Brahmamudi March 18th Episode: రాజ్ జ్ఞాపకాల్లో కావ్య - యామినితో రామ్ పెళ్లి - దుగ్గిరాల ఫ్యామిలీకి రుద్రాణి టార్చర్
Brahmamudi March 18th Episode: బ్రహ్మముడి మార్చి 18 ఎపిసోడ్‌లో రాజ్‌ను ఫారిన్ తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని యామిని ప్లాన్ వేస్తుంది. కానీ యామిని వెంట ఫారిన్ వెళ్లడానికి రాజ్ ఒప్పుకోడు. పెళ్లి కూడా ఇప్పుడే వద్దని అంటాడు.
Brahmamudi March 18th Episode: రాజ్ బతికే ఉన్నాడని, తాను చూశానని కావ్య ఎంత చెప్పిన కుటుంబసభ్యులు నమ్మరు. మరోవైపు రాజ్‌ను రామ్‌గా మార్చేసిన యామిని అతడి ఫారిన్ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది. రాజ్‌పేరిట దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. రాజ్‌కు గతం గుర్తొస్తే నిన్ను క్షమించడని తల్లిదండ్రులు ఎంత చెప్పిన యామిని వినదు.
రాజ్‌ను పెళ్లి చేసుకుంటా...
ఇక్కడే ఉంటే రాజ్‌కు అతడికి కుటుంబం ఎదురుకావచ్చునని, గొడవలు జరగడం తనకు ఇష్టం లేదని అంటుంది. రాజ్‌ను ఫారిన్ తీసుకెళ్లి అక్కడే అతడిని పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్లు తన ప్లాన్‌ను తల్లిదండ్రులకు చెబుతుంది. రాజ్‌కు గతం గుర్తుకు రాకుండా తాను జాగ్రత్త పడుతానని అంటుంది.
యామిని ఫారిన్ వెళ్లడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోరు. మాకు ఉన్నదానికి నువ్వు ఒక్కదానివేనని ఆమెను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయబోతారు.
యామిని కంగారు...
ఏమైంది అని అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ అడుగుతాడు. రాజ్ తమ మాటలు విన్నాడని యామిని కంగారు పడుతుంది. ఇద్దరం కలిసి ఫారిన్ వెళ్లిపోయి అక్కడే సెటిలైపోవాలని ఉందని, కానీ దానికి మమ్మీ డాడీ ఒప్పుకోవడం లేదని యామిని అంటుంది. జరిగిన యాక్సిడెంట్‌ను తాను ఇంకా మార్చిపోలేకపోతున్నానని, ఫారిన్ వెళ్లడం, పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని రాజ్ బదులిస్తాడు. రాజ్ మాటలతో యామిని షాకవుతుంది.
రాజ్ జ్ఞాపకాలు...
రాజ్ గురించే ఆలోచిస్తుంటుంది కావ్య. గోడకు తగిలి ఆమె చేతికి ఉన్న గాజులు పగిలిపోతాయి. ఆ గాజులు రాజ్ తనకు తొడిగిన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటుంది. గాజులు ఎందుకు తీసుకొచ్చారని కావ్య ఎంత అడిగిన రాజ్ చెప్పడు. నువ్వు ముందు గాజులు వేసుకుంటేనే చెబుతానని అంటాడు.
రాజ్ చెప్పినట్లే చేస్తుంది కావ్య. ఒక్కోసారి మధ్య రాత్రి మెళుకువ వచ్చినప్పుడు నీ చేతి గాజుల చప్పుడు వింటే నవ్వు నా పక్కనే ఉన్నావని నమ్మకం నాకు కంఫర్ట్ ఫీలింగ్ కలిగిస్తుందని రాజ్ అంటాడు. గాజుల చప్పుడు వినబడకపోతే ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తుందని అంటాడు.
కావ్య గాజులు మాటిమాటికి తీసేయకుండా చిన్న సైజ్ తీసుకొస్తాడు. రాజ్ ఇచ్చిన గాజులు తీసేయబోతుంది. కావ్య చేతులను పట్టుకొని మెళితిప్పుతాడు. కావ్య బాధతో విలవిలలాడుతూ వదిలేయమని రాజ్‌ను బతిమిలాడుతుంది.
ఇందిరాదేవి కన్నీళ్లు...
రాజ్ లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుంటూ తనను వదిలేయమని కావ్య చెప్పడం ఇందిరాదేవి చూస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు రాజ్ లేడనే సంగతి గుర్తొచ్చి కావ్య కూడా ఎమోషనల్ అయిపోతుంది.
మానుఫ్యాక్షరింగ్ డిఫెక్ట్...
కావ్యను చూస్తే భయమేస్తుందని ఇందిరాదేవి అంటుంది. చీకటి గదిలో చంద్రముఖిలా న్యాటం చేస్తుందా అని రుద్రాణి సెటైర్ వేస్తుంది. ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేవా అపర్ణ అంటుంది. మానుఫ్యాక్షరింగ్ డిఫెక్ట్ అని స్వప్న కూడా అత్తపై ఫైర్ అంటుంది.
రాజ్ ఇంకా బతికే ఉన్నాడని, తన పక్కనే ఉన్నాడని కావ్య ఊహించుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి చెప్పినట్లు కావ్య మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అనిపిస్తుందని కుటుంబసభ్యులతో ఇందిరాదేవి చెబుతుంది. ఇందిరాదేవి మాటలు అందరూ నిజమేనని అనుకుంటారు. కావ్యను డాక్టర్‌కు చూపించాలని ఫిక్సవుతారు.
రాజ్ కర్మకాండలు...
డాక్టర్‌తో పాటు ఓ పురోహితుడిని పిలిపించమని రుద్రాణి అంటుంది. మూడో రోజు కర్మ జరిపించాలని చెబుతుంది. రుద్రాణి మాటలతో అపర్ణ కోపం పట్టలేకపోతుంది నువ్వు మనిషిపా పశువువా అని కోపంగా అంటుంది. అపర్ణ మాటలను తేలిగ్గా తీసుకుంటుంది రుద్రాణి. నేను పోయినా కూడా కర్మ జరిపించాలని అది ఆచారం అని చెబుతుంది. అది నిజమైతే బాగుండు నీ కర్మ గ్రాండ్‌గా జరిపించేవాళ్లమని ప్రకాశం కోపంగా ఆన్సర్ ఇస్తాడు.
ఇంటికే ఆరిష్టం...
రాజ్ కర్మ జరిపించాల్సిందేనని, లేదంటే ఇంటికే అరిష్టమని, రాజ్ ఆత్మ కూడా శాంతించదని రుద్రాణి వాదిస్తుంది. మీకు ఇబ్బందిగా ఉంటే రాజ్ క ర్మ జరిపించే బాధ్యతను తాను తీసుకుంటానని రుద్రాణి అంటుంది. రాజ్ బతికి ఉన్నప్పుడు ఎంతో చేయాలని అనుకున్నానని, కానీ ఏం చేయలేకపోయానని, కనీసం రాజ్ చనిపోయాడు కాబట్టి వాడి కర్మలు జరిపించి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తానని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతుంది. నన్ను అత్త అని ఎంతో ప్రేమగా పిలిచేవాడని కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా నాటకం ఆడుతుంది.
కావ్య ఆలోచనల్లో రాజ్...
తాను హాస్పిటల్‌లో చేర్పించిన కావ్యతో తనకు ఏదో అనుబంధం ఉన్నట్లుగా రాజ్‌కు అనిపిస్తుంది. ఆమె గురించే ఆలోచిస్తుంటాడు. అప్పుడే యామిని వచ్చి రాజ్ భుజంపై చేయివేస్తుంది. కోపంగా చేయి తీసేస్తాడు.
నీ చేతి స్పర్ష నాకు పరిచయం ఉన్నట్లుగా అనిపించడం లేదని, కానీ ఈ రోజు నేను హాస్పిటల్‌లో చేర్పించిన అమ్మాయి ముఖం చూస్తే మాత్రం నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉన్నట్లుగా అనిపించిందని అంటుంది. నా మెదడుకు, మనసుకు మధ్య ఏదో జ్ఞాపకం ఊగిసలాడుతుందని అంటుంది. నా మనసుకు దగ్గరైన మనిషిలా అనిపిస్తుందని అంటాడు.
మేము తప్ప ఎవరూ లేరు...
రాజ్ హాస్పిటల్‌లో చేర్పించిన అమ్మాయి కావ్య అయివుంటుందని యామిని కంగారు పడుతుంది. రాజ్ ఇక్కడే ఉంటే అతడికి గతం గుర్తొస్తుందని భయపడిపోతాడు. నీకు కావాల్సిన వాళ్లు మేము తప్ప ఎ వరూ లేరని తన మాటలతో రాజ్‌ను నమ్మిస్తుంది. మన ఆఫీస్‌లో పనిచేసే అమ్మాయి అయ్యి ఉంటుందని అంటుంది. ఆ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచించవద్దని రాజ్‌తో చెబుతుంది. యామిని మాటలు నిజమని రాజ్ నమ్ముతాడు.
రాజ్ కర్మకాండలు...
ఇష్టం లేకపోయినా రుద్రాణి మాటలు నమ్మి రాజ్‌కు కర్మకాండలు జరిపిస్తుంటాడు సుభాష్. ఇక నుంచి తనను అమ్మ అని ఎవరూ పిలుస్తారని అపర్ణ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. రాజ్ బతికే ఉన్నాడని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం