బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది దీపికా రంగరాజు. ఈ సీరియల్‌తోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ధైర్యం, అమాయకత్వం, తెలివితేటలు కలబోసిన ఇల్లాలి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో అదరగొడుతోంది. ఇటీవల దీపికా రంగరాజు కాకమ్మ కథలు అనే టాక్ షోలో పాల్గొన్నది. హీరోయిన్ తేజస్వి మదివాడ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నది దీపికా రంగరాజు.
యాక్టింగ్ కెరీర్ విషయంతో తనను ఎవరో సపోర్ట్ చేయలేదని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి మోటీవేషన్ , హెల్స్ లభించలేదని కావ్య అన్నది. నేను చదువుకొని ఐటీ జాబో, గవర్నమెంట్ జాబో చేయాలని మా తల్లిదండ్రులు ఇప్పటికీ కోరుకుంటున్నారని చెప్పింది. నీ యాక్టింగ్ బాగుంది, కెరీర్ పరంగా మంచి పరిణితి చూపిస్తున్నావని చెప్పేవాళ్లు ఒక్కరూ లేరని అన్నది.
మనల్ని సపోర్ట్ చేసేవాళ్లు ఉంటే లైఫ్‌లో ఇంకా ఎదుగుతాం. ఏదైనా చేయగలుగుతాను అని ఈ షోలో బ్రహ్మముడి కావ్య చెప్పింది. నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని, కొన్ని సందర్భాల్లో అది బాధిస్తుందని చెప్పింది. ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నావు.. ఇంకా ఎక్కువ సంపాదించు అని చెప్పేవాళ్లు ఒక్కరూ లేరని దీపికా రంగరాజు తెలిపింది.
ఛాన్స్ వస్తే బిగ్‌స్క్రీన్‌లో ఏ హీరోతో నటించాలని ఉందని కావ్యను తేజస్వి మదివాడ అడిగింది. నాగార్జునతో సినిమా చేయాలని ఉందని దీపికా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చింది. బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ రోల్‌కు సెట్టయ్యే మరో యాక్టర్ ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు అమర్‌దీప్ పేరు చెప్పింది కావ్య. తెలుగులో తన ఫేవరేట్ టీవీ యాక్టర్‌గా మాత్రం మానస్ పేరు చెప్పింది.
నా అంత కాకపోయినా నాలా నటిస్తే బాగుంటుందని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు దీపికా రంగరాజు...రష్మిక మందన్న పేరు చెప్పి నవ్వులు పూయించింది.
సీరియల్స్ చేయకపోయి ఉంటే న్యూస్ యాంకర్‌గా సెటిలయ్యేదానిని అని, సీరియల్స్ లోకి రాకముందు ఓ తమిళ టీవీలో కొన్నాళ్లు న్యూస్ ప్రజెంటర్‌గాపనిచేసినట్లు దీపికా రంగరాజు చెప్పింది.
సంబంధిత కథనం