అప్పు ద్వారా యామిని ఇంటి అడ్రెస్ కనిపెడుతుంది కావ్య. రాజ్‌ను కలవడానికి బయలుదేరుతుంది. కావ్య ఇంటి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తుంది రుద్రాణి. ఆమె నోరు మూయిస్తుంది కావ్య. నా జోలికి మీరు వస్తే మీ జోలికి నేను వస్తానని అంటుంది. మీ హద్దుల్లో మీరు ఉండటం మంచిదని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది.
రుద్రాణితో గొడవ ఎందుకని, నీకు ఏం కావాలన్న మేము తీసుకొస్తామని కావ్యకు సర్ధిచెప్పబోతాడు సుభాష్. అంటే నేను గడప దాటి బయటకు వెళితే ఇంటి పరువు పోతుందని మీరు కూడా నమ్ముతున్నారా అని సుభాష్‌ను అడుగుతుంది కావ్య. నీకు హెల్ప్ చేద్దామని అన్నానని సుభాష్ బదులిస్తాడు. మీ నమ్మకం వేరు...నేను వెళుతున్న దారి వేరు.
అలాంటప్పుడు నేను అడిగింది ఎలా తీసుకువస్తారని సుభాష్‌తో ఎమోషనల్‌గా చెబుతుంది కావ్య. నా జీవితంలో ఎప్పుడూ చివరి వరకు ఒంటరిగానే పోరాడాల్సివస్తుందని, నన్ను నమ్మి ఎవరూ నాతో రావడం లేదని అంటుంది. అప్పటివరకు నేనే వెళ్లే దారిని కూడా తప్పుపడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు కూడా ఒంటరిగానే పోరాడుతానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళుతుంది.
కావ్య వెళ్లిపోగానే అపర్ణ దగ్గరకు వస్తుంది రుద్రాణి. అన్నయ్యను కావ్య అన్ని మాటలు అంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని ఫిట్టింగ్ పెట్టబోతుంది. కావ్య మాటలను నువ్వు కూడా నిజమని నమ్ముతున్నావా అని అపర్ణను అడుగుతుంది రుద్రాణి. కావ్య మాటలు నిజమైతే బాగుండునని అనిపిస్తుందని అపర్ణ బదులిస్తుంది. నీ మాట ప్రకారం నా కొడుకు ఈ లోకంలో లేడు.
కానీ కావ్య చెప్పే ప్రతి మాటలో నా కొడుకు బతికే ఉన్నాడు. అందుకే తన నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నానని అపర్ణ చెబుతుంది. అందరూ ఊహల్లోనే బతకండి. ఏదో ఒక రోజు కావ్య చేస్తున్న పనుల వల్ల మన కుటుంబం పరువు రోడ్డున పడటం ఖాయమని రుద్రాణి తన మనసులోని అక్కసును బయటపెడుతుంది.
కావ్య ముందు నోరు తెరిచి నువ్వే పరువు తీసుకున్నావని రుద్రాణితో ఇందిరాదేవి అంటుంది. మా అత్తకు పరువు, ప్రతిష్టలు లాంటివి ఏం లేవని, ఉంటే మొగుడిని ఎందుకు వదిలేస్తుందని స్వప్న సెటైర్లు వేస్తుంది. నీతులు ఎదుటివాళ్లకు చెప్పడం కాదు మనం కూడా ఫాలో కావాలని పంచ్ వేస్తుంది.
యామిని ఇంటికి వెళ్లి డోర్ కొడుతుంది కావ్య. రాజ్ డోర్ తీస్తాడు. అతడినే చూస్తూ ఉండిపోతుంది కావ్య. హాయ్ మీరా...ఇప్పుడు ఎలా ఉంది అని కావ్యను అడుగుతాడు రాజ్. ఆమెను లోపలికి ఆహ్వానిస్తాడు. లక్కీగా మీకు ఏం కాలేదు సంతోషంగా ఉందని రాజ్ అంటాడు. నాకు మాత్రం చాలా బాధగా ఉందని కావ్య మనసులో అనుకుంటుంది. నన్ను గుర్తుపట్టలేకపోతున్న మిమ్మల్ని చూస్తే గుండె తట్టుకోలేకపోతుందని ఆవేదనకు లోనవుతుంది. మీరు నన్ను కాపాడుకున్నారు...కానీ నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోయానని మనసులో అనుకుంటుంది.
తనను కాపాడి హాస్పిటల్‌లో జాయిన్ చేసిన రాజ్‌కు థాంక్స్ చెబుతుంది కావ్య. అదంతా మా తాతయ్య దగ్గర నేర్చుకున్నానని రాజ్ అంటాడు. తాతయ్య పేరు చెప్పగానే రాజ్‌కు గతం గుర్తొచ్చిందని కావ్య అనుకుంటుంది. జోక్ చేశానని, మనిషిగా అది నా కనీసం ధర్మం అని రాజ్ అంటాడు.
మా ఇంటి అడ్రెస్ ఎలా తెలిసిందని కావ్యను అడుగుతాడు రాజ్. ఓపీపై మీరే అడ్రెస్ రాశారని కావ్య అంటుంది. కావ్య తెలివితేటలకు రాజ్ ఫిదా అవుతాడు. మీరు నెర్పించినవేనని కావ్య అంటుంది. కావ్య మాటలతో రాస్ షాకవుతాడు. ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌ను మెచ్చుకుంటాడు.
కావ్య, రాజ్ తన ఇంట్లోనే క్లోజ్‌గా మాట్లాడుకోవడం చూసి యామిని షాకవుతుంది. కావ్య దగ్గరకు వస్తుంది.
తను ఎవరో నీకు తెలుసా అని రాజ్‌ను అడుగుతుంది. తెలుసు కాబట్టే కదా నన్ను వెతుక్కుంటూ వచ్చిందని యామినికి బదులిస్తాడు రాజ్. మాది జన్మ జన్మల బంధం అని అంటాడు. రాజ్ మాటలతో యామిని షాకవుతుంది. జోక్ చేశానని రాజ్ నవ్వుతాడు.
రోడ్డు మీద కళ్లు తిరిగిపడిపోతే కాపాడి నేను హాస్పిటల్‌లో చేర్పించింది తననే అని కావ్యను యామినికి పరిచయం చేస్తాడు. మీ పేరు ఏంటని కావ్యను అడుగుతాడు రాజ్. కళావతి అని కావ్య బదులిస్తుంది.
మీ పేరు బాగుందని రాజ్ మెచ్చుకుంటాడు. నా మనసుకు నచ్చినవాళ్లు నాకు పెట్టిన పేరు అదని అంటుంది. తన పేరు రామ్ అని కావ్యకు చెబుతాడు రాజ్. కావ్యకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. కావ్య తనవైపు కోపంగా చూడటంతో యామిని ఇబ్బందిపడుతుంది. తన డ్రామా ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతుంది.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు, నాకు బాగా తెలిసినట్లు అనిపిస్తుందని రాజ్ అంటాడు. నా మెడలో తాళి మీరే కట్టారనే నిజం త్వరలోనే తెలిసేలా చేస్తానని కావ్య మనసులో అనుకుంటుంది. మరోవైపు యామిని తల్లిదండ్రులు కూడా కావ్యతో క్లోజ్‌గా మాట్లాడుతారు. అది చూసి యామిని తట్టుకోలేకపోతుంది. కావ్యకు కాల్ వస్తుంది. నాకు అర్జెంట్ పని ఉందని వెళ్లబోతూ బై రాజ్ అని చెబుతుంది కావ్య. ఆ పిలుపు విని రాజ్ షాకవుతాడు. సారీ రామ్ అని అంటుంది.
కావ్య దూరంగా వెళ్లిపోతుండటంతో రాజ్ కూడా ఏదో మిస్సయినట్లు ఫీలవుతాడు. మంచి అమ్మాయిలా ఉందంటూ కావ్యపై యామిని తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తారు. కావ్యను ఎక్కడో చూసినట్లు ఉందని రాజ్ ఆలోచిస్తాడు. మన మధ్య ఏదో బంధం ఉందని అనిపిస్తుందని మనసులో అనుకుంటాడు. నీ చూపు, రూపం ఇవేవి నాకు కొత్త కాదని అనిపిస్తుందని , నిజంగా మాకు పాత పరిచయం ఉందా అని రాజ్ ఆలోచిస్తాడు. పదే పదే కావ్య వెనక్కి తిరిగి రాజ్‌ను చూస్తుంది. రాజ్ కూడా కావ్యనే చూస్తుంటాడు.
మీరు గతం మర్చిపోయినా మన బంధం తాలూకు జ్ఞాపకాలు మీ చూట్టూనే తిరుగుతున్నాయని, మీరు ఎప్పటికీ నా భర్తే అని రాజ్‌ను ఉద్దేశించి మనసులో అనుకుంటుంది కావ్య.
రామ్, యామినిలకు ముహూర్తం ఫిక్స్ చేస్తారు యామిని తల్లిదండ్రులు. కానీ పెళ్లి ప్రపోజల్‌ను రాజ్ రిజెక్ట్ చేస్తాడు. పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదని అంటాడు. మరోవైపు రాజ్‌కు గతం గుర్తుకు తేవడానికి స్పెషల్‌గా వంట ప్రిపేర్ చేసి రాజ్‌కు పంపిస్తుంది కావ్య. ఆ వంట రుచి చూసిన రాజ్ మ ఎచ్చుకుంటాడు. కళావతి చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం