Brahmamudi Promo: 100 కోట్లు అప్పు చేసిన రాజ్, కావ్య- గట్టిగా ఇరికించిన అనామిక.. మామ కామెడీ, బామ్మర్దిని కొట్టిన రామరాజు
Brahmamudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఉంట్లో స్వప్న పాపకు బారసాలను అంతా ఎంతో సంతోషంగా చేస్తుంటారు. అక్కడికి అనామిక ఎంట్రీ ఇచ్చి పెద్ద బాంబ్ పేల్చుతుంది. రాజ్, కావ్యలు రూ. 100 కోట్ల అప్పు చేశారని చెబుతుంది. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ రెచ్చిపోతారు.

Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో స్వప్నకు పాప పుట్టడంతో దుగ్గిరాల కుటంబంలో సంతోషం విల్లివిరిస్తుంది. అంతా సంతోషంగా ఉంటారు. కానీ, రుద్రాణి మాత్రం అది చూసి ఓర్వలేకపోతుంది. దాంతో అనామికకు కాల్ చేస్తుంది.
సరైన అవకాశం కోసం
ఇంట్లో ప్రతి ఒక్క విషయం నీకు చెబుతూ వచ్చాను. నువ్ ఏదోదో చేస్తాను అన్నావ్. కానీ, ఏం చేయలేదు. ఏమైపోయింది నీ పగ, ప్రతికారం. నీలో పౌరుషం తగ్గిపోయిందా, లేక ధైర్యమే చచ్చిపోయిందా అని అనామికతో అంటుంది రుద్రాణి. వీళ్ల మొహాల్లో నవ్వులు చూడలేకపోతున్నా అని రుద్రాణి అంటుంది. దాంతో మృగాలు సైలెంట్‌గా ఉన్నాయంటే వేటాడటం లేదని కాదు. సరైన అవాకశం కోసం ఎదురుచూస్తున్నట్లు, నేను కూడా అదే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని అనామిక అంటుంది.
ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. అదే మీ మనవరాలి బారసాల. రేపు మీ మనవరాలి బారసాల టైమ్‌లో నేను రాబోతున్నాను. బాంబ్ పేల్చబోతున్నాను. రేపు నేను కొట్టబోయే దెబ్బకు మీ దుగ్గిరాల కుటుంబం మొత్తం కుదేలు అయిపోతుంది. కళ్లప్పగించి చూడటానికి వెయిట్ చేయండి అని ఆవేశంతో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనామిక. దాంతో రుద్రాణి ఆలోచనలో పడుతుంది. ఈ అనామిక ఏం ప్లాన్ వేసింది, అంత పెద్ద ఏం బాంబ్ పేలుస్తుంది అని అనుకుంటుంది.
అనామిక ఎంట్రీ
మరుసటి రోజు అంతా బారసాల సందర్భంగా హడావిడి నడుస్తుంది. కావ్య అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది. దుగ్గిరాల ఇంటికి కనకం వస్తుంది. కనకం రాగానే రుద్రాణి మాటలతో సెటైర్లు వేయడం స్టార్ట్ చేస్తుంది. ఎవరు ఏమన్నా పట్టించుకోదు. తర్వాత ఊయలను పూలతో అందంగా డెకరేట్ చేసి బారసాల చేయిస్తుంటారు. అంతా సంతోషంగా బారసాల చేస్తున్న సమయంలో అనామిక ఎంట్రీ ఇస్తుంది.
సినిమా శుభం కార్డ్ కోసం అందరూ ఒకే చోట చేరినట్లు భలే చేరుకున్నారే అని అనామిక అంటుంది. అసలు నిన్ను ఎవరు పిలిచారు అని కనకం అరుస్తుంది. అమాయకులను మేల్కొల్పడానికి నేనే వచ్చాను అని అనామిక అంటుంది. అనామిక నోర్మూసుకుని వెళ్తావా లేదా అని కావ్య గట్టిగా చెబుతుంది. ఎందుకు వెళ్లాలి, నీకు సంబంధించిన విషయాలు ఏమైనా బయటపడతాయా అని భయంగా ఉందా అని రుద్రాణి అంటుంది.
గట్టిగా ఇరుక్కున్న రాజ్, కావ్య
దాంతో రుద్రాణికి సపోర్ట్ చేసిన ధాన్యలక్ష్మీ అనామికను చెప్పమని అంటుంది. రాజ్, కావ్యలు కలిసి రూ. 100 కోట్లు అప్పు చేశారు అని అనామిక అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఇదే దుగ్గిరాల ఇంట్లో అనామిక పేల్చిన పెద్ద బాంబ్. సీతారామయ్య ఇచ్చిన షూరిటీని అడ్డుగా పెట్టుకుని రాజ్, కావ్యను అప్పు చేసినట్లుగా అబద్ధం చెబుతుంది అనామిక. అది అబద్ధం అని రాజ్, కావ్య వాదించలేక, సీతారామయ్య షూరిటీ, ఇల్లు తాకట్టు వంటి విషయాలు చెప్పలేకుండా గట్టిగా ఇరికించేసింది అనామిక.
Illu Illalu Pillalu Serial Latest Episode Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో చందు పెళ్లి చూపులకు వెళ్లిన రామరాజు, వేదవతి సంబంధం ఓకే అయిందని తెగ సంబరపడిపోతారు. కానీ, అమ్మాయి తండ్రికి భద్రావతి కాల్ చేసి చందు పెళ్లి చెడగొడుతుంది. రామరాజు ఇంటికి రాగానే పెళ్లి వద్దనుకుంటున్నట్లు అమ్మాయి తండ్రి కాల్ చేసి చెబుతాడు.
బామ్మర్దిని కొట్టిన రామరాజు
చందు పెళ్లి కోసం ఫొటోషూట్ జరిపిస్తాడు మామ. తన ఇద్దరు కొడుకుల వల్లే పెద్ద కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయిందని రామరాజు ఆవేశంతో రగులుతుంటాడు. ముందు చూస్తే తన ఇద్దరు కొడుకులు సంతోషంగా ఉండటం చూడలేకపోతాడు. ఏంట్రా ఇదంతా అని గట్టిగా అరుస్తాడు. అది చూసి బావొచ్చాడమ్మా. బావొచ్చాడు.. ఎంత బాగున్నాడు అనుకుంటూ రామరాజు దగ్గరికి మామ వస్తాడు.
కొడుకులను నిందించిన రామరాజు
బావా.. నేనే దగ్గరుండి ఫొటోసెషన్ పెట్టించాను. ఎలా ఉంది బావ మీ బామ్మర్ది క్రియేటివిటీ. పోలా.. అదిరిపోలా.. అని మామ కామెడీ చేస్తాడు. అప్పటికే కోపంలో ఉన్న రామరాజు బామ్మర్దిని ఒక్కటి లాగిపెట్టి చెంపపై కొడుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. తన పెద్ద కొడుకు చందు పెళ్లి క్యాన్సిల్ అవడానికి కారణం ధీరజ్, సాగర్‌లను నిందిస్తాడు రామరాజు. అదంతా వెనుక నుంచి చూస్తున్న భద్రావతి మాత్రం చాలా సంతోషిస్తుంది. తను అనుకున్న పని సాధించానని సంబరపడిపోతుంది.
సంబంధిత కథనం
టాపిక్