Brahmamudi November 6th Episode: తల్లిని ఇంటి నుంచి గెంటేసిన స్వప్న - రాజ్‌తో కావ్యకు విడాకులు - అప్పు ఫైర్
Brahmamudi November 6th Episode: అబద్ధపు ప్రెగ్నెన్సీతో అందరిని మోసం చేసిన స్వప్నను ఇంటి నుంచి పంపించేయాలని అపర్ణ నిర్ణయం తీసుకుంటుంది. నిజం తెలిసి కూడా దాచినందుకు కావ్యను కూడా ఇంటి నుంచి పంపించేయాలని తీర్మాణిస్తుంది. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Brahmamudi November 6th Episode: కడుపు పేరుతో నాటకం ఆడటమే కాకుండా కావ్యపై నింద వేసి ఆమెను ఇరికించిన స్వప్న చెంపలను వాయిస్తుంది కనకం. ఎన్ని దెబ్బలు కొట్టిన స్వప్న తన తప్పును ఒప్పుకోదు. అందరు కలిసి తనను టార్గెట్ చేయడంతో మరో దారిలేక కావ్యపై ఇరికించానని, నువ్వు అనుకున్నంత మంచిదేమి కాదు నీ చిన్న కూతురు అంటూ కనకంపై సీరియస్ అవుతుంది స్వప్న. అసలు తప్పు చేసింది నువ్వు. నిన్ను నువ్వే కొట్టుకో అంటూ తల్లిపై ఎగిరిపడుతుంది. నీ వల్లే ఇదంతా జరిగిందని అంటూ కొప్పడుతుంది.
తల్లిపై స్వప్న ఫైర్...
చిన్నప్పటి నుంచి నన్ను డబ్బు మనిషిలా పెంచావు. డబ్బున్న వాళ్లతోనే స్నేహం చేయాలని, డబ్బున్న వాళ్లలాగే ప్రవర్తించాలని పెంచావని కనకంపై ఫైర్ అవుతుంది స్వప్న. నన్ను గొప్పింటి కోడలిని చేస్తానన్నది నువ్వు కాదా... నాలో ఆశలు రేపింది నువ్వు కాదా అని నిలదీస్తుంది.
తప్పులన్నీ నువ్వు చేసి ఇప్పుడు నాకు నీతులు చెప్పడానికి వచ్చావా అంటూ తల్లిని మాటలతో అవమానిస్తుంది. నువ్వు నాటకం ఆడితే లోకకళ్యాణం.. నేను నాటకం ఆడితే నటన మోసం అంటూ తల్లిని ఎగతాళి చేస్తుంది స్వప్న. కావ్య లైఫ్ బాగుండటం కోసం నా లైఫ్ నాశనం అయిపోయినా పర్వాలేదని అనుకుంటున్నావా అని క్వశ్చన్ చేస్తుంది. నీది తల్లి ప్రేమలా కాకుండా సవతి ప్రేమలా కనిపిస్తోందని నిలదీస్తుంది.
స్వప్న చెంపలు వాయించిన కనకం...
కూతురి మాటలతో కనకం కోసం కట్టలు తెచ్చుకుంటుంది. స్వప్న చెంపపై గట్టిగా ఒక్కటిస్తుంది. సవతి ప్రేమ నీపై కాదు స్వప్నపై చూపించానని, ఆమె కష్టాన్ని మొత్తం నీకే దారపోశానని ఎమోషనల్ అవుతుంది. నువ్వు పెళ్లి పీటల మీది నుంచి పారిపోతే కావ్యకు పెళ్లి చేసి ఈ నరకంలో పడేశానని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను ఆడిన నాటకాలన్నీ నీ సంతోషం కోసమే అంటూ స్వప్నపై ఫైర్ అవుతుంది కనకం.
నీ స్వార్థంతో కావ్య జీవితం నాశనం చేస్తున్నావని కూతురికి క్లాస్ ఇస్తుంది కనకం. కానీ తల్లి మాటలను స్వప్న లెక్కపెట్టదు. నా దారికి అడొస్తే ఎవరిని వదిలిపెట్టనని, అందరి జీవితాల్ని నాశనం చేస్తానని స్వప్న బెదిరిస్తుంది. నా జోలికి రాకుండా కావ్యను దూరంగా ఉండమని చెప్పు అని తల్లికే వార్నింగ్ ఇస్తుంది. దుగ్గిరాల ఇంట్లోనే స్వప్న ఉంటే కావ్య జీవితానికి ప్రమాదమని కనకం అనుకుంటుంది.
ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. నా లైఫ్‌లో నీ క్యారెక్టర్ క్లోజ్ అయ్యిందని, ఇంకొకసారి నా జీవితంలోకి రాకు. వచ్చి పరువు తీసుకోకు అని తల్లిని తన రూమ్ నుంచి బయటకు పంపించి డోర్ క్లోజ్ చేస్తుంది స్వప్న.
కనకం షాక్...
కూతురు చేసిన పనితో కనకం షాక్ అవుతుంది. కన్నీళ్లలో మునిగిపోయిన కనకం దగ్గరకు కావ్య వస్తుంది. ఈ తల్లిని క్షమించమని కన్నీళ్లతో కావ్యతో చెప్పి కనకం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏడుస్తూ ఇంటికొచ్చిన కనకాన్ని చూసి కృష్ణమూర్తి, అప్పు కంగారు పడతారు. స్వప్నను అత్తింటి నుంచి తీసుకొస్తే కావ్య కష్టాలు తీరుతాయని అనుకున్నానని, కానీ తనను గదిలో నుంచి బయటకు తోసేసి ముఖం మీదే తలుపు వేసిందని కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. స్వప్నను ఇప్పుడేవెళ్లి ఈడ్చుకొస్తానని అప్పు ఆవేశపడుతుంది. కనకం, కృష్ణమూర్తి ఆమెను ఆపుతారు. నువ్వు వెళ్లడం వల్ల గొడవ పెద్దది అవుతుందని అంటారు.
కావ్య ఓదార్పు...
తల్లి కన్నీళ్లతో తన అత్తింటి నుంచి వెళ్లడం కావ్య తట్టుకోలేకపోతుంది. తల్లికి ఫోన్ చేసి ఓదార్చుతుంది. స్వప్న గురించి తెలిసి కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం లేదని అంటుంది. తప్పు జరిగిపోయింది...ఇక జరిగేవాటిని ఎదుర్కోక తప్పదని తల్లితో అంటుంది కావ్య.
అపర్ణ నిర్ణయం...
రాజ్‌తో కావ్యకు విడాకులు ఇప్పించాల్సిందేనని అపర్ణ పట్టుపడుతుంది. ఇందిరాదేవి ఎంత సర్ధిచెప్పాలని ప్రయత్నించిన ఆమె మాట వినదు. ఇన్నాళ్లు ఇంటి పరువు కోసం ఆలోచించానని, ఇప్పుడు కూడా కావ్యను క్షమిస్తే అది మన తప్పే అవుతుందని అపర్ణ అంటుంది.
స్వప్న చేసిన తప్పుకు కావ్య శిక్షించడం కరెక్ట్ కాదని ధాన్యలక్ష్మి కూడా అంటుంది. ఎవరూ ఎంత చెప్పిన అపర్ణ మాత్రం తన పట్టు వీడదు. జాలి చూపించి ఇంటి కోడళ్లుగా చేసుకుంటే స్వప్న, కావ్య కలిసి వెన్నుపోటు పొడిచారని ఫైర్ అవుతుంది. కావ్య మొహం చూడలేకపోతున్నానని, విడాకుల విషయంలో ఏదో ఒకటి తొందరగా తేల్చమని ఇందిరాదేవితో అంటుంది అపర్ణ.
రాజ్ ఆవేశం...
మరోవైపు స్వప్నకు కడుపులేదనే విషయం తెలిసి కూడా తన దగ్గర కావ్య దాచిపెట్టడం రాజ్ సహించలేకపోతాడు. కోపంతో రగిలిపోతాడు. ఎదురుగా తమ పెళ్లి ఫొటో కనిపించడంతో కోపంతో ఆ ఫొటోను చించేస్తాడు. కావ్య ఫొటోను కాల్చేస్తాడు. రాజ్ చేయి కాలుతుంది. అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది. రాజ్ చేయి కాలడం చూసి కంగారుగా అతడి చేయిపట్టుకుంటుంది.
కానీ రాజ్ తన చేయి వెనక్కి తీసుకుంటాడు. కావ్యపై ఫైర్ అవుతాడు. తాను తప్పు చేయలేదని కావ్య ఎంత వాదించిన రాజ్ ఆమె మాటలను వినడు. అబద్ధాన్ని, మోసాన్ని ఎప్పటికీ తాను భరించలేనని కావ్యతో అంటాడు రాజ్. తాతయ్య నిర్ణయంతో మన బంధానికి తెరపడాలని కోరుకుంటున్నట్లు స్వప్నతో చెప్పి రూమ్ నుంచి వెళ్లిపోతాడు.
రాజ్ మాటలతో కావ్య కన్నీళ్లతో కుప్పకూలిపోతుంది. కడుపు పేరుతో తమను మోసం చేసిన స్వప్నను ఇంటి నుంచి పంపించేయాలని రుద్రాణి నిర్ణయించుకుంటుంది. ఈమోసంలో కావ్య పాత్ర కూడా ఉండటంతో ఆమెను కూడా ఇంటి నుంచి పంపించేయాలని తీర్మాణం చేస్తుంది. రాజ్‌తో కావ్యకు విడాకులు ఇప్పటించాలని పట్టుపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.