రుద్రాణి మాటలు నమ్మి రాజ్‌కు కర్మకాండలు జరిపిస్తుంటారు కుటుంబసభ్యులు. రాజ్ ఫొటోను చూస్తూ అపర్ణ ఎమోషనల్ అవుతుంది. నన్ను అమ్మ అని ఎవరు పిలుస్తారు. ఇక ఎప్పటికీ ఆ పిలుపు వినబడనంత దూరంగా రాజ్ వెళ్లిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటుంది. దుగ్గిరాల కుటుంబసభ్యులు అందరూ ఎమోషనల్ అవుతారు. కానీ రుద్రాణి మాత్రం లోలోన సంబరపడుతుంది.
రాజ్ దూరమయ్యాడు కాబట్టి ఆస్తికి తన కొడుకు రాహుల్ వారసుడు అవుతాడని ఆనందం పట్టలేకపోతుంది. కర్మకాండలు పూర్త్యే వరకు అయినా బాధ పడుతున్నట్లుగా యాక్టింగ్ చేయమని తల్లికి సలహా ఇస్తాడు రాహుల్.
కర్మకాండలకు సంబంధించిన మంత్రాలు వినిపించడంతో కావ్య బయటకు వస్తుంది. రాజ్ ఫొటోకు దండ వేసి ఉండటం చూసి షాకవుతుంది. ఆపండి అని గట్టిగా అరుస్తుంది. కర్మకాండలు ఈ లోకంలో లేనివాళ్లకు చేయాలి. ఉన్నవాళ్లకు కాదని సుభాష్‌తో వాదిస్తుంది కావ్య. గుండెను రాయిచేసుకొని ఈ నిజాన్ని జీర్ణం చేసుకోమని కావ్యకు సర్ధిచెప్పబోతుంది అపర్ణ.
రాజ్‌ను నా కళ్లతోనే నేను చూశానని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారని అపర్ణతో అంటుంది కావ్య. మీరే నమ్మకపోతే ఎలా అని వాపోతుంది. రానురాను ధైర్యాన్ని పొగొట్టుకొని మతిస్థిమితం పోగొట్టుకున్నదానిలా తయారవుతున్నావని, నీకు మేము అండగా ఉన్నామని కావ్యతో ఇందిరాదేవి చెబుతుంది. రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఈ కార్యక్రమం జరగాలని, అపోద్దని అంటుంది.
ఆచారం పేరుతో బతికున్న మనిషికి మీరు కర్మకాండలు పెడుతున్నారని అది మహాపాపమని కావ్య బదులిస్తుంది. నా భర్త బతికుండగా నా కళ్ల ముందే ఆయనకు కర్మకాండలు జరిపిస్తుంటే నేను చూడలేనని కావ్య అంటుంది. ఇవన్నీ చేసి చేసి నా సౌభాగ్యాన్ని దూరం చేయద్దని, తాను పుణ్యస్త్రీనని కుటుంబసభ్యులను బతిమిలాడుతుంది.
కావ్యను స్వప్న, అప్పు లోపలికి తీసుకెళ్లబోతారు. అందరిలాగే మీరు కూడా నాకు మతిపోయిందని అనుకుంటున్నారా? నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అని అప్పు, స్వప్పలతో కోపంగా అడుగుతుంది కావ్య. రాజ్‌ను తాను చూశానని చెబుతుంది. కానీ కావ్య చెప్పిన మాటలను ఇద్దరు నమ్మరు.
నా ఐదో తనాన్ని వదులుకోమని చెప్పే హక్కు ఇక్కడ ఎవరికి లేదని కావ్య అంటుంది. ఆయనకు కర్మకాండలు జరిపిస్తే నా భర్త ఉండగానే నేను వితంతువుగా బతకాల్సివస్తుందని, అది నాకు శాపంగా మారుతుందని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రాధేయపడుతుంది కావ్య.
పసుపుకుంకుమలు తీయకపోయినా పర్వాలేదని, కానీ రాజ్‌కు తిలోదకాలు ఇవ్వడానికి మాత్రం అడ్డుపడొద్దని, మమ్మల్ని క్షోభ పెట్టకుండా ఈ తంతు జరగనివ్వమని కావ్యకు దండం పెడుతుంది అపర్ణ. రాజ్ చనిపోయి ఉంటే గుండె నిబ్బరం చేసుకొని మీ కొడుకు బదులు నేనే మీకు అండగా నిలబడేదానిని అని అపర్ణ మాటలకు బదులిస్తుంది కావ్య.
అంత తట్టుకోలేకపోతే చచ్చిపోయేదానిని. ఊహించుకొని రాజ్ బతికి ఉన్నాడని తాను చెప్పడం లేదని, నిజంగానే కళ్లతో చూశానని కావ్య అంటుంది. ఆచారం పేరుతో మహాపాపం చేస్తున్నారని చెబుతుంది. ఇవన్నీ ఆపేయమని అపర్ణను బతిమిలాడుతుంది కావ్య.
కావ్య ఇంత నమ్మకంగా చెబుతుంటే...మనమే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామని అనిపిస్తుందని అపర్ణ అంటుంది. ఏం చేయాలో తెలియడం లేదని అంటుంది. రాజ్ బతికి ఉంటే...కావ్యను చూసి ఉంటే వదిలేసి ఎలా వెళ్లిపోతాడని సుభాష్ అంటాడు. కావ్య భ్రమలో ఉందని, అదే భ్రమలోకి మనల్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తుందని సుభాష్ చెబుతుంది.
కావ్యను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించకపోతే శాశ్వతంగా పిచ్చిదైపోతుందని రుద్రాణి అంటుంది. నన్ను పిచ్చిదానిని చేసి ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నారా...నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా అని కావ్య నిలదీస్తుంది.
కావ్య మాటలను పట్టించుకోకుండా సుభాష్ కర్మకాండలు జరిపించబోతాడు. కావ్య కోపం పట్టలేక అక్కడి వస్తువులతో పాటు రాజ్ ఫొటోకు ఉన్న దండను తీసి విసిరేస్తుంది. భర్త ఫొటోను గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. బతికే ఉన్న నా భర్తకు తర్పణం వదిలే హక్కు, అధికారం కన్నతండ్రి అయినా మీకు కూడా లేదని సుభాష్‌తో అంటుంది.
పక్కనున్న దీపంపై ప్రమాణం చేసి నా భర్త బతికే ఉన్నాడని కావ్య అంటుంది. ఏదో ఒక రోజు మీరు చేసిన పనికి పశ్చాత్తాప పడతారని కావ్య అంటుంది. నా భర్త లేడనే మాట మళ్లీ ఇంట్లో వినిపించడానికి వీలులేదని అందరికి వార్నింగ్ ఇస్తుంది.
హాస్పిటల్‌లో తాను జాయిన్ చేసిన అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉందని రాజ్ పదే పదే ఆలోచిస్తున్నాడని, అతడిని చూస్తుంటే నాకు టెన్షన్‌గా ఉందని యామిని అంటుంది. రాజ్ ఎంత ఆలోచించిన అతడికి తలనొప్పి తప్ప గతం మాత్రం గుర్తుకు రాదని యామిని తల్లి అంటుంది. రాజ్ అని పిలవడంతో తల్లిపై యామిని ఫైర్ అవుతుంది. రామ్ అని పిలవమని హెచ్చరిస్తుంది. రాజ్ కాపాడిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని యామిని ఫిక్సవుతుంది.
మరోవైపు కావ్య మాటలను నమ్ముతుంది అప్పు. రాజ్ కేసును రీ ఇన్వేస్టిగేషన్ చేయాలని అనుకుంటుంది. అప్పు నిజానిజాలు తెలుసుకునే లోపే తాను రాజ్‌ను తీసుకొచ్చి అందరి ముందు నిలబెడతానని కావ్య అంటుంది. కావ్య అడ్డు తొలగిపోతేనే తన కొడుకు రాహుల్ ఆస్తితో పాటు కంపెనీకి వారసుడు అవుతాడని రుద్రాణి అనుకుంటుంది. కావ్యను చంపడానికి స్కెచ్ వేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం