Brahmamudi December 9th Episode: రాజ్ రూమ్‌లోకి కావ్యకు నో ఎంట్రీ - ఇందిరాదేవి మిస్సింగ్ - ఎస్ఐ ట్రైనింగ్‌లో అప్పు
Brahmamudi:బ్రహ్మముడి డిసెంబర్ 9 ఎపిసోడ్‌లో ఆస్తి పంపకాల కోసం కుటుంబసభ్యులంతా తన కళ్ల ఎదుటే గొడవలు పడటం చూసి ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ రూమ్‌లోకి వెళ్లకుండా కావ్య కిచెన్‌లో పడుకుంటుంది.
ఆస్తి పంపకాల కోసం దుగ్గిరాల కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటారు. తన కళ్ల ఎదుటే గొడవలు పడటం చూసి ఇందిరాదేవి ఎమోషనల్ అవుతుంది. ఆపండి అని అరుస్తుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటుంది. ఇంటి పెద్దకు ఏదైనా ఆపద వస్తే ఎలా బతికించుకోవాలని ఆరాటపడతారు. కానీ మీరు మాత్రం సీతారామయ్యకు ఏమైనా అయితే ఆస్తులు ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారు? ఉమ్మడి కుటుంబంలో ఉండాల్సిన వాళ్లేనా మీరు అంటూ క్లాస్ ఇస్తుంది.
కష్టం వస్తే ఓదార్చడం మర్చిపోయి...
నా ఇద్దరు కోడళ్లను కూతుళ్లలానే చూశాను. కానీ ఈనాడు నాకు కష్టం వస్తే ఓదార్చడం మర్చిపోయి కడుపునిండా అన్నం తిననీయకుండా చేస్తున్నారు. మీరు అసలు మనషులేనా అంటూ దులిపేస్తుంది. ఆస్తుల గురించి మాట్లాడుతున్నా నీకంటే పిశాచులు నయం అని ధాన్యలక్ష్మిపై ఫైర్ అవుతుంది. భోజనం చేయకుండానేఇందిరాదేవి వెళ్లిపోతుంది.
ఇందిరాదేవికి భోజనం...
ఇందిరాదేవి కోసం అపర్ణ, కావ్య భోజనం తీసుకొని ఆమె రూమ్‌కు వస్తారు. కానీ ఆ రూమ్‌లో ఇందిరాదేవి కనిపించకపోవడంలో అపర్ణ కంగారుపడుతుంది. మనం అన్న మాటలు తట్టుకోలేక ఓదార్పు కోసం తాతయ్య దగ్గరకు అమ్మమ్మ వెళ్లి ఉంటుందని కావ్య అంటుంది.
కళ్యాణ్ ఓదార్పు...
హాస్పిటల్ బెడ్‌పై ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్న సీతారామయ్యను చూసి ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక్కసారి కళ్లు తెరిచి తనతో మాట్లాడమని అంటుంది. నానమ్మను కళ్యాణ్ ఓదార్చుతాడు. తొందరలోనే తాతయ్య కోలుకొని ఇంటికి వస్తాడని అంటాడు. అందరితో ఆనందంగా గడుపుతాడని చెబుతాడు.
ఆ ఆశలు చచ్చిపోయాయి...
ఆ ఆశలు చచ్చిపోయాయని కళ్యాణ్‌తో అంటుంది ఇందిరాదేవి. ఇంట్లో ఆనందపు ఆనవాళ్లుల లేకుండాపోయాయని, ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నారని చెబుతుంది. తన తర్వాతి తరం కూడా బంధాలకు విలువ ఇస్తూ అందరి కలిసి ఉంటారని సీతారామయ్య ఆశపడ్డాడు. కానీ కుళ్లు, కుతంత్రాలు, స్వార్థం అనే చీడ మన ఇంటి కొమ్మలు, రెమ్మలతో పాటు ఇప్పుడు వేళ్లకు కూడా పాకిందని, ఆ బాధ తట్టుకోలేక మీ తాతయ్య కుప్పకూలిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కావ్య ఎంట్రీ...
అప్పుడే అక్కడికి కావ్య ఎంట్రీ ఇస్తుంది. తాతయ్యను చూడాలని ఉందని చెబితే మీతో పాటు నేను వచ్చేదానిని. మీ పాటికి మీరు వస్తే ఎక్కడికి వెళ్లారని మేము అనుకోవాలని ఇందిరాదేవిని అడుగుతుంది కావ్య. మీరు కనిపించకపోయే సరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా అని కావ్య అంటుంది.
నేను కనిపించకపోతే ఆ ఇంట్లో బాధపడేవాళ్లు ఉన్నారని నేను అనుకోవడం లేదని ఇందిరాదేవి సమాధానమిస్తుంది. అంటే నేను లేనా అని కావ్య అంటుంది. నువ్వు ఉన్నావు కాబట్టే ఈ ముసలి ప్రాణం కాస్త అయినా ప్రశంతంగా ఉంటుంది.
నేను పస్తులు ఉంటా...
అన్నం తినమని ఇందిరాదేవితో అంటుంది కావ్య. ఆకలిగా లేదని ఇందిరాదేవి బదులిస్తుంది. రుద్రాణి అన్న మాటలకు ఆకలి చచ్చిపోయిందా...ఎందుకు అబద్ధాలు చెబుతారని అమ్మమ్మతో కావ్య అంటుంది. మీరు తినలేదని నేను కూడా రెండు రోజులుగా భోజనం చేయలేదని చెబుతుంది.
ఇంకో బెడ్ వేసుకుంటా...
మీరు తినకపోతే నేను కూడా భోజనం చేయకుండా ఇలాగే నీరసించిపోయి తాతయ్య బెడ్ పక్కనే ఇంకో బెడ్ వేసుకుంటాను. మా ఇద్దరి మధ్య కూర్చొని మీరు ఏడుస్తూ ఉండాల్సివస్తుందని ఇందిరాదేవితో అంటుంది కావ్య. ఆమె మాటలతో బెట్టు వీడి భోజయం చేయడానికి ఇందిరాదేవి అంగీకరిస్తుంది. అమ్మమ్మకు స్వయంగా కావ్యనే అన్నం తినిపిస్తుంది. కావ్య ప్రేమకు ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కారం ఎక్కువై నీళ్లు వస్తున్నాయా అని అమ్మమ్మను అడుగుతుంది కావ్య. అవి కారం వల్ల వస్తోన్న కన్నీళ్లు కాదు...మీ మమకారం వస్తోన్న నీళ్లు అని అంటుంది.
అప్పు ఎస్ఐ ట్రైనింగ్...
అప్పును హాస్పిటల్‌కు ఎందుకు తీసుకురాలేదని కళ్యాణ్‌ను అడుగుతుంది కావ్య. అప్పు ఎస్ఐ ఎగ్జామ్ పాస్ అయ్యిందని, ట్రైనింగ్‌కు వెళ్లిందని కళ్యాణ్ అనగానే కావ్య ఆనందపడుతుంది. తాతయ్య అనారోగ్యం గురించి అప్పుకు తెలియదని కళ్యాణ్ అంటాడు. తెలిస్తే ఇన్నాళ్లు పడిన కష్టం వృథాగా మారిపోతుందని చెప్పలేదని చెబుతాడు. అప్పుకు తెలిశాకా పెద్ద గొడవ చేస్తుందని కళ్యాణ్ అంటాడు.
ఆ భయం పోయింది...
ఇంట్లో వాళ్లను ఎలా మార్చాలో మాత్రం అర్థం కావడం, లేదని, ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉందని, ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలియక భయంగా గడపాల్సివస్తుందని కళ్యాణ్‌తో అంటుంది కావ్య. తాతయ్య మీకు పూర్తి అధికారులు ఇచ్చినప్పుడే నాలో ఉన్న ఆ భయం పోయిందని కళ్యాణ్ అంటాడు.
మీ రాకతో దుగ్గిరాల ఇంటికి మంచిరోజులు తప్పకుండా వస్తాయని కావ్యతో కళ్యాణ్ చెబుతాడు. ఆ ఇంటి బాధ్యతలు భారంగానే ఉంటాయి కానీ గౌరవంగా ఉండవని కావ్య బదులిస్తుంది. ఎంతటి భారన్నైన మోసే శక్తి ఉంది కాబట్టే ఆ బాధ్యతల్ని తాతయ్య మీకు అప్పగించాడని కావ్యతో అంటాడు కళ్యాణ్.
ఆస్తిలో వాటా...
ఆస్తిలో వాటా కళ్యాణ్ పేరు మీద రాయించడానికి పత్రాలు రెడీ చేస్తుంది ధాన్యలక్ష్మి. ఆ పేపర్స్ భార్య దగ్గర నుంచి తీసుకొని చింపేస్తాడు ప్రకాశం. ఇప్పుడు కొంపలేం మునిగిపోయావని ఇంత జాగ్రత్తపడుతున్నావని భార్యను అడుగుతాడు. మావయ్య రేపో...మాపో అన్నట్లుగా ఉన్నాడు. ఈ లోపే అత్తయ్యను అడిగి ఆస్తిలో వాటా తీసుకుంటే మంచిదని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావని ధాన్యలక్ష్మికి క్లాస్ ఇస్తాడు ప్రకాశం. నీకు ఉన్న బంగారం పిచ్చి కాస్త ఆస్తి మీదకు మారిందని, కాస్త మనిషిలా ఆలోచించమని అంటాడు.
కళ్యాణ్ భవిష్యత్తు కోసమే...
ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉందని కాబట్టే అడుగుతున్నానని ధాన్యలక్ష్మి అంటుంది. ఆస్తిలో వాటా రాయించడం అంటే ఇంటిని ముక్కలు చేయడమని అందుకు తాను ఒప్పుకోనని ప్రకాశం చెబుతాడు. రుద్రాణి మాటలతో నువ్వు రాను రాను రాక్షసిలా మారిపోతున్నావని భార్యపై ఫైర్ అవుతాడు ప్రకాశం. కళ్యాణ్ భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నానని ధాన్యలక్ష్మి తన మాటల్ని సమర్థించుకుంటుంది.
కిచెన్‌లో పడుకున్న కావ్య...
కావ్య కిచెన్‌లో చాప వేసుకొని పడుకుంటుంది. అది చూసి అపర్ణ ఫైర్ అవుతుంది. ఇక్కడ ఎందుకు పడుకున్నావని నిలదీస్తుంది. నిన్ను రాజ్ తన రూమ్‌లోకి రావద్దని అన్నాడా...తలుపు వేసుకున్నాడా...పనిమనిషిలా ఇక్కడ ఎందుకు పడుకున్నావని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.
రాజ్ పిలవకుండా ఆయన గదిలోకి ఎలా వెళ్లాలి...అందుకే ఆ రూమ్‌లోకి వెళ్లకుండా కిచెన్‌లో పడుకున్నానని అపర్ణ ప్రశ్నలకు కావ్య సమాధానమిస్తుంది. నువ్వు వంట గదిలో పనిమనిషిలా పడుకుంటే నా కడుపు తరుక్కుపోయింది. ఈ పాపం నాకు, నా కొడుకుకు తగులుతుందని కావ్యతో చెబుతుంది అపర్ణ.
ఎందులో తగ్గొద్దు...
నిన్ను ఇంటి కోడలిగా ఇందిరాదేవి, సీతారామయ్య నిన్ను తీసుకొచ్చారని, అంతేకానీ మా అందరికి వండి వార్చడానికి కాదని చెబుతుంది. ఇది నీ ఇళ్లు అని, ఇంటిపై కోడలిగా నీకు సర్వ హక్కులు ఉన్నాయని, నువ్వు ఎందులో తగ్గడానికి వీలులేదని కోడలితో అపర్ణ అంటుంది.
రాజ్‌ను పిలుస్తుంది. రాజ్ రాగానే తను ఎవరు, ఈ ఇంట్లో ఎందుకు ఉందని కొడుకును అడుగుతుంది అపర్ణ. కళావతి ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేకపోతే వెంటనే పంపించేద్దామని రాజ్ సమాధానమిస్తాడు. ఇంకోసారి ఆ మాట అంటు పళ్లు రాలగొడతా అని కొడుకుపై అపర్ణ ఫైర్ అవుతుంది. కావ్య కిచెన్‌లో పడుకుందని రాజ్‌తో అంటుంది అపర్ణ.
ఇంట్లో అంత మానవత్వం లేని మనుషులు ఉన్నారా...కిచెన్‌లో ఎందుకు పడుకున్నావని కావ్యపై కొప్పడుతాడు రాజ్. మరి కావ్య ఎక్కడ పడుకోవాలని రాజ్‌ను అపర్ణ అడుగుతుంది. రాజ్ సమాధానం చెప్పలేకపతడబడిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.