రాజ్‌తో ఛాటింగ్ చేస్తుంది కావ్య. ఒకసారి కలవాలని ఉందని రాజ్‌కు మెసేజ్ పెట్టబోతుంది కావ్య. మరోవైపు రాజ్ కూడా అదే ఆలోచిస్తుంటాడు. కలవమని అడిగితే తనను కావ్య తప్పుగా అర్థం చేసుకుంటుందని అనుకుంటాడు. పరిచయం లేని అమ్మాయిని కలవమని ఎలా అడగాలా అని డైలమాలో పడతాడు. నేను నీ పెళ్లాన్ని అని, ఒక్కసారి కలవమని అడగటమే ఆలస్యం ఎగురుకుంటూ వచ్చి నీ కళ్లముందు వాలిపోతా అని కావ్య అనుకుంటుంది.
చివరకు ధైర్యం చేసి రేపు ఒకసారి కలుద్దామా అని కావ్యకు మెసేజ్ పెడతాడు రాజ్. ఆ మెసేజ్ చూడగానే కావ్య ఆనందం పట్టలేకపోతుంది. రాజ్‌ను ఆటపట్టించడానికి ఎందుకు అని రిప్లై ఇస్తుంది. ఆ కారణం ఏదో రేపు కలిసినప్పుడు చెబుతానని రాజ్ బదులిస్తాడు. గతం మర్చిపోయినా రాజ్ మొండితనం మాత్రం తగ్గలేదని కావ్య లోలోన రుసరుసలాడుతుంది. కాఫీ షాప్‌లో కలుద్దామని కావ్యకు చెబుతాడు రాజ్. కావ్య ఓకే అంటుంది.
కావ్యనే రాజ్ భార్య అని నిజం చెప్పబోయిన తండ్రిపై నిప్పులు చెరుగుతుంది యామిని. నా లైఫ్‌ను ఏం చేయాలని అనుకుంటున్నావు. నాకు ద్రోహం చేయాలని అనుకుంటావా అని ఫైర్ అవుతుంది.
రాజ్ బాధపడుతుంటే చూడలేకపోయానని, తప్పు చేస్తోన్న ఫీలింగ్ కలిగిందని యామినికి తండ్రి బదులిస్తాడు. రాజ్ కాదు రామ్ అని యామిని కోపంగా అరుస్తుంది. గతం గుర్తుకులేకపోయినా కావ్యను చూడగానే రాజ్ తెలిసిన మనిషిలా ఫీలయ్యాడంటే భార్యను అతడు ఎంతగానో ప్రేమించాడని అర్థమవుతుందని యామిని తండ్రి అంటాడు.
రామ్ కళ్లల్లో ప్రేమను చూశావు..మరి నా అణువుఅణువులో రామ్ మీద పెంచుకున్న ప్రేమ నీకు ఎందుకు కనిపించలేదు. రామ్ కోసం నేను చావడానికి కూడా సిద్దపడ్డాను. చచ్చి రామ్‌కు దూరం కావడం కంటే బతికి రామ్‌ను సొంతం చేసుకోవాలనే డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడ్డానని, అవన్నీ నీకు తెలియదా అని తండ్రితో కోపంగా అంటుంది యామిని. నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా...రామ్‌ను నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నించినా వాళ్లను నేను క్షమించనని కత్తి తీస్తుంది యామిని.
తండ్రిని యామిని ఎక్కడ చంపేస్తుందోనని వైదేహి భయపడుతుంది. తండ్రిని చంపే శాడిస్ట్‌ను తాను కాదని, రామ్ దూరమైతే నన్ను నేను చంపుకోవడానికి వెనుకాడనని కత్తితో తనను తాను పొడుచుకోబోతుంది యామిని. ఆమెను తల్లిదండ్రులు ఆపుతారు.
నా కూతురు కంటే నాకు ఏది ముఖ్యం కాదని, రామ్‌తో నీ పెళ్లి జరిగేలా నేను చేస్తానని యామినికి మాటిస్తాడు ఆమె తండ్రి. తండ్రి మాటలతో యామిని సంతోషంతో పొంగిపోతుంది. చేస్తున్నది తప్పే అని తెలిసిన కూతురు కోసం తప్పడం లేదని యామిని తండ్రి బాధపడతాడు. మన కూతురు సంతోషంగా ఉండటమే మనకు ముఖ్యమని వైదేహి చెబుతుంది.
రాజ్ కలిసి ఏం మాట్లాడాలి అనికావ్య ఆలోచిస్తుంటుంది. మరోవైపు రాజ్ కూడా కావ్య గురించే ఆలోచిస్తుంటాడు. నువ్వు నాకు ఎందుకు పదే పదే గుర్తుస్తున్నావో తెలుసుకొని తీరుతానని రాజ్ అనుకుంటాడు. రాజ్ గురించి ఆలోచిస్తూ కావ్యకు నిద్ర రాదు. మరోవైపు రాజ్ కూడా అదే పరిస్థితిలో ఉంటాడు.
రాజ్‌ను కలవడానికి అందంగా ముస్తాబవుతుంది కావ్య. నీ కోడలు రోజురోజుకు చాలా డెవలప్ అవుతుందని హీరోయిన్ రేంజ్‌లో రెడీ అయ్యిందని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. రాజ్‌ను కలవాలనే ఆనందంలో ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించలేదని కావ్య అనుకుంటుంది. ఎక్కడికి వెళుతున్నావని కావ్యను అడుగుతుంది ఇందిరాదేవి.
ఆఫీస్‌కు వెళుతున్నానని కావ్య అబద్ధం ఆడుతుంది. ఇంట్లో నిన్ను అడిగేవాళ్లు ఎవరున్నారు. అంతా నీ ఇష్టారాజ్యమే కదా, నిన్ను అడిగేవాళ్లుఇక్కడ ఎవరూ లేరని రుద్రాణి అంటుంది. నిన్ను అడగాల్సిన అత్తామామలే నోరు మెదపడం లేదని, నాకు ఎందుకు అని రుద్రాణి మాటల దాడి మొదలుపెడుతుంది.
నేను ఏం చేసినా ఓ కారణం ఉంటుంది అని రుద్రాణికి బదులిస్తుంది కావ్య. బిగ్‌బాస్‌కు వెళ్లిన కంటెస్టెంట్‌గా నువ్వు ఏం చెబితే అది వింటూ ఉండాలి. చివరలో నువ్వు ఇచ్చే షాక్‌కు థ్రిల్ అయిపోవాలి. ఆస్తి నీ పేరు మీద రాసినప్పుడు మాకు తెలియదు. తాకట్టు పెట్టినప్పుడు తెలియదు. కానీ చివరలో వచ్చి లోకకళ్యాణం కోసం అంటూ బిల్డప్‌లు ఇస్తారు. మేము వావ్ అంటూ ప్రేక్షక పాత్ర వహించాలి అంతేగా అని రుద్రాణి అంటుంది.
ఇంట్లో ఎవరికి సమాధానం చెప్పిన చెప్పకపోయినా మీకు చెప్పాలని అపర్ణతో అంటుంది కావ్య. రాజ్ తిరిగి వచ్చే వరకు అతడి బాధ్యతలు తనవేనని, ఈ రోజు నుంచి ఆఫీస్ పనులు తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు చెబుతుంది. మీరు వద్దంటే ఆగిపోతానని అంటుంది. నువ్వు చేదు జ్ఞాపకాల నుంచి బయటపడాలనే మేము కోరుకున్నామని, సంతోషంగా ఆఫీస్‌కు వెళ్లమని కావ్యతో అంటుంది ఇందిరాదేవి.
నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందా అంటే కావ్యను అర్థం చేసుకోలేకపోవడమే రుద్రాణి అంటుంది. గుంటనక్కల గోతులు తవ్వాలని చూసే మీకు కష్టం వస్తే కాపాడాలని చూసే కావ్యకు చాలా తేడా ఉందని అత్తపై స్వప్న పంచ్‌లు వేస్తుంది.
కావ్య అందంగా రెడీ అయ్యి వెళ్లడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని రుద్రాణి అనుమానపడుతుంది. రాజ్‌ను కలవడానికి వెళుతుందని అనుకుంటారు. కావ్య నాటకానికి తెర దించడానికి ఆమెను ఫాలో అవుతారు.
కావ్యను కలవడానికి వెళితే యామిని తప్పకుండా వద్దని అంటుంది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలా అని రాజ్ ఆలోచిస్తాడు. హాల్‌లో ఎవరు కనిపించకపోవడంతో సైలెంట్‌గా జంప్ కావాలని అనుకుంటాడు.
కానీ అతడి ప్లాన్ రివర్స్ అవుతుంది. ఎక్కడికి వెళుతున్నావని యామిని తండ్రిదండ్రులు అడుగుతారు. మా అమ్మనాన్నలు గుర్తొచ్చారని, వారి సమాధుల దగ్గరకు వెళతానని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి తప్పించుకుంటాడు రాజ్.
రాజ్ ఏం మాట్లాడుతారో, ఏం అడుగుతారో అని కావ్య కంగారు పడుతుంది. మరోవైపు తనకు గతం గుర్తులేదు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియడం లేదని రాజ్ కూడా అనుకుంటాడు. కావ్య ఆఫీస్‌కు కాకుండా మరో చోటికి వెళ్లడం రుద్రాణి, రాహుల్ కంటపపడుతుంది.
కావ్య అబద్ధం చెప్పింది కాబట్టి రెడ్‌హ్యాండెడ్‌గా ఆమె బండారం బయటపెట్టాలని అనుకుంటారు. కావ్య రెస్టారెంట్‌లో ఉండగా వీడియో తీస్తారు. ఆ వీడియోను అందరికి చూపించాలనే సంబరంలో రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుంటారు. వారికి రాజ్ ఎదురవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం