Brahmamudi Promo: ధాన్యలక్ష్మీ, రుద్రాణిని మోసం చేస్తున్నావని రాజ్‌ను నిందించిన అపర్ణ- ప్రేమ దెబ్బతో విలవిల్లాడిన ధీరజ్
Brahmamudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, కావ్య ఇద్దరు కలిసి ఇంటి ఆస్తులతోపాటు రుద్రాణి, ధాన్యలక్ష్మీ సంపాదించిన ఆస్తులను అమ్మేసి డాలర్స్‌గా మార్చేసి ఫారెన్‌లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారని మాకు తెలియదనుకుంటున్నావా అని కొడుకుని నిందిస్తుంది అపర్ణ.
Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, కావ్య పాస్‌పోర్ట్, వీసాకు కావాల్సిన డాక్యుమెంట్స్ కోసం బ్రోకర్ సతీష్ వస్తాడు. అతనితో అవి ఎవరికి అని చెప్పిస్తుంది రుద్రాణి. తర్వాత ఆస్తులన్నీ తాకట్టుపెట్టి డాలర్స్‌కు మార్చి అమెరికాలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు రుద్రాణి చెబుతుంది. దానికి అపర్ణ తప్పు బడుతుంది.

సెటిల్ అవ్వాలని
నాకు న్యాయం చేయాలని మాట్లాడితే మీకెందుకు తప్పుగా అనిపిస్తుందో అని ధాన్యలక్ష్మీ నిందిస్తుంది. అపర్ణ, సుభాష్‌లతో గొడవ పెట్టుకుంటుంది. మీ కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే చాలు అని సైలెంట్‌గా ఉంటున్నారు అంటుంది. ఇప్పుడు వీరికి ఇంత అర్జంట్‌గా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, విదేశాల్లో సెటిల్ అవ్వాలనే ఆలోచన లేకపోతే తప్పా అని రెచ్చిపోతుంది ధాన్యలక్ష్మీ. దానికి రుద్రాణి తోడు అయి ఇద్దరు ఇంట్లో రచ్చ రచ్చ చేస్తారు.
ధాన్యలక్ష్మీ మాటలకు విసిగిపోయిన అపర్ణ రాజ్‌ను అన్ని గట్టిగా అడిగి తెలుసుకుంటాను అని చెబుతుంది. కట్ చేస్తే రాత్రి భోజనం సమయంలో రాజ్‌తో మాట్లాడుతుంది అపర్ణ. నువ్వు, కావ్య కలిసి మన ఆస్తులతోపాటు ధాన్యలక్ష్మీ, రుద్రాణి కలిసి కష్టపడి సంపాదించిన ఆస్తులను అమ్మేసి వచ్చిన డబ్బును డాలర్స్‌గా మార్చి ఫారెన్‌కు పారిపోవాలని అనుకుంటున్నారా అని అపర్ణ అడుగతుంది. దాంతో ఒక్కసారిగా రాజ్, కావ్య షాక్ అవుతారు.
ధాన్యలక్ష్మీ, రుద్రాణిని మోసం చేస్తే
పక్కవాళ్ల ఆస్తిని వాళ్ల అనుమతి లేకుండా అమ్మే హక్కు నీకు ఎవరు ఇచ్చారు అని అపర్ణ రాజ్‌ను నిందిస్తుంది. దాంతో మమ్మీ.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్. నేను డాలర్స్‌గా మార్చడం ఏంటీ అని రాజ్ అంటాడు. దానికి కోపంగా నటించకు.. నువ్ చెప్పకపోతే మాకు తెలియదనుకుంటున్నావా. వెనుక నుండి ధాన్యలక్ష్మీ, రుద్రాణిని మోసం చేస్తే మేము తెలుసుకోలేననుకుంటున్నావా అని అపర్ణ నిందిస్తూ నిలదీస్తుంది. దాంతో రాజ్, కావ్య అయోమయంగా చూస్తారు.
Illu Illalu Pillalu Serial Latest Episode Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ధీరజ్‌పై అటాక్ చేయడంపై విశ్వను కొడుతుంది భద్రావతి. చంపేయాలని చూడటం ఏంటీ అని నిలదీస్తుంది. నాన్నలా నేను జీవితాంతం బాధపడలేను. ఇప్పుడు తప్పించుకోవచ్చు. ఎప్పటికైనా వాడిని చంపేస్తాను అని కోపంగా వెళ్లిపోతాడు విశ్వ.
చాలా హాయిగా ఉంది
మరోవైపు ధీరజ్ ఉన్న గదిలోకి వెళ్తుంది ప్రేమ. ధీరజ్‌తో చాలా ప్రేమగా మాట్లాడుతుంది ప్రేమ. ధీరజ్‌కు తగిలిన దెబ్బలు చూసి నొప్పి ఎక్కువగా ఉన్నాయా అని ప్రేమ అడుగుతుంది. దానికి అయ్యో లేదమ్మా.. చాలా హాయిగా ఉన్నాయి.. అని చెప్పిన ధీరజ్ వెంటనే.. ఏంటే.. అని చేయి లేపుకుంటూ వెళ్తాడు. నొప్పితో ఆగుతాడు. వెటకారం చేస్తున్నావా.. వెటకారం అని ధీరజ్ కోపంగా అంటాడు.
నాది నిజంగా అలాంటి మెంటాలిటీ అయితే.. నేను నిన్ను కాపాడను అని ప్రేమ చెబుతుంది. నువ్ నన్ను కాపాడింది నా మీద ప్రేమతో కాదమ్మా. మీ అన్నయ్య మీద ప్రేమతో అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ షాక్ అవుతుంది. ఒకవేళ నాకు ఏదైనా అయితే మీ అన్నయ్య జైలుకు పోతాడు అని ధీరజ్ అంటాడు. దాంతో కోపానికి వస్తుంది ప్రేమ.
సారీ చెప్పడానికి వస్తే
ఏరా.. నువ్వు ఇంతేనా.. నా కారణంగా నీకు దెబ్బలు తగిలాయి అని నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అని ఫీల్ అవుతూ చెబుతుంది ప్రేమ. కానీ, దానికి ధీరజ్ సెటైర్లు వేస్తాడు. జింకను వేటాడటానికి కారణం అయిన పులే జింకను పరామర్శించడానికి వెళ్లిందట అని ధీరజ్ వెటకారంగా అంటాడు.
దాంతో మరింత కోపం పెంచుకున్న ప్రేమ నువ్ జన్మలో మారవురా అని అంటుంది. తర్వాత బయటకు వెళ్తున్న ధీరజ్.. నిన్ను అని కొట్టడానికి చేయి లేపుతాడు. అప్పుడే ప్రేమ వెనక్కి చూస్తుంది. దాంతో ఆ ఏంటీ అని ఆగిపోతాడు ధీరజ్. తర్వాత సచ్చినోడా అనుకుంటూ ధీరజ్‌పై దిండు గట్టిగా పడేస్తుంది.
ఆవేశంగా ప్రేమ
దాంతో ధీరజ్ నొప్పితో గిలగిలలాడుతాడు. ఒసేయ్ రాక్షసి.. అసలే నొప్పిగా ఉంటే దిండుతో కొట్టి చచ్చావేంటే అని ధీరజ్ నొప్పితో అంటాడు. దానికి ప్రేమ మరింత కోపంగా ఆవేశం గక్కుతూ చూస్తుంది. ధీరజ్ నొప్పితో విలవిల్లాడుతాడు.
సంబంధిత కథనం