Brahmamudi March 8th Episode: రాజ్‌కు యాక్సిడెంట్ - ఐసీయూలో కావ్య - అప‌ర్ణ‌, క‌న‌కం క‌న్నీళ్లు - రుద్రాణి ఆనందం-brahmamudi march 8th episode kavya injured in accident raj is missing star maa today serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 8th Episode: రాజ్‌కు యాక్సిడెంట్ - ఐసీయూలో కావ్య - అప‌ర్ణ‌, క‌న‌కం క‌న్నీళ్లు - రుద్రాణి ఆనందం

Brahmamudi March 8th Episode: రాజ్‌కు యాక్సిడెంట్ - ఐసీయూలో కావ్య - అప‌ర్ణ‌, క‌న‌కం క‌న్నీళ్లు - రుద్రాణి ఆనందం

Nelki Naresh HT Telugu

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి మార్చి 8 ఎపిసోడ్‌లో కావ్య‌ను చంపేందుకు ఓ షూట‌ర్‌తో డీల్ కుద‌ర్చుకుంటుంది యామిని. కానీ షూట‌ర్ బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యి టైర్‌కు త‌గల‌డంతో రాజ్‌, కావ్య ప్ర‌యాణిస్తోన్న కారు లోయ‌లో ప‌డుతుంది. ఈ ప్ర‌మాదంలో కావ్య తీవ్రంగా గాయ‌ప‌డుతుంది. రాజ్ మిస్స‌వుతాడు.

బ్ర‌హ్మ‌ముడి మార్చి 8 ఎపిసోడ్‌

కావ్య‌, రాజ్ శ్రీశైలం బ‌య‌లుదేరుతారు. మ‌ధ్య‌లో రూట్ మార్చిన రాజ్‌....కావ్య‌ను భూత్ బంగ్లా వ‌ద్ద‌కు తీసుకొస్తాడు. లోప‌ల ఓ స‌ర్‌ప్రైజ్ ఉంద‌ని అంటాడు. కావ్య క‌ళ్లు మూసి లోప‌లికి తీసుకెళ‌తాడు. బిల్డింగ్ లోప‌ల అందంగా డెక‌రేట్ చేసి ఉంటుంది. ఆ డెక‌రేష‌న్ చూసి ఈ రోజు నా బ‌ర్త్ డే కాదు...మీ బ‌ర్త్ డే కాదు. మ‌న పెళ్లి రోజు కూడా కాద‌ని కావ్య అంటుంది.

వాట‌న్నింటికంటే నాకు ముఖ్య‌మైన రోజు అని రాజ్ బ‌దులిస్తాడు. తాత‌య్య మిమ్మ‌ల్ని మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌క‌టించింది ఈ రోజే క‌దా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌. నువ్వే నా జీవితానికి డైరెక్ట‌ర్ అని తెలుసుకున్న రోజు అని రాజ్ స‌మాధాన‌మిస్తాడు.

గొడ‌వ‌ప‌డ‌టం ఇష్టం…

నీతో పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే నువ్వంటే ఏమిటో అర్థ‌మైపోయింద‌ని కావ్య‌తో అంటాడు రాజ్‌. నువ్వు నాతో గొడ‌వ ప‌డుతుంటే బాగా న‌చ్చేది అని చెబుతాడు. నిన్ను బాగా ఇష్ట‌ప‌డ్డాను. కానీ ఆ విష‌యం బ‌య‌ట‌పెడితే నాతో గొడ‌వ‌ప‌డ‌టం ఎక్క‌డ ఆపేస్తావో అని ఇన్నాళ్లు చెప్ప‌లేక‌పోయాన‌ని రాజ్ అంటాడు. నిన్ను ఎంత తిట్టినా...అవ‌మానించిన క‌ష్టం అనే స‌రికి నావైపు నిల‌బ‌డ్డావు.

క‌న్నీళ్లు వ‌స్తే తుడిచే అమ్మ‌వు అయ్యావు. క‌ష్టం వ‌స్తే ధైర్యం చెప్పే నాన్న‌వు అయ్యావు. క‌న్ఫ్యూజ‌న్‌లో ఉంటే క్లారిటీ ఇచ్చే స్నేహితుడివ‌య్యావు. కానీ నేను నీకు ఏం కాలేక‌పోయాన‌ని రాజ్ ఎమోష‌న‌ల్ అవుతాడు. నీ క‌న్నీళ్ల‌కు కార‌ణ‌మ‌య్యాను. నీ క‌ష్టాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయ్యాన‌ని అంటాడు. అయినా నువ్వు న‌న్ను ప్రేమిస్తూనే ఉన్నావ‌ని అంటాడు. నీ అంత గొప్ప‌గా నేను నిన్ను ప్రేమించ‌లేక‌పోవ‌చ్చు కానీ...ఈ రోజు నుంచి నీ క‌న్నీటికి కార‌ణం మాత్రం కాన‌ని కావ్య‌కు మాటిస్తాడు రాజ్‌

లైఫ్‌లాంగ్ ఇంతే ప్రేమ‌గా....

మోకాళ్ల‌పై కూర్చొని కావ్య‌కు రింగ్ ఇచ్చి నాతో లైఫ్‌లాంగ్ ఇంతే ప్రేమ‌గా న‌న్ను చూసుకుంటూ ఉండిపోతావా క‌ళావ‌తి అని ప్ర‌పోజ్ చేస్తాడు రాజ్‌. ఒక‌వేళ నేను ఎప్పుడైనా త‌ప్పు చేసి నీకు దూరంగా వెళ్లిపోతే న‌న్ను మాత్రం నువ్వు వ‌దిలేయ‌వ‌ద్ద‌ని రాజ్ అంటాడు.

మ‌న పెళ్లి నాకు ఇష్టం లేకుండా జ‌రిగింది. మ‌నం మ‌ళ్లీ పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. కావ్య చేతికి రింగ్ తొడుతాడు. రాజ్ ప్ర‌పోజ‌ల్‌కు కావ్య ఫిదా అవుతుంది. మీరు న‌న్ను వ‌దిలి ఎంత దూరం వెళ్లినా...నేను మిమ్మ‌ల్ని వ‌దిలిపెట్ట‌న‌ని, ఊపిరి ఉన్నంత వ‌ర‌కు మీతోనే ఉంటాన‌ని రాజ్‌కు మాటిస్తుంది కావ్య‌.

అనుకున్న‌ట్లుగా జ‌ర‌గాలి...

భూత్ బంగ్లా నుంచి కావ్య రాజ్ శ్రీశైలం బ‌య‌లుదేరుతారు. యామినితో డీల్ కుదుర్చుకున్న షూట‌ర్ కావ్య‌ను చంప‌డానికి ప్లాన్ చేసి ఎదురుచూస్తుంటాడు. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌ర‌గాల‌ని, కావ్య చ‌నిపోవాల‌ని, రాజ్‌కు మాత్రం ఏం కాకూడ‌ద‌ని షూట‌ర్‌తో చెబుతుంది యామిని. ప‌ది నిమిషాల్లో ప‌నిపూర్తి చేసి కాల్ చేస్తాన‌ని షూట‌ర్ అంటాడు. కావ్యకు గ‌న్ గురిపెట్టి కాలుస్తాడు షూట‌ర్‌. కానీ బుల్లెట్ మిస్స‌యి టైర్‌కు త‌గులుతుంది. కారు లోయ‌లోకి ప‌డిపోతుంది.

అప‌ర్ణ కంగారు....

ఇంట్లో గోడ‌కు త‌గిలించి ఉన్న రాజ్‌, కావ్య ఫొటో కింద‌ప‌డ‌టంతో కొడుకు, కోడ‌లికి ఏమ‌య్యిందోన‌ని కంగారు ప‌డుతుంది అప‌ర్ణ‌. ప‌గ‌లిపోయింది ఫొటోనే క‌దా...రెండు వంద‌ల పెడితే మ‌ళ్లీ వ‌స్తుంద‌ని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. నా మ‌న‌సుకు ఎందుకో కీడు శంకిస్తుంద‌ని అప‌ర్ణ వ‌ణికిపోతుంది.

అప్పుడే సుభాష్‌కు ఫోన్ వ‌స్తుంది. రాజ్‌, కావ్య ల‌కు యాక్సిడెంట్ అయిన విష‌యం పోలీసులు ఫోన్ చేసి చెబుతారు. హాస్పిట‌ల్‌లో ఆడ్మిట్ చేసిన‌ట్లు చెప్ప‌డంతో సుభాష్‌తో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యులు కంగారుగా హాస్పిట‌ల్‌కు వ‌స్తారు.

ఐసీయూలో కావ్య‌...

హాస్పిట‌ల్ బెడ్‌పై కావ్య ఒక్క‌తే క‌నిపిస్తుంది. ఐసీయూలో గాయాల‌తో స్పృహ లేకుండా వున్న కావ్య‌ను చూసి అప‌ర్ణ ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌న‌కం కూడా హాస్పిట‌ల్‌కు వ‌స్తుంది. కావ్య‌ను చూసి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

అప‌ర్ణ క‌న్నీళ్లు...

కావ్య‌కు మేజ‌ర్ యాక్సిడెంట్ అయ్యింద‌ని, బ్ల‌డ్ చాలా పోయింద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. రాజ్ గురించి ఎంక్వైరీ చేస్తాడు సుభాష్‌. కావ్య‌ను మాత్ర‌మే పోలీసులు హాస్పిట‌ల్‌లో ఆడ్మిట్ చేశార‌ని, ఆమె వెంట ఎవ‌రూ రాలేద‌ని డాక్ట‌ర్ చెబుతాడు. డాక్ట‌ర్ మాట‌ల‌తో కుటుంబ‌స‌భ్యులు షాక‌వుతారు. రాజ్‌, కావ్య‌ల‌కు అడుగ‌డుగునా స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వ‌డం చూసి అప‌ర్ణ‌, క‌న‌కం క‌న్నీళ్లు పెట్టుకుంటారు.

రుద్రాణి ఆనందం...

కావ్య‌కు యాక్సిడెంట్ కావ‌డం, రాజ్ మిస్సింగ్ కావ‌డం రుద్రాణి సంబ‌ర‌ప‌డుతుంది. కొద్ది సేపు నీ ఆనందాన్ని కంట్రోల్ చేసుకోమ‌ని త‌ల్లిని హెచ్చ‌రిస్తాడు రాహుల్‌. ఈ టైమ్‌లో నోరు జారితే అంద‌రూ మన‌ల్ని ఉరికించి కొడ‌తార‌ని, అప్పుడే ఇదే హాస్పిట‌ల్‌లో జాయిన్ కావాల్సివ‌స్తుంద‌ని అంటాడు.

కావ్య స్పృహ‌లోకి వ‌స్తుంది. రాజ్ మిస్సింగ్ గురించి కావ్య‌కు చెబుతాడు సుభాష్‌. అప్పుడే అక్క‌డికి అప్పు వ‌స్తుంది. యాక్సిడెంట్ స్పాట్‌లో రాజ్ క‌నిపించ‌లేద‌ని, అత‌డు వేసుకున్న ష‌ర్ట్ మాత్ర‌మే దొరికింద‌ని అంటుంది. ర‌క్తం మ‌ర‌క‌ల‌తో నిండిన ష‌ర్ట్‌ను చూసి అప‌ర్ణ, కావ్య క‌న్నీళ్లు పెట్టుకుంటారు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం