Brahmamudi Promo: కావ్య, రాజ్‌కు అపర్ణ క్షమాపణలు - అనామిక ప్లాన్ రివర్స్ - ఆస్తి పంచనున్న సీతారామయ్య!
Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ ప్రోమోలో రాజ్, కావ్యలను అపార్థం చేసుకొని అనుమానించినందుకు అపర్ణ పశ్చాత్తాప పడుతుంది. ఇంటి సమస్యలు మొత్తం తీరిపోయాయని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ ఆనందపడుతోన్న టైమ్‌లోనే సీతారామయ్య ట్విస్ట్ ఇస్తాడు. ఆస్తిని ముక్కలు చేయబోతున్నట్లు ప్రకటిస్తాడు.

దుగ్గిరాల ఆస్తిని జప్తు చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమవుతారు. ఇంటితో పాటు అందరి నగలు ఇచ్చేయాలని బ్యాంకు ఆఫీసర్లు అడుగుతారు. తన నగలు ఇవ్వకుండా దాచేస్తుంది రుద్రాణి. నగలు ఇవ్వాల్సిందేనని ధాన్యలక్ష్మి, స్వప్న పట్టుపట్టడంతో తనకు ఈ ఇంటికి అసలు సంబంధమే లేదని, తాను ఈ ఇంటి ఆడపడుచును కాదని ప్లేట్ ఫిరాయిస్తుంది. రుద్రాణి దాచిన నగలను స్వప్న బయటకు తీసి బ్యాంకు ఆఫీసర్ల ముందు పెడుతుంది.
అప్పు ఎంట్రీ...
ఆస్తి మొత్తాన్ని బ్యాంకు ఆధికారులకు సీతారామయ్య రాసిస్తోన్న టైమ్‌లోనే నందగోపాల్‌తో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అప్పు. నందగోపాల్‌తో పాటు ఎస్ఐ విశ్వ చేసిన మోసాన్ని బయటపెడుతుంది. స్నేహితుడైన విశ్వ తనకు ద్రోహాన్ని తలపెట్టాలని చూడటం రాజ్ తట్టుకోలేకపోతాడు. పోలీస్‌గా డ్యూటీ సరిగ్గా చేయడమే కాకుండా కోడలిగా ఇంటి పరువు కాపాడిన అప్పుపై పొగడ్తలు కురిపిస్తాడు సీతారామయ్య. ఇందులో తాను చేసింది ఏం లేదని, నంద బతికి ఉన్న విషయం కావ్య ద్వారానే తనకు తెలిసిందని అప్పు అంటుంది. నువ్వు మా ఇంటి దేవతవని కావ్యతో సీతారామయ్య అంటాడు.
రాజ్ ఆవేశం...
నందగోపాల్‌తో కలిసి దివాళా నాటకం ఆడించింది అనామిక, సామంత్ అనే నిజం అప్పు బయటపెడుతుంది. అనామిక అంతు చూస్తానని ఆవేశంగా రాజ్ బయలుదేరుతాడు. అనామికను అతడు ఏం చేస్తాడోనని కంగారుగా రాజ్ వెంట వెళుతుంది కావ్య.
అనామిక ప్లాన్ ఫెయిల్...
దుగ్గిరాల ఫ్యామిలీ రోడ్డు మీద పడటం ఖాయమని అనామిక అనుకుంటుంది. కానీ చివరి నిమిషంలో నందగోపాల్ దొరికిపోవడంతో ఆమె ప్లాన్ రివర్స్ అవుతుంది. కష్టపడి తాను వేసిన ప్లాన్ ఫెయిలవ్వడం అనామిక తట్టుకోలేకపోతుంది. అప్పుపై కోపంతో రగిలిపోతుంది. అప్పుడే అక్కడకకు వచ్చిన కావ్య, రాజ్...అనామికకు వార్నింగ్ ఇస్తారు. ఎన్ని కుట్రలు పన్నిన తమ ఫ్యామిలీని ఏం చేయాలేవని అంటారు. కావ్య మాటలతో అనామిక కోపం రెట్టింపు అవుతుంది. ఈ సారి అప్పు, కావ్య ఇద్దరిని కోలుకోలేని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంటుంది.
ఆస్తి ముక్కలు...
రాజ్, కావ్యలను అపార్థం చేసుకొని అనుమానించినందుకు పశ్చాత్తాప పడుతుంది అపర్ణ. ఎంతో కష్టాన్ని, బాధను మనసులో పెట్టుకొని ఇన్నాళ్లు ఎంతో పెద్ద బాధ్యతను మోశారని కొడుకు, కోడలిని మెచ్చుకుంటుంది అపర్ణ. ఇక ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తీరిపోయాయని సంబరపడుతుంది.
కానీ సీతారామయ్య పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. అసలు సమస్య అలాగే ఉందని అంటాడు. ఆస్తి మొత్తం ముక్కలు చేసి ఎవరి వాటా వారికి ఇవ్వాలనుకుంటున్నట్లు చెబుతాడు. సీతారామయ్య మాటలతో కావ్య, రాజ్‌తో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ షాకవుతారు. ధాన్యలక్ష్మితో పాటు రుద్రాణి మాత్రం ఆనందపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆస్తి పంపకాలు చేయాలని సీతారామయ్య ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఆస్తి పంపకాలు వద్దని ప్రకాశం ఎందుకు అన్నాడు అన్నది సోమవారం నాటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
సంబంధిత కథనం