Brahmamudi Today Episode: అనామిక చెంప పగలగొట్టిన కావ్య - రుద్రాణికి పనిష్‌మెంట్ - మారిపోయిన ప్రకాశం
Brahmamudi February 17th Episode:బ్రహ్మముడి ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌లో బ్యాంకు అప్పు కుట్ర వెనుక అనామిక, సామంత్ ఉన్నారనే నిజం తెలుసుకున్న రాజ్ కోపంతో రగిలిపోతాడు. సామంత్ ఇంటికెళ్లి అతడిని చితక్కొడతాడు. అడ్చొచ్చిన అనామిక చెంపలు కావ్య వాయిస్తుంది.

బ్యాంకు అప్పు సమస్యను క్రియేట్ చేసింది అనామిక, సామంత్ అనే నిజం బయటపెడుతుంది అప్పు. నంద, విశ్వ వెనకుండి ఈ కథ మొత్తం వాళ్లే నడిపించారని అంటుంది. అప్పు మాటలు వినగానే రాజ్ కోపంతో రగిలిపోతాడు. ఈ సారి వాళ్లను వదిలేది లేదని కోపంగా అనామిక దగ్గరకు బయలుదేరుతాడు. రాజ్ వెంట కావ్య వెళుతుంది.
సామంత్ టెన్షన్...
మరోవైపు సామంత్ టెన్షన్‌గా కనిపిస్తాడు. అనామిక మాటలు నమ్మి తన కంపెనీ నడవటం కోసం ఐదు కోట్ల అప్పు చేస్తాడు. ఇద్దరు క్లయింట్స్‌ను అనామిక తీసుకొస్తుంది. వాళ్లు ఒప్పుకోకపోతే తన కంపెనీ మూతపడటం ఖాయమని సామంత్ భయపడతాడు. అప్పుడే నంద దొరికిపోయాడనే నిజం సామంత్‌కు తెలుస్తుంది. నంద దొరకడం అసాధ్యమని, సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అని అనామిక అంటుంది. అసలు నువ్వు చేసే పనులన్నీ రాంగే అని అనామికపై ఫైర్ అవుతాడు సామంత్.
విశ్వ వల్లే...
నందను దాచడటానికి విశ్వకు డబ్బిచ్చి... మనకు ఫేవర్‌గా వాడుకోవాలని అనుకున్నాం. కానీ విశ్వ డబ్బులకు కక్కుర్తి పడటంతో నంద.... అప్పుకు దొరికిపోయాడని అనామికతో చెబుతాడు సామంత్. మన పేర్లు కూడా బయటకు వచ్చి ఉంటాయని, రాజ్ మనల్ని వదిలిపెట్టడని భయపడిపోతాడు. రాజ్ సంగతి తాను చూసుకుంటానని సామంత్‌కు సర్ధిచెప్పి డీల్ మాట్లాడుదామని సామంత్‌ను తీసుకెళుతుంది అనామిక.
చితకబాదిన రాజ్...
సామంత్ తన క్లయింట్స్‌తో డీల్ మాట్లాడుతుండగా అక్కడికి రాజ్, కావ్య సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు. వచ్చి రావడంతో సామంత్ కాలర్ పట్టుకొని అతడి చెంపలు వాయిస్తాడు రాజ్. నా వల్ల నీకు జరిగిన నష్టం ఏంటి? ఎందుకు చేశావు ఈ పని అని సామంత్‌ను చితక్కొడతాడు. మధ్యలోకి అనామిక ఎంటర్ అవుతుంది. సామంత్‌ను వదిలేయమని అంటుంది. నోరూమూసుకోమని అనామికకు వార్నింగ్ ఇస్తాడు.
అనామిక చెప్పుడు మాటలు విని...
నిన్ను తొక్కాలని, నువ్వు నష్టపోవాలని నేను ఏ రోజు చూడలేదని, నీ కంపెనీ కొనడానికి చాలా సార్లు ఓపెన్ ఆఫర్స్ వచ్చిన కొనలేదని సామంత్‌తో రాజ్ అంటాడు. అనామిక చెప్పుడు మాటలు నమ్మి నాదారికి అడ్డొచ్చి...నా బిజినెస్‌ను దెబ్బతీసి నా ఫ్యామిలీని రోడ్డకు లాగాలని అనుకున్నావని సామంత్ కుట్రలను రాజ్ బయటపెడతాడు. నా ఫ్యామిలీకి ఏం జరగలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నానని, లేదంటే నిన్ను చంపేస్తానని సామంత్‌ను హెచ్చరిస్తాడు రాజ్. అడ్డొస్తే ఆడదానివి అని చూడకుండా నిన్ను కూడా లేపేస్తానని అనామికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
మాపై నిందలు వేస్తే...
ఎవరో చేసే తప్పులకు మాపై నిందలు వేస్తే ఊరుకునేది లేదని, మర్యాదగా నీ మొగుడిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్లమని కావ్యతో అంటుంది అనామిక. లేకపోతే ఏం చేస్తావని అనామిక చెంపపై గట్టిగా ఒక్కటిస్తుంది కావ్య. నీకు వాగడమే తెలుసు..మాకు కొట్టడం తెలుసునని అంటుంది.
మా ఆయనే తలుచుకుంటే మిమ్మల్ని, మీ కంపెనీని అర నిమిషంలో కొనగలడు...క్షణాల్లో మిమ్మల్ని రోడ్డుకు లాగేస్తాడని అనామికపై ఫైర్ అవుతుంది కావ్య. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్...ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే చంపేస్తానని సామంత్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కావ్య, రాజ్ వెళ్లిపోతారు. సామంత్ నిజస్వరూపం బయటపడటంతో క్లయింట్స్ డీల్‌కు ఒప్పుకోరు.
కళ్యాణ్ ఆనందం...
తమ ఫ్యామిలీ పరువును అప్పు కాపాడిందని తెలిసి కళ్యాణ్ సంతోషం పట్టలేకపోతాడు. పోలీస్‌గా, కోడలిగా రెండు పాత్రలకు న్యాయం చేశావని అప్పుతో అంటాడు కళ్యాణ్. అనామిక, రుద్రాణి ఇంటిని ముక్కలు చేసి అందరిని రోడ్డున పడేయాలని అనుకున్నారని, కానీ ఇటుక ముక్క కూడా కదిలించలేకపోయారని కళ్యాణ్ చెబుతాడు. సమయానికి నువ్వు రాకపోయుంటే ఇంటి పరిస్థితి ఏమైపోయి ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు.
రొమాంటిక్ మూడ్‌లో...
నువ్వు ఇంట్లో అడుగుపెడితే ఆ ఇంటికి జరిగే మేలు ఏమిటో ఇప్పుడే అందరికి తెలిసిందని అంటుంది. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదని అప్పుతో చెబుతాడు కళ్యాణ్. ఏం అడిగిన ఇస్తావా అని అప్పు అడుగుతుంది. ఇంతసేపు నన్ను పొగిడిన నోటితోనే అని అప్పు సిగ్గుపడిపోతుంది. ఆమె నుదుటిపై ముద్దు ఇస్తాడు కళ్యాణ్. అప్పు, కళ్యాణ్ రొమాంటిక్ మూడ్‌లో ఉండగా కరెంట్ బిల్ అంటూ ఓ వ్యక్తి డిస్ట్రబ్ చేస్తాడు.
చిన్న వాళ్లైనా...
అప్పు సమస్య తీరిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంగా కలిసిపోయి మాట్లాడుకుంటుంటారు.ఇన్నాళ్లు అప్పు సంగతి దాచడటానికి రాజ్, కావ్య ఎన్నో అవస్థలు పడ్డారని, అందరితో మాటలు పడ్డారని అపర్ణ అంటుంది. చిన్నవాళ్లైన ఇంటి గుట్టు బయటకు రాకుండా కుటుంబ గౌరవం కాపాడారని అపర్ణ అంటుంది. ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తీరిపోయాయని అపర్ణ అంటుంది.
ఆస్తి పంపకాలు జరగాల్సిందే...
అసలు సమస్య అలాగే ఉందని, ఆస్తి పంపకాలు మిగిలిపోయాయని సీతారామయ్య అంటాడు. నాకున్న ఆస్తిపాస్తులను కుటుంబం ఉమ్మడిగా అనుభవించాలని కోరుకున్నానని సీతారామయ్య చెబుతాడు.
కానీ కొందరిలో స్వార్థం ప్రవేశించిందని, దానివల్ల ఇంట్లో మనస్పర్థలు, చీలికలు మొదలయ్యాయని సీతారామయ్య అంటాడు. ఈ గొడవల వల్ల తన మనసు విరిగిపోయిందని, అందువల్లే ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటా వారికి పంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటిస్తాడు. ఎవరి భాగం వాళ్లు చూసుకొని ఎవరి దారి వారు చూసుకుంటే మంచిదని అంటాడు. సీతారామయ్య మాటలతో ధాన్యలక్ష్మి, రుద్రాణి ఆనందపడతారు.
మాకు వాటా వద్దు...
నా ఇద్దరు కొడుకులు రామలక్ష్మణుల్లా కలిసి ఉంటారని కలలు గన్నానని, కానీ ప్రకాశం కూడా మారిపోయాడని సీతారామయ్య ఎమోషనల్ అవుతాడు. మాకు ఆస్తుల మీద ఆశలేదని, జప్తులో ఆస్తి పోయిన బాధపడేవాళ్లం కాదని అపర్ణ అంటుంది. అందరం కలిసి ఉంటేనే మన కుటుంబం చాలా మందికి ఆదర్శంగా ఉంటుందని, వాటాలు పంచుకుంటే అందరం దూరం అయిపోతామని, అది నాకు ఇష్టం లేదని రాజ్ అంటాడు. పంచడం తప్పని సరి అయితే మాకు మాత్రం వాటా వద్దని, మీతోనే కలిసి ఉంటామని కావ్య అంటుంది.
ప్రకాశం క్షమాపణలు...
ఆ ఒక్క మాట చాలని సీతారామయ్య ఎమోషనల్ అవుతాడు. నేను, నా భార్య మీతోనే ఉంటామని అంటాడు. ఎవరికి రావాల్సిన వాటా వారు న్యాయంగా తీసుకొని వెళ్లిపోతేనే బాగుంటుందని చెబుతాడు.
సీతారామయ్య మాటలతో ప్రకాశం తన తప్పును తెలుసుకుంటాడు. సీతారామయ్య కాళ్లపై పడిపోయి క్షమాపణలు అడుగుతాడు. నా భార్య మాటలకు లొంగిపోయి ఆస్తి కోసం కోర్టుకు వెళ్లాలని అనుకున్నానని, రాజ్, కావ్యను అపార్థం చేసుకున్నానని ప్రకాశం అంటాడు.
సీతారామయ్య కండీషన్...
మాకు ఆస్తి వద్దని, అందరం కలిసే ఉందామని తండ్రితో చెబుతాడు ప్రకాశం. దయచేసి మీ నిర్ణయం మార్చుకోమని తండ్రిని ప్రాదేయపడతాడు. కుటుంబాన్ని ముక్కలు చేయాలనే ఆలోచన బాగాలేదని అందరంఊ అంటారు. ఆస్తి పంపకాలకు అందరూ అడ్డు కోవడం చూసి రుద్రాణి కంగారు పడుతుంది.
అప్పును కోడలిగా ఒప్పుకోవాలని, కళ్యాణ్, అప్పులను ఇంటికి తీసుకురావాలని సీతారామయ్య కండీషన్ పెడతాడు.
రుద్రాణికి షాక్...
అప్పు, కళ్యాణ్‌లకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కావ్య. రుద్రాణి అందరి మనసుల్లో విషం నింపి ఇంటికి ముక్కలు చేయాలని అనుకుందని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి, రాహుల్‌లను ఇంటి నుంచి పంపించేయాలని అంటుంది. ఇందిరాదేవి మాటలతో రాహుల్, రుద్రాణి షాకవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం