Brahmamudi March 5th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ - ముక్క‌లైన దుగ్గిరాల ఫ్యామిలీ - రాజ్‌ను ఆటాడుకున్న కావ్య-brahmamudi march 5th episode raj angry on kavya to closeness with bhaskar brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi March 5th Episode Raj Angry On Kavya To Closeness With Bhaskar Brahmamudi Today Episode

Brahmamudi March 5th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ - ముక్క‌లైన దుగ్గిరాల ఫ్యామిలీ - రాజ్‌ను ఆటాడుకున్న కావ్య

Nelki Naresh Kumar HT Telugu
Mar 05, 2024 09:06 AM IST

Brahmamudi March 5th Episode:నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో కావ్య ప‌ట్ల రాజ్ మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను ఎలాగైనా బ‌య‌ట‌పెట్టాల‌ని ఆమె బావ ఫిక్స‌వుతాడు. కావ్య‌తో క్యార‌మ్ ఆడుతోన్న టైమ్‌లో బాగా క్లోజ్‌గా మూవ్ అవుతాడు. వారిద్ద‌రి క్లోజ్‌నెస్ చూసి రాజ్ స‌హించ‌లేక‌పోతాడు.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi March 5th Episode: ప్ర‌కాశం వ‌ల్ల ఆఫీస్‌లో యాభై ల‌క్ష‌ల న‌ష్టం రావ‌డంతో అత‌డిపై సుభాష్ ఫైర్ అవుతాడు. త‌న క‌ళ్ల ముందే భ‌ర్త‌ను సుభాష్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్ట‌డం ధాన్య‌ల‌క్ష్మి త‌ట్టుకోలేక‌పోతుంది. త‌న భ‌ర్త‌ను తిట్టే హ‌క్కు మీకు లేదంటూ సుభాష్‌కు ఎదురుతిరుగుతుంది ధాన్య‌ల‌క్ష్మి. మా ఆయ‌నేం మీ బానిస కాదంటూ సుభాష్‌తో అంటుంది. ధాన్యల‌క్ష్మిమాట‌ల‌తో సుభాష్ హ‌ర్ట్ అవుతాడు. ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు.

సుభాష్ ఎమోష‌న‌ల్‌...

ధాన్య‌ల‌క్ష్మి అన్న మాట‌ల‌ను గుర్తుచేసుకొని సుభాష్‌ ఎమోష‌న‌ల్ అవుతాడు. క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. ధాన్య‌ల‌క్ష్మి త‌ర‌ఫున సుభాష్‌కు ప్ర‌కాశం క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు. ధాన్య‌ల‌క్ష్మి అన్న మాట‌ల్లో నిజం ఉంద‌ని సుభాష్ అంటాడు. నా త‌మ్ముడిని ఎలా తిట్టినా చెల్లుబాటు అవుతుంద‌ని ఇన్నాళ్లు అనుకున్నాన‌ని, కానీ నీకు ఓ మ‌న‌సు ఉంద‌ని ఈ రోజే అర్థ‌మైంద‌ని సుభాష్ ఎమోష‌న‌ల్ అవుతాడు. నా త‌మ్ముడు అన్నింట్లో బెస్ట్ ఉండాల‌ని కోరుకునేవాడిన‌ని, ఎవ‌రు వేలేత్తి చూపించ‌కూడ‌ద‌ని త‌ప్పు చేస్తే నీకు మ‌తిమ‌రుపు ఉంద‌నే సంగతి మ‌ర్చిపోయి తిట్టేవాడిన‌ని ప్ర‌కాశంతో అంటాడు సుభాష్‌. త‌మ్ముడికి తానే క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు సుభాష్‌. మ‌న మ‌ధ్య క్ష‌మాప‌ణ‌లు అక్క‌ర‌లేద‌ని సుభాష్‌తో అంటాడు ప్ర‌కాశం.

బావ‌తో కావ్య క్యార‌మ్ గేమ్‌...

రాజ్‌ను ఏడిపించాల‌ని ఫిక్స‌వుతారు కావ్య‌, ఆమె బావ‌. ఇద్ద‌రు క‌లిసి క్యార‌మ్ బోర్డ్ ఆడ‌బోతున్న‌ట్లు రాజ్‌కు వినిపించేలా గ‌ట్టిగా అరుస్తారు. న‌న్ను ఆడుకుంటున్నారుగా ఇది చాల‌దా అంటూ వారిపై రాజ్ సీరియ‌స్ అవుతాడు. నేను ఆడ‌తాన‌ని వ‌స్తాడు. ఈ గేమ్‌లో నువ్వు, నేను ఒక టీమ్ అని కావ్య‌తో ఆమె బావ అంటాడు. కానీ రాజ్ అందుకు ఒప్పుకోడు. అప్పు, కావ్య ఓ టీమ్ అని, తాను, కావ్య బావ ఓ టీమ్ అని అంటాడు.

క్యార‌మ్ ఆడుతోండ‌గా కాయిన్స్ ఎలా కొట్టాలో ఆమె బావ ద‌గ్గ‌రుండి కావ్య‌కు నేర్పిస్తుంటాడు. ఆ సీన్ చూసి రాజ్ త‌ట్టుకోలేక‌పోతాడు. కావ్య కాయిన్ ప‌డేయ‌గానే ఆమె బావ సంతోషంగా గంతులు వేస్తాడు. కావ్య మ‌న అపోజిష‌న్ టీమ్ అని రాజ్ అత‌డిపై సెటైర్ వేస్తాడు. రాజ్ కాయిన్ ప‌డేసిన‌ప్పుడు మాత్రం అత‌డు సెలైంట్‌గా ఉంటాడు.

కావ్య బిల్డ‌ప్పులు...

రాజ్ ఆమె త‌న బావ గురించి తెగ బిల్డ‌ప్‌లు ఇస్తుంది కావ్య‌. కానీ అత‌డు ఒక్క కాయిన్ కూడా ప‌డ‌గొట్ట‌లేక‌పోతాడు. కావ్య ఆడుతోండ‌గా ప్ర‌తిసారి ఆమె బావ స‌ల‌హాలు ఇస్తుంటాడు. కావ్య‌ను గెలిపించ‌డానికే తాను ఈ గేమ్ ఆడుతున్న‌ట్లుగా చెబుతాడు.

కావ్య బావ ఆనందం...

బావ స‌ల‌హాల‌తో కావ్య వ‌రుస‌గా కాయిన్స్ వేస్తుంది. దాంతో కావ్య‌, ఆమె బావ లేసి డ్యాన్స్ చేస్తారు. ఆ సీన్ చూసి రాజ్ స‌హించ‌లేక‌పోతాడు. నేను ఈ గేమ్ ఆడ‌న‌ని వెళ్లిపోవాల‌ని అనుకుంటాడు. కావ్య చేతుల‌ను ఆమె బావ ప‌ట్టుకుంటూ బాగా క్లోజ్‌గా మూవ్ కావ‌డం చూసి రాజ్ లోలోన ర‌గిలిపోతుంటాడు. కావ్య‌ను ఆమెకు బావ‌కు ఎలాగైనా దూరం చేయాల‌ని అనుకుంటాడు.

కావ్య డిజైన్స్‌పై ఇంక్‌...

కావ్య వేసిన డిజైన్‌పై ఇంక్ పోస్తాడు రాజ్‌. ఏం తెలియ‌న‌ట్లుగా బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న‌కు టీ కావాల‌ని కావ్య‌తో అంటాడు. భ‌ర్త‌కు టీ ఇవ్వ‌డం కోసం కావ్య లేస్తుండ‌గా క‌న‌కం ఆపుతుంది. బావ‌తో నువ్వు గేమ్ ఆడ‌మ‌ని రాజ్‌కు తాను పెట్టి ఇస్తాన‌ని అంటుంది. క‌న‌కం పీక పిసికేయాల‌న్నంత కోపంగా ఉన్న పైకి మాత్రం ఏం అన‌లేక‌పోతాడు రాజ్‌. కావ్య‌ను వెంట‌నే డిజైన్స్ తీసుకుర‌మ్మ‌ని చెబుతాడు.

రాజ్ క్లాస్‌...

డిజైన్స్‌పై ఇంక్ ప‌డి ఉండ‌టం చూసి కావ్య షాక‌వుతుంది. రాజ్‌కు ఏమ‌ని స‌మాధానం చెప్పాలో తెలియ‌క త‌డ‌బ‌డుతుంది. డిజైన్స్‌పై ఇంక్ ప‌డింది అంటూ వంక‌లు చెబితే ఊరుకోన‌ని కావ్య‌కు క్లాస్ ఇస్తాడు రాజ్‌. బావ చేయిప‌ట్టుకొని క్యార‌మ్స్ ఆడ‌టం తెలుసుకొని వ‌ర్క్ స‌రిగ్గా చేయ‌డం తెలియ‌దా అంటూ ఫైర్ అవుతాడు. ఇప్ప‌టికిప్పుడు ఆ డిజైన్స్ మ‌ళ్లీ వేయ‌మ‌ని అంటాడు.

కావ్య బావ ప్లాన్‌...

కావ్య బావ రూమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. కావ్య మ‌ళ్లీ డిజైన్స్ వేయాల్సిన ప‌నిలేద‌ని అంటాడు. కావ్య వేసిన డిజైన్స్‌ను త‌న ఫోన్‌లో ఫొటో తీసి సేవ్ చేశాన‌ని అంటాడు. బావ తెలివికి కావ్య తెగ మురిసిపోతుంది.

చిన్న‌నాడు ఆడుకున్న గేమ్స్ క‌లిసి ఆడ‌దామ‌ని కావ్య‌ను తీసుకెళ‌తాడు ఆమె బావ‌. రాజ్‌కు ప‌ర్మిష‌న్ లేకుండానే కావ్య‌ను తీసుకెళ్లిపోతాడు.

అప‌ర్ణ ఆవేద‌న‌...

ధాన్య‌ల‌క్ష్మి త‌న భ‌ర్త‌ను నానా మాట‌లు అన‌డం అప‌ర్ణ స‌హించ‌లేక‌పోతుంది. ఆ విష‌యాన్ని ఇందిరాదేవికి చెబుతుంది. త‌న కోపాన్ని భ‌ర్త సుభాష్‌పై చూపించింద‌ని, త‌ప్పు చేసిన ప్ర‌కాశాన్ని మంద‌లించ‌బోతే త‌ప్పుప‌ట్టింద‌ని అప‌ర్ణ అంటుంది. ధాన్య‌ల‌క్ష్మి ఒక్క‌సారిగా త‌మ‌ను ప‌రాయివాళ్ల‌ను చేసి మాట్లాడింద‌ని, ఆ విష‌యంలో సుభాష్ చాలా కుమిలిపోతున్నాడ‌ని ఆవేద‌న‌కు లోన‌వుతుంది. ధాన్య‌ల‌క్ష్మి చాలా ప్ర‌మాద‌క‌రంగా మారిపోతుంద‌ని, త‌న‌కు న‌చ్చ‌చెప్ప‌క‌పోతే త్వ‌ర‌లోనే ఇళ్లు ముక్క‌ల‌వ్వ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తుంది.

WhatsApp channel