Brahmamudi November 14th Episode:అత్తింటి సపోర్ట్ కొట్టేసిన కావ్య - రాజ్‌కు హ్యాండిచ్చిన దుగ్గిరాల ఫ్యామిలీ
Brahmamudi November 14th Episode: బ్రహ్మముడి నవంబర్ 14 ఎపిసోడ్‌లో కావ్యతో పోటీపడేందుకు ఆఫీస్‌కు బయలుదేరుతాడు రాజ్. ఎవరూ అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పకపోగా...కావ్యనే గెలవాలని కోరుకుంటున్నామని రాజ్ ముఖం మీదే చెప్పేస్తారు.
Brahmamudi November 14th Episode: రాజ్, కావ్య మధ్య సీతారామయ్య పోటీపెడతాడు. జగదీష్ ప్రసాద్ కంపెనీ కాంట్రాక్ట్ ఎవరు దక్కించుకుంటారో వారే కంపెనీ సీఈవోగా కొనసాగుతారని సీతారామయ్య అంటాడు.ఈ పోటీలో రాజ్ ఓడిపోతే కావ్యను తిరిగి అత్తింటికి తీసుకురావాలని కండీషన్ పెడతాడు. కావ్య ఓడిపోతే జీవితంలో ఆఫీస్ ముఖం చూడొద్దని రాజ్ అంటాడు. పోటీతో పాటు భర్త పెట్టిన కండీషన్‌కు కావ్యఒప్పుకుంటుంది.
కళ్యాణ్ ఆనందం...
కావ్య తిరిగి అత్తింట్లోకి అడుగుపెట్టబోతుందని తెలిసి కళ్యాణ్, అప్పు ఆనందంగా ఫీలవుతారు. ఈ పోటీలో కావ్యనే గెలుస్తుందని కళ్యాణ్ అంటాడు. రాజ్‌కు అప్పు సపోర్ట్ చేస్తుంది. రాజ్ తెలివితేటల్ని తక్కువగా అంచనా వేయొద్దని అంటుంది. తాతాగారు అందరు కలిసి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారని, నువ్వు కూడా ధాన్యలక్ష్మితో ఉన్న గొడవలకు పుల్‌స్టాప్ పెట్టి ఇంటికి దగ్గరైతే మంచిదని కళ్యాణ్‌కు అప్పు సలహా ఇస్తుంది.
నీ పోలీస్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాతే ఇంటికి వెళ్లడం గురించి ఆలోచిస్తానని కళ్యాణ్ అంటాడు. తన పోలీస్ ట్రైనింగ్ కోసం కళ్యాణ్ కష్టాలు పడటం చూసి అప్పు ఎమోషనల్ అవుతుంది. ధాన్యలక్ష్మి చెప్పినట్లుగా ఆటో నడపటం కాకుండా రైటర్‌గా పేరుతెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయమని కళ్యాణ్‌తో అంటుంది అప్పు.
కనకం ఆనందం...
కావ్య అత్తింట్లోకి తొందరలోనే అడుగుపెట్టబోతుందనే న్యూస్ విని కనకం తెగ సంబరపడిపోతుంది. అప్పుడే కావ్య ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇలాంటి రోజు కోసం నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నానని కావ్యతో తన ఆనందాన్ని పంచుకుంటుంది కనకం. నీ హడావిడి కాసేపు ఆపమని తల్లికి క్లాస్ ఇస్తుంది కావ్య. పందెంలో గెలవకుండానే నేను దుగ్గిరాల ఇంటికి వెళ్లిపోయినట్లుగా ఊహిస్తున్నావా అంటూ సెటైర్లు వేస్తుంది.
పోటీపడుతోంది రాజ్‌తో...
నేను పోటీపడుతుంది రాజ్‌తో అని తల్లితో అంటుంది కావ్య. నాకు నీ తెలివితేటల గురించి తెలుసు...నువ్వు ఏదైనా అనుకుంటే సాధించేవరకు వదిలిపెట్టవని, న్యాయం నీవైపు ఉంటే దేవుడితోనైనా పోరాడటంతో తప్పులేదని కూతురితో అంటుంది కావ్య.
నువ్వు పందెంలో గెలవడానికి ఏది చెబితే అది చేస్తానని, నీ పనులన్నీ మొత్తం నేనే చేస్తానని కావ్యకు మాటిస్తుంది కనకం. డిజైన్స్ గీసే పనిని రేపు మొదలుపెడతానని కావ్య అంటుంది. ఆపేయ్ అని కనకం గట్టిగా అరుస్తుంది. రేపు అనే మాటకు చోటు ఉండద్దొని, రేపటి పని ఈరోజే చేయమని డైలాగ్స్ కొట్టి తెగ ఓవరాక్షన్ చేస్తుంది.
అనామిక కన్నింగ్ ప్లాన్...
అనామికకు ఫోన్ చేస్తుంది రుద్రాణి. వాటాగా వచ్చిన ఆస్తిని ఎందులో ఇన్వెస్ట్ చేయాలా అని అడగటానికి ఫోన్ చేశారా అని రుద్రాణితో అంటుంది అనామిక. నీ ప్లాన్స్ వల్ల ఆస్తి కాదు కదా నాకు ఆవగింజ కూడా దక్కలేదని రుద్రాణి పంచ్‌లు వేస్తుంది. కావ్య, రాజ్ మధ్య పోటీ గురించి చెబుతుంది.
ఇందులో కావ్య, రాజ్‌లలో ఎవరు గెలిచిన మనకే నష్టమని అనామికతో రుద్రాణి అంటుంది. టెంపుల్ కాంట్రాక్ట్ మీ కంపెనీకి కాకుండా మా కంపెనీకి దక్కేలా చేస్తానని, అప్పుడు పోటీ అన్నదే ఉండదని అనామిక అంటుంది. దుగ్గిరాల ఇంట్లో రగిల్చిన ఆస్తి గొడవల మంట ఆరకుండా చూసుకోమని రుద్రాణికి సలహా ఇస్తుంది అనామిక.
రుద్రాణి మాయ మాటలు...
అనామిక చెప్పినట్లే చేయాలని రుద్రాణి అనుకుంటుంది. ధాన్యలక్ష్మిని పావుగా వాడుకొని ఆస్తి గొడవలు మరింత పెద్దది చేయాలని చూస్తుంది. ధాన్యలక్ష్మి ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది.
నీకు కోట్ల ఆస్తి ఉన్నా కొడుకు మాత్రం ఆటోనడుపుకుంటున్నాడని, నీ విషయంలో బాధపడాలో, జాలిపడాలో తెలియడం లేదని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. నా కొడుకుకు న్యాయం చేయమని నువ్వు పెద్ద గొడవ చేసినా నిన్ను ఎవరూ పట్టించుకోలేదని, టైమ్ కావాలని మాట దాటవేశారని ధాన్యలక్ష్మిని రుద్రాణి రెచ్చగొడుతుంది.
ఆస్తిలో వాటా లేదని అంటారు...
కళ్యాణ్ కు ఎలా న్యాయం చేయాలన్నది పట్టించుకోకుండా సీతారామయ్య, ఇందిరాదేవి పందెం పేరుతో రాజ్, కావ్యలను కలిపే ప్రయత్నాల్లో ఉన్నారని అంటుంది. కావ్యను ఎలా ఇంట్లోకి రప్పించాలన్నది మాత్రమే పట్టించుకుంటూ కళ్యాణ్‌ను గాలికి వదిలేస్తున్నారని చాడీలు చెబుతుంది. రాజ్, కావ్యలను నెత్తిన పెట్టుకొని ఏదో ఒకరోజు కళ్యాణ్‌కు ఈ ఆస్తితో ఏ సంబంధం లేదని అన్నా అంటారని రుద్రాణి అంటుంది.
రుద్రాణి ట్రాప్...
రుద్రాణి ట్రాప్‌లో పడ్డ ధాన్యలక్ష్మి ఆమె మాటలు నిజమని నమ్ముతుంది. నీ మనసులో ఉన్న కోపాన్ని, బాధనుఅనుక్షణం కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా చేయమని కన్నింగ్ సలహాను ధాన్యలక్ష్మికి ఇస్తుంది రుద్రాణి.
శత్రువుకే సపోర్ట్...
రాజ్ ఆఫీస్‌కు బయలుదేరుతాడు. అతడికిప్రకాశం ఎదురొస్తాడు. నేను పందెం కట్టి ఆఫీస్‌కు వెళుతున్నానని, ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ బాబాయ్‌పై రాజ్ కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లు నటిస్తాడు. కావ్యకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి కదు...ఫోన్ చేసి చెబుతానని రాజ్‌పై సెటైర్లు వేస్తాడు ప్రకాశం. నువ్వు కూడా శత్రుపక్షంలో చేరిపోయావా అని బాబాయ్‌పై రాజ్ ఫైర్ అవుతాడు. అప్పుడే అక్కడికి సుభాష్ కూడా కావ్య చేతిలో ఓడిపోవడానికి ఆఫీస్‌కు వెళుతున్నావా అని పంచ్ వేస్తాడు. కావ్య గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సుభాష్ అంటాడు.
కావ్య గెలవాలని పూజలు...
అపర్ణ చేత ఆల్ ది బెస్ట్ చెప్పించుకోమని కొడుకుకు సుభాష్ సలహా ఇస్తాడు. మమ్మీ కూడా కోడలు గెలవాలని కోరుకుంటుందని, ఆల్ ది బెస్ట్ ఏం అవసరం లేదని రాజ్ అంటాడు. నువ్వు పందెంలో ఓడిపోయినా జీవితంలో గెలుస్తావని అపర్ణ అంటుంది. రాజ్‌కు కూడా కావ్య గెలవాలనే ఉందని, భార్య గెలిచి పది మంది ప్రశంసిస్తే పొంగిపోకుండా రాజ్ ఎలా ఉండగలడని ఇందిరాదేవి అంటుంది.
మీ ఉత్సాహం చూస్తుంటే కావ్య గెలవాలని యజ్ఞాలు, పూజలు చేసేలా ఉన్నారని రాజ్ అంటాడు. మంచి ఐడియా ఇచ్చావని, ఇప్పుడే గుడికి వెళతామని ఇందిరాదేవి, అపర్ణ అంటాడు.
రుద్రాణి సపోర్ట్...
రుద్రాణి మాత్రం రాజ్‌కు సపోర్ట్ చేస్తుంది. నా బ్లెసింగ్స్ ఎప్పడూ నీకే ఉంటాయని అంటుంది. ఎవరు ఏం కోరుకున్నా గెలవాలనే సంకల్పంతోనే ఆఫీస్‌కు వెళుతున్నానని కోపంగా రాజ్ అంటాడు. కోపంగా ఆఫీస్‌లో అడుగుపెడతాడు రాజ్. సెక్యూరిటీ గార్డ్ రాజ్‌కు విష్ చేస్తాడు. మేనేజర్ జాబ్ పోయినా సెక్యూరిటీగా బాగా సెటిలయ్యావని రాజ్ అతడితో అంటాడు. ఇవాళో రేపో మీ మేనేజర్ గిరి పోతుందని ఆఫీస్‌లో అందరూ అనుకుంటున్నారని చెప్పి రాజ్ కోపాన్ని మరింత పెంచుతాడు సెక్యూరిటీ గార్డ్.
రాజ్ ఆఫర్స్...
డిజైన్స్ గీయడానికి బోర్డ్, ఛార్ట్‌లతో ఆఫీస్‌కు వస్తాడు రాజ్. యుద్ధానికి వస్తోన్నట్లుగా ఫీలవుతాడు. డిజైన్స్ గీయాలంటే క్రియేటివిటీ ఉండాలని, అదక్కడ లేదుగా అంటూ రాజ్‌ను ఆటపట్టిస్తుంది కావ్య. సీఈవో పోస్ట్ కోసం నాతోనే పోటీపడుతున్నాడని తీసేసినట్లుగా మాట్లాడుతుంది.
మంచి డిజైన్స్ గీసి ఇచ్చిన వారికి సొంతంగా ఇళ్లు కట్టించి ఇస్తానని ఆఫర్స్ ప్రకటిస్తాడు. వారిలో గెలవాలనే ఆవేశాన్ని నూరిపోస్తాడు. రాజ్ మాటలు నిజమని నమ్మిన ఎంప్లాయ్స్ వెంటనే పని మొదలుపెడతాడు.
అనామిక అబద్ధాలు...
రాజ్, కావ్యలను కాంట్రాక్ట్ ఇచ్చిన జగదీష్ ప్రసాద్‌ను అనామిక కలుస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని, కంపెనీని రాజ్, కావ్య సరిగ్గా పట్టించుకోవడం లేదని చెబుతుంది. అలాంటి కంపెనీకి కంట్రాక్ట్ ఇచ్చి మీ పరువు పొగొట్టుకుంటారా అంటూ మాయ మాటలతో కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు ప్లాన్ వేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
టాపిక్