Brahmamudi March 6th Episode: బ్రహ్మముడి సీరియల్ - రాజ్ మనసులో కావ్య - రుద్రాణిపై స్వప్న రివేంజ్
Brahmamudi March 6th Episode: రాజ్‌ను ఆటపట్టించేందుకు భాస్కర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తుంది కావ్య. డ్యాన్స్ చేసే క్రమంలో నిప్పులపై అడుగువేయబోతుంది. ఆమెను రాజ్ సేవ్ చేస్తాడు. ఈ ప్రమాదంలో రాజ్ చేయి కాలడంతో కావ్య కంగారుపడుతుంది. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi March 6th Episode: కావ్య బావ భాస్కర్ పీడ వదిలించుకునేందుకు రాజ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ ఫ్లాప్ అవుతాయి. రాజ్ చాలా అసహనంగా ఉండగా శ్వేత ఫోన్ చేస్తుంది. అత్తారింటికి వెళ్లిన తర్వాత నన్ను మర్చిపోయావని రాజ్‌పై సెటైర్ వేస్తుంది. ఇది అత్తారిళ్లులా లేదు అండమాన్ జైలులా ఉందని, నవ్వుతూనే అందరూ నరకం చూపిస్తున్నారని రాజ్ కోపంగా బదులిస్తాడు. మరి అక్కడ ఉండటం ఎందుకు వచ్చేయచ్చుగా అని రాజ్‌తో శ్వేత అంటుంది.
మాట మార్చిన రాజ్...
నాకు రావాలనే ఉంది. కానీ ఇంటి అల్లుడు తొందరగా వెళ్లడం ఏంటి అని అత్తమామలు మర్యాదలు చేస్తున్నారు. నన్ను రాకుండా ఆపేస్తున్నారని తనకు తాను రాజ్ సర్ధిచెప్పుకుంటాడు. మాట మార్చేస్తాడు. కానీ భాస్కర్ ఇక్కడ ఉండటమే నాకు నచ్చడం లేదని శ్వేతతో అంటాడు రాజ్. వాళ్లు పిలవకుండానే జెలసీతో నువ్వు అక్కడికి వెళ్లావు కదా రాజ్ నాటకం మొత్తం కనిపెట్టేస్తుంది శ్వేత.
నువ్వు చాలా మారిపోయావని రాజ్‌తో అంటుంది. కావ్యకు ఆమె బావ ఎక్కడ ప్రపోజ్ చేస్తాడోనని తెగ టెన్షన్ పడుతున్నావు. కావ్య తన బావతో పుట్టింటికి వెళుతుందని తెలిసి నువ్వు కూడా ఆమెతో పాటు అక్కడికి వెళ్లావు కదా అని రాజ్‌ను అడుగుతుంది శ్వేత. ఈగో వల్ల ఒప్పుకోవడం లేదు కానీ నీ నిజానికి నీ మనసులో కావ్య పట్ల చాలా ప్రేమ ఉందనిపిస్తుందని రాజ్‌తో అంటుంది శ్వేత. అలాంటిదేం లేదని, కావ్య నా లైఫ్‌లో నుంచి వెళ్లిపోవడం ఖాయమని రాజ్ అంటాడు.
కావ్య బావ ఎందుకొచ్చాడు...
అసలు ఇన్ని రోజుల తర్వాత కావ్య బావ ఎందుకొచ్చాడు. పని మీద వచ్చాడా? లేదంటే నువ్వు కావ్య విడిపోతున్నారని తెలిసి అమెరికా నుంచి ఇండియా వచ్చాడా అని రాజ్ మనసులో అనుమానాల్ని రేకెత్తిస్తుంది శ్వేత.
గతంలో కావ్యను భాస్కర్ ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కోల్పోయిన ప్రేమను తిరిగి దక్కించుకోవడానికే వచ్చాడా అన్నది నువ్వు తెలుసుకో. అంత మంచి అమ్మాయి ఒక్కసారి నీ జీవితం నుంచి వెళ్లిపోతే ఎప్పటికీ తిరిగి రాదని రాజ్‌తో అంటుంది శ్వేత. ఆమె ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక రాజ్ తడబడిపోతాడు.
అనామిక క్లాస్...
కవితల పబ్లిషింగ్ కోసం కళ్యాణ్ వెళతాడు. కానీ అతడి కవితల్ని పబ్లిష్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు.అదే విషయం తండ్రితో చెబుతుంటాడు కళ్యాణ్. నీ లైఫ్ మొత్తం వెయిట్ చేసినా నీ కవితల్ని ఎవరూ ప్రింట్ చేయరని కళ్యాణ్‌ను ఎగతాళి చేస్తుంది అనామిక. కాలంతో అందరూ పరుగులు పెడుతోన్న టైమ్‌లో మీ అబ్బాయి ఇంక కవితల దగ్గరే ఆగిపోయాడని ప్రకాశంతో చెబుతూ కళ్యాణ్‌ను అవమానిస్తుంది.
నన్ను బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అని అనామికకు బదులిస్తాడు కళ్యాణ్. ఇప్పటికైనా కళ్లు తెరిచి...మీ అన్నయ్యలా ఆలోచించు. అతడిలా గొప్పగా బతకడంపై దృష్టిపెట్టమని భర్తకు సలహా ఇస్తుంది అనామిక. నువ్వు అంటున్న గొప్పతనం డబ్బు, ఇలాంటి బంగళాలో బతకడం వల్ల రాదని అనామికకు ధీటుగా బదులిస్తాడు కళ్యాణ్. మొదటిరోజు కాబట్టే ఇలా మొండిగా వాదిస్తారు. నెల రోజుల్లో నువ్వే నా దారికి వస్తావని కోపంగా అనామిక అక్కడి వెళ్లిపోతుంది.
మన అల్లుడు కాదు మేనల్లుడు...
రాజ్‌ను మళ్లీ ఏడిపించాలని కావ్య, భాస్కర్ ఫిక్సవుతారు. రాజ్ ముందు చాలా సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఎంతైనా మన అల్లుడు చిన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోలేదని కృష్ణమూర్తి అంటాడు. మన అల్లుడు కాదు..మేనల్లుడు అంటూ కృష్ణమూర్తిపై రాజ్ ఫైర్ అవుతాడు.
బావ అంటు అప్పు పిలుస్తుంది. ఏంటి అని రాజ్ వెటకారంగా అంటాడు. నిన్ను కాదు అంటూ భాస్కర్ దగ్గరకు వెళుతుంది. కావ్య, నువ్వు కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంటుందని భాస్కర్‌తో అంటుంది. నీతో కలిసి కావ్య డ్యాన్స్ చేస్తే రాజ్ ఏమనుకోడని చెబుతుంది.
కావ్యను సేవ్ చేసిన రాజ్...
భాస్కర్‌తో కలిసి కావ్య డ్యాన్స్ చేస్తుండగా నిప్పుపై అడుగుబేయబోతుంది. ఆమెకు ప్రమాదం జరుగకుండా రాజ్ అడ్డుకుంటాడు. కానీ అతడి చేతి కాలిపోతుంది. అది చూసి కావ్య కంగారు పడుతుంది. కావ్య ప్రేమను చూపిస్తున్నా వినకుండా రాజ్ ఇంటి లోపలికి వెళ్లిపోతాడు.
రుద్రాణి సమాధానం...
క్రెడిట్ కార్డ్ బిల్ యాభై వేలు రావడం చూసి స్వప్న టెన్షన్ పడుతుంది. ఆ డబ్బులను రుద్రాణిని అడగాలని అనుకొని ఆమె రూమ్‌కు వెళుతుంది. అప్పుటికే డబ్బుల కోసం రుద్రాణిని బతిమిలాడుతుంటాడు రాహుల్. అవన్నీ పట్టించుకోకుండా రుద్రాణిని డబ్బుల కోసం నిలదీస్తుంది స్వప్న. తన దగ్గర డబ్బులు లేవని, ఉన్న ఇవ్వనని రుద్రాణి మొండిగా పట్టుపడుతుంది రుద్రాణి. డబ్బులు ఎలా, ఎవరి నుంచి రాబట్టుకోవాలో నాకు తెలుసు అని స్వప్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రాజ్ సెటైర్స్...
కావ్యతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా భాస్కర్ కాలు కాలిపోతుంది. నడవలేకపోతుంది. అల్లుడు నడవలేక ఇబ్బంది పడుతున్నాడని కనకం అంటుంది. భాస్కర్‌ను కనకం అల్లుడు అని పిలవడం రాజ్ సహించలేకపోతాడు. సిట్యూవేషన్‌తో సంబంధం లేకుండా పంచ్ డైలాగ్స్‌తో భాస్కర్‌ను ఆటపట్టిస్తాడు రాజ్.
స్వప్న మోడలింగ్...
డబ్బుల కోసం మోడలింగ్ చేయాలని స్వప్న ఫిక్సవుతుంది. ఇంట్లోనే ఫొటోషూట్ ఏర్పాటుచేస్తుంది. ఆమె ఫొటోషూట్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ అడ్డుకుంటారు. తనకు డబ్బులు అవసరం అయ్యాయని, భర్తతో పాటు అత్తయ్యను డబ్బులు అడిగితే పుట్టింటి నుంచి తెచ్చుకోమంటున్నారని స్వప్న అంటుంది.
మీ పుట్టింటివారే మా దయాదాక్షణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారని స్వప్నపై సెటైర్ వేస్తుంది ధాన్యలక్ష్మి. డబ్బుల కోసమే కళ్యాణ్‌ను పెళ్లిచేసుకోవాలని అప్పు అనుకున్నదని అనామిక కూడా నోరుజారుతుంది. అత్తింటి వారికి రాజ్ అండగా నిలుస్తుంటాడు. కావ్య తల్లిదండ్రలు గురించి అలా మాట్లాడొద్దని అనామికకు వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.