New Serial: స్టార్ మా సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు ఎంతటి సంచలనం రేపాయో మనకు తెలుసు. ఈ రెండూ టీఆర్పీల్లో టాప్ రేటింగ్స్ సాధించాయి. ఈ రెండింటినీ భూమి ఎంటర్టైన్మెంట్సే నిర్మించింది. అలాంటి నిర్మాణ సంస్థ నుంచి ఇప్పుడు సరికొత్త సీరియల్ రాబోతోంది. అయితే ఆ సీరియల్ స్టార్ మాలో కాకుండా ఈటీవీలోకి రానుంది.
బ్రహ్మముడి, గుప్పెడంత మనసు సీరియల్స్ కంటే ముందు భూమి ఎంటర్టైన్మెంట్స్ చెల్లెలి కాపురం అనే మరో సీరియల్ ను కూడా నిర్మించింది. ఇక వీటి తర్వాత నిండు మనసులు అనే మరో సీరియల్ కూడా రానుంది. ఇది కూడా స్టార్ మాలోనే. భూమి ఎంటర్టైన్మెంట్స్ కు ఇది నాలుగో సీరియల్.
తన ప్రతి సీరియల్ ను స్టార్ మాలోనే నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఈటీవీ కోసం కొత్త సీరియల్ చేస్తోంది. ఈ ఐదో సీరియల్ గురించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ అన్నీ హిట్ సీరియల్సే అందించడంతో ఈ భూమి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోయే కొత్త సీరియల్ పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి.
అంతేకాకుండా తొలిసారి ఈటీవీలో రానున్న సీరియల్ ఇది. స్టార్ మాతో పోలిస్తే ఈటీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ చాలా తక్కువ. మరి ఈ సరికొత్త సీరియల్ ఎలా ఉంటుంది? ఇందులో నటించేది ఎవరు? కథేంటి అన్న వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
స్టార్ మాలో వచ్చే సీరియల్స్ కొన్నేళ్లుగా టాప్ లో నిలుస్తున్నాయి. అందులో బ్రహ్మముడి, గుప్పెడంత మనసు మరింత ప్రజాదరణ పొందిన సీరియల్స్. ఇందులో గుప్పుడంత మనసు ఇప్పటికే ముగిసింది. బ్రహ్మముడి ఇంకా కొనసాగుతోంది. ప్రైమ్ టైమ్ లో ఉన్న సమయంలో ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో నంబర్ వన్.
తర్వాత మధ్యాహ్నానికి మార్చారు. అక్కడ కూడా బ్రహ్మముడి బాగానే పర్ఫామ్ చేస్తోంది. ఆరు నుంచి ఏడు రేటింగ్ సాధిస్తోంది. ఈ సీరియల్ జనవరి 24, 2023లో ప్రారంభమైంది. ఇప్పటికే రెండేళ్లుగా 700కుపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తూనే ఉంది.
సంబంధిత కథనం