Brahmamudi June 3rd Episode: రుద్రాణి బండారం బ‌య‌ట‌ప‌డిందిగా - రాహుల్‌కు బుద్దిచెప్పిన రాజ్‌-brahmamudi june 3rd episode aparna lashes out on rudrani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi June 3rd Episode Aparna Lashes Out On Rudrani

Brahmamudi June 3rd Episode: రుద్రాణి బండారం బ‌య‌ట‌ప‌డిందిగా - రాహుల్‌కు బుద్దిచెప్పిన రాజ్‌

HT Telugu Desk HT Telugu
Jun 03, 2023 10:58 AM IST

Brahmamudi June 3rd Episode: రాహుల్‌తో స్వ‌ప్న పెళ్లిని జ‌ర‌గ‌కుండా అడ్డుకునేందుకు రుద్రాణి ప్ర‌య‌త్నిస్తుంది. కానీ అప‌ర్ణ ఆమెకు షాకిస్తుంది. ఆ త‌ర్వాత నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi June 3rd Episode: రాహుల్ కార‌ణంగా స్వ‌ప్న జీవితానికి జ‌రిగిన అన్యాయాన్ని స‌రిదిద్దాల‌ని అనుకుంటారు సీతారామ‌య్య‌. రాజ్‌తో క‌లిసి క‌న‌కం ఇంటికి వ‌స్తాడు. త‌ప్పు ఇద్ద‌రు చేసినా శిక్ష మాత్రం త‌న అక్క స్వ‌ప్న‌కే ప‌డింద‌ని, ఆమె క‌డుపులో పెరుగుతోన్న బిడ్డ‌కు తండ్రి కావాల‌ని సీతారామ‌య్య‌ను అభ్య‌ర్తిస్తుంది. బిడ్డ‌కు క‌న‌డానికి ముందే స్వ‌ప్న పెళ్లి రాహుల్‌తో జ‌ర‌గాల‌ని అంటుంది. ఆలోచించి స‌రైన నిర్ణ‌యం తీసుకోమ‌ని సీతారామ‌య్య‌ను కోరుతుంది. త‌న పుట్టింటి గౌర‌వాన్ని నిల‌బెట్టాల‌ని వేడుకుంటుంది.

ఆమె అభ్య‌ర్థ‌న‌కు రాజ్ స‌మాధాన‌మిస్తాడు. స్వ‌ప్న‌, రాహుల్‌లా పెళ్లి జ‌రిపించాల‌ని అడ‌గ‌టానికే తాత‌య్య ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు సీతారామ‌య్య చెబుతాడు. వారం రోజుల్లో రాహుల్‌, స్వ‌ప్న పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. ఆ మాట‌లు విని స్వ‌ప్న సంతోష‌ప‌డుతుంది. సీతారామ‌య్య దంప‌తుల కాళ్ల‌పై ప‌డుతుంది.

రుద్రాణికి క్లాస్‌...

ఇంట్లో ఎవ‌రిని లెక్క‌చేయ‌కుండా, అన్న‌య్య వ‌దిన‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌కుండా రుద్రాణి ప్ర‌వ‌ర్తించ‌డంపై సుభాష్ కోప‌గించుకుంటాడు. నీ కొడుకును కూడా స‌వ్యంగా పెంచ‌లేక‌పోయావ‌ని ఇదేనా పెంప‌కం, ఇలాగేనా పెంచేది అంటూ చెడామ‌డా వాయించేస్తాడు. నా త‌ప్పుకు మ‌మ్మీని ఎందుకు అంటున్నార‌ని సుభాష్‌తో అంటాడు రాహుల్‌.

అత‌డిపై సుభాష్ గ‌ట్టిగా అరుస్తాడు. ఇవ‌న్నీ నీ త‌ప్పులు కావు. మీ మ‌మ్మీవ‌ని అంటాడు సుభాష్‌. నీ త‌ప్పులు చిట్టా చాలా పెద్ద‌ద‌ని బాబాయ్ కూడా రాహుల్ చేసిన మోసాల్ని బ‌య‌ట‌పెడ‌తాడు. నీ నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని కావ్య నేను చాలా సార్లు అనుకున్నామ‌ని, కానీ నువ్వు మాత్రం మాకు దొర‌క‌కుండా ఇన్నాళ్లు త‌ప్పించుకున్నావ‌ని క‌ళ్యాణ్ కూడా రాహుల్‌ను ఇరికించేస్తాడు.

త‌ప్పును స‌మ‌ర్థించుకున్న రుద్రాణి...

రాహుల్ చేసిన త‌ప్పును స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది రుద్రాణి. తాను కోటీశ్వ‌రురాలిన‌ని ఇంట్లో ఎంతో మందిని స్వ‌ప్న మోసం చేసింద‌ని అంటుంది. అలాంటి అమ్మాయిని కూడా మోసం చేశాడంటే ఈ విష‌యాల్లో నీ కొడుకు ఎంతో ప్రావీణ్యుడు అని అర్థ‌మ‌వుతుంద‌ని బాబాయ్ రుద్రాణిపై సెటైర్ వేస్తాడు. త‌న‌తో పాటు త‌న కొడుకు రాహుల్‌ను అంద‌రూ త‌ప్పుప‌ట్ట‌డాన్ని రుద్రాణి స‌హించ‌లేక‌పోతుంది.

ఇద్ద‌రి త‌ప్పుల్ని వేలేత్తి చూపించేస‌రికి త‌ట్టుకోలేక‌పోతున్నావా అంటూ రుద్రాణితో అంటాడు బాబాయ్‌. కానీ జ‌రిగిన త‌ప్పులో త‌న కొడుకుది ఎంత త‌ప్పు ఉందో స్వ‌ప్న‌ది కూడా అంతే త‌ప్పు ఉందంటూ రాహుల్‌నే వెన‌కేసుకు వ‌స్తుంది రుద్రాణి. కానీ ఆ త‌ప్పు వ‌ల్ల స్వ‌ప్న జీవిత‌మే పాడ‌య్యింద‌ని ధాన్య ల‌క్ష్మి అంటుంది. ఇంత‌లోనే సీతారామ‌య్య‌, ఇందిరాదేవి, రాజ్ అక్క‌డికి వ‌స్తారు.

అప‌ర్ణ ఫైర్‌...

సీతారామ‌య్య‌ను చూడ‌గానే అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డానికి రుద్రాణి సిద్ధ‌మ‌వుతుంది. ఆమెను ఇందిరాదేవి ఆపుతుంది. రాహుల్ చేసిన త‌ప్పును స‌రిదిద్ద‌డానికే తాము క‌న‌కం ఇంటికి వెళ్లామ‌ని సీతారామ‌య్య అంటాడు. అక్క‌డ‌కు వెళ్లి ఏ తీర్మాణం చేసుకొచ్చారు, మీ ధ‌ర్మాస‌నం ఏ తీర్పు చెబుతుంద‌ని వారిని దెప్పిపొడుస్తుంది రుద్రాణి. వారం రోజుల్లో స్వ‌ప్న‌, రాహుల్ పెళ్లి జ‌ర‌గాల‌ని ఇందిరాదేవి అంటుంది. ఆమె మాట‌ల‌కు రుద్రాణి షాక్ తింటుంది. ఆ పెళ్లికి తాను ఒప్పుకోన‌ని అంటుంది.

ఇంత‌లోనే అక్క‌డ‌కు వ‌చ్చిన అప‌ర్ణ ఎందుకు ఒప్పుకోవ‌ని ఆమెకు షాకిస్తుంది. నా కొడుకు ఖ‌రీదైన సెల్‌ఫోన్‌, డ్రెస్ ఏది కొన్న అది నీ కొడుకు వేసుకొని తిరిగేవాడ‌ని, వారి మ‌ధ్య స్నేహం, అవ‌గాహ‌న ఉండ‌టంతో ప‌ట్టించుకోలేద‌ని రుద్రాణితో అంటుంది అప‌ర్ణ‌. చివ‌ర‌కు నా కొడుకు ఇష్ట‌ప‌డిన అమ్మాయిని పెళ్లిలో నుంచి రాహుల్‌ లేవ‌దీసుకుపోయాడు. ఇప్పుడు కూడా వారిస్నేహం అంతే అనుకోవాలా రుద్రాణి అంటూ అప‌ర్ణ ఫైర్ అవుతుంది.

రాజ్ పై అసూయ…

నా కొడుకు అంటే రాహుల్‌కు, నీకు అసూయ అంటూ అస‌లు నిజాన్ని బ‌య‌ట‌పెడుతుంది అప‌ర్ణ‌. మా మీద ప్ర‌తీకారంతోనే రాజ్‌తో కావ్య పెళ్లి జ‌రిపించావ‌ని అంటుంది. కానీ నీమీద ప్ర‌తీకారంతో రాహుల్‌కు స్వ‌ప్న‌ల పెళ్లి జ‌రిపించ‌డం లేదు. రాహుల్ చేసిన త‌ప్పును ప‌దిమందిలో రుజువు చేసింది ఆ అమ్మాయి. అంద‌రూ వాటిని న‌మ్మిన త‌ర్వాతే స్వ‌ప్న‌తో రాహుల్ పెళ్లి జ‌రిపించాల‌ని అనుకుంటున్నామ‌ని రుద్రాణితో అంటుంది అప‌ర్ణ‌.

ఈ పెళ్లికి త‌న స‌మ్మ‌తం అవ‌స‌రం లేదా అని రుద్రాణి అంటుంది. ఆమె మాట‌ల‌కు కావ్య గ‌ట్టిగా స‌మాధాన‌మిస్తుంది. ఒప్పుకోక‌పోతే రాహుల్‌పై కేసు పెడ‌తాన‌ని అంటుంది. ఒక‌వేళ అదే జ‌రిగితే దుగ్గిరాల ఇంటి ప‌రువు రోడ్డుకు ఎక్కుతుంద‌ని, అందుకు కార‌ణ‌మైన మీరు ఇంటి నుంచి బ‌య‌ల‌కు వెళ్లాల్సివ‌స్తుంద‌ని రుద్రాణి, రాహుల్‌ల‌తో అంటుంది ఇందిరాదేవి. అమ్మ అనే పిలుపు నుంచి అమ్మ‌గారు అనే స్థాయికి దిగ‌జారాల్సివ‌స్తుంద‌ని వార్నింగ్ ఇస్తుంది.

అస‌లు నిజం బ‌య‌ట‌కు....

కావ్య‌కు రాహుల్ అన్న‌య్య అయితే స్వ‌ప్న‌కు అదే వ‌రుస అవుతాడ‌ని వాళ్ల పెళ్లి అనాగ‌రిక‌మ‌వుతుంద‌ని రుద్రాణి మ‌రో ప్లాన్ వేసి పెళ్లి నుంచి త‌ప్పించుకోవాల‌ని అనుకుంటుంది. అనాగ‌రికం గురించి మీ త‌ల్లి కొడుకులే నాకు గుర్తు చేయాలి అంటూ రుద్రాణిపై అప‌ర్ణ సెటైర్ వేస్తుంది. ఎంత చెప్పిన రుద్రాణి మాత్రం రాహుల్‌, స్వ‌ప్న‌ల‌ పెళ్లికి ఒప్పుకొదు. స్వ‌ప్న‌ను అబార్ష‌న్ చేయించి మ‌రో పెళ్లి చేద్ధామ‌ని, అవ‌స‌ర‌మైతే డ‌బ్బు ప‌డేద్దామ‌ని అంటుంది.

ఆమె మాట‌ల‌కు కావ్య ఫైర్ అవుతుంది. ప‌శువును క‌న్నందుకు బాధ‌ప‌డాల్సింది పోయి, ఆడ‌పిల్ల‌ను బ‌లిప‌శువును చేద్దామ‌ని అనుకుంటున్నారా అంటుంది. ఇదే అవ‌కాశం అని త‌ప్పంతా ఇదే చేసింద‌ని కావ్య‌పై అవ‌మానిస్తాడు రాహుల్‌. త‌న భార్య‌ను కించ‌ప‌రిచి మాట్లాడ‌టంతో అత‌డి చెంప‌ల‌ను వాయిస్తాడు రాజ్‌. సుభాష్ కూడా రాహుల్‌ను కొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. కానీ సీతారామ‌య్య ఆపుతాడు.

సీతారామ‌య్య తీర్పు...

నువ్వు అనాథ‌లా ప‌డి ఉంటే మామ‌య్య ద‌య‌త‌ల‌చి చ‌దివించి పెళ్లి చేశార‌ని, అది గుర్తుపెట్టుకోమ‌ని, నువ్వు మాకు ఏ వ‌రుస అవుతావ‌ని రుద్రాణితో అంటుంది అప‌ర్ణ‌. నువ్వు మాకు ఏ ర‌క్త సంబంధంలేన‌ప్పుడు రాహుల్ ఎలా అన్న‌య్య అవుతాడ‌ని చెబుతుంది. అంద‌రూ మూకుమ్మ‌డిగా రుద్రాణి త‌ప్పుల్ని ఎత్తి చూప‌డంతో ఆమె నోరు మెదిపే అవ‌కాశం రాదు. వాద‌న‌లు అన‌వ‌స‌రం రాహుల్‌తో స్వ‌ప్న పెళ్లి జ‌ర‌గాల్సిందేన‌ని సీతారామ‌య్య తీర్పు ఇస్తాడు.

భ్ర‌మ‌లో స్వ‌ప్న‌…

ఇంత జ‌రిగినా స్వ‌ప్న భ్ర‌మ‌లు మాత్రం తొల‌గిపోవు. దుగ్గిరాల ఇంటి కోడ‌లు అవుతోన్న గ‌ర్వంలో ఉంటుంది. దుగ్గిరాల ఇంట్లో కోడ‌లిగా ఉండాలంటే కావ్య‌లా పూర్‌గా ఉండ‌కూడ‌ద‌ని అంటుంది. ఇంత‌లోనే సేట్ వ‌డ్డీ డ‌బ్బుల కోసం క‌న‌కానికి ఫోన్ చేస్తాడు. కానీ ఆ వ‌డ్డీ డ‌బ్బుల‌ను స్వ‌ప్న మేక‌ప్ కోసం ఖ‌ర్చు చేసింద‌నే నిజం తెలిసి క‌న‌కం షాక్ అవుతుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point