Brahmamudi December 31st Episode: కావ్య మాయలో పడ్డ రాజ్ -అనామిక రీఎంట్రీ - ధాన్యలక్ష్మి కొత్త పంచాయితీ
Brahmamudi December 31st Episode: బ్రహ్మముడి డిసెంబర్ 31 ఎపిసోడ్‌లో ఓ కాంట్రాక్ట్ వర్క్ పూర్తిచేయడానికి ఐదు కోట్లు డబ్బు అవసరం కావడంతో రాజ్ తెగ టెన్షన్ పడతాడు. కానీ కావ్య తెలివిగా అడ్వాన్స్ రూపంలో ఆ డబ్బు వచ్చేలా చేస్తుంది. ఆనందం పట్టలేక కావ్యను ఎత్తుకొని గిరగిర తిప్పేస్తాడు రాజ్.
కాఫీ కావాలని పనిమనిషికి ఆర్డర్ వేస్తుంది రుద్రాణి. ఇంట్లో ప్రతి ఒక్కరికి రోజుకు రెండుసార్లు మాత్రమే కాఫీ ఇవ్వాలని కావ్య కొత్త రూల్ పెట్టిందని పని మనిషి అంటుంది. అది కూడా ఉదయం ఒకసారి...సాయంత్రం ఒకసారి...మధ్యలో కావాలంటే కుదరదని రుద్రాణికి షాకిస్తుంది పనిమనిషి.
ఇది ఇళ్లా...జైలా ఏం అర్థం కావడం లేదని, అడుగుతీసి అడుగు వేయాలన్న కావ్య పర్మిషన్ తీసుకోవాల్సివస్తుందని, ప్రతి దానికి ఈ అడుక్కునే గోల ఏమిటో అని రుద్రాణి చిరాకుపడుతుంది.
పనివాళ్లకు లోకువ...
కావ్య వల్ల పనివాళ్లకు కూడా తాను లోకువ అయ్యానని రుద్రాణి వాపోతుంది. ఈ ఇంట్లో ఉండటం కంటే ఎవరో ఒకరిని మర్డర్ చేసి జైలుకు వెళ్లడం మంచిదని అనుకుంటుంది. తొందరలోనే మీరు జైలుకు వెళతారన్న అంటూ పనిమనిషి రుద్రాణిపై సైటైర్లు వేస్తుంది. ఎక్కువ మాట్లాడితే నిన్ను ఇంట్లో నుంచి నిన్ను పంపించేస్తానని పనిమనిషికి రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది.
హాట్ టాపిక్‌తో హీట్...
ఇంట్లో వాళ్లు వాడుతోన్న రెంట్ కార్లను వద్దని వెనక్కి పంపించేస్తుంది కావ్య. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిస్తే గొడవ చేస్తారని రాజ్ భయపడిపోతాడు. అవన్నీ తాను చూసుకుంటానని కావ్య అంటుంది. కార్లను కావ్య వద్దని చెప్పడం రుద్రాణి వింటుంది. కార్ల వ్యవహరం అడ్డుపెట్టుకొని ఇంట్లో గొడవ సృష్టించాలని రుద్రాణి అనుకుంటుంది. కావ్య చేతిలో నుంచి ఆస్తిని దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ హాట్ టాపిక్‌తో ఇంట్లో హీట్ పుట్టించేయాలని ఫిక్సవుతుంది.
రాజ్ టెన్షన్...
ఆఫీస్‌లో రాజ్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఏమైందని భర్తను కావ్య అడుగుతుంది. జగదీష్‌గారి కాంట్రాక్ట్ పూర్తిచేయడానికి ఐదు కోట్లు డబ్బు అవసరం అయ్యాయని రాజ్ అంటాడు. ఆ డబ్బు ఎలా సర్ధుబాటు చేయాలా తెలియడం లేదని అంటాడు. అప్పుడే జగదీష్ ప్రసాద్ అక్కడికి వస్తాడు.
అతడిని చూడగానే రాజ్ కంగారుమరింత పెరుగుతుంది. మీరు ఇచ్చిన గడువు పూర్తికాకముందే వచ్చారేమిటని అడుగుతాడు. వర్క్ గురించి అడగటానికి తాను రాలేదని, అడ్వాన్స్ ఇవ్వమని కావ్య ఫోన్ చేసిందని, ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చానని జగదీష్ ప్రసాద్ చెప్పగానే రాజ్ షాకైపోతాడు.
కళావతి సూపర్...
జగదీష్ ప్రసాద్ ఐదు కోట్ల చెక్ ఇచ్చి వెళ్లిపోగానే రాజ్ ఆనందం పట్టలేకపోతాడు. కళావతి నువ్వు సూపర్ అంటూ... కావ్యను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. భర్త ఆనందం చూసి కావ్య మురిసిపోతుంది. అప్పుడే శృతి క్యాబిన్ లోకి రావడంతో ఆమెను చూసి కంగారు పడిన రాజ్...కావ్యను కిందపడేస్తాడు. ఆనందం వస్తే ఎత్తుకొని తిప్పుతారు...ఎవరైన వస్తే పడేస్తారు...ఏంటండి ఇది అంటూ భర్తపై ఫైర్ అవుతుంది కావ్య.
శృతికి రాజ్ క్లాస్...
కావ్య కిందపడటానికి శృతినే కారణమని ఆమెకు క్లాస్ ఇస్తాడు రాజ్. అత్తగారి ఇంటికి వచ్చినట్లు డైరెక్ట్‌గా క్యాబిన్‌లోకి వస్తావా అంటూ కోప్పడుతాడు. మీరు డోర్ ఓపెన్ చేసి మరి మేడమ్‌ను ఎత్తుకొని తిప్పుతారని తెలియదని శృతి వెటకారం ఆడుతుంది. ఆమె తిక్క సమాధానాలు చూసి ఇంక్రిమెంట్ కట్ అని రాజ్ అంటాడు.
కావ్య మాయలో రాజ్...
ఎత్తుకున్న మీరు బాగున్నారు...కిందపడ్డ మేడమ్ ఆనందంగా ఉన్నారు...మధ్యలో చూసి నా ఇంక్రిమెంట్ కట్ చేయడం కాదని శృతి వాపోతుంది ఆమె మాటలతో రాజ్ క్యాబిన్ నుంచి వెళ్లిపోతాడు.
ఏంటి మేడమ్...మొన్న ఆఫీస్‌కు రానిచ్చారు...నిన్న పొగిడారు...ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని తిప్పుతున్నారు. రాజ్ మొత్తం మీ మాయలో పడిపోయారు అంటూ కావ్యను టీజ్ చేస్తుంది శృతి. ఆమె మాటలతో కావ్య సిగ్గుపడిపోతుంది.
రుద్రాణి సెంటిమెంట్ డైలాగ్స్...
కార్ల వ్యవహరాన్ని అడ్డుపెట్టుకొని కావ్య ఇరికించే ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెడుతుంది రుద్రాణి. నగలు మెరుగు పెట్టడానికి వెళుతున్నానని, తనకు తోడుగా నువ్వు రావాలని ధాన్యలక్ష్మిని అడుగుతుంది. ధాన్యలక్ష్మి రానని అంటుంది.
నీకు, నీ కొడుకుకు ఆస్తి రావాలని నేను నిలబడ్డానని, నన్ను అందరూ నారద అని, లేడీ శకుని అని తిడుతున్నా నీ కోసం పడుతున్నానని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతుంది రుద్రాణి. నీ కోసం ఇంత చేస్తే నా కోసం ఒక్కసారి బయటకు కూడా రాలేవా అని రుద్రాణి అనడంతో ధాన్యలక్ష్మి కరిగిపోతుంది. రుద్రాణి వెంట బయలుదేరుతుంది.
తిడితే పడటానికి మీ భర్తను కాదు...
ఇంటి బయటకు వచ్చి చూస్తే ఒక్క కారు కనిపించదు. ఇందాక డ్రైవర్లు వచ్చి నాలుగు కార్లు తీసుకెళ్లిపోయారని ధాన్యలక్ష్మితో చెబుతాడు రాహుల్. దాంతో కోపంగా డ్రైవర్‌కు ఫోన్ చేసి ఎక్కడ చచ్చార్రా అని ధాన్యలక్ష్మి అంటుంది. కొంచెం మర్యాదగా మాట్లాడండి...తిడితే పడటానికి మీ భర్తను కాదని ధాన్యలక్ష్మిపై రివర్స్ అవుతాడు డ్రైవర్. రుద్రాణి కోపం పట్టలేక డ్రైవర్‌వి డ్రైవర్‌లా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. నీ కొడుకులా పని పాట లేకుండా ఇంట్లో ఉండటం లేదని రుద్రాణిపై పంచ్‌లు వేస్తాడు డ్రైవర్.
మీ పర్మిషన్ అవసరంలేదు...
మా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్లారని ధాన్యలక్ష్మి అనగానే..మీ పర్మిషన్ ఎవడికి కావాలని, కావ్యనే కార్లను పంపించేసిందని, ఆమెను వెళ్లిని అడుక్కొండి అంటూ డ్రైవర్ కాల్ కట్ చేస్తాడు. ఆ మాట వినగానే ధాన్యలక్ష్మి ఆవేశంగా ఇంట్లోకి వెళుతుంది. అపర్ణను పిలుస్తుంది.
నా కోడలు అంత గొప్పది...ఇంత గొప్పది అని చెబుతుంటావుగా. రోజురోజుకు మనల్ని దిగజార్చి మట్టితో బొమ్మలు చేసి అమ్ముకునేదాకా ఊరుకోదా నీ కోడలు అని గొడవకు దిగుతుంది. కావ్య చేసే పనులు చూస్తే దుగ్గిరాలఇంటి దీన పరిస్థితులు వివరించడం కష్టంగా ఉందని రుద్రాణి గొడవను పెద్దది చేస్తుంది.
ఆస్తి మొత్తం అనుభవించాలని...
ఆస్తి మొత్తం ఒక్కతే అనుభవించాలని, మనమంతా దేహి అని అడుక్కుంటూ తన కాళ్ల దగ్గర పడి ఉండాలని ఈ పనులన్నీ చేస్తుందని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇన్ని రోజులు తిండి దగ్గర ఆంక్షలు పెట్టింది.
క్రెడిట్ కార్డులు బ్లాక్ చేసింది. ఇప్పుడు కార్లు తీసేసింది. మేము బయటకు వెళ్లాలంటే ఆటోలో వెళ్లాలా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఈ విషయం ఏదో ఇప్పుడే తేలాలని చెబుతుంది.
కార్ల గురించి అడగటానికి అపర్ణకు ఫోన్ చేస్తుంది కావ్య. తాను బిజీగా ఉన్నానని కావ్య అంటుంది. పనిలేని వాళ్లు మొదలుపెట్టిన పనికిరాని పంచాయితీ ఇదని, తర్వాత మాట్లాడుకుందామని ధాన్యలక్ష్మి, రుద్రాణిపై అపర్ణ సెటైర్లు వేసి ఫోన్ కట్ చేస్తుంది.
రుద్రాణి వెంటకారం...
బిజీగా ఉన్నానని అపర్ణతో కావ్య చెప్పడాన్ని కూడా ధాన్యలక్ష్మి, రుద్రాణి తప్పుపడతారు. అత్తకు సమాధానం చెప్పలేనంత బిజీ ఏమిటో అంటూ వెటకారం ఆడుతారు. కావ్య తప్పుడు నిర్ణయం కాబట్టే సమాధానం చెప్పలేక తప్పించుకుందని రుద్రాణి అంటుంది.
చిట్‌ఫండ్ గ్రూప్ ఓనర్‌తో వంద కోట్లకు ఎగనామం పెట్టించి రాజ్, కావ్యలను ఇబ్బంది పెట్టాలని అనామిక అనుకుంటుంది. చిట్‌ఫండ్ కంపెనీ ఓనర్ ఆచూకీ స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ ద్వారా రాజ్‌కు తెలిసిపోతుంది. అతడిని పట్టుకోవడానికి కావ్యతో కలిసి బయటుదేరుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
టాపిక్