Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఆఫీస్‌కు వచ్చిన క్లైంట్స్‌కు 24 గంటల్లో బిల్స్ క్లియర్ చేస్తానని హామీ ఇచ్చి పంపించేస్తుంది కావ్య. తర్వాత మన సమస్యలు క్లైంట్స్ వరకు చేరకూడదు. అది మనకే భవిష్యత్తులో సమస్య అవుతుంది. కల్యాణ్ జ్యూలర్స్ వాళ్లను మనీ పే చేయమని అడగండి అని కావ్య మేనేజర్‌కు చెబుతుంది.
తర్వాత ఇంటికి కావ్య వస్తుంది. గుమ్మంలోనే అప్పు ఎదురుచూస్తుంటే కావ్య అడుగుతుంది. నీకోసమే ఎదురుచూస్తున్నాను. అపర్ణ అత్తయ్య పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుంది. ఏం తినట్లేదు. కనీసం మంచి నీళ్లు కూడా తాగట్లేదు అని అప్పు చెబుతుంది. తెలుసు. అత్తయ్యకు పరిష్కారం ఆయనే. ఆయన్ను తిరిగితీసుకురావడానికి ఇంకా టైమ్ పడుతుంది అని కావ్య అంటుంది. కానీ, అప్పటివరకు అలాగే వదిలేయం లేం కదా. బావ బతికే ఉన్నాడనే నిజం చెబుదామనుకున్నా. కానీ, నీకు చెప్పకుండా చెప్పడం వద్దని ఆగాను అని అప్పు అంటుంది.
రేపు పెద్దత్తయ్య పుట్టినరోజు. అన్నదానం చేద్దామని ప్రకాషం మావయ్య అంటే.. నా కొడుకు లేనప్పుడు ఎలాంటి పుట్టినరోజు వద్దని అన్నారు. ఎంతగానో బాధపడుతున్నారని అప్పు చెబుతుంది. అత్తయ్యతో నేను మాట్లాడుతాను. నువ్ వదిలేయ్ అని కావ్య అంటుంది. అపర్ణ దగ్గరికి వెళ్తుంది. చీకట్లో అపర్ణ కూర్చుంటుంది. కావ్య వెళ్లి లైట్స్ ఆన్ చేస్తుంది. నాకు వెలుతురు చూడాలని లేదు. కన్న కొడుకే కంటికి దూరమైనప్పుడు ఎవరినైనా ఎందుకు చూడాలనిపిస్తుంది అని అపర్ణ అంటుంది.
మీ కోడలిగా నేను. మీ కుటుంబ సభ్యులు మీకు అవసరం లేదా అని కావ్య అంటుంది. ఇలా నన్ను ఒంటరిగా వదిలేయ్. నేనేం మాట్లాడలేను అని అపర్ణ అంటుంది. అసలు ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నారు అని కావ్య అంటుంది. రేపు నా పుట్టినరోజును ఘనంగా జరిపించాలని అంటున్నారు. ఆ పుట్టినరోజు దేనికోసం, ఎవరికోసం జరుపుకోవాలి. తన కొడుకు భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలనుకుటుంది తల్లి. అంతేకానీ కొడుకు ఈ లోకానికే దూరమయ్యాక సంబరపడుతుందా అని అపర్ణ అంటుంది.
అత్తయ్య ఆయనే లేరని ఎలా అనుకున్నారు. ఆయన బతికే ఉన్నారు. ఆయన తిరిగి వస్తారని నేను ఎంత చెప్పిన మీరు ఎందుకు నమ్మడం లేదు అని కావ్య అంటుంది. ఎలా నమ్మమంటావే. వాడు నీకు మాత్రమే కనిపిస్తూ ఇంట్లోవాళ్లకు కనిపిస్తే ఎలా నమ్ముతాం. నువ్ వాడి మీద పిచ్చి ప్రేమతో భ్రమలో ఉంటున్నావో తెలియట్లేదు అని అపర్ణ అంటుంది. అంటే నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని కావ్య అడుగుతుంది.
అలాగే ప్రవర్తిస్తున్నావ్. నిజంగా వాడు బతికే ఉంటే నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు. ఇంటికి ఎందుకు రావట్లేదు. కన్నవాళ్లను కాదని ఎక్కడో బయట బతికే అవసరం వాడికేముందు చెప్పు అని అపర్ణ అంటే.. సైలెంట్‌గా ఉండిపోతుంది కావ్య. చెప్పలేవు కదా. అందుకే నమ్మకలేకపోతున్నా. ఆ దేవుడు వచ్చి చెప్పిన నేను కళ్లారా చూసేవరకు నమ్మలేను. వాడు నిజంగా బతికే ఉంటే ఈ తల్లిని చూడకుండా ఉండలేడు. అయినా ఎందుకు రావట్లేదు చెప్పు చెప్పు అని అపర్ణ అడుగుతూనే ఉంటుంది.
ఎందుకుంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి అని కావ్య నిజం చెప్పేస్తుంది. ఏంటే నువ్ మాట్లాడేది. నా కొడుకు గతం మర్చిపోయాడా. నిజం చెప్పు అని అపర్ణ షాక్ అవుతుంది. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అని యాక్సిడెంట్ తర్వాత రాజ్‌ను చూసింది, గతం గుర్తుకురావడానికి ట్రై చేస్తే రాజ్ కండిషన్ గురించి మొత్తం చెబుతుంది కావ్య. అయ్యో నా కొడుకుకి ఆ దేవుడు ఎంత పెద్ద శిక్ష వేశాడు అని అపర్ణ బాధపడుతుంది.
ప్రాణాలతో బతికించాడు ఆ దేవుడు. సమస్యలన్నీ తీరిపోయి ఆయన్ను ఇంటికి తీసుకొచ్చేవరకు ఎవరికి చెప్పకూడదనుకున్నాను. కానీ, మీరు రోజురోజుకీ బాధపడుతూ మీ ప్రాణం మీదకు తెచ్చుకునేలా ఉన్నారు. అందుకే చెబుతున్నా. ఆయన యామిని ఇంట్లో క్షేమంగా ఉన్నారని సంతోషపడాలో, ఆయనకు కొత్త గతం సృష్టించి యామిని గుప్పిట్లో పెట్టుకున్నందుకు బాధపడాలో తెలియట్లేదు అని కావ్య అంటుంది. ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని అడిగితే.. మాట్లాడకుండా ఉండగలరా. అందుకే చెప్పలేదని కావ్య అంటుంది.
గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయొద్దని డాక్టర్ చాలా గట్టిగా చెప్పారు. అలా చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం అని కావ్య చెప్పడంతో అపర్ణ అవాక్కవుతుంది. నాకు వాన్ని చూడాలనిపిస్తుందని అపర్ణ తెగ బతిమిలాడుతుంది. చూడాలనిపిస్తుంది, చూశాక మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడాక గతాన్ని గుర్తు చేయాలనిపిస్తుంది. అందుకే వద్దు అని కావ్య అంటే.. అపర్ణ వినదు. నువ్ నాకోసం అబద్ధం చెబుతున్నావ్. వాడు బతికి ఉన్నాడన్నది నిజమైతే నాకు చూపించు అని వాదిస్తుంది అపర్ణ.
సరే అత్తయ్య. రేపే ఆయన్ను మీకు చూపిస్తాను. కానీ, ఆయనతో ఎట్టిపరిస్థితుల్లో గతం గురించి మాట్లాడను అని మాట ఇస్తేనే నేను చూపిస్తాను అని కావ్య అంటుంది. దాంతో సరే. నువ్ చెప్పినట్లే చేస్తాను. గతం గురించి మాట్లాడను. చూస్తే చాలు అని కావ్యకు మాటిస్తుంది అపర్ణ. మీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఆయన అన్నదానం చేస్తారుగా. ఈసారి కూడా ఆయన చేతుల మీదుగానే అన్నదానం చేసేలా నేను చేస్తాను అని కావ్య చెబుతుంది. అక్కడే ఆయన్ను చూద్దురుగానీ అని కావ్య చెబుతుంది.
చాన్నాళ్ల తర్వాత నా గుండె తేలిగ్గా ఉంది అని అపర్ణ సంతోషిస్తుంది. అత్తయ్య కానీ మీరు పరాయి మనిషిలా దూరంగా చూడాలి అని కావ్య అంటుంది. వాడు బతికి ఉండటం ముఖ్యం. పరాయి మనిషిలా దూరం నుంచి చూస్తాను అని అపర్ణ అంటుంది. రేపు ఉదయమే గుడికి వెళ్దాం. ఇంట్లో ఎవరికి చెప్పకండి అని కావ్య చెబుతుంది. సరే అంటుంది అపర్ణ. ఆ తర్వాత ఆకలిగా ఉందే.. భోజనం చేయాలనిపిస్తుందే అని అపర్ణ అడిగేసరికే.. మా మంచి అత్తయ్య మొహం కడుక్కుని రండి. వడ్డిస్తాను అని కావ్య వెళ్లిపోతుంది.
తర్వాత ఆయన్ను అత్తయ్యకు చూపిస్తానని, అన్నదానం చేసేలా చేస్తానని హామీ ఇచ్చాను. ఎలా చేయాలి. ఆయనను ఎలా దీనికి ఒప్పించాలి. నేను అడిగితే ఆయన ఒప్పుకుంటారా. నాకు ఏదైనా మంచి దారి చూపించు స్వామి అని కావ్య ఆలోచిస్తుంది. కళావతి ఏం చేస్తున్నారో. మనసు విప్పి మాట్లాడుదామంటే ఆఫీస్ ఉందని వెళ్లిపోయింది. కాల్ చేసి చూద్దామని రాజ్ ఫోన్ తీసి కావ్యకు కాల్ చేస్తాడు. కావ్య కూడా ఫోన్ చేద్దామనుకునేసరికి కావ్యకే కాల్ వస్తుంది.
దాంతో ఆశ్చర్యపోతుంది కావ్య. ఎక్కడున్నారు అని రాజ్ అడిగితే.. భారతీయ స్త్రీలు ఇంట్లో ఉంటారండి అని కావ్య అంటుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఏంటీ పొడిపొడిగా మాట్లాడుతున్నారు. బిజీగా ఉన్నారా అని రాజ్ అడుగుతాడు. అవునండి. మాకు ఇంట్లో కూడా పనులు ఉంటాయి అని పనులు చెబుతుంది. ఇంట్లో అందరికి వంట చేసి పెట్టాలి. నేనే కూరగాయలు తీసుకురావాలి షాప్‌కు వెళ్లి అని కావ్య చెబుతుంది. హమ్మయ్య ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని మా ఆంటీ కూడా వెజిటేబుల్స్ తీసుకురమ్మన్నారు అని రాజ్ అంటాడు.
మణికొండ దగ్గర ఓ షాప్‌కు వెళ్తున్నట్లు కావ్య చెబుతుంది. ఓయో కాలనీ.. ఓయో కాలనీ దగ్గర. దాని పక్కనే అని షాప్ అడ్రస్ చెబుతుంది కావ్య. మా ఆంటీ కూడా అక్కడే తెమ్మన్నారు అని రాజ్ చెబుతాడు. మీరు అక్కడే తీసుకుంటారా. నేను ఆ పక్కనే పంచవతి కాలనీలో తీసుకుంటాను అని కావ్య అంటుంది. దాంతో రాజ్ తొందరెక్కువరా నీకు అని అనుకుంటాడు. తర్వాత ఒకే టైమ్‌లో ఒకే షాప్‌లో కొనడం కోఇన్సిడెన్స్ అవుతుందని కావ్య అంటుంది.
నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని కావ్య చెబితే.. నేను కూడా అండి అని రాజ్ అంటాడు. తర్వాత కాసేపట్లో మీకు ఓ కొరియర్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూడండి అని రాజ్‌తో కావ్య చెబుతుంది. కానీ, కొరియర్ బాయ్ యామినితో కొరియర్ అని చెబుతాడు. ఎవరికి వచ్చిందని యామిని అడిగితే.. ఇంతలో రాజ్ వచ్చి ఆ కొరియర్ నాకోసమే. నేనే బుక్ చేశాను అని కంగారుగా లోపలికి తీసుకెళ్తాడు రాజ్. దాంతో యామిని డౌట్ పడుతుంది.
రాజ్ కొరియర్ ఓపెన్ చేసి చూస్తే అందులో వైట్ షర్ట్ ఉంటుంది. దానిపై ఆర్ అని రాసి ఉంటుంది. అది చూస్తే మీకు ఏమైనా గుర్తుకు వచ్చిందా అని కావ్య అడుగుతుంది. వచ్చింది.. అని రాజ్ చెబుతాడు. దాంతో తను పంపించిన షర్ట్ గిఫ్ట్‌తో రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందని కావ్య సంతోషిస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అన్నదానం కోసం భోజనం పంపిస్తుంది అపర్ణ. ఏదో నీ కొడుకే అన్నదానం జరిపిస్తున్నంత రేంజ్‌లో వెళ్తున్నావేంటీ అని రుద్రాణి అంటుంది.
అక్కడ అన్నదానం చేయించేది నా కొడుకే కదా అని రుద్రాణితో అపర్ణ నిజం చెబుతుంది. దాంతో రుద్రాణి, రాహుల్, కావ్య, సుభాష్, ఇందిరాదేవి వాళ్లంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం