Brahmamudi September 26th Episode: కావ్య తయారు చేసిన విగ్రహాల్ని రౌడీలు ఎత్తుకెళతారు. రాజ్ హీరోలా ఎంట్రీ ఇచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేసి విగ్రహాల్ని కాపాడుతాడు. విగ్రహాల్ని కాపాడననే గర్వంతో కావ్య ముందు బిల్డప్‌లు ఇస్తాడు రాజ్. బలహీనుల పక్కన నా లాంటి బలవంతుడు ఉండాలని గొప్పలకు పోతాడు. అప్పుడే బొద్దింక కనిపించడంతో రాజ్ భయపడిపోతాడు. అతడి భయం చూసి నిజంగా రౌడీలతో మీరే ఫైట్ చేశారా అంటూ కావ్య డౌట్ పడుతుంది. దాంతో రాజ్ ఈగో హర్ట్ అవుతుంది.
తనకు భయం లేదని నిరూపించుకోవడానికి ఏదైనా పరీక్ష పెట్టుకో అని కావ్యతో ఛాలెంజ్ చేస్తాడు రాజ్. తనను పది నిమిషాలు చేతులతో ఎత్తుకోమని అంటుంది. కావ్య సరదాగానే ఛాలెంజ్ చేసిన రాజ్ సీరియస్‌గా తీసుకుంటాడు. కావ్యను పది నిమిషాలు ఎత్తుకుంటాడు.
చివరకు రౌడీలను కొట్టింది రాజే అని కావ్య ఒప్పుకుంటుంది. అప్పుడే రాజ్ ఆమెను కిందికి దించుతాడు. రాజ్‌లో వచ్చిన మార్పు చూసి కావ్య మురిసిపోతుంది. భర్త తనను ఇష్టపడటం మొదలుపెట్టాడని అనుకుంటుంది. ఆ మాట బయటకు చెప్పడానికి అతడిలోని ఈగో అడ్డుస్తుందని. తనకు పెట్టిన మూడు నెలల గడువులోగా రాజ్ మనసులో ఉన్న మాటను ఎలాగైనా బయటపెట్టించాలని కావ్య ఫిక్స్ అవుతుంది.
అప్పును కలుస్తానని మాటిచ్చిన కళ్యాణ్ ఆమెకు హ్యాండిస్తాడు. కనీసం కలవడం కుదరడం లేదని మెసేజ్ కూడా చేయడు. కళ్యాణ్‌తో మాట్లాడటానికి అప్పు ట్రై చేస్తుంది. చాలా సమయంపాటు కళ్యాణ్ ఫోన్ బిజీ అని వస్తుంది తిరిగి ఫోన్ కూడా చేయడు. దాంతో అప్పు కోపం పెరుగుతుంది. కళ్యాణ్ అంతు చూడాలని ఫిక్స్ అవుతుంది.
ఉదయం లేవగానే స్కిప్పింగ్ చేస్తుంటాడు రాజ్. కొత్తగా వర్కవుట్స్ మొదలుపెట్టారు..కారణం ఏంటి అంటూ రాజ్‌ను అడుగుతుంది కావ్య. నువ్వు పెట్టే ఆయిల్ ఫుడ్ తిని తిని నాలుగు కేజీలు బరువు పెరిగాను. అందుకే వర్కవుట్స్ చేస్తున్నానని కావ్యపై సెటైర్ వేస్తాడు. నేను ఆగకుండా వంద చేయగలను. నువ్వు ఇరవై కూడా చేయలేవని కావ్యను దెప్పిపొడుస్తాడు. ఇద్దరిలో ఎవరూ ఎక్కువ చేస్తారో చూద్దాం అంటూ రాజ్‌తో పోటీకి కావ్య సిద్ధమవుతుంది. రాజ్, కావ్య గిల్లికజ్జాలను సీతారామయ్య, ఇందిరాదేవి చూసి సంబరపడుతుంటారు. చివరకు కావ్యను ఓడించాలని ఫిక్స్ అయిన రాజ్ ఆమెతో స్కిప్పింగ్‌లో పోటీపడతారు.
ఇద్దరు కలిసే స్కిప్పింగ్ చేయాలని కావ్య కండీషన్ పెడుతుంది. రాజ్, కావ్య కలిసి స్కిప్పింగ్ చేయడం చూసి అపర్ణ కోపం పెరుగుతుంది. వాళ్లిద్దరి సంతోషాన్ని చూసి రుద్రాణి కూడా లోలోన రగిలిపోతుంది. స్వప్న కనపడటం లేదనే తెలిస్తే కావ్యలో కనిపిస్తోన్న ఆ ఆనందం మొత్తం దూరమవుతుందని అనుకుంటుంది. స్కిప్పింగ్‌లో కావ్యతో పోటీపడలేక ఓడిపోతాడు రాజ్.
కావ్య చేతిలో ఓడిపోయానని ఒప్పుకుంటావా అని రాజ్‌ను అడుగుతుంది ఇందిరాదేవి. కానీ ఓడిపోయాననే మాట రాజ్ నోటి నుండి రాకుండా అడ్డుకుంటుంది కావ్య. ఇందులో రాజ్ ఓడిపోలేదు. నేను గెలిచానంటూ లాజిక్స్ మాట్లాడుతుంది. భర్తకు విలువ ఇచ్చే కావ్య వ్యక్తిత్వాన్ని చూసి సీతారామయ్య, ఇందిరాదేవి ప్రశంసలు కురిపిస్తారు.
స్కిప్పింగ్‌లో తనపై గెలిచిన ఆనందం కావ్యలో ఎక్కువగా కనిపించడంతో రాజ్ ఆమెపై సెటైర్ వేయబోతాడు. మళ్లీ నీతో పోటీపడి తప్పకుండా గెలుస్తానని కావ్యతో ఛాలెంజ్ చేస్తాడు. ఐ యామ్ వెయిటింగ్ అంటూ భర్తకు సవాల్ విసిరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య. ఆమె ఆటిట్యూడ్ చూసి రాజ్ కంగుతింటాడు.
అప్పును కలవడానికి వస్తాడు కళ్యాణ్. అనామిక పెళ్లి ప్రపోజల్ గురించి ఆమెకు చెప్పాలని అనుకుంటాడు. కానీ కళ్యాణ్‌ను చూడగానే అప్పు కోపంతో రగిలిపోతుంది. కర్ర తీసుకొని అతడిని చితకబాదుతుంది.
ఆమెను కంట్రోల్ చేయడానికి ఐ లవ్ యూ అని అంటాడు కళ్యాణ్. దాంతో అప్పు కొట్టడం ఆపేస్తుంది. ఈ మాట చెబుతుందని అనామికను కలవడానికి వెళ్లానని...కానీ ఆమె మాత్రం పెళ్లి కార్డు తీసుకొచ్చి డైరెక్ట్ మ్యారేజీ ప్రపోజల్ తన ముందు పెట్టిందని అంటాడు. కానీ అతడి మాటల్ని పట్టించుకోదు.
తనను కలవడానికి ఎందుకు రాలేదని, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని ఫైర్ అవుతుంది. అనామికను కలవడం నీకు గుడ్‌న్యూస్ నాకు కాదు అంటూ కళ్యాణ్‌ను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కోపం తగ్గిన తర్వాత అప్పునే కూల్ అవుతుందని కళ్యాణ్ అనుకుంటాడు.
తాను ఇచ్చిన అప్పు కోసం కృష్ణమూర్తి ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు మార్వాడీ సేట్. కృష్ణమూర్తిపై ఇష్టానుసారం మాటలు జారుతాడు. సేట్ మాటలను చూసి కనకం ఫైర్ అవుతుంది. డబ్బులు కట్టకపోతే ఏం చేస్తావు అంటూ వార్నింగ్ ఇస్తుంది. డబ్బులు ఇవ్వకపోతేమీ ఇంటి పరువు గంగపాలు చేస్తానని సేట్ బెదిరిస్తాడు.
అతడి మాటలతో కనకం కోపం మరింత పెరుగుతుంది. మా పరువు కాదు..నీ రక్తాన్నే గంగా నదిలో కలిపేస్తానని సేట్ మెడలను గట్టిగా పట్టుకుంటుంది. కృష్ణమూర్తి, అన్నపూర్ణమ్మ ఎంత చెప్పినా వినిపించుకోదు. ఆమె దూకుడు చూసి సేట్ భయపడతాడు. రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే ఇళ్లు జప్తు చేస్తానని సేట్ హెచ్చరించివెళ్లిపోతాడు.
అతడి మాటలతో కనకంలోని కోపం మొత్తం పోయి భయం మొదలవుతుంది. నిజంగా రెండు రోజుల్లో డబ్బులు వస్తాయా అని భర్తను అనుమానంగా అడుగుతుంది. కృష్ణమూర్తి. డబ్బులు వస్తాయని కంగారుపడొద్దని అతడు బదులిస్తాడు.
సర్‌ప్రైజ్ పేరుతో స్వప్నను కొత్త ప్లేస్‌కు తీసుకొస్తాడు. ఇకపై ఏ ఇబ్బంది లేకుండా నిన్ను సంతోషంగా చూసుకుంటానని స్వప్నకు మాటిచ్చిన రాజ్ ఆమెకు రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి మైఖేల్ ఎంట్రీ ఇస్తాడు. స్వప్నపై గన్ గురిపెడతాడు. రాహుల్‌ను కొట్టి స్వప్నను కిడ్నాప్ చేస్తాడు మైఖేల్.
ఆ తర్వాత గాయంతో రాహుల్ హాస్పిటల్ పాలయ్యాడని తెలిసి దుగ్గిరాల ఫ్యామిలీ కంగారు పడతారు. స్వప్నను ఎవరో కిడ్నాప్ చేశారని, ఆమెను చంపేస్తారని భయంగా ఉందని రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు నాటకం ఆడుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.