Brahmamudi January 21st Episode: రాజ్ చెంప పగలగొట్టిన అపర్ణ -సాక్ష్యాలతో బయటపడ్డ కావ్య అప్పులు -అనామిక టెన్షన్
Brahmamudi January 21st Episode: బ్రహ్మముడి జనవరి 21 ఎపిసోడ్‌లో కావ్యతో అపర్ణ మాట్లాడటం మానేస్తుంది. కోడలు ఇచ్చిన కాఫీ కూడా తాగనని అంటుంది. అపర్ణ కోపాన్ని తగ్గించి కావ్యతో తాను మాట్లాడించేలా చేస్తానని రాజ్ బిల్డప్‌లు ఇస్తాడు. కానీ అతడి ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అవుతుంది.
Brahmamudi January 21st Episode: నగలు తాకట్టు పెట్టడానికి కారణమేమిటన్నది కావ్య చెప్పకపోవడంతో కోడలితో మాట్లాడటం మానేస్తుంది అపర్ణ. కావ్య ఇచ్చిన కాఫీ కూడా తాగనని అంటుంది. కావ్య సారీ చెప్పిన వినకుండా కోపంగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోతుంది. అపర్ణ మాట్లాడకుండా వెళ్లిపోవడంతో కావ్య హర్ట్ అవుతుంది.ఆ సీన్ రాజ్ చూస్తాడు.
రాజ్ బిల్డప్పులు...
అత్తగారు అలిగి వెళ్లిపోయిందని కోడలుగారు చిన్నబుచ్చుకున్నారా అంటూ కావ్యపై సెటైర్లు వేస్తాడు. అమ్మతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు...అదో అర్ట్ అంటూ బిల్డప్పులు ఇస్తాడు. అది నీకు కూడా చేత కాదని ఇందిరాదేవి అంటుంది. మీకే కనక దమ్ము ఉంటే అత్తయ్యను నాతో మాట్లాడించండి అంటూ భర్తతో కావ్య ఛాలెంజ్ చేస్తుంది. కావ్య ఛాలెంజ్‌ను రాజ్ అంగీకరిస్తాడు.
కప్ పగిలిన శబ్ధం...
అపర్ణ మీ ఇద్దరిపై చాలా కోపంగా ఉందని, మీ అమ్మను నువ్వు పుట్టక ముందు నుంచి చూస్తున్నా...అనుభవంతో చెబుతున్నా వదిలేయమని ఇందిరాదేవి ఎంత చెప్పిన వినకుండా నా మీద నమ్మకం లేదు కదా...మా తల్లీ కొడుకుల అనుబంధాన్ని చూసి మీరే కుళ్లుకుంటారు అంటూ సంతోషంగా అమ్మ అమ్మ నేనొచ్చేస్తున్నా అంటూ పాటలు పాడుకుంటూ అపర్ణ బెడ్‌రూమ్‌లోకి వెళతాడు రాజ్.
అపర్ణ బెడ్‌రూమ్‌లో నుంచి కాఫీ కప్ పలిగిన శబ్ధం వినిపిస్తుంది. రాజ్ చెంప పగలగొట్టిన అపర్ణ అతడికి రూమ్ నుంచి బయటకు తోసేస్తుంది.
రాజ్ కోతలు...
ఏరా కాఫీ తాగిందా అంటూ రాజ్‌ను వెటకారంగా అడుగుతుంది ఇందిరాదేవి. కాఫీ చల్లారిందట అని రాజ్ బదులిస్తాడు. మరి కాఫీ కప్ ఏది అని అడిగితే తడబడుతూ సమాధానం చెబుతాడు. కప్ పగిలిన సౌండ్, చెంప చెల్లుమన్నట్లు మాకు వినిపించిందని అంటే...అదేం లేదని బిల్డప్‌లు ఇవ్వబోతాడు. అసలు జరిగింది ఏదో వాళ్లు ఈజీగా కనిపెట్టే కోయ్ కోయ్ అంటూ రాజ్‌ను ఏడిపిస్తారు.
కాళ్లపై పడటమే...
అయినా పట్టువీడని రాజ్...మరో కాఫీ కప్‌తో అపర్ణ రూమ్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఈ సారి నేను వేసిన ప్లాన్‌కు మమ్మీనే కాదు ఎవరైనా కరిగిపోయి క్షమించాల్సిందేనని రాజ్ అంటాడు. ఏంటా ప్లాన్ అని ఆసక్తిగా అడుగుతుంది కావ్య. చాలా సింపుల్...కాఫీ కప్ అమ్మ చేతిలో పెట్టి...ఆమె కాళ్లపై పడి ప్రాధేయపడితే అమ్మలో అత్త ప్రేమ పొంగిపోయి కరిగిపోతుందని రాజ్ అంటాడు.
వంద కోట్ల స్కామ్...
నేను ఒక్కదానినే కాదు మీరు కూడా రావాల్సిందేనని కావ్య పట్డుపడుతుంది. అపర్ణ తనను కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చి రాజ్ భయపడిపోతాడు. ఏది ఇచ్చిన ఇద్దరం సమానంగా పుచ్చుకోవాల్సిందేనని కావ్య అంటుంది. సలహాలు ఇచ్చిన వాళ్లను ఇలా బుక్ చేయద్దని తప్పించుకోవడానికి రాజ్ చూస్తాడు. వంద కోట్ల స్కామ్ అని చెప్పి నన్ను ఇరికించింది ఎవరో అంటూ జరిగింది మొత్తం కావ్య ఏకరువు పెట్టడంతో కావ్య వెంట వెళ్లడానికి రాజ్ అంగీకరిస్తాడు.
కావాలని దాచలేదు...
అపర్ణ గార్డెన్‌లో కోపంగా కూర్చొని కనిపిస్తుంది. అపర్ణకు కాఫీ ఇవ్వడానికి ఇద్దరు భయపడిపోతారు. చివరకు ఇద్దరు కలిసి అపర్ణ కాళ్లపై పడిపోతారు. ఈ అమాయకుల్ని, నిర్భాగ్యులను క్షమించమని రాజ్ అంటాడు. ఇంటి బరువుబాధ్యతల్ని మోయడానికి చాలా అవస్తలు పడుతున్నానని, ఈ కష్టాలు మీతో చెప్పలేక మౌనంగా ఉన్నాను అంతేకానీ కావాలని దాయలేదని కావ్య తల దించుకొని సమాధానం చెబుతుంది.
ఇద్దరు తలెత్తి చూసేసరికి అపర్ణ ప్లేస్‌లో ఇందిరాదేవి ఉంటుంది. ఆమెను చూసి షాకవుతారు. కప్ నా చేతిలో పెట్టి మీ మాటలు వినకుండానే అపర్ణ వెళ్లిపోయిందని ఇందిరాదేవి అంటుంది.
అనామిక ఎంట్రీ...
అప్పు, కళ్యాణ్ హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళుతుంటారు. ఓ దొంగ సామంత్ పర్స్ కొట్టేయబోతుంటే అప్పు చూస్తుంది. దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతడు పారిపోతాడు. అప్పుకు సామంత్ థాంక్స్ చెబుతాడు. అప్పుడే అక్కడికి అనామిక ఎంట్రీ ఇస్తుంది. రోడ్డుపై పడిన మీరు ఇలా చైన్ స్నాచర్స్, పర్స్ దొంగలను పట్టుకునే పనులు చేస్తున్నారా? ఇందుకోసం ఎంత డబ్బు ఛార్జ్ చేస్తున్నారు అంటూ ఇన్‌సల్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇదేనా మీ ఆదాయం, కళ్యాణ్ ఊడిగం చేసిన పెద్దగా ఏం రావడం లేనట్లుగా ఉందని అంటుంది. ఊరుకుటుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావని కోపంగా అనామికతో అంటాడు కళ్యాణ్. నువ్వు జాలి పడే పరిస్థితుల్లో మేము లేమని కళ్యాణ్ కోపంగా బదులిస్తాడు.
సామంత్ కాళ్లు పుట్టుకున్నది నువ్వు...
మీరు కారు కొన్నారా...విల్లా కొన్నారా...అవన్నీ ఏవి అని వెటకారంగా అనామిక మాట్లాడుతుంది. అవన్నీ నువ్వు చూసే రోజు తొందరలోనే వస్తుందని అప్పు బదులిస్తుంది. బుద్ది తక్కువై ఇంట్లో నుంచి వెళ్లిపోయామని వెళ్లి మీ వాళ్ల కాళ్ల మీద పడతారా అంటూ అనామిక అంటుంది. అందరూ నీలా ఉంటారని అనుకోకని కళ్యాణ్ అంటాడు. తప్పు చేసినందుకు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే...సామంత్ కాళ్లు పట్టుకొని అతడి దగ్గరకు చేరావు. డబ్బు కోసం దిగజారిపోయి బతకడం నీకు తెలుసు కావచ్చు...కానీ కష్టపడటం మాత్రమే మాకు వచ్చని కళ్యాణ్ అంటాడు.
అప్పు పోలీస్...
త్వరలోనే అప్పు పోలీస్ కాబోతుందని కళ్యాణ్ అంటాడు. గుడ్ జోక్ అంటూ అనామిక నవ్వుతుంది. సొంత టాలెంట్ అప్పు ఎగ్జామ్స్ పాస్ అయ్యిందని, కొద్ది రోజుల్లోనే అప్పును పోలీస్ యూనిఫామ్‌లో చూసి తరించమని అనామికతో అంటాడు కళ్యాణ్. తను పోలీస్ అయ్యాక నువ్వు ఏ తప్పు చేయకూడదని దేవుడిని వేడుకో...తప్పు చేసి దొరికితే అప్పు సంగతి తెలుసు కదా...నాలా సాఫ్ట్ కాదని, తుప్పు వదిలిస్తుందని అనామికకు వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్. నీ ఆటలు, నాటకాలు తొందరగా మానేయమని అనామికకు కోపంగా చెప్పి అప్పును తీసుకొని కళ్యాణ్ వెళ్లిపోతాడు.
అప్పు పోలీస్ అవుతుందని తెలిసి అనామిక కంగారు పడుతుంది. రాజ్, కావ్యల గురించి ఆలోచిస్తూ వీళ్ల గురించి పూర్తిగా మార్చిపోయానని అనామిక అంటుంది. వీళ్ల సంగతి తర్వాత రుద్రాణికి పంపించిన డాక్యుమెంట్స్ సంగతి చూడమని సామంత్ అంటాడు.
పది కోట్లకు తాకట్టు
అనామిక పంపించిన డాక్యుమెంట్స్‌ను తీసుకొని ధాన్యలక్ష్మికి ఇస్తుంది రుద్రాణి. అవుట్‌హౌజ్‌ను పది కోట్లకు రాజ్, కావ్య తాకట్టు పెట్టినట్లు ఆ డాక్యుమెంట్స్‌లో ఉంటుంది. మనల్ని తెలివితక్కువాళ్లను చేస్తూ రాజ్, కావ్య డబ్బుల్ని దాచుకుంటూ జల్సాలు చేస్తున్నారని ధాన్యలక్ష్మికి రెచ్చగొడుతుంది రుద్రాణి. ఆస్తుల్లో వాటా ఇవ్వకపోగా...ఇప్పుడు అప్పుల్లో వాటాలు అడిగేలా ఉన్నారని అంటుంది. అసలు అవుట్‌హౌ జ్ ఎందుకు తాకట్టు పెట్టారో కూపీ లాగితే అన్ని విషయాలు బయటకు వస్తాయని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి.
మేడమ్ సార్...మేడమ్ అంతే...
కావ్య, రాజ్ ఆఫీస్‌కు రెడీ అవుతుంటారు. రాజ్ ఆలస్యం చేయడంతో అతడిపై కావ్య చిరాకు పడుతుంది. నువ్వు హాస్టల్ వార్డెన్‌లా తయారయ్యావని కావ్యతో కోపంగా అంటాడు రాజ్. ఈ బాధ్యతల వల్ల మూడు తిట్లు, ఆరు చివట్లలా తన జీవితం మారిపోయిందని కావ్య బదులిస్తుంది.
నువ్వు ఓపికతో చేస్తోన్న ఈ పనులన్నీ చూస్తుంటే మేడమ్ సార్..మేడమ్ అంతే అనాలనిపిస్తుందని రాజ్ అంటాడు. రుద్రాణి ఇచ్రిన డాక్యుమెంట్స్‌తో ఇంట్లో రచ్చ చేస్తుంది రుద్రాణి. రాజ్, కావ్యలను నిలదీస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.