Brahmamudi June 24th Episode: సాక్ష్యాలతో బయటపడ్డ రుద్రాణి బాగోతం -కావ్య ఫైనల్ వార్నింగ్ -సుభాష్‌కు అపర్ణ శిక్ష
Brahmamudi June 24th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో రుద్రాణి కుట్రలను సాక్ష్యాలతో బయటపెడుతుంది కావ్య. ఇలా బతకడం ఓ బతుకేనా అని రుద్రాణి, రాహుల్‌కు క్లాస్ పీకుతుంది. కావ ఎన్ని తిట్టినా రుద్రాణి నోరు మెదపదు.

Brahmamudi June 24th Episode: నకిలీ మాయను అడ్డం పెట్టుకొని రుద్రాణి, రాహుల్ కలిసి ఆడిన డ్రామాకు కావ్య పుల్‌స్టాప్ పెడుతుంది. ఈ నింద నుంచి మావయ్య సుభాష్‌ను నిర్ధోషిగా బయటపడేస్తుంది. ఆ నాటకం ఆడించింది తామే అన్న నిజం బయటపడకపోవడంతో రుద్రాణి, రాహుల్ ఊపిరి పీల్చుకుంటారు. తమ పరిస్థితి చావు తప్పి కన్నులోట్టపోయిందన్న విధంగా మారిపోయిందని రాహుల్ వాపోతాడు. నువ్వు వేసిన ప్లాన్స్ మొత్తం రివర్స్ అవుతున్నాయని తల్లి రుద్రాణిపై ఫైర్ అవుతాడు రాహుల్.
కావ్య ఎంట్రీ...
ఇంట్లో అందరూ కలిసిపోయారని, రాజ్ మళ్లీ ఆఫీస్‌కు రావడం ఖాయమని రాహుల్ అంటాడు. . అందులో డౌట్ లేదని అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన కావ్య బదులిస్తుంది. మాయను తీసుకొచ్చి నిజం బయటపెట్టానన్న అహంకారంతో విర్రవీగకు...అన్నిసార్లు నువ్వే గెలుస్తావని అనుకోకు అని కావ్యతో ఛాలెంజ్ చేయబోతుంది రుద్రాణి. మరి మీరు గెలుస్తారా రుద్రాణి గారు..ఎలా గెలుస్తారు..మాయను కిడ్నాప్ చేసి నిజాన్ని పాతిపెట్టాలని చూసినట్లా అని కావ్య రివర్స్ ఎటాక్ చేస్తుంది.
నిందలు వేస్తే ఊరుకోను...
మాయ కిడ్నాప్ అనే మాట వినగానే రుద్రాణి తడబడుతుంది. నిందలు వేస్తే ఊరుకోనని బిల్డప్‌లు ఇస్తుంది. బిడ్డను తీసుకొని నాటకం ఆడేవరకు మాయ చేసింది. నిజం బయటకు రాకుండా మాయను కిడ్నాప్ చేసింది మీరే అన్న విషయం నాకు తెలిసిపోయింది...ఇంకా బుకాయించాలని చూడకండి అని రుద్రాణితో అంటుంది కావ్య. అవును మాయను నేనే కిడ్నాప్ చేయించాను. ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ల ముందు ఎలా నిరూపిస్తావు. నేను చేశానని సాక్ష్యాలు ఉన్నాయా కావ్యతో వాదిస్తుంది రుద్రాణి.
సాక్ష్యాలతో...
నా దగ్గర ఉన్న సాక్ష్యంతో మీ నిజస్వరూపం ఇంట్లో వాళ్ల ముందు బయటపెట్టగలను అని కావ్య అంటుంది. తన దగ్గర ఉన్న ఫోన్ తీసి చూపిస్తుంది. అది మాయను కిడ్నాప్ చేసిన రౌడీలది అని చెబుతుంది కావ్య. రౌడీల ఫోన్‌లో మీ నంబర్ ఉందని చెప్పి రుద్రాణికి షాకిస్తుంది కావ్య.
నా నంబర్ ఉంటే నేను కిడ్నాప్ చేయించినట్లు కాదని రుద్రాణి బుకాయిస్తుంది. కానీ రౌడీలకు మీపై అనుమానం వచ్చినట్లు ఉంది...అందుకే మీతో మాట్లాడిన ప్రతి మాటను రికార్డ్ చేశారని కావ్య అంటుంది. నిజం బయటపడతానే రుద్రాణి సైలెంట్ అవుతుంది.
కావ్య క్లాస్...
ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంట్లో మనుషులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఈ ఫోన్‌లో మీరు మాట్లాడిన మాటలు వింటుంటే నాకే అసహ్యం వేసిందని రుద్రాణిని ఛీదరించుకుంటుంది కావ్య. ఇలా బతకడం ఓ బతుకేనా రుద్రాణి గాలి మొత్తం తీసేస్తుంది. మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమివేయడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు.
కానీ నాలో ఇంకా మానవత్వం మిగిలి ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నా అని వార్నింగ్ ఇస్తుంది. మిమ్మల్ని శిక్షిస్తే మీతో పాటు మా అక్క కూడా ఆ శిక్ష అనుభవించాల్సివస్తుంది. ఆ ఒక్క కారణంతోనే వదిలేస్తున్నానని రుద్రాణి, రాహుల్‌ను హెచ్చరిస్తుంది. అలాగని ప్రతిసారి వదిలివేయనని చెబుతుంది. ఇంకోసారి ఈ కుటుంబం జోలికి వస్తే ఈ ఫోన్ రికార్డింగ్స్ మొత్తం బయటపెట్టేస్తానని వార్నింగ్ ఇస్తుంది.
సుభాష్ ఆనందం ఆవిరి...
తనపై పడిన నిందలు తొలగిపోవడంతో సుభాష్ సంతోషపడతాడు. ఇన్ని రోజులు నిన్ను మోసం చేశాననే అపరాధభావంతో నీ కళ్లలోకి సూటిగా చూడలేకపోయానని అపర్ణతో అంటాడు. నన్ను ఎప్పటికీ క్షమించవేమోనని భయపడ్డానని అపర్ణతో చెబుతాడు. నన్ను అర్థం చేసుకొని క్షమించావు అది చాలు అని అపర్ణపై చేయివేస్తాడు సుభాష్.
అపర్ణ ఫైర్...
చేయితీయండి అంటూ సుభాష్‌పై ఫైర్ అవుతుంది అపర్ణ. నేను మిమ్మల్ని క్షమించేలేదని...అది ఎప్పటికీ జరగదని అంటుంది. కొడుకు ముందు మీ పరువు తీయకూడదని నవ్వుతూ కనిపించానని చెబుతుంది. మనం ఇద్దరం కలిసి సంతోషంగా ఉండాలని కావ్య కష్టపడి మాయ చేత నిజాలు బయటపెట్టింది.
ఆమె మనసును నొప్పించకూడదని మౌనంగా ఉన్నాను. మరో ఆడదానిని తాకిన చేతులతో నన్ను తాకనిస్తానని ఎలా అనుకన్నారని భర్తపై ఫైర్ అవుతుంది. ఇక నుంచి బయటప్రపంచానికి మాత్రమే మనం భార్యాభర్తల అని అంటుంది. మీరు చేసిన ద్రోహానికి నాకు నేను వేసుకుంటున్న శిక్ష ఇదని సుభాష్‌తో అంటుంది.
కావ్యను భయపెట్టిన రాజ్...
కావ్య బెడ్‌రూమ్‌లో బట్టలు సర్ధుతుంటుంది. వెనుక నుంచి వచ్చి రాజ్ ఆమెను భయపెడతాడు. తేరుకున్న నేను మీ కోసమే ఎదురుచూస్తున్నానని రాజ్‌తో అంటుంది కావ్య. ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నానని చెబుతుంది. స్టార్ట్ చేయండి అని రాజ్‌తో చెబుతుంది కావ్య. ఆమె మాటలను తప్పుగా అర్థం చేసుకున్నా రాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కొంచెం కన్ఫ్యూజన్‌గా ఉందని అంటాడు. నీకు బుద్ది ఉందా...బుర్రా ఉందా అంటూ రోజు స్టార్ట్ చేస్తారుగా..అలాగే తిట్టండి ఈ రోజు కూడా రాజ్‌తో చెబుతుంది కావ్య.
కావ్య తిట్ల గురించి మాట్లాడటం చూసి రాజ్ కంగారు పడతాడు. నేను మరేదో అనుకున్నానని మనసులో అనుకుంటాడు. తన మనసులో ఉన్న మాట బయటపెట్టబోతాడు. కానీ కావ్య మాత్రం రాజ్‌కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. ఇంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లెమ్ తీరిపోయింది కాబట్టి నన్ను ఏ సాకుతో తిట్టాలో అని ఆలోచిస్తున్నారు కదా... అని రాజ్‌తో కోపంగా అంటుంది కావ్య. నన్ను మాట్లాడనివ్వు అని రాజ్ అన్న కావ్య పట్టించుకోదు.
కొత్త కొత్త తిట్లు కనిపెట్టడానికి ఆలోచిస్తున్నారు కదా...ఇంట్లో నేను ఒక్కదానినే మీకు తేరగా ఉన్నాను కదా మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. మీ తిట్లను భరించే ఓపిక లేదని..జీతం ఇచ్చి తిట్లు తినడానికి మరొకరిని ఉద్యోగంలో పెట్టుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్య తన మూడ్ మొత్తం పాడు చేయడంతో రాజ్ చిరాకు పడతాడు.
అంతరాత్మ ముద్దు...
కావ్య రూమ్ నుంచి బయటకు వెళ్లగానే రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. కావ్యథాంక్స్ చెప్పే స్టైల్ వేరు అన్నట్లుగా ఉండాలని రాజ్‌కు సలహా ఇస్తుంది అంతరాత్మ. కావ్యను ఎత్తుకొని ఆమెకు ముద్దు ఇవ్వబోతుంది అంతరాత్మ. కానీ రాజ్ అడ్డుకుంటాడు. నువ్వు ముద్దు పెట్టవు.
కనీసం ఊహల్లో కూడా నన్ను ముద్దు పెట్టుకోనివ్వవు అని రాజ్‌పై అంతరాత్మ కోప్పడుతుంది. కావ్యకు మొదటి ముద్దు నేను ఇవ్వాలని రాజ్ అంటాడు. అంతరాత్మకు కూడా ఆ అవకాశం ఇవ్వనని అంటాడు. రాజ్‌ను రసహీనుడు అంటూ రాజ్ కు అంతరాత్మ క్లాస్ ఇస్తుంది. కావ్యకు ఎలా ప్రపోజ్ చేయాలో, ఆమెను ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు బాగా తెలుసు అని అంతరాత్మతో అంటాడు రాజ్.
కనకం ఫైర్...
కనకం ఇంటి పనుల్లో ఉండగా చుట్టుపక్కల ఉన్న వారు వస్తారు. మీ చిన్న కూతురు లాడ్జిలో దొరికిందటగా...డబ్బున్న వాడినే పట్టిందిగా అని అవమానిస్తారు. ఇలాంటి తిరుగుళ్లు తిరిగితే నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారు. అప్పును ఇలా ఊరు మీద వదిలేస్తే ఎలా అని కనకాన్ని నానా మాటలు అంటారు.
ఇంతకుముందు ఇలాగే మాయ చేసి ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశావుగా అని మాటలతో ఇబ్బంది పెడతారు. కనకం కోపం పట్టలేకపోతుంది. వారి జుట్లు పట్టుకొని చెడామడా వాయిస్తుంది. కృష్ణమూర్తి అడ్డుపడిన పట్టించుకోకుండా చీపురు పట్టుకొనికొట్టడానికి వస్తుంది.
కళ్యాణ్ రిక్వెస్ట్...
అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్‌ను చూడగానే అతడి ముఖం ముందే తెలుపు వేస్తుంది కనకం. జరిగిన దాంట్లో మన తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి అప్పు అంటూ కళ్యాణ్ బతిమిలాడుతాడు. మీరైన అర్థం చేసుకొని తలుపు తీసి మాట్లాడండి అనికనకాన్ని రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్. అతడు ఎంత బతిమిలాడిన అప్పు, కనకం మాత్రం తలుపు తీయరు. దాంతో కళ్యాణ్ నిరాశగా తిరిగి వెళ్లిపోతాడు.
గార్డెన్‌లో కావ్యకు సైట్ కొడుతుంటాడు రాజ్. ఎంటి నన్ను అలా చూస్తున్నారని రాజ్‌ను అడుగుతుంది కావ్య. నేను ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నానని అబద్ధం ఆడుతాడు.