌ను చూసి అపర్ణ షాక్ అవుతుంది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజ్.. రాజ్.. నిజమే.. నా కొడుకుకి ఏం కాలేదు. వాడు బ్రతికే ఉన్నాడు. ఎన్నాళ్లు అయిపోయిందిరా నిన్ను చూసి అని అపర్ణ సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అంటుంది. అపర్ణ కలవడానికి వెళ్తుంటే.. కావ్య ఆపుతుంది.

మీరు ఇలా ఎమోషనల్ అవుతారనే ఇన్నాళ్లు ఆయన్ను మీకు చూపించలేదు అని కావ్య అంటుంది. కనీసం దగ్గరికైనా వెళ్లకుండా ఎలా ఉండను అని బాధపడుతుంది అపర్ణ. ఆయన మీ కొడుకే కానీ, అది ఆయనకు తెలియదు. ఆయన గతం మర్చిపోయారన్నది మీరు మర్చిపోకండి అని కావ్య అంటుంది. ఒక్కసారి వాడితో మాట్లాడాలని ఉందని అపర్ణ అంటుంది. ఒక్క మాటతో సరిపెట్టుకోలేరు. అమ్మా అని పిలిపించుకోవాలని ఆరాటపడతారు. అది ఆయనకు అర్థం కాదు అని కావ్య నచ్చజెబుతుంది.

ఆయన దేనిగురించి అయినా ఎక్కువ ఆలోచిస్తే అది ఆయనకే ప్రమాదమని చెప్పానుగా. ఆయన మనకు ప్రాణాలతో దక్కాలంటే మీరు మౌనంగా ఉండాలి అని కావ్య చెబుతుంది. కళావతి గారు వచ్చారా లేదా. లోపల ఉండి ఉంటారు అని గుడిలోకి వెళ్తాడు రాజ్. సరే, నువ్వు అన్నట్లు ఏం మాట్లాడను. కానీ, దగ్గరి నుంచి అయినా చూడని. వాడి ప్రాణాలకు ప్రమాదం అని తెలిసాక పలకరించను. ఒక్క మాట కూడా మాట్లాడను. దగ్గరి నుంచే చూస్తాను. నీకు ఇచ్చిన మాట తప్పను అని కోడలిని వేడుకుంటుంది అపర్ణ.

ఉపవాసం ఉండటంతో

దాంతో సరే అన్న కావ్య జాగ్రత్త చెబుతుంది. రాజ్‌కు ఎదురుగా, దగ్గరిగా అపర్ణ వెళ్తుంటుంది. అప్పుడే ఏదో అడ్డుపడి అపర్ణ కిందపడబోతుంది. అమ్మా.. అంటూ అపర్ణను కిందపడకుండా కాపాడుతాడు రాజ్. అదంతా కావ్య చూస్తూ ఉంటుంది. రాజ్‌ను దగ్గరిగా చూస్తూ మరిసిపోతుంది అపర్ణ. రాజ్ మాట్లాడుతుంటే.. అపర్ణ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వింటూ ఉంటుంది. అపర్ణకు కన్నీళ్లు ధారల వస్తుంటాయి. అమ్మా ఏమైందమ్మా.. కళ్లు తిరిగాయా అని రాజ్ అడుగుతాడు.

తేరుకున్న అపర్ణ.. అవును బాబు. ఉపవాసం ఉండటం వల్ల కళ్లు తిరిగాయి అని అపర్ణ చెబుతుంది. జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పి ముందుకు నడుస్తాడు రాజ్. అపర్ణ దానికే మురిసిపోతుంటే.. అమ్మా అని అపర్ణను ఎప్పటిలా కొడుకులాగే పిలుస్తాడు రాజ్. దాంతో మరింతగా సంతోషపడి వెనక్కి చూస్తుంది అపర్ణ. ఆయన అత్తయ్య గారిని గుర్తుపట్టేసారా అని కావ్య అనుకుంటుంది. అపర్ణ ముందుకు వచ్చి కాళ్ల కింద ఉన్న కర్చీఫ్ తీసి ఇస్తాడు. హా నాదే బాబు అని అపర్ణ తీసుకుంటుంది.

పక్కకు వెళ్లిన అపర్ణ కొడుకుతో మాట్లాడినందుకు తన్మయత్నం చెందుతుంది. అపర్ణకు తన బర్త్ డే నాడే కొడుకు మాట్లాడే గిఫ్ట్ అందినట్లు అవుతుంది. ఇంతలో కావ్య వచ్చి అపర్ణను కిందకు తీసుకుపోతుంది. నోరారా పేరు పెట్టి పిలవాలనిపించిన మాట్లాడలేదు. నువ్ చెప్పినట్లుగానే మౌనంగా ఉండిపోయాను. వాడు అమ్మా అనగానే వాడు గుర్తు పట్టేసాడేమో అని లోకంలో ఉన్న సంతోషమంతా వచ్చింది. కానీ, కర్చీఫ్ ఇచ్చి వెళ్లిపోయాడు అని అపర్ణ అంటుంది.

మాట నిలబెట్టుకున్నావ్

మీరు కనిపించిన ప్రతిసారి ఇలా ఎమోషనల్ అయితే ఆయనకు డౌట్ వస్తుంది. కొంతకాలం ఈ బాధను దాచుకోండి అని కావ్య చెబుతుంది. కన్నతల్లిని పరాయిదానిలా చూస్తే తట్టుకోవడం కష్టంగా ఉందని అపర్ణ అంటుంది. ఇదంతా కొన్నిరోజులే. ఆయనకు గతం గుర్తుకు వస్తుంది అని కావ్య చెబుతుంది. కావ్య కనిపించకపోయేసరికి కాల్ చేస్తాడు రాజ్. మీరు దూరంగా ఉండండి అని కావ్య అంటే.. నాకిచ్చిన మాట ప్రకారం నా కొడుకును ప్రాణాలతో చూపించావ్ అని మాట నిలబెట్టుకున్నట్లుగా అపర్ణ చెబుతుంది.

కావ్యకు కాల్ చేసిన రాజ్ ఎక్కడున్నారు అని అడుగుతాడు. మీ గుండెల్లో అని కావ్య అంటుంది. ఏంటీ అని రాజ్ అడిగితే.. గుడిలో అండి అని కావ్య చెబుతుంది. అదే ఎక్కడ అని రాజ్ అంటే.. మీరు వెనక్కి తిరిగితే కనిపిస్తాను అని రాజ్‌కు కావ్య కనిపిస్తుంది. అలానే చూస్తూండిపోతాడు రాజ్. ఏంటండి అని కావ్య అంటే.. ఇప్పటిదాకా దేవత అక్కడ ఉండేది కదా. ఇటెప్పుడు వచ్చిందా అని రాజ్ అంటాడు. మీరు బిస్కెట్లు పాకెట్లో పెట్టుకుని తిరుగుతుంటారా అని కావ్య అంటే.. లేదు జేబులోనే పెట్టుకుంటాను అని రాజ్ అంటాడు.

ఇద్దరూ నవ్వుకుంటారు. పూజకు, అన్నదానానికి అన్ని రెడీ అయ్యాయని తీసుకెళ్తుంది కావ్య. దంపతులిద్దరు సీతారాముళ్లా చూడముచ్చటగా ఉన్నారు అని పూజారి అంటాడు. అది చూసి అపర్ణ మురిసిపోతుంది. రాజ్ చేతులమీదుగా జరిపించిన అన్నదానంలో అపర్ణ కూడా తింటుంటుంది.

ఉలిక్కిపడిన యామిని

అపర్ణను కావ్యకు చూపిస్తూ ఆవిడను చూస్తుంటే చిన్నప్పుడు దూరమైన మా అమ్మే గుర్తుకు వస్తుందని, ప్రతి సంవత్సరం ఆవిడ కొడుకే ఆమె పేరుమీద అన్నదానం చేయించేవాడట. ఆమె పుట్టినరోజున ఒక చిన్న కేక్ కట్ చేయిస్తే బాగుంటుందండి అని రాజ్ అంటాడు. అపర్ణకు రాజ్ కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తాడు రామ్‌గా ఉన్న రాజ్. అది చూసిన యామిని ఉలిక్కిపడుతుంది. రాజ్‌కు అపర్ణ కేక్ తినిపిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం