Brahmamudi Kavya: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న బ్రహ్మముడి కావ్య - డ్యాన్స్ షోకు మెంటర్‌గా రాజ్‌తో పోటీకి సై!
Brahmamudi Kavya: బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్, కావ్య అనే పాత్రల్లో భార్యాభర్తలుగా నటిస్తోన్నారు మానస్, దీపికా రంగరాజు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షోలో మెంటర్స్‌గా ఒకరితో మరొకరు పోటీపడబోతున్నారు. ఈ డ్యాన్స్ షో ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో టెలికాస్ట్ కాబోతోంది.

దీపికా రంగరాజు అలియాస్ బ్రహ్మముడి కావ్య కొత్త అవతారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డ్యాన్స్ షోకు మెంటర్‌గా వ్యవహరించనున్నది. ఈ షోతోనే బ్రహ్మముడి కావ్య ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.
ఫిబ్రవరి 14 నుంచి...
డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ మొదలుకాబోతుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఈ డ్యాన్స్ రియాలిటీ షో స్ట్రీమింగ్ కాబోతుంది. డ్యాన్స్ ఐకాన్ సీజన్ కు ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోండగా... హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా కనిపించబోతున్నారు.
నలుగురు మెంటర్స్...
ఈ డ్యాన్స్ షోకు మరో నలుగురు మెంటార్స్ కూడా ఉండనున్నారు. వీరిలో దీపిక రంగరాజు ఒకరు. ఆమెతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్ కూడా మెంటర్లుగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ వెల్లడించింది. వైల్డ్, బోల్డ్...మాత్రమే కాదు ఫుల్ ఫైర్ అంటూ దీపికా ఫొటోను ఆహా ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రోజుకు కాదు గంటకు...
మానస్ డ్యాన్స్ షో అదిరిపోయే స్టెప్పులు వేసిన మరో వీడియోను ఆహా ఓటీటీ షేర్ చేసింది. డీజే టిల్లు పేరు అనే పాటకు మానస్ డ్యాన్స్ చేశాడు. మీరు రోజుకు ఎంత మందిని ఫర్ట్ చేస్తారు అని మానస్‌ను ఓంకార్ ప్రశ్న అడిగాడు. వెంటనే దీపికా లేని రాంగ్ క్వశ్చన్ గంటకు ఎంత మందిని ఫ్లర్ట్ చేస్తారని అడగాలి అంటూ మానస్‌ను ఆటపట్టించినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తుంది.
దీపికా నడుము అందాలను వర్ణించమని మానస్‌ను ఓంకార్ అడిగాడు. దగ్గర నుంచి చూసిన యశ్వంత్ మాస్టర్ వర్ణించలేకపోయాడు..నేనేం వర్ణించగలను అని మానస్ సమాధానం చెప్పడం, యశ్వంత్ మాస్టర్ తడబడటం ఈ ప్రోమోలో నవ్వులను పూయిస్తుంది.
భార్యాభర్తలుగా...
బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్, కావ్య అనే క్యారెక్టర్స్‌లో భార్యాభర్తలుగా నటిస్తోన్న మానస్, దీపికా రంగరాజు ఈ డ్యాన్స్ షోలో మాత్రం మెంటర్లుగా ఒకరితో మరొకరు పోటీపడబోతున్నారు.
ఐదుగురు కంటెస్టెంట్స్...
డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ పోటీపడనున్నారు. పంచభూతాల్లాంటి వారి పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో అని హోస్ట్ ఓంకార్ ఓ షో గురించి వెల్లడించారు.
టీఆర్‌పీ రేటింగ్...
బ్రహ్మముడి సీరియల్ ఒకప్పుడు స్టార్ మాలో టీఆర్‌పీ రేటింగ్ పరంగా నంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తూ వచ్చింది. ఇటీవలే ఈ సీరియల్ టైమింగ్స్‌ను ఛేంజ్ చేశారు. రాత్రి నుంచి మధ్యాహ్నానికి షిప్ట్ చేశారు. దాంతో సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.