Brahmamudi June 2nd Episode: రాహుల్‌ను జైలుకుపంపిస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన కావ్య - స్వ‌ప్న‌కు రాహుల్ అన్న‌య్య అవుతాడా?-brahmamudi june 2nd episode brahmamudi today episode kavya warns to rudani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi June 2nd Episode Brahmamudi Today Episode Kavya Warns To Rudani

Brahmamudi June 2nd Episode: రాహుల్‌ను జైలుకుపంపిస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన కావ్య - స్వ‌ప్న‌కు రాహుల్ అన్న‌య్య అవుతాడా?

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 10:45 AM IST

Brahmamudi June 2nd Episode: రాహుల్ నిజ‌స్వ‌రూపం ఏమిటో రాజ్‌తో పాటు ఇంట్లో అంద‌రికి తెలిసిపోతుంది. స్వ‌ప్న‌తో అత‌డి పెళ్లి జ‌రిపించాల‌ని సీతారామ‌య్య నిర్ణ‌యం తీసుకుంటాడు. కానీ రుద్రాణి మాత్రం అందుకు అంగీక‌రించ‌దు.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్

Brahmamudi June 2nd Episode: వెన్నెల‌ను పెళ్లి చేసుకొని కోటీశ్వ‌రుడు కావాల‌ని క‌ల‌లు కంటాడు రాజ్‌. కానీ కావ్య కార‌ణంగా అత‌డి ప్లాన్ బెడిసికొడుతుంది. అత‌డి నిజ‌స్వ‌రూపాన్ని అంద‌రి ముందు ఆధారాల‌తో స‌హ బ‌య‌ట‌పెడుతుంది కావ్య‌. వాటిని చూసి రాజ్, అప‌ర్ణ‌తో పాటు ఇంట్లో వారంద‌రూ షాక్ అవుతారు. త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకోబోయే ప్ర‌య‌త్నం చేస్తాడు రాహుల్‌. కావ్య‌నే స్వ‌ప్న‌తో క‌లిసి ఇవ‌న్నీ చేయిస్తుంద‌ని ఆమెపై నింద‌లు వేయ‌బోతాడు. ఈ సారి రాహుల్ మాట‌ల‌ను రాజ్ న‌మ్మ‌డు.

అత‌డికి లాగి పెట్టి ఒక్క‌టి కొడ‌తాడు. ఎంత న‌మ్మానురా నిన్ను. స్వ‌ప్న‌తో డేట్‌కు వెళ్లేరోజు ఆమెకు గిఫ్ట్ ఇవ్వ‌డానికి ఉంగ‌రం డిజైన్ చేస్తే వీడే లాక్కున్నాడు క‌దా అని ధాన్య‌ల‌క్ష్మితో అంటాడు రాజ్‌. ఆమె అవున‌ని స‌మాధాన‌మిస్తుంది. నా బ‌దులు నువ్వే కేఫ్‌కు వెళ్లి స్వ‌ప్న‌ను నీవైపు తిప్పుకున్నాను. స‌రిగ్గా పెళ్లి టైమ్‌కు స్వ‌ప్న‌ను లేవ‌దీసుకు వెళ్లావ‌ని రాహుల్‌పై సీరియ‌స్ అవుతాడు రాజ్‌. ప‌క్క‌నే ఉంటూ ద్రోహం చేశావ‌ని రాహుల్‌ను అస‌హ్యించుకుంటాడు.

రుద్రాణిపై అప‌ర్ణ ఫైర్‌...

అప‌ర్ణ కూడా రుద్రాణిపై విరుచుకుప‌డుతుంది. అరుంధ‌తి కూతురికి నీ కొడుకు స‌రైన వాడు కాదంటే న‌న్ను ఎన్ని మాట‌లు అన్నావ్ అంటూ రుద్రాణిపై ఫైర్ అవుతుంది. ఇదా నీ కొడుకు చేసిన ఘ‌న‌కార్యం అంటుంది. నా కొడుకు పెళ్లి ఆగిపోయేలా చేశాడు, అంత‌మందిలో మా ప‌రువు తీసి మ‌మ్మ‌ల్ని మోసం చేశావ‌ని అంటుంది. ఇదంత కుట్ర అంటూ రుద్రాణి క‌న్వీన్స్ చేయ‌బోతుంది. రుద్రాణి మాట‌ల‌కు సీతారామ‌య్య ఎగిరిపెడ‌తాడు. ఏది కుట్ర‌..ఆ అమ్మాయి బ‌తుకు ఎటూ కాకుండా చేసి, ఆమెను త‌ల్లిచేసి మ‌రో అమ్మాయికి అన్యాయం చేయాల‌ని చూస్తున్నాడు నీ కొడుకు అంటూ రుద్రాణిపై కోప‌గించుకుంటాడు.

కావ్య‌కు అరుంధ‌తి థాంక్స్‌...

ఏంటి అప‌ర్ణ ఇది. ఇలాంటి వాడికి నా కూతురిని ఇస్తే ఎందుకు ఆప‌లేక‌పోయావు అంటూ అప‌ర్ణ‌పై అరుంధ‌తి కూడా సీరియ‌స్ అవుతుంది. మీ ఫ్యామిలీ అంటే గొప్ప ఫ్యామిలీ అనుకున్నాను. కానీ క‌ట్టుకున్న భార్య‌ను అపార్థం చేసుకొని ఆమెను దూరం పెట్టాడు నీ కొడుకు. ఇంటి కోడ‌లిని ప‌ని మ‌నిషి క‌న్నా హీనంగా చూశాను నువ్వు. ఇలాంటి ద‌రిద్రాన్ని ఇంట్లో పెట్టుకొని పోషిస్తున్నావు అంటూ రుద్రాణిపై వేలెత్తి చూపి ఆమెను అవ‌మానిస్తుంది.

మా కుటుంబాన్ని త‌క్కువ చేసి మాట్లాడొద్దు అంటూ కావ్య ఆమె మాట‌ల‌ను అడ్డుకుంటుంది. రుద్రాణి వ‌ల్లే తాను ముసుగు వేసుకొని పెళ్లి చేసుకోవాల్సివ‌చ్చింద‌ని అంటుంది. ఇంట్లో ఏ ఒక్క‌రూ త‌న‌ను ఇబ్బంది పెట్ట‌లేద‌ని అరుంధ‌తి చెబుతుంది. అది నీ స్వంత విష‌యం. అందుకు నేనేమీ మాట్ల‌డ‌ను. కానీ నా కూతురు జీవితం నువ్వే నిల‌బెట్టావ‌ని కావ్య‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతుంది అరుంధ‌తి. వెన్నెల కూడా రాహుల్‌ను ఛీకొట్టి వెళ్లిపోతుంది.

స్వ‌ప్న‌ను స‌పోర్ట్ చేసిన కావ్య‌...

స్వ‌ప్న ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డంతో క‌న‌కం బాధ‌ప‌డుతుంటుంది. స్వ‌ప్న ప్రెగ్నెంట్ అని డాక్ట‌ర్ చెప్పిన మాట‌లు గుర్తుకొచ్చి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంత‌లోనే స్వ‌ప్న‌ను తీసుకొని కావ్య ఇంట్లోకి రావ‌డం క‌నిపిస్తుంది. నీతో పాటు స్వ‌ప్న ఉంది ఏమిట‌ని కావ్య‌ను అడుగుతుంది క‌న‌కం.

త‌న అత్త‌గారింటికి స్వ‌ప్న వ‌చ్చిన వ‌చ్చిన విష‌యాన్ని క‌న‌కంతో చెబుతుంది కావ్య‌. అత్తారింట్లో కూడా నిన్ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డం లేదా ఇది అంటూ క‌న‌కం బాధ‌ప‌డుతుంది. న్వాయం కోసం అక్క రావాల్సిన చోటికే వ‌చ్చింద‌ని స్వ‌ప్న‌ను స‌పోర్ట్ చేస్తుంది కావ్య‌. రుద్రాణి కొడుకు రాహుల్...స్వ‌ప్న‌ను మోసం చేశాడ‌ని అస‌లు నిజం త‌ల్లిదండ్రుల‌కు చెబుతుంది.

స్వ‌ప్న‌కు రాహుల్ అన్న‌య్య‌నా...

స్వ‌ప్న చేసిన ప‌నికి క‌న‌కం, కృష్ణ మూర్తి కోపంతో ర‌గిలిపోతారు. ఎంత ప‌నిచేశావే పాపిష్టిదానా అంటూ ఫైర్ అవుతారు. స్వ‌ప్న చేసిన ప‌నివ‌ల్ల అత్తారింట్లో కావ్య‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయో అని భ‌య‌ప‌డ‌తారు. ఆ కుర్రాడు నీకు అత్త కొడుకు అంటే అన్న వ‌ర‌స అవుతాడు క‌దా అని కావ్య‌తో అంటుంది పెద్ద‌మ్మ‌. అంటే స్వ‌ప్న‌కు కూడా అన్న‌య్యే అవుతాడ‌ని అంటుంది. వావి వ‌ర‌స లేకుండా త‌ప్పు చేసిన కూతురిని కృష్ణ‌మూర్తి అస‌హ్యించుకుంటాడు. స్వ‌ప్న‌ను పెళ్లి చేసుకోవ‌డానికి రాహుల్ ఒప్పుకుంటాడో లేదో అని భ‌య‌ప‌డ‌తారు.

రుద్రాణి బాధ‌...

కొడుకును కోటీశ్వ‌రుడిని చేయాల‌నే త‌న ప్లాన్ రివ‌ర్స్ కావ‌డంతో రుద్రాణి అల్లాడిపోతుంది. నిల‌బ‌డ్డ చోటే నీ గొయ్యి నువ్వే త‌వ్వుకున్నావంటూ రాహుల్‌కు క్లాస్ ఇస్తుంది. నిన్ను స్వ‌రాజ్ గ్రూప్‌కు ఎండీని చేయాల‌ని అనుకుంటే గాలి తిరుగుళ్లు తిరిగి పాడైపోయావ‌ని అంటుంది. వెయ్యి కోట్ల‌కు అధిప‌తివి అయిపోతావ‌ని అనుకుంటే ఆ క‌ల‌ను కూడా నెర‌వేర్చ‌లేక‌పోయావ‌ని కోపంతో ఎగిరిప‌డుతుంటుంది..

స్వ‌ప్న చాలా రిచ్ అని అంద‌రితో పాటు త‌న‌ను న‌మ్మించింద‌ని, అలాంటి రిచ్ అమ్మాయిని రాజ్ పెళ్లి చేసుకోకుండా దెబ్బ‌కొట్టాల‌ని అనుకున్నాన‌ని రాహుల్ త‌ల్లితో చెబుతాడు. త‌న‌కు ద‌క్కాల్సింది నేను ద‌క్కించుకోవాల‌ని అనుకున్నాన‌ని అత‌డు అంటుండ‌గానే అత‌డి మాట‌ల‌ను మ‌ధ్య‌లోనే ఆపేసిన రుద్రాణి అడుక్కునే వాళ్ల‌కు అల్లుడికి అవుతున్నావ‌ని కొడుకును దెప్పిపొడుస్తుంది. ఇద్ద‌రు క‌లిసి స్వ‌ప్న అడ్డు తొల‌గించుకోవాల‌ని డిసైస్ అవుతారు.

రుద్రాణికి కావ్య వార్నింగ్‌...

స్వ‌ప్న త‌ప్పుడు దారిలో నిడ‌వ‌టానికి క‌న‌క‌మే కార‌ణ‌మ‌ని ఇరుగుపొరుగు మాట‌ల‌తో ఇద్ద‌రిని దెప్పిపొడుస్తుంటారు. ఇంతోల‌నే. సీతారామ‌య్య‌ను తీసుకొని రాజ్...క‌న‌కం ఇంటికి వ‌స్తాడు. వాళ్లు ఇంట్లో అడుగుపెట్ట‌గానే అమాయ‌కురాలైన అమ్మాయిని మోసం చేసి క‌డుపు రాగానే వ‌దిలిపెట్టాడు. అది మీ దుగ్గిరాల వంశానికి అవ‌మానం కాదా అని సుజాత సీతారామ‌య్య‌పై సీరియ‌స్ అవుతుంది. కావ్య ఆమె మాట‌ల‌ను అడ్డుకుంటుంది.

త‌ప్పు చేసే అల‌వాటు మా వంశంలోనే లేద‌ని అంటుంది. వాళ్లు వేరే మేము వేరు అంటూ త‌న కుటుంబాన్ని వెన‌కేసుకొస్తుంది. రాహుల్ చేసిన త‌ప్పును స‌రిదిద్ద‌డానికి స్వ‌ప్న‌తో పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. కానీ వారి పెళ్లికి రుద్రాణి ఒప్పుకోదు. కానీ రాహులపై తాను కేసు పెడ‌తాన‌ని, అత‌డికి జైలుకు పంపిస్తాన‌ని రుద్రాణికి కావ్య వార్నింగ్ ఇస్తుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point