రాజ్‌ను కలవడానికి బయలుదేరుతుంది కావ్య. ఆఫీస్‌కు వెళుతున్నానని అపర్ణతో అబద్ధం చెబుతుంది. మరోవైపు కావ్యను కలవడానికి రాజ్ కూడా యామిని తల్లిదండ్రులతో అబద్ధం ఆడుతాడు. కావ్యను సీక్రెట్‌గా రుద్రాణి, రాహుల్ ఫాలో అవుతారు.
కావ్య ఆఫీస్‌కు కాకుండా ఓ కాఫీడేకు వెళ్లడం కనిపెడతారు. కావ్య అబద్దాన్ని రెడ్ హ్యాడెండ్‌గా బయటపెట్టాలని రుద్రాణి ఫిక్సవుతుంది. రాజ్ కలవడానికే కావ్య వెళితే మన పరిస్థితి ఏమిటని తల్లితో రాహుల్ అంటాడు. రాజ్ బతికే అవకాశం లేదని కొడుకుకు బదులిస్తుంది రుద్రాణి.
నిద్రలేవగానే రాజ్ రూమ్‌లోకి వెళుతుంది యామిని. రాజ్ రూమ్‌లో కనిపించకపోవడంతో టెన్షన్ పడుతుంది. రాజ్ బయటకు వెళ్లాడని తల్లి చెప్పగానే ఆమెపై కోపంతో ఎగిరిపడుతుంది. ఇదే ఊళ్లో అతడి ఫ్యామిలీ ఉందని, ఎవరైనా కనిపించి రాజ్‌ను గుర్తుపడితే పరిస్థితి ఏమిటని కోపంగా అంటుంది. మీ బావకు నువ్వు సృష్టించిన అమ్మనాన్నలు గుర్తొచ్చారాట.
వారి సమాధులను చూడాలని ఉందంటే... ఆ సెంటిమెంట్‌కు కరిగిపోయి తానే రాజ్ బయటకు వెళ్లడానికి ఒప్పుకున్నానని వైదేహి అంటుంది. కానీ రాజ్‌ను ఎవరైనా చూస్తారన్నది మేము ఆలోచించలేకపోయాని వైదేహి చెబుతుంది. మీ సొంత బుర్రలు వాడకండి...ఏదైనా నాకు చెప్పి చేయమని ముందు నుంచి చెప్పానుగా అంటూ తల్లిదండ్రులపై కోప్పడుతుంది యామిని.
రాజ్‌కు కాల్ చేస్తుంది యామిని. కళావతిని కలవడానికి వెళుతున్నానంటే యామిని వద్దంటుందని రాజ్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడు. మరోవైపు కావ్య ఓ కాఫీడేలోకి వెళ్లడం రుద్రాణి, రాహుల్ చూస్తారు. ఆమెను సీక్రెట్‌గా ఫాలో అవుతారు. కావ్య వెళ్లి ఓ టేబుల్‌పై కూర్చొని రాజ్ కోసం ఎదురుచూస్తుంటుంది. కావ్య కాఫీడేలో కూర్చొని...ఏమండి మీ కోసం ఎంత సేపు ఎదురుచూడాలి.
ఏమైపోయారని తనలో తానే మాట్లాడుతుంది కావ్య. ఎదురుగా ఎవరూ లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకొని మాట్లాడటం చూసి రాహుల్ షాకవుతాడు. కావ్య తనలో తానే మాట్లాడుకోవడం వీడియో తీస్తాడు రాహుల్. ఈ వీడియోను ఇంట్లోవాళ్లకు చూపించి కావ్యకు నిజంగానే పిచ్చి పట్టిందని అందరికి చెప్పాలని అనుకుంటారు. కానీ కావ్య ఇయర్ బడ్స్ పెట్టుకొని రాజ్‌తో మాట్లాడటం వారు గమనించరు.
కావ్య తమను చూసేలోగా అక్కడి నుంచి పారిపోవాలని రుద్రాణి, రాహుల్ గబగబ అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. అనుకోకుండా వారికి ఎదురుగా రాజ్ వస్తాడు. రాజ్ వారి కంట పడకుండా అతడిని పక్కకు లాగేస్తుంది కావ్య.
ఎందుకు ఆలస్యమైందని రాజ్‌ను అడుగుతుంది కావ్య. అంకుల్ వాళ్లను మ్యానేజ్ చేయాలిగా అని రాజ్ తడబడుతూ సమాధానమిస్తాడు. కావ్య టెన్షన్‌గా కనిపించడంతో ఏమైందని రాజ్ అడుగుతాడు. అదేం లేదని కావ్య అంటుంది. రాజ్‌ను వెతుక్కుంటూ స్మశానానికి వస్తుంది యామిని. అక్కడ రాజ్ కనిపించకపోవడంతో అతడు అబద్ధం చెప్పాడని ఫిక్సవుతుంది. రాజ్ ఎక్కడికి వెళ్లి ఉంటాడన్నది ఎంత ఆలోచించిన ఆమెకు అంతుపట్టదు. రాజ్‌కు కాల్ చేస్తుంది.
అడగ్గానే వచ్చినందుకు థాంక్స్ అని కావ్యతో అంటాడు రాజ్. ఆమెతో మాట్లాడటానికి ఇబ్బందిపడుతుంటాడు. చివరకు ధైర్యం చేసి ఈ శారీలో బాగున్నారని కావ్యకు కాంప్లిమెంట్ ఇస్తాడు. చాలా సంప్రదాయంగా ఉన్నారని అంటాడు. ఇది చెప్పడానికే పిలిచారా అని కావ్య అంటుంది.
మీరు నాకు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారని కావ్యతో అంటాడు రాజ్. కళ్లు తిరిగి పడిపోయిన రోజు మిమ్మల్ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తున్నప్పుడు నాకు బాగా దగ్గరైన వ్యక్తి దూరమవుతున్నట్లుగా అనిపించిందని, నేను ఏ పని చేసిన మీరే గుర్తొస్తున్నారని, నాకు తెలియకుండానే మీ గురించే ఆలోచిస్తున్నానని రాజ్ అంటాడు.
మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిశామా...ఇద్దరికి ఇంతకుముందే పరిచయం ఉందా అని కావ్యను అడుగుతాడు రాజ్. మనది భార్యభర్తల బంధమని తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారని కావ్య ఎమోషనల్ అవుతుంది.
కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనం ఇదివరకు కలిసినట్లు మీకు అలాగే అనిపిస్తుందా కావ్యను అడుగుతాడు రాజ్. కావ్య సమాధానం చెప్పేలోపు యామిని కాల్ చేస్తుంది. ఆమెతో మాట్లాడటానికి రాజ్ పక్కకు వెళతాడు. ఇక్కడే ఉంటే తాను భార్యననే నిజం రాజ్‌కు ఎక్కడ చెబుతానోనని భయపడిన కావ్య అతడికి చెప్పకుండా కాఫీ షాప్ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది.
యామిని కాల్ లిఫ్ట్ చేసిన రాజ్ తాను తల్లిదండ్రుల సమాధుల దగ్గర ఉన్నానని బదులిస్తాడు. తాను అక్కడే ఉన్నానని యామిని అనడంతో కాఫీ షాప్‌కు ఉన్న నిజం బయటపెట్టేస్తాడు రాజ్. తాను కాఫీ షాప్‌కు వస్తున్నానని చెప్పి యామిని కాల్ కట్ చేస్తుంది. కావ్య వెళ్లిపోతుండటం చూసి రాజ్ ఆమెను ఆపేందుకు ప్రయత్నిస్తాడు. తనకు అర్జెంట్ పని ఉందని రాజ్‌కు అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య.
మరోవైపు కావ్య కాఫీ షాప్‌లో తనలో తానే మాట్లాడుకున్న వీడియోను కుటుంబసభ్యులందరికి చూపిస్తుంది రుద్రాణి. కావ్య మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆమెకు పిచ్చి పట్టిందని కుటుంబసభ్యులందరితో చెబుతుంది. రుద్రాణి మాటలు నిజమని దుగ్గిరాల ఫ్యామిలీ నమ్ముతారు. రుద్రాణి తీసిన తన వీడియో చూసి కావ్య షాకవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం