Brahmamudi January 15th Episode: బయటపడ్డ కావ్య సీక్రెట్ - లో క్లాస్ అంటూ స్వప్న పుట్టింటిపై రుద్రాణి డైలాగ్స్
Brahmamudi: బ్రహ్మముడి జనవరి 15 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతం ఫంక్షన్ కోసం కనకం చేసిన ఏర్పాట్లు చీప్‌గా ఉన్నాయని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్య బోసి మెడతో సీమంతం ఫంక్షన్‌కు రావడంపై రుద్రాణిలో అనుమానం మొదలవుతుంది. కావ్య నగలు తాకట్టు పెట్టిన నిజం రాహుల్ ద్వారా తెలుసుకుంటుంది.
స్వప్న సీమంతం వేడుక కోసం కనకం ఇంటికొస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. కనకం చేసిన ఏర్పాట్లు చూసి లోపల అడుగుపెట్టకూండానే నోటికి పనిచెబుతుంది రుద్రాణి. స్వప్న పుట్టింటి స్థాయి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అంటుంది. మనం అతిథిలుగా వచ్చాం...అతిగా ప్రవర్తించకుంటే మంచిదని రుద్రాణిపై పంచ్ వేస్తుంది ఇందిరాదేవి.

లో క్లాస్ బుద్ది…
ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపిద్దామా...ఎవరికి కించపరుచుదామా అని చూస్తుంటారు కదా రుద్రాణిపై కావ్య ఫైర్ అవుతుంది. నాది నీలాంటి లో క్లాస్ బుద్ది కాదంటూ కావ్య మాటలపై రుద్రాణి రుసరుసలాడుతుంది. మాది లో క్లాస్ అయినా మాకు బుద్ది ఉంది...మీకు అది కూడా లేదు అత్తపై స్వప్న ఫైర్ అవుతుంది. పుట్టింట్లో కూడా అత్తకు గౌరవం ఇవ్వవా అని భార్యపై రాహుల్ కొప్పడుతాడు. గౌరవించే అవకాశం నాకు ఆమె ఇవ్వడం లేదని భర్తకు బదులిస్తుంది స్వప్న.
బోసి మెడతో...
కావ్య బోసి మెడతో ఎలాంటి నగలు లేకుండా ఫంక్షన్‌కు రావడంపై రుద్రాణి, ధాన్యలక్ష్మి ఆరాలు తీయడం మొదలుపెడతారు. నిన్ను చూస్తుంటే పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉన్నావని రుద్రాణి అంటుంది. దివాళా తీసినట్లు బోసి మెడతో మా పరువు తీయడానికి వచ్చావా అంటూ ధాన్యలక్ష్మి కూడా పంచ్‌లు వేస్తుంది.
నేను నీకు ఇచ్చిన నగలు ఉన్నాయి కదా అవి వేసుకొని వస్తే బాగుండేది కోడలితో అంటుంది అపర్ణ. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసిన కావ్య మౌనంగా ఉంటుంది. కావ్య కంగారుపడటం చూసిన రుద్రాణి అసలు ఆ నగలు ఉన్నాయో లేదో...నీకు పెత్తనం ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయని కూపీ లాగే ప్రయత్నం చేస్తుంది.
కావ్య అబద్ధం...
హడావిడిలో ఇంట్లోనే నగలను మర్చిపోయానని కావ్య అబద్ధం ఆడుతుంది. ఆ నగలను డ్రైవర్ చెబితే తీసుకొస్తాడని రుద్రాణి అంటుంది. లేదంటే నగలు తీసుకురావడానికి సుభాష్ వెళతాడని అపర్ణ ఈంటుంది. రాజ్ అందరికి సర్ధిచెబుతాడు. తాను ఏదో ఓ టైమ్‌లో వెళ్లి నగలను తీసుకొస్తానని చెప్పి అందరిని లోపలికి తీసుకెళతాడు.
చీప్‌గా ఏర్పాట్లు...
ఫంక్షన్ ఏర్పాట్లలో కనకం బిజీగా ఉంటుంది. అప్పుడే ఖరీదైన చీరలో అక్కడకు వచ్చిన స్వప్నను చూసిన కనకం...దుగ్గిరాల ఇంటి కోడలిని అనిపించుకున్నావని అంటుంది. మేము మా బాధ్యతల్ని బాగానే చేస్తున్నామని, కానీ నువ్వే దుగ్గిరాల ఇంటి వియ్యంకురాలివి అనిపించుకోవడం రుద్రాణి మళ్లీ తన నోటికి పనిచెబుతుంది.
ఫంక్షన్ ఏర్పాట్లు చాలా చీప్‌గా ఉన్నాయని కనకాన్ని అవమానిస్తుంది. కూతురి సీమంతానికి ఆకాశమంత పందిరి వేస్తావని అనుకుంటే...ఆకాశమే తప్ప పందిరి కనిపించడం లేదని పంచ్‌లు వేస్తుంది. మాటలతో మభ్య పెడుతూ తూతూ మంత్రంగా ఫంక్షన్ చేస్తావని నేను ముందే అనుకున్నానని కనకం కించపరిస్తూ మాట్లాడుతుంది.
తల్లి కడుపులో ఉండగానే...
పుట్టింట్లో ఫంక్షన్ చేయడం మాకు పుట్టబోయే మనవడికి అవమానంగా ఉందని, దరిద్రాన్ని తల్లి కడుపులో ఉన్నప్పుడే అనుభవించాల్సివచ్చిందని రుద్రాణి అంటుంది. ఖర్చులు తగ్గించాలని కొంత మంది ఈ వేడుకను ఇక్కడ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుందని కావ్యపై అనుమానపడతాడు రాహుల్.
సర్ధుకుపోయేది లేదని, ఇక్కడ అంత అతుకుల బొంతలా ఉందని కనకంపై ఫ్యామిలీపై మాటలతో ఎటాక్ చేస్తుంది. స్వప్న కూడా రుద్రాణి మాటలనే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సీమంతం ఏర్పాట్లు అసలు నచ్చలేదని, ఎందుకు ఇలా చేశావని తల్లిపై కోప్పడి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లిపోతుంది.
అంత నా ఖర్మ...
అత్తారింట్లో అన్ని కోట్ల ఆస్తులు ఉన్నా...దిక్కుమొక్కులేని దానిలా చీప్‌గా ఇలా సీమంతం జరుపుకోవాల్సివస్తుందని, అంత నా ఖర్మ అని బాధపడుతుంది స్వప్న. అక్కకు కావ్య సర్ధిచెబుతుంది. ఆస్తులు ఉంటే అంగరంగవైభవంగా ఫంక్షన్ చేసి గొప్పలు చెప్పుకోగలం...అందులో అన్ని ఆర్టిఫీషియల్‌గానే ఉంటాయని, అక్కడికి వచ్చేవారు మన దగ్గర ఉన్న డబ్బును చూసే వస్తారని, మనపై నిందలు వేయాలనే చూస్తారని స్వప్నతో అంటుంది కావ్య.
అదే ఇక్కడ నాన్న తాటాకులతో వేసిన పందిరి, అమ్మ మామిడాకులతో కట్టిన తోరణాలు మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తాయని, అరిటాకుల్లో భోజనాలు ఎంతో తృప్తి నిస్తాయని, అదే అసలైన ఫంక్షన్ అని చెబుతుంది. మన దగ్గరకు వచ్చే వారు మన డబ్బు, హోదా చూసి రాకూడదు. మన పద్దతులను, మంచితనాన్ని చూసి మన మీద ప్రేమతో అభిమానంతో రావాలని స్వప్నతో అంటుంది కావ్య.
ఇంటి జ్ఞాపకాలు...
కావ్య మాటలతో స్వప్న కూల్ అవుతుంది.కోపం తగ్గించుకుంటుంది. ఇంటితో ఉన్న జ్ఞాపకాల్ని గుర్తుచేస్తుంది. అవన్నీ గుర్తుచేసుకొని స్వప్న ఆనందపడుతుంది. నువ్వు చెబుతుంటే ఇక్కడే ఫంక్షన్ జరుపుకోవడం బాగునట్లు అనిపిస్తుందని కావ్యతో అంటుంది స్వప్న. నేనే అమ్మను తప్పుగా అర్థం చేసుకున్నానని, ఈ ఇంటికి తీసుకొచ్చి మంచిపనిచేశావని కావ్యతో చెబుతుంది స్వప్న. సీమంతం వేడుక కోసం ఆనందంగా రెడీ అవుతుంది.
సీమంతం శీను...
కనకం చేసిన ఉప్మా తినలేకపోతుంది రుద్రాణి. స్వప్న కోసం పెట్టిన ఫ్రూట్స్ తినడానికి ట్రై చేస్తుంది. కానీ అవి ప్లాస్టిక్ ఫ్రూట్స్ కావడంతో ఈవెంట్ మేనేజర్ సీమంతం శీను అడ్డుకుంటాడు. మీరు ఆ పండ్లు తినడానికి వీలు లేదంటూ రుద్రాణితో గొడవకు దిగుతాడు. ఆమె చేయి పట్టుకుంటాడు. తన చేయి పట్టుకున్న సీమంతం శీను చెంప పగలగొడుతుంది రుద్రాణి.
అతడిని తోసేసి యాపిల్ తినబోతుంది. కానీ ప్లాస్టిక్ ఫ్రూట్ చూసి షాకైపోతుంది. నిజం ఫ్రూట్స్ కూడా ఉన్నాయని కనకం కవర్ చేయబోతుంది. ఆమె మాటలను వినిపించుకోకుండా కోపంగా రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
వేళపాళ లేదా...
కావ్యతో మాట్లాడాలని ఆమెను సీక్రెట్‌గా రూమ్‌లోకి పిలుస్తాడు రాజ్. గదిలోకి పిలవడానికి వేళపాళ ఉండదా అంటూ రాజ్‌పై సెటైర్లు వేస్తుంది కావ్య. నా పెళ్లాన్ని నేను పిలుచుకోవడానికి టైమ్ చూసుకోవాలా అని రాజ్ అంటాడు. ఈ గది చూస్తుంటే మనం మొదటిసారి కలిసిన రోజు గుర్తొచ్చిందని రాజ్ అంటాడు. ఆ పీడకలను ఇప్పుడు గుర్తుచేస్తారని కావ్య అంటుంది.
రాజ్ గిఫ్ట్...
కాస్త దగ్గరకు వచ్చి మాట్లాడమని కావ్యతో అంటాడు రాజ్. రాకపోతే ఏం చేస్తారని కావ్య బదులిస్తుంది. ఇలా లాక్కుంటానని కావ్యను దగ్గరకు తీసుకుంటాడు రాజ్. ఏంటి అధికారం చెలాయిస్తున్నారని, ఇదేం మీ ఆఫీస్ కాదని అంటుంది. ఇది మా అత్తారిల్లు ఇక్కడే నేను ఏం చేసినా నువ్వు సైలెంట్‌గా ఉండాల్సిందేనని రాజ్ అంటాడు. మీరు ఇలా చేస్తే నేను పారిపోతానని కావ్య అంటుంది. కావ్యకు కవర్ ఇస్తాడు రాజ్. భర్త తన కోసం గిఫ్ట్ తెచ్చాడని కావ్య మురిసిపోతుంది.
నగల టాపిక్…
కావ్య తన నగలు తాకట్టు పెట్టి సీతారామయ్య హాస్పిటల్ బిల్లు కట్టిన విషయం కనిపెడతాడు రాహుల్. ఈ విషయంరుద్రాణికి చెబుతాడు. కావ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాలని రుద్రాణి ఫిక్సవుతుంది. అపర్ణ ముందు కావ్య నగల టాపిక్ తీసుకొస్తుంది. నిజంగానే ఆ నగలు జాగ్రత్తగా ఉన్నాయా అని అడుగుతుంది. రుద్రాణి మాటలతో కావ్య భయపడిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.