Brahmamudi February 11th Episode: అనామిక చిచ్చు -రోడ్డున పడనున్న దుగ్గిరాల ఫ్యామిలీ - ధాన్యలక్ష్మి విశ్వరూపం
Brahmamudi: బ్రహ్మముడి ఫిబ్రవరి 11 ఎపిసోడ్‌లో రాజ్, కావ్య కలిసి వంద కోట్లు అప్పు చేశారని దుగ్గిరాల కుటుంబసభ్యుల ముందు వాళ్లను ఇరికిస్తుంది అనామిక. బ్యాంకు నోటీసు పేపర్లు చూపిస్తుంది. మరోవైపు గడువులోపు అప్పు తీర్చకపోవడంతో దుగ్గిరాల ఆస్తులను జప్తు చేయడానికి బ్యాంకు వాళ్లు వస్తారు.

స్వప్న కూతురు బారసాల ఫంక్షన్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేస్తుంటారు. సడెన్‌గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అనామిక. రాజ్, కావ్య కలిసి వంద కోట్లు అప్పు చేశారని బాంబు పేల్చుతుంది. అనామిక మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకవుతారు. ఆ వంద కోట్ల అప్పులను తీర్చడానికి మీ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని, ఇంట్లో ఖర్చులను తగ్గిస్తున్నారని అనామిక అంటుంది.
రాజ్, కావ్య సెలైంట్...
అనామిక మాటలు నిజమని ధాన్యలక్ష్మి, రుద్రాణితో పాటు మిగిలిన దుగ్గిరాల కుటుంబసభ్యులు నమ్ముతారు. ఇంట్లో కావ్య పెట్టిన రూల్స్‌కు వంద కోట్ల అప్పే కారణమని రుద్రాణి గుండెలు బాదుకుంటుంది. అనామకురాలి మాటలు నమ్మి రుద్దాంతం చేస్తే బాగుండదని రుద్రాణి గొడవను ఆపేస్తుంది ఇందిరాదేవి. అనామిక చెప్పింది అబద్దమైతే...కావ్య, రాజ్ ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు సెలంట్‌గా ఉన్నారని రాహుల్ ప్రశ్నిస్తాడు.
మాడిపోయిన ముఖచిత్రాలు...
వంద కోట్ల అప్పు కట్టాలని బ్యాంకు వాళ్లు ఇచ్చిన నోటీసును అనామిక చూపిస్తుంది. ఆ నోటీసులపై రాజ్ సంతకం ఉంటుంది. దుగ్గిరాల ముఖచిత్రాలు మాడిపోవడం, వాడిపోవడం చూస్తుంటే చాలా హాయిగా ఉందని అనామిక అంటుంది. మీరంతా నడి రోడ్డు మీదకు వస్తే చూడటానికి మళ్లీ వస్తానని అనామిక వెళ్లిపోతుంది.
ఆ డబ్బు ఏం చేశారు...
రాజ్, కావ్యలను వంద కోట్ల అప్పు కోసం ధాన్యలక్ష్మి, రుద్రాణి నిలదీస్తారు. అంత డబ్బు ఏం చేశారు? బినామీ పేర్ల మీద ఆస్తులు కొన్నారా? ఆస్తుల్లో వాటాలు అడిగే సరికి ఇవ్వడానికి వీలు లేకుండా ఇలా అప్పులు చేశారా అంటూ రచ్చ చేస్తుంది ధాన్యలక్ష్మి. ఎందుకోసం, ఎవరి కోసం...ఏ అవసరం వచ్చిందని వంద కోట్లు అప్పు చేశారని అపర్ణ కూడా కొడుకు, కోడలిని నిలదీస్తుంది.
కంపెనీ దివాళా తీసిందా?
కంపెనీ దివాళా తీసిందా? సమస్యను మీలో మీరే దాచుకున్నారంటే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని కళ్యాణ్ అంటాడు. ఇన్నాళ్లు ఉమ్మడి ఆస్తి భద్రంగా ఉందని, ఏదో ఒక రోజు పంచుతారనే ఆశతో ఉన్నాను. ఇప్పుడు ఆ ఆశలు అన్నింటిని కూకటి వేళ్లతో కూల్చేశారని ధాన్యలక్ష్మి నానా మాటలు అంటుంది. వంద కోట్ల అప్పు గురించి చెప్పబోతుంది కావ్య. రాజ్ అడ్డుకుంటాడు. ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదు. నా అనుమతి లేకుండా నువ్వు ఏది చేయలేదు. కాబట్టి సమాధానం కూడా నేను చెప్పాలని అంటాడు.
ఒక్క రూపాయి వాడుకోలేదు...
కంపెనీ దివాళా తీయలేదు. కానీ అప్పు ఉన్న మాట నిజం. అప్పులో ఇరవై ఐదు కోట్లు తీర్చేశాం. మిగిలిన 75 కోట్లు త్వరలోనే తీర్చబోతున్నాం. అప్పు గురించి ఏం చెప్పిన వినే పరిస్థితుల్లో మీరు లేరు. చెప్పడానికి మేము సిద్ధంగా లేము. ఆ అప్పులో నుంచి మేము ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకోలేదు. అదొక్కటి నమ్మితే చాలని రాజ్ చెబుతాడు. కావ్యను అక్కడి నుంచి తీసుకెళతాడు.
విశ్వరూపం చూస్తారు...
వంద కోట్ల అప్పు గురించి సుభాష్, అపర్ణతో పాటు ఇందిరాదేవికి కూడా తెలిసే ఉంటుందని రుద్రాణి ఫిట్టింగ్ పెడుతుంది. ఈ సమస్య ఎలా, ఎక్కడి నుంచి మొదలైందో తెలియకపోతే నా విశ్వరూపం చూస్తారని ధాన్యలక్ష్మి అంటుంది.
తప్పు చేసేవాళ్లు కాదు...
రాజ్, కావ్య కలిసిపోయారని సంతోషించేలోపే వంద కోట్ల అప్పు బయటపడటంతో షాకవుతారు అపర్ణ, సుభాష్. ఇది నిజమా, అబద్ధామా అన్నది తెలియడం లేదని ఎమోషనల్ అవుతుంది అపర్ణ. రాజ్ ఇంటికి తలవంపులు తెచ్చే పనులు చేయడని, కావ్య డబ్బు మనిషి కాదని అపర్ణ అంటుంది. వాళ్లు తప్పు చేసేవాళ్లు కాదు, అప్పు చేసేవాళ్లు కాదని, ఏదో బలమైన కారణం వల్లే వాళ్లు మౌనంగా ఉండాల్సివస్తుందని సుభాష్ అంటాడు. వంద కోట్ల అప్పు అడ్డుపెట్టుకొని ఇంట్లో రుద్రాణి, ధాన్యలక్ష్మి ఎన్ని గొడవలు సృష్టిస్తారోనని అపర్ణ కంగారు పడుతుంది. వాళ్లను ఎలా ఆపాలో తెలియడం లేదని భర్తతో చెబుతుంది.
చెడు చేయాలని అనుకునేవారికి...
అనామికకు వంద కోట్ల విషయం ఎలా తెలిసింది అని భర్తను అడుగుతుంది కావ్య. మంచి చేయాలని అనుకునేవాడికి ఒక్కటే దారి. కానీ చెడు చేయాలని అనుకునేవాడికి వంద దారులు ఉంటాయని రాజ్ బదులిస్తాడు. అనామిక వల్ల వంద కోట్ల విషయం ఒక్కటే బయటపడింది. కానీ తాతయ్య విషయం బయటకు రాలేదు. ఆయన్ని ఎవరూ తప్పుగా అనుకోకూడదనే ఇన్నాళ్లు ఈ విషయం దాచిపెట్టాం.
వంద కోట్ల అప్పు గురించి బయటపడిందని కాబట్టి ఇంట్లో వాళ్లు మనల్ని నిలదీయడం మానేస్తారని, ఎన్ని గొడవలు చేసినా వంద కోట్ల అప్పు తీర్చేవరకు వాళ్లు ఏం చేయలేరని రాజ్ అంటాడు. కావ్య ఏదో చెప్పబోతుంటే ర ఆజ్ ఆమెను ఆపేస్తాడు. ఇన్ని రోజులు నన్ను నమ్మావు కదా...ఈ విషయంలో నన్ను నమ్మమని అంటాడు.
దుగ్గిరాల ఫ్యామిలీ రోడ్డు మీదకు...
రాజ్, కావ్య ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగేందుకు అనామిక స్కెచ్ వేస్తుంది. దుగ్గిరాల ఇంటిని జప్తు చేసి ఇంట్లో వాళ్లను మెడపట్టి బయటకు పంపించమని బ్యాంకు వాళ్లతో తాను మాట్లాడానని సామంత్‌తో అంటుంది అనామిక. ఆ తర్వాత బ్యాంకు వాళ్ల దగ్గర నుంచి స్వరాజ్ గ్రూప్‌ను తక్కువ రేటుకు నీ పేరుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని అనామిక అంటుంది. ఆమె ప్లాన్‌కు సామంత్ ఫిదా అవుతాడు. రేపు మీ పడబోతున్న పిడుగును కావ్య ఎలా ఆపుతుందో తాను చూస్తానని అనామిక అంటుంది.
కళ్యాణ్‌కు ధాన్యలక్ష్మి ప్రశ్నలు...
పరిస్థితులు చేయి జారకముందే మన వాటా మనం తీసుకొని బయటపడదామని కళ్యాణ్, ప్రకాశంతో ధాన్యలక్ష్మి అంటుంది. ఓ పక్క వంద కోట్ల అప్పు తీర్చడానికి అన్నయ్య కష్టపడుతుంటే నువ్వు ఆస్తుల కోసం ఎలా స్వార్థంగా ఆలోచిస్తున్నావని తల్లిని తప్పుపడతాడు కళ్యాణ్. అన్నయ్య అంటూ అంత ప్రేమను చూపిస్తున్నావుగా...మరి రాజ్... అప్పు చేసే ముందు రాజ్ నీకు చెప్పాడా?
ఎందుకు అప్పు చేశాడో చెప్పాడా? అప్పుగా తీసుకున్న వంద కోట్లు ఏం చేశాడో చెప్పాడా అంటూ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మి. వాళ్లకు ఎలాంటి కష్టం రాలేదని, వంద కోట్లు అప్పు చేసి రాజ్, కావ్య డబ్బులను దాచుకున్నారని, అప్పుల పేరుతో మన ఆస్తులను అమ్ముతున్నారని రచ్చ చేస్తుంది.
గడువు తేదీ లోగా...
రాజ్, కావ్య అసలైన స్వార్థపరులని, మనలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధాన్యలక్ష్మి ఆరోపిస్తుంది. తల్లి ఎంత చెప్పిన కళ్యాణ్ మాత్రం రాజ్, కావ్యలనే సపోర్ట్ చేస్తాడు.గడువు తేదీ లోగా అప్పు చెల్లించకపోవడంతో దుగ్గిరాల ఆస్తులను జప్తు చేయడానికి బ్యాంకు వాళ్లు వస్తారు.
బ్యాంకు వాళ్ల ముందే రుద్రాణి, ధాన్యలక్ష్మి కలిసి రాజ్, కావ్యలతో వాదనకు దిగుతారు. ఆ వంద కోట్లు ఏం చేశారో చెప్పాలని నానా మాటలు అంటారు. తండ్రి ఇచ్చిన వంద కోట్ల ష్యూరిటీని సుభాష్ బయటపెడతాడు.
ఒక్క రూపాయి కూడా...
వంద కోట్లలో నుంచి కావ్య, రాజ్ ఒక్క రూపాయి కూడా వాడుకోలేదని చెబుతాడు.మాకు రావాల్సిన వాటా ఇచ్చిన తర్వాతే ఆస్తులను జప్తు చేయమని రాజ్, కావ్యలతో ధాన్యలక్ష్మి అంటుంది. కోమాలో నుంచి బయటకు వచ్చిన సీతారామయ్య అప్పుడే ఇంట్లోకి వస్తాడు. గొడవను చూస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం