Brahmamudi January 28th Episode: ఆస్తి కోసం కోర్టుకు ప్రకాశం - ధాన్యలక్ష్మికి దండం పెట్టిన కావ్య - రుద్రాణి ఫిట్టింగ్
Brahmamudi: బ్రహ్మముడి జనవరి 28 ఎపిసోడ్‌లో ఆస్తిలో వాటా కోసం కోర్టు నోటీసులు పంపిస్తారు ప్రకాశం, ధాన్యలక్ష్మి. ఆస్తి మొత్తం సీతారామయ్య వారసులేదనని, తానేం పుట్టింటికి మూటగట్టుకొని తీసుకుపోనని కావ్య దండం పెట్టిన ప్రకాశం, ధాన్యలక్ష్మి వినరు.
Brahmamudi బట్టలు ఆరేసే తీగకు కరెంట్ కనెక్షన్ ఇచ్చి కావ్యను చంపాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. కొడుకు ప్లాన్ గురించి తెలియక రుద్రాణి బట్టలు అరేయడానికి వెళుతుంది. కరెంట్ షాక్ కొట్టడంలో లబోదిబోమని అరుస్తుంది. కరెంట్ షాక్ నుంచి బయటపడేసే నెపంతో అత్తను కర్రతో చితక్కొడుతుంది స్వప్న. రాహుల్ పవర్ ఆఫ్ చేయడంలో రుద్రాణి ప్రాణాలతో బయటపడుతుంది.
మీ అమ్మను నేనే బతికించాను, జీవితాంతం మీరిద్దరు నాకు రుణపడి ఉండాలని రాహుల్‌తో అంటుంది స్వప్న.కరెంట్ షాక్ ఐడియా వేసిన రాహుల్‌పై కోపం పట్టలేకపోతుంది రుద్రాణి. చెత్త ఐడియాలు వేస్తావా అని పక్కనే కర్ర తీసుకొని దంచుతుంది.
అప్పు అలక...
అప్పు పోలీస్ ట్రైనింగ్‌కు తిరిగి బయలుదేరుతుంది. ఆమె బ్యాగ్‌ను కళ్యాణ్ సర్ధుతుంటాడు. ఈ టవల్ పెట్టు, ఆ డ్రెస్ పెట్టు అని కళ్యాణ్‌తో అన్ని పనులు చేయించుకుంటుంది. నా వల్ల కాదని విసిగిపోయానని , కన్ఫ్యూజ్ చేసి నా బుర్ర తింటున్నావని కళ్యాణ్ చిరాకుగా అంటాడు.
నేను నీకు చికాకు తెప్పిస్తున్నానా అని అప్పు అలుగుతుంది. తన బ్యాగ్ తానే సర్ధుకుంటానని కోపంగా అంటుంది. నాకు నేనే వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అన్నందుకు లోకువైనానని అప్పు అంటుంది. నిన్ను తక్కువ చేస్తే నన్ను నేను తక్కువ చేసుకున్నట్లేనని కళ్యాణ్ అంటాడు. ఆ ఆలోచన లేదని, రాదని నాకు తెలుసునని అప్పు అంటుంది. అలిగిన అందంగా ఉంటానని ఓ పాటలో రాశావు కదా అందుకే అలిగానని కళ్యాణ్‌ను ఆటపట్టిస్తుంది అప్పు.
అపర్ణ ఫోన్ కాల్...
అప్పుడే కళ్యాణ్‌కు అపర్ణ ఫోన్ చేస్తుంది. రాజ్, కావ్య కలిసి గెస్ట్ హౌజ్‌ను ఎందుకు తాకట్టు పెట్టారో నీకు తెలుసా అని కళ్యాణ్‌ను అడుగుతుంది. తనకు తాకట్టు విషయమే తెలియదని కళ్యాణ్ కంగారుగా సమాధానమిస్తాడు. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే భయంగా ఉందని అపర్ణ అంటుంది. పెద్దమ్మ మాటలతో కళ్యాణ్ కంగారుపడిపోతాడు.
కోర్టు నోటీసులు...
ఇంట్లో కావ్య అందరికి కాఫీ ఇస్తుంటుంది. అప్పుడే కొరియర్ బాయ్ వచ్చి కోర్టు నోటీసులు ఇస్తాడు. ఆ నోటీసులు మేమే పంపించామని భయంభయంగా వచ్చి ప్రకాశం చెబుతాడు. అతడి మాటలతో ఇందిరాదేవితో సహా కుటుంబసభ్యులందరూ షాకవుతారు. ప్రకాశం మాట్లాడటానికి భయపడుతున్నాడని గ్రహించిన ధాన్యలక్ష్మి...మా ఆస్తి వాటా మాకు కావాలని కోర్టుకు వెళుతున్నామని బదులిస్తుంది.
రుద్రాణి హస్తం...
ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటికే నోటీసులు పంపిస్తారా? ఇంటి పరువు బజారున పడేస్తారా అని ఇందిరాదేవి కోపంగా ప్రకాశంతో అంటుంది. ఈ నోటీసుల వెనుక మా అత్త హస్తం ఖచ్చితంగా ఉంటుందని స్వప్న అనుమానంగా అంటుంది. సిటీలో ఫేమస్ లాయర్ ఎవరిని అడిగితే పేరు ఫోన్ నంబర్ ఇచ్చాను అంతేనని, అంతకుమించి నేను ఏం చేయలేదని రుద్రాణి అంటుంది. ఇలాంటి పంది కొక్కులను ఇంట్లో నుంచి తరిమివేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదని రాహుల్, రుద్రాణిపై సెటైర్లు వేస్తుంది స్వప్న.
కోర్టుకు వెళ్లడమే మంచింది...
ఒక్క మాట మాతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావని తమ్ముడిని నిలదీస్తాడు సుభాష్. నీతో చాలా సార్లు చెప్పానని కానీ నువ్వు ఎప్పుడు కావ్యనే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావని ప్రకాశం ఆన్సర్ ఇస్తాడు. ఇంట్లో జరిగేవి నువ్వు పట్టించుకోవడం లేదని సుభాష్‌నే తప్పు పడతాడు. ధాన్యం పోరు పడలేకపోతున్నానని అంతే కాకుండా నాకు కోర్టుకు వెళ్లడమే మంచిదనిపించిందని ప్రకాశం అంటాడు.
ఏం మంచి...ఎవరికి మంచి...కన్న తండ్రి హాస్పిటల్‌లో ఉంటే పట్టించుకోకుండా ఆస్తుల కోసం కోర్టుకు వెళతావా. మీ అమ్మ పుట్టెడు దుఃఖంలో ఉంటే ఓదార్చాల్సిందిపోయి ఆమెను మరింత క్షోభ పెడతావా అని ప్రకాశానికి క్లాస్ ఇస్తుంది అపర్ణ.
ఆస్తి కోడలే అనుభవించాలా...
ఆస్తి ఎప్పటికీ నీ కొడుకు కోడలే అనుభవించాలా...మిగిలిన వాళ్లు ఏమైపోయినా పర్వాలేదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నోరు విప్పితే ఆస్తి అంటావు. నువ్వు వద్దు నీ అస్తి వద్దు అని నీ వారసుడు ఆటో తోలుకొని బతుకుతున్నాడు. నిన్ను కళ్యాణ్ వెలివేసి వెళ్లిపోయిన తర్వాత కూడా ఇంకా నీకు ఆస్తి గురించి ఎందుకు తాపత్రయం అని ధాన్యలక్ష్మిని నిలదీస్తుంది అపర్ణ.
ధాన్యలక్ష్మి రచ్చ...
ఇలా మమ్మల్ని బెదిరించి ఇన్నాళ్లు మా నోరు మూయించారని ధాన్యలక్ష్మి అంటుంది. సుభాష్‌కే కావ్య విలువ ఇవ్వాలేదని, ఆస్తి గురించి తనను అడిగే హక్కు లేదని అన్నదని ధాన్యలక్ష్మి చెబుతుంది. మావయ్యకే విలువ ఇవ్వని కావ్య ఇంకా చిన మావయ్యకు ఏం విలువ ఇస్తుందని ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది. దానికి నువ్వు సమాధానం చెప్పగలవా అని ధాన్యలక్ష్మి అడిగిన ప్రశ్నతో అపర్ణ సైలెంట్ అవుతోంది.
ఆస్తులే కావాలా?
భర్తతో ఉన్న అనుబంధాన్ని, కుటుంబం కోసం సీతారామయ్య చేసిన త్యాగాన్ని అందరికి వివరిస్తుంది. ఇలాంటి కష్ట సమయంలో నాకు అండగా ఉండాల్సిన మీరు కోర్టుకు ఎక్కుతారా అని ధాన్యలక్ష్మి, ప్రకాశాన్ని నిలదీస్తుంది ఇందిరాదేవి. నీకు రక్త సంబంధం కంటే నీ భార్య మాట ఎక్కువైందా? ఇంత పెద్ద కుటుంబం కంటే ఆస్తి ముఖ్యంగా మారిందా అని ప్రకాశానికి క్లాస్ ఇస్తుంది.
కావ్య విర్రవీగుతుంటే?
సెంటిమెంట్ సిమెంట్‌తో నువ్వు కట్టుకున్న మేడలు, గోడలు కూలిపోయే టైమ్ వచ్చిందని రుద్రాణి గొడవను పెద్దది చేస్తుంది. ఎంత సేపు నీ కొడుకు, కోడలిని తప్పు పడుతున్నావు కానీ ఈ పరిస్థితి తీసుకొచ్చిన కావ్యను ఒక్క మాట ఎందుకు అనలేదని ఇందిరాదేవిని అడుగుతుంది రుద్రాణి.
ఆస్తి మొత్తం తనదేనని, అమ్ముకుంటా, తాకట్టు పెట్టుకుంటా అని కావ్య విర్రవీగుతుంటే...ఇలాగే పరిస్థితి కొనసాగితే రోడ్డున పడాల్సివస్తుందని ధాన్యలక్ష్మి, ప్రకాశం చేసిన మంచి పనిని ఎందుకు ప్రశ్నిస్తున్నావని తల్లితో వాదనకు దిగుతుంది రుద్రాణి.
నోరు మూసుకొండి....
మీ జోక్యం అవసరమని, మీ కథాకళి కాసేపు ఆపమని, నోరు మూసుకోమని రుద్రాణితో అంటుంది కావ్య. ఎంత ధైర్యం నీకు అని కావ్యపై ఫైర్ కాబోతుంది రుద్రాణి. కావ్య నోరు మూసుకోమని చెప్పింది...నోరు తెరవమని కాదని రుద్రాణిపై రాహుల్ పైర్ అవుతాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి మావయ్యను మాట అనే ధైర్యం తనకు లేదని కావ్య అంటుంది.
ఈ ఆస్తి మొత్తం సీతారామయ్య వారసులేదనని, వారికే ఈ ఆస్తి చెందుతుందని, ఇదంతా మూటగట్టుకొని మా పుట్టింటికి తీసుకుపోనని కావ్య అంటుంది. కోర్టు వరకు వెళ్లి అమ్మమ్మను బాధపెట్టవద్దని ధాన్యలక్ష్మి, ప్రకాశానికి దండం పెడుతుంది కావ్య.
ప్రకాశం సమాధానం...
నువ్వు పెట్టే దండం వద్దు...ఆ తర్వాత పెట్టే పిండం వద్దని కావ్యతో వెటకారంగా అంటుంది ధాన్యలక్ష్మి. ప్రకాశం కూడా కావ్యనే తప్పు పడతాడు. మీ మావయ్య గుండె గట్టిది కాబట్టి హక్కు లేదని అన్న ధైర్యంగా నిలబడ్డాడు. నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లగొడితే బయటి ప్రపంచంలో బతకడం తనకు చేతకాదని అంటాడు. ఎవరి మాట నువ్వు వినడం లేదు. నీ మాట వినమని మమ్మల్ని ఎలా అడుగుతున్నావని కావ్యతో అంటాడు ప్రకాశం.
కోర్టుకు వెళ్లాల్సిందే...
కావ్య, నేను మీకు అన్యాయం చేసి ఆస్తి మొత్తం మేమే అనుభవించాలని అనుకోవడం లేదని ప్రకాశం, ధాన్యలక్ష్మికి సర్ధిచెప్పాలని చూస్తాడు రాజ్. అయినా ఇద్దరు వినరు. కోర్టుకు వెళ్లాల్సిందేనని అంటారు.
కావ్య మీ నాన్నను అవమానించినా నువ్వు నోరు ఎందుకు విప్పలేదని రాజ్‌ను ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మి. సుభాష్‌కే విలువ ఇవ్వని కావ్య మమ్మల్ని ఏం పట్టించుకుంటుందని అంటుంది. కోర్టులోనే తేల్చుకుందామని వెళ్లిపోతుంది.
కావ్య రిక్వెస్ట్...
దుగ్గిరాల వంశ వృక్షం తమ కళ్ల ముందే కూలిపోతుంటే ఏం చేయలేకపోతున్నామని అపర్ణ, సుభాష్ బాధపడతారు. ధాన్యలక్ష్మి మాటలు విని ప్రకాశం పూర్తిగా మారిపోయారని, ఇక వాళ్లను కోర్టుకు వెళ్లకుండా ఆపడం సాధ్యం కాదని సుభాష్ ఆవేదనకు లోనవుతాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య...మీరే ఏదో ఒకటి చేసి ప్రకాశాన్ని ఆపమని మావయ్యను కోరుతుంది. చేసిందంతా చేసి ఇప్పుడు మావయ్యను సాయం చేయమంటే ఆయన ఏం చేస్తారని కావ్యను నానా మాటలు అంటుంది అపర్ణ. చేసేది నువ్వు...ఆపాల్సింది మేమా అని, కుటుంబ శ్రేయస్సు అన్నది మాటల్లోనే కాదు...ఆచరణలో చూపించాలని కావ్యను తప్పు పడుతుంది అపర్ణ.
కళ్యాణ్ ఎంట్రీ...
ఇంటి యజమాని ఆస్తి మనవళ్లకే చెందుతుందని సీతారామయ్య వీలునామాలో రాస్తాడు. అలాంటప్పుడు ధాన్యలక్ష్మి, ప్రకాశం తరఫున కేసు వాదించడానికి ఎలా వచ్చారని లాయర్‌ను ప్రశ్నిస్తుంది కావ్య. ప్రకాశం కేసు వేయడానికి వీలు కాకపోతే నా కొడుకు తరఫున కేసు వేయిస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. తల్లి మాటలను అడ్డుకుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.