Brahmamudi February 5th Episode:కళావతి గ్లామర్‌కు రాజ్ ఫిదా - శ్వేతపై రివేంజ్ తీర్చుకున్న కావ్య - రుద్రాణి డ్రామా
Brahmamudi February 5th Episode: కావ్య తన గెటప్ మార్చి మోడ్రన్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ఆఫీస్‌కు వస్తుంది. కావ్య లుక్ చూసి రాజ్ జెలసీగా ఫీలవుతాడు.ఆమెను ఏడిపించడానికి శ్వేతను ఆఫీస్‌కు పిలుస్తాడు. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi February 5th Episode: కిడ్నాపర్ల బారి నుంచి తెలివిగా చిన్నారిని కాపాడాలని అనుకుంటుంది అప్పు. చిన్నారి కట్లు విప్పి బయటకు తీసుకొస్తుంది. కానీ అప్పుతో పాటు చిన్నారి, ఆమె తల్లి కిడ్నాపర్లకు దొరికిపోతారు. నా దగ్గర డబ్బులేదని, మమ్మల్ని వదిలేయమని కిడ్నాపర్లను చిన్నారి తల్లి బతిమిలాడుతుంది. ఆమె మాటలను పట్టించుకోని కిడ్నాపర్లు చిన్నారిని చంపేయాలని ఫిక్సవుతారు.

పాప సంగతి సరే మిమ్మల్ని పోలీసుల నుంచి ఎవరు కాపాడుతారని అప్పు అంటుంది. పోలీసులు ఇక్కడికి ఎలా వస్తారని కిడ్నాపర్లు అంటారు. ఫోన్ చేస్తే వస్తామని కిడ్నాపర్ల ఎదుట పోలీసులు ప్రత్యక్షమవుతారు. పోలీసులు అప్‌డేట్ అయ్యారని, నేరం జరగకముందే వస్తున్నారని కిడ్నాపర్లకు క్లాస్ ఇస్తుంది అప్పు. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని సేవ్ చేసిన అప్పును పోలీసులు అభినందిస్తారు. నీ లాంటి వాళ్లు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండాలని అంటారు.
గెటప్ మార్చిన కావ్య...
డిజైన్స్ సరిగా వేయవు కానీ...మీ మేడమ్‌తో కబుర్లు చెప్పమంటే గంటల తరబడి చెబుతావు అంటూ ఆఫీస్‌లో శృతికి క్లాస్ ఇస్తుంటాడు రాజ్. అప్పుడే ఆఫీస్ ముందు కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి కావ్య దిగుతుంది. ఆమె గెటప్ మొత్తం మారిపోతుంది.
మోడ్రన్ డ్రెస్‌లో స్టైలిష్‌గా రెడీ అయ్యి ఆఫీసుకు వస్తుంది. కావ్య అందానికి రాజ్ ఫిదా అవుతాడు. అప్రయత్నంగానే అతడి చేతిలోని డిజైన్ పేపర్స్ కిందపడిపోతాయి. ఏంటి పడిపోయారా అంటూ రాజ్‌ను అడుగుతుంది కావ్య. రాజ్ తడబడిపోతాడు. ఏంటి అని అడుగుతాడు. డిజైన్ పేపర్స్ పడేసుకుంటున్నారా అంటూ మాట మార్చుతుంది కావ్య.
కావ్యకు కాంప్లిమెంట్స్...రాజ్ అసూయ
మోడ్రన్ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపిస్తున్నారని కావ్యకు శృతితో పాటు మిగిలిన ఉద్యోగులు కాంప్లిమెంట్స్ ఇస్తారు. వారి కాంప్లిమెంట్స్ చూసి రాజ్ జెలసీగా ఫీలవుతాడు. టెడ్డీ బేర్‌కు ట్రెండీ వేర్ తొడిగినట్లు ఉందని కావ్యపై సెటైర్స్‌వేస్తాడు రాజ్. మీరు జెలసీతో అలా అంటున్నారు కానీ మనసులో ఆశ్చర్యపోయి ఉంటారని భర్తతో అంటుంది కావ్య. డ్రెస్ మారినంత మాత్రాన మనుషులు మారరు అంటూ రాజ్ అంటాడు. పర్లేదు మీకు తప్ప ఇక్కడ అందరికి నచ్చింది. త్వరలోనే మీకు నచ్చుతుంది. అప్పటివరకు వెయిట్ చేస్తాను. వస్తాను డియర్ అంటూ రాజ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోతుంది కావ్య.
శ్వేత ఫోన్ కాల్...
అప్పుడే రాజ్‌కు ఫోన్ చేస్తుంది శ్వేత. కలుద్దామని అన్నావు ఎక్కడ అని అడుగుతుంది. కావ్యను ఏడిపించడానికి ఎక్కడో ఎందుకు ఆఫీస్‌లోనే కలుద్దామని శ్వేతతో అంటాడు రాజ్. కావ్య ఆఫీస్‌కు వెళ్లడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని రుద్రాణి ఆలోచిస్తుంది.
ఆఫీస్‌కు ఎప్పుడు వెళ్లనని అపర్ణకు మాటిచ్చిన కావ్య ఆ మాట తప్పడం వెనుక ఏదో రహస్యం ఉండి ఉంటుందని అనుమానపడుతుంది. ఆ సీక్రెట్ ఏమిటో కనుక్కోమని రాహుల్‌ను ఆఫీస్‌కు పంపిస్తుంది రుద్రాణి. కెరీర్‌ను డెవలప్‌చేసుకోవడానికే కావ్య ఆఫీస్‌కు వెళుతున్నట్లు తెలిసిందని తల్లితో అంటాడు రాహుల్.
రాజ్, కావ్యనాటకం...
రాజ్, కావ్య అన్యోన్యంగా ఉన్నట్లు అందరి ముందు నటిస్తున్నారని, రాజ్ గురించి తెలుసుకోవడానికే కావ్య ఆఫీస్‌కు వెళుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తుంది రుద్రాణి. కావ్య కంటే ముందే రాజ్ చేస్తోన్న తప్పు ఏమిటో తెలుసుకుంటే.. ఆ తప్పును చూపించి నీకు కంపెనీలో స్థానం అడగొచ్చు అని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. తల్లి ఐడియా విని రాహుల్ ఆనందపడిపోతాడు. కావ్యకు తెలియకుండా మన ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయమని రాహుల్‌తో అంటుంది రుద్రాణి.
ఆఫీస్‌కు వచ్చిన శ్వేత...
రాజ్‌ను కలవడానికి శ్వేత ఆఫీస్‌కు వస్తుంది. కావ్య దృష్టిలో శ్వేతను పడేలా చేస్తాడు రాజ్. కావ్య క్యాబిన్ ముందే శ్వేతతో క్లోజ్‌గా మూవ్ అవుతాడు. నా పర్సనల్ క్యాబిన్‌కు వెళ్లి మాట్లాడుకుందామని చెబుతాడు. రాజ్ క్లోజ్‌నెస్‌కు శ్వేత ఆశ్చర్యపోతుంది.
క్యాబిన్‌లో రాజ్, శ్వేత మాట్లాడుతుండగా అక్కడికి కావ్య వస్తుంది. కావ్యను శ్వేత విష్ చేస్తుంది. కావ్య బదులుగా నవ్వుతుంది. విష్ చేస్తే తిరిగి విష్ చేయడం సంస్కారం అని కావ్యపై సెటైర్ వేస్తాడు రాజ్. సంస్కారం గురించి మీ దగ్గరే నేర్చుకోవాలని రాజ్‌కు మాటకు మాట బదులిస్తుంది కావ్య.
కావ్య సెటైర్స్‌ను...
కావ్యను చూపించి తను మీ వైఫ్ కావ్య కదా అని రాజ్‌ను అడుగుతుంది శ్వేత. నా ఖర్మ కొద్ది భార్య అయ్యిందని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య ఈ ఆఫీస్‌లో ఎందుకు పనిచేస్తుందని రాజ్‌ను ప్రశ్నిస్తుంది శ్వేత. నా ఖర్మ కొద్ది అంటూ రాజ్ బదులుగా కావ్య సమాధానమిస్తుంది. మనం డైరెక్ట్‌గా కలవడం ఇదే మొదటిసారి కదా కావ్యతో అంటుంది శ్వేత. అవును...ఇదే చివరి సారి కూడా తిక్కతిక్కగా బదులిస్తుంది కావ్య.
అదేంటి అని శ్వేత అడగ్గా...ఓ మీరు మళ్లీ మళ్లీ వస్తారా...నేను ఇక్కడే పాతుకుపోవాలని వచ్చా అని కావ్య అంటుంది. మీరు వచ్చి పోతు ఉంటే చూస్తూ ఉంటా అని అంటుంది. కావ్య మాటలతో శ్వేత హర్ట్ అవుతుంది. కావ్యకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నువ్వు ఏం అనుకోవద్దు అంటూ శ్వేతను బతిమిలాడుతాడు రాజ్. పెళ్లాంతో ఎలా మాట్లాడాలో, పరాయి అమ్మాయితో ఎలా మాట్లాడాలో మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదని ఈ మధ్యే అర్థమైంది అంటూ రాజ్‌పై సెటైర్స్ వేస్తుంది.
తన క్యాబిన్ నుంచి వెళ్లమని కావ్యతో అంటాడు రాజ్. వెళుతూ శ్వేతకు బుద్దిచెప్పాలని కావ్య అనుకుంటుంది. ఫైల్ తీసుకున్నట్లుగా నటిస్తూ కలర్స్‌ను ఆమెపై పడేలా చేస్తుంది. అది చూసి రాజ్ ఫైర్ అవుతాడు. చూసుకోవాలి కదా అని అంటాడు. చూసి కూడా కావాలని పడేసే రకం కాదని కోపంగా రాజ్ క్యాబిన్ నుంచి వెళ్లిపోతుంది శ్వేత.
శ్వేత అనుమానం...
కావ్య వాలకం చూసి శ్వేతలో డౌట్ మొదలవుతుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని రాజ్‌ను అడుగుతుంది. ఏం లేదు, ఇద్దరం బాగానే ఉన్నామని రాజ్ అంటాడు. మీ మధ్య సెలైంట్‌గా యుద్ధం జరుగుతుందని, నువ్వు ఆ విషయాన్ని కావాలనే దాస్తున్నావని రాజ్‌తో అంటుంది శ్వేత. ఎంతగా మండిపోకపోతే నామీద ఎందుకు కలర్ పోస్తుంది అని రాజ్‌ను నిలదీస్తుంది శ్వేత.నాకు నిజం తెలియాలని అంటుంది.
కావ్య అసహనం...
రాజ్ క్యాబిన్ నుంచి కోపంగా తన రూమ్‌లోకి వస్తుంది కావ్య. ఆమె కోపం చూసి ఏమైందని అడుగుతుంది శృతి. ఆమెకు తిక్కతిక్కగా సమాధానమిస్తుంది కావ్య. కావ్య ఏం మాట్లాడుతుందో అర్థం కాక తలతిరిగినట్లవుతుందని శృతి అంటుంది. ఆఫీస్ కావడంతో బలవంతంగా తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటుంది
శ్వేత క్లాస్...
కావ్యతో జరుగుతున్న గొడవ గురించి శ్వేతను చెబుతాడు రాజ్. మన మధ్య ఏదో రిలేషన్ ఉందని కావ్య అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ అభిప్రాయం కరెక్ట్ కాదని, మన మధ్య ఏం లేదని నువ్వు చెప్పకపోవడం తప్పు అని రాజ్‌తో కోపంగా అంటుంది శ్వేత. ఎందుకు చెప్పాలి.
కొంతమంది అంతకుమించి ఎదగరు. విశాలంగా ఆలోచించాలని అనుకోరు. కళ్లకు కనిపించేదే నిజమని నమ్మే వాళ్ల సంస్కారం అంతే అనుకుంటే వాళ్లను సంస్కరించుకుంటూ ఎక్కడ కూర్చుంటామని రాజ్ బదులిస్తాడు. మన ఫ్రెండ్‌షిప్ విషయంలో క్లారిటీ లేక కావ్య పొరపడుతుందని, నిన్ను నిలదీసినప్పుడే నిజం చెబితే బాగుండేదని శ్వేత అంటుంది.
నీ ఆలోచన విధానంలోనే తప్పు ఉందని రాజ్‌ను తప్పు పడుతుంది శ్వేత. కావ్య మనల్ని అపార్థం చేసుకుందని తెలిసిన తర్వాత తాను ఊరుకోలేకపోతున్నాని అంటుంది. రాజ్, శ్వేత మాట్లాడుతుండగా అక్కడికి కావ్య వస్తుంది. ఆమె ముందు మధ్య ప్రేమ ఉన్నట్లుగా మరోసారి నటిస్తాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.