Brahmamudi January 1st Episode: రాజ్‌కు బాస్‌గా మారిన కావ్య -ఉద్యోగం పీకేస్తానని వార్నింగ్ -హక్కుల కోసం రుద్రాణి రచ్చ
Brahmamudi January 1st Episode: బ్రహ్మముడి జనవరి 1 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటిపై కావ్య పెత్తనానికి ఎలాగైనా చెక్ పెట్టాలని రుద్రాణి, ధాన్యలక్ష్మి అనుకుంటారు. కావ్య చేసే ప్రతి పనికి అడ్డు చెప్పడమే కాకుండా ఆమె పెట్టే రూల్స్‌ను వ్యతిరేకించాలని నిర్ణయించుకుంటారు.
Brahmamudi January 1st Episode: కావ్య చేతుల్లో నుంచి ఆస్తిని లాక్కోవడానికి ప్లానుల మీద ప్లానులు వేస్తుంది రుద్రాణి. ఇంటి ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా కుటుంబసభ్యులు వాడుతోన్న కార్లను తీసేస్తుంది కావ్య. ఈ కార్ల వ్యవహరాన్ని అడ్డం పెట్టుకొని కావ్యను టార్గెట్ చేస్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మితో కలిసి రచ్చ చేస్తుంది.
కారు లేకుండా మేము ఆటోలో వెళ్లాలా... ఏ అధికారంతో ఈ ఇంటి పద్దతులను కావ్య మార్చుతుందో మాకు ఇప్పుడే తెలియాలి అంటూ అపర్ణతో గొడవకు దిగుతారు. ధాన్యలక్ష్మి మాటలు భరించలేక కార్ల గురించి అడగటానికి కావ్యకు ఫోన్ చేస్తుంది అపర్ణ. కానీ ఆఫీస్ పనులతో తాను బిజీగా ఉన్నానని చెప్పి కావ్య ఫోన్ కట్ చేయడంతో రుద్రాణి, ధాన్యలక్ష్మి కోపం మరింత పెరుగుతుంది.
పనికిమాలిన సంత...
అనవసరపు ఖర్చులు తగ్గించడానికి ఇవన్నీ చేస్తున్నానని కావ్య అంటే ఊరుకునేది లేదని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలాంటి తద్దినాలన్నీ తలకెత్తుకోవాల్సి వస్తుందనే ఇంటి తాళాలు తీసుకొచ్చి నాకు ఇస్తానని కావ్య అన్నదని.... ఎప్పుడైతే కావ్య చేతిలో ఇంటి తాళాలు పడ్డాయో అప్పటి నుంచే ఈ పనికిమాలిన సంత మొదలైంది అంటూ ధాన్యలక్ష్మి, రుద్రాణిపై సెటైర్లు వేసి వెళ్లిపోతుంది అపర్ణ. కావ్యను ఇంటికి వచ్చిన తర్వాత దులిపివేయాలని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఫిక్సైపోతారు.
లాస్‌లో కంపెనీ...
ఓ ఎంప్లాయ్ అడ్వాన్స్ కావాలని అడుగుతాడు. కానీ అకౌంట్‌లో డబ్బులు లేవని...ఇప్పుడు ఇవ్వడం కుదరదని మేనేజర్ అంటాడు. ఆఫీస్ అకౌంట్‌లో డబ్బులు లేవని, కంపెనీ లాస్‌లో నడుస్తుందని మిగిలిన ఉద్యోగులతో ఆ ఎంప్లాయ్ చెబుతుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య వారి మాటలు విని కోపం పట్టలేకపోతుంది.
కంపెనీ లాస్‌లో నడుస్తుందని ఎవరు చెప్పారు...వందేళ్ల చరిత్ర ఉన్న కంపెనీ మీ అడ్వాన్స్ కోసం బోర్డ్ తిప్పేస్తుందా అని ఫైర్ అవుతుంది. జీతాలు ఎప్పుడైనా ఒక్కరోజు ఆలస్యంగా అందుకున్నారా అంటూ ఉద్యోగులను నిలదీస్తుంది. ఉద్యోగుల కోసం కంపెనీ ఏం చేస్తుందో మొత్తం చెప్పుతుంది.
అన్నం పెట్టే కంపెనీ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడుతారా... మీలో ఒక్కరికైనా విశ్వాసం ఉందా ప్రశ్నిస్తుంది. స్వరాజ్ గ్రూప్ గురించి ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడితే పనిష్‌మెంట్ తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది.
అనామిక ప్లాన్...
దుగ్గిరాల కుటుంబంపై రివేంజ్ తీర్చుకోవడానికి ఎన్డీ చిట్‌ఫండ్ ఓనర్ నందగోపాల్ చేత దివాళా నాటకం ఆడిస్తుంది అనామిక. కానీ నందగోపాల్ భయడిపోతాడు. క్లయింట్స్ తో పాటు పోలీసులు తనను వెతుకుతున్నారని, దొరికితే ఎక్కడ చంపేస్తారోనని వణికిపోతున్నానని అనామికతో చెబుతాడు నందగోపాల్. భయం ఎందుకు మీరు దొరికితేనే కదా అని అనామిక అతడికి ధైర్యం చెబుతుంది. రాజ్ నన్ను పట్టుకుంటాడని అనిపిస్తుందని నందగోపాల్ కంగారుపడతాడు. నువ్వు వాడికి దొరికే అవకాశం లేదని అనామిక చెబుతుంది.
వంద కోట్లు నీవే...
నువ్వు విదేశాలకు పారిపోయావని అందరూ నమ్ముతున్నారని, ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేయమని చిట్‌ఫండ్ ఓనర్‌తో అనామిక చెబుతుంది. ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి బ్యాంకు వాళ్లకు ఎక్కువ టైమ్ లేకపోవడంతో రాజ్ నుంచే ఆ సొమ్ము మొత్తం తిరిగి తీసుకుంటారు.
అప్పటివరకు ఓ మూడు నెలల పాటు రాజ్‌కు దొరక్కుండా ఉంటే వంద కోట్లు నీకే దక్కుతాయని నందగోపాల్‌కు తన ప్లాన్ వివరిస్తుంది అనామిక. ఆమె ప్లాన్ విని నందగోపాల్ ఆనందం పట్టలేకపోతాడు. మూడు నెలలు తన గెస్ట్‌లో ఎవరికి కనిపించకుండా లవర్‌తో కలిసి ఎంజాయ్ చేయాలని ఫిక్సవుతాడు.
ఆచూకీ దొరికింది...
నందగోపాల్ అప్పు కారణంగా చేయని తప్పుకు తమతో పాటు కుటుంబసభ్యులు పడుతోన్న ఇబ్బందులు చూసి కావ్య తట్టుకోలేకపోతుంది. అప్పు కట్టడానికి తాము అష్టకష్టాలు పడుతుంటే నందగోపాల్ మాత్రం జల్సాలు చేస్తున్నాడని కోపంగా రాజ్‌తో అంటుంది. నందగోపాల్‌ను పట్టుకునేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నానని రాజ్ అంటాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి నందగోపాల్ లోకల్‌లోనే ఉన్నాడని, ఫోన్ ఆన్ చేశాడని చెబుతాడు. పోలీసుల సహకారంతో నందగోపాల్‌ను పట్టుకోవడానికి కావ్యతో కలిసి అతడి గెస్ట్‌హౌజ్‌కు బయలుదేరుతాడు రాజ్.
నో చెప్సాల్సిందే...
ఏదో చిన్న పిల్ల అని కావ్యను చూసి చూడనట్లు వదిలేస్తున్నానని, అంతేకానీ చేతకాక కాదని కావ్యపై తనకున్న కోపాన్ని బయటపెడుతుంది ధాన్యలక్ష్మి. చెప్పుడు మాటలతో ఆమె కోపాన్ని మరింత పెంచుతారు రాహుల్, రుద్రాణి. ఇక నుంచి కావ్య చేసే ప్రతి పనికి అడ్డు చెప్పాలి.
ఆమె పెట్టే రూల్స్‌కు నో చెప్పాలి. తిరిగి మన హక్కులు మనం సంపాదించుకోవాలని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. ఇదంతా జరగాలంటే ఆ కావ్య ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి పనికిరాదని నిరూపించాలని రుద్రాణి చెబుతుంది. ఇదంతా నీ వల్లే సాధ్యమవుతుందని ధాన్యలక్ష్మికి నూరిపోస్తుంది. రుద్రాణి చెప్పుడు మాటల ప్రభావంలో పడ్డ ధాన్యలక్ష్మి కావ్య ఇంటికి రాగానే లెక్కలన్నీ తేల్చాలని ఎదురుచూస్తుంటుంది.
రాజ్ సెటైర్లు...
నందగోపాల్‌ను పట్టుకోవడానికి రాజ్, కావ్య బయలుదేరుతారు. నందగోపాల్ దొరికితే వాడి అంతుచూస్తానని కోపంగా అంటాడు. దొరికినప్పుడు ఏం చేశారో...పారిపోకుండా కనీసం పట్టుకోలేకపోయారని రాజ్‌పై సెటైర్లు వేస్తుంది కావ్య. బోర్డ్ తిప్పేసిన వాడు పారిపోకుండా మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడా అని అంటుంది.
ఈ మధ్య నువ్వు టూమచ్‌గా మాట్లాడుతున్నావని, పొగరు బాగా పెరిగిపోయిందని కావ్యపై పంచ్‌లు వేస్తాడు రాజ్. చిట్‌ఫండ్ దివాళా గురించి ఇప్పుడే ఇంట్లోవాళ్లకు చెబుతానని కావ్య అంటుంది. మిమ్మల్ని ఎన్ని లక్షలు అయినా అడుక్కోమని అంటానని చెబుతుంది. రేపటి నుంచి నువ్వు ఆఫీస్‌కు రాకని కావ్యతో కోపంగా అంటాడు రాజ్. మీరు కారు ఆపితే ఇప్పుడే దిగిపోతానని రాజ్‌ను పోరుతుంది కావ్య. ఈ కంగారులో వారి కారుకు ఓ వ్యక్తి అడ్డు రావడంతో రాజ్ బ్రేక్ వేసి ఆపేస్తాడు.
భార్య కాదు బాస్...
తాను పెళ్లి చూపులకు వెళుతోండగా తన కారు ఆగిపోయిందని, లిఫ్ట్ ఇవ్వమని కోరుతాడు. కారు ఎక్కిన వ్యక్తితో కావ్య తన భార్య కాదని, బాస్ అని చెబుతాడు రాజ్. తాను డ్రైవర్‌గా జాబ్ చేస్తున్నానని అంటాడు.
నందగోపాల్ ఫామ్‌హౌజ్ అడ్రెస్‌ను కష్టపడి పట్టుకుంటారు రాజ్, కావ్య. ఫామ్ హౌజ్‌లోని బెడ్‌రూమ్ పూలతో అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. భూత్‌బంగ్లాకు జిరాక్స్ కాపీలా ఉందని కావ్య అంటుంది. అనుకోకుండా కాలు జారి రాజ్‌పై పడుతుంది కావ్య. ఆమెను పట్టుకోబోతాడు రాజ్. ఇద్దరు కలిసి బెడ్‌పై పడిపోవడంతో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.