Brahmamudi Today Episode: ఆస్తి పంచనన్న సీతారామయ్య -రుద్రాణి చేతిలో చిప్ప- నందు సీక్రెట్ బయటపెట్టిన కావ్య!
Brahmamudi: బ్రహ్మముడి ఫిబ్రవరి 13 ఎపిసోడ్‌లో తన పరువుమర్యాదలు, మాటే అక్కరలేని వారికి ఆస్తి పంచి ఇచ్చేది లేదని చెప్పి రుద్రాణి, ధాన్యలక్ష్మికి సీతారామయ్య షాకిస్తాడు రుద్రాణి, రాహుల్‌లకు అడుక్కోవడం తప్ప మరో దారిలేదని స్వప్న అంటుంది.

వంద కోట్ల అప్పును గడువు లోగా రాజ్, కావ్య చెల్లించకపోవడంతో ఆస్తులను జప్తు చేస్తామంటూ బ్యాంకు అధికారులు ఇంటికొస్తారు. ఆస్తిలో మా వాటాలు మాకు పంచి ఇచ్చిన తర్వాతే ఆస్తులను జప్తు చేయాలని బ్యాంకు ఆఫీసర్ల ముందే రాజ్, కావ్యలతో రుద్రాణి, ధాన్యలక్ష్మి గొడవపడతారు.
షాకిచ్చిన సీతారామయ్య...
అప్పుడే సీతారామయ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తాడు. ఆస్తుల కోసం కుటుంబసభ్యులు గొడవలు పడటం చూసి బాధపడతాడు. మీ స్వార్థం కోసం నా పరువు మర్యాదలు తీయాలని చూస్తున్నారని రుద్రాణి, ధాన్యలక్ష్మిపై ఫైర్ అవుతాడు. మీకు నా మాటే అక్కరలేనప్పుడు నేను సంపాదించిన ఆస్తి మీకు ఎలా ఇస్తాను? నా పరువు మర్యాదలే మీకు అక్కరలేనప్పుడు మీరు నాకు అక్కరలేదని షాకిస్తాడు.
ఆస్తులను అమ్మేయ్...
బ్యాంకు వాళ్లకు ఎంత అప్పుందో...అంత మన ఆస్తులు అమ్మి కట్టేయ్...ఎవరు ఏమైపోయినా నాకు సంబంధం లేదని రాజ్‌తో అంటాడు. మీ వారసులు ఏమైపోయినా పర్వాలేదా అని ధాన్యలక్ష్మి అంటుంది. మీ మావయ్య పరువుమర్యాదలే అక్కరలేనప్పుడు మీరు ఆయనకు వారసులు ఎలా అవుతారని ధాన్యలక్ష్మికి బదులిస్తుంది ఇందిరాదేవి. సీతారామయ్య మాటకు ఎదురుచెప్పే హక్కు ఎవరికి లేదని అంటుంది.
పేకమేడల్లా కూలిపోయాయి...
ఆస్తి కోసం తాము వేసిన ప్లాన్స్ పేకమేడల్లా కూలిపోవడంతో రుద్రాణి, రాహుల్‌లకు మింగుడుపడదు. ధాన్యలక్ష్మి అత్తయ్య మైండ్‌ను డైవర్ట్ చేసి ఇళ్లు ముక్కలు చేసే టైమ్‌లో సీతరామయ్య వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టాడని రాహుల్ బాధపడతాడు. ఆఖరి నిమిషంలో వచ్చే పోలీసులా కథ అంత మార్చేశాడని రుద్రాణి వాపోతుంది. రుద్రాణి చేతిలో బొచ్చే తీసుకొని పెడుతుంది స్వప్న. చివరకు మీకు మిగిలేది ఇదే అని అంటుంది.
కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటే...
అందమైన ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నారు. అమాయకులను వలలో వేసుకొని ఇంటిని గుల్ల చేయాలని మీరు చేసిన కుట్రలకు మిగిలింది ఇదే అని స్వప్న అంటుంది. అడుక్కునే కర్మ మాకు పట్టలేదని రుద్రాణి కోపంగా అంటుంది.
రోడ్డున పడటం ఖాయం...
ఆస్తి మొత్తం పోయాకా మీరిద్దరు రోడ్డున పడటం ఖాయమని, బతకడానికి దారిలేక ఆకలికి తట్టుకోలేక రోడ్డు పక్కన అడుక్కుంటారని స్వప్న అంటుంది. ఆ విజువల్స్ ఊహించుకోవడానికే గొప్పగా ఉన్నాయని స్వప్న అంటుంది. నిజంగానే అడుక్కుంటున్నట్లుగా రుద్రాణి, రాహుల్ ఊహించుకుంటారు.బొచ్చే పట్టుకొని రుద్రాణి ఇంగ్లీష్‌లో అడుక్కున్నట్లుగా సీన్ కనిపిస్తుంది. రాహుల్ కొబ్బరి చిప్పలు తింటూ కడుపునింపుకున్నట్లుగా ఊహించుకుంటారు.
నోటికి తాళం పడే టైమ్ వచ్చింది...
ఆ కల నుంచి తేరుకొని కంగారు పడతారు. ఎలా ఉంది ఆ అడుక్కునే లైఫ్ అని స్వప్న అనగానే ఆమెపై రుద్రాణి ఫైర్ అవుతుంది. కూల్ అత్తా...నీ నోటికి తాళం పడే టైమ్ వచ్చిందని, ఎక్కువ మాట్లాడితే తోక కత్తిరిస్తారని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మీ అమ్మ మాటే వింటూ ఆమెతో కలిసి ముష్టి ఎత్తుకుంటావా...లేదంటే మంచివాడిగా మారి నా పార్టీలో చేరుతావో ఆలోచించుకోమని రాహుల్‌తో అంటుంది స్వప్న.
సుభాష్ క్లాస్...
ధాన్యలక్ష్మి మాట విని మారిపోయిన ప్రకాశానికి ఇందిరాదేవి, సుభాష్ క్లాస్ ఇస్తారు. ఇంతకుముందు మేము ఎన్నడు చూడని ప్రకాశాన్ని చూస్తున్నామని, నా తమ్ముడు ఇలా ఎప్పుడు లేదని సుభాష్ అంటాడు. మన కుటుంబంలో ఆస్తుల కోసం గొడవలు పడ్డట్లు నువ్వు చూశావా? నాన్న ఇచ్చిన మాటను తప్పడం విన్నావా? అని ప్రకాశాన్ని ప్రశ్నిస్తాడు సుభాష్. సీతారామయ్య కుటుంబం అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ మనం మాత్రం ఆస్తుల కోసం కొట్టుకుంటూ పరువు తీస్తున్నామని ఆవేదనకు లోనవుతాడు.
కళ్యాణ్ భవిష్యత్తు కోసం...
కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఆలోచించానని, ధాన్యలక్ష్మి ఆవేదనలో అర్థం ఉందని అనిపించిందని చెబుతాడు. కన్న కొడుకు గురించి ఆలోచించి తండ్రి గురించి పట్టించుకోవడం మానేశావని ప్రకాశంతో అంటుంది ఇందిరాదేవి. నాన్న నేర్పించింది నీకు క్రమ శిక్షణ విలువలు అయితే నువ్వు మనసులో ఆస్తులు, అంతస్తులు నింపుకొని మారిపోయావని ప్రకాశంతో అంటాడు సుభాష్.
రుద్రాణి వల్లే...
మీ మాటలు, ప్రవర్తనతో సీతారామయ్య మనసు విరిగిపోయిందని, వీళ్లకోసమేనా ఇన్నాళ్లు కష్టపడిందని కన్నీళ్లు పెట్టుకున్నాడని, తన మనషులే తనను పరాయివాళ్లను చేయడం చూసి తట్టుకోలేకపోతున్నాడని ఇందిరాదేవి ఎమోషనల్ అవుతాడు. రుద్రాణి వల్లే ధాన్యలక్ష్మి ఇలా తయారైందని, ఒక్క కలుపు మొక్క వల్లే ఇళ్లు మొత్తం నాశనం అయ్యిందని అపర్ణ అంటుంది. ఇందులో ధాన్యలక్ష్మి, ప్రకాశం తప్పు లేదని అపర్ణ చెబుతుంది. అపర్ణ మాట్లాడుతుండగానే ప్రకాశం వెళ్లిపోతాడు. అతడు మారుతాడనే నమ్మకం లేదని, ఎవరి దారి వారు చూసుకోవాల్సిందేనని ఇందిరాదేవి అంటుంది.
తాతయ్య మాట...
బ్యాంకు వాళ్లకు ఆస్తి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి బయలుదేరబోతాడు రాజ్. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదని కావ్య అంటుంది. తాతయ్య హాస్పిటల్ నుంచి వచ్చేలోపు సమస్యను సాల్వ్ చేయాలని అనుకున్నామని, కానీ ఏం చేయలేకపోయామని రాజ్ బాధపడతాడు.
ఆస్తి కోసం రుద్రాణి, ధాన్యలక్ష్మి అన్న మాటలు విని తాతయ్య మనసుకు ఎంత కష్టం కలిగిందోనని కావ్య అంటుంది. తాతయ్యను ఎలాగూ సంతోషపెట్టలేకపోయాం...కనీసం ఆయన మాటనైనా నిలబెడదామని రాజ్ అంటాడు.
సీతారామయ్య కన్నీళ్లు...
తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్లిపోవాల్సిరావడంతో సీతారామయ్య, ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటారు. మంచితనానికి, అనుబంధాలకు ఈ ఇళ్లు కొలువై ఉంటుందని కలలు కన్నానని, కానీ స్వార్థం కుళ్లు పెంచుకొని పిల్లలు ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారని, తాను నేర్పిన విలువలు ఏమైపోయానని సీతారామయ్య కన్నీళ్లు పెట్టుకుంటాడు.
అప్పు కోసం క్యారేజీ తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వస్తాడు కళ్యాణ్. నువ్వు నా కోసం లంచ్ తీసుకురావడం ఏంటి అని భర్తను అడుగుతుంది అప్పు. ఏం తీసుకురాకూడదా అని కళ్యాణ్ బదులిస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం