Brahmamudi April 17th Episode: గెలిచిన కావ్య ప్రేమ - చనిపోయిన వెన్నెల - రుద్రాణితో డ్యాన్స్ చేయించిన స్వప్న
Brahmamudi April 17th Episode: స్వప్న దగ్గర నుంచి ఆస్తి పేపర్స్ కొట్టేయాలని రాహుల్, రుద్రాణి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఆస్తి పేపర్స్‌పై స్వప్న చేత సంతకాలు చేయిస్తాడు రాహుల్. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?

రాజ్‌కు బిడ్డకు తల్లి వెన్నెలనా? కాదా? అన్నది తెలుసుకోవడానికి కావ్య వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. రాజ్ టెన్త్ క్లాస్‌మేట్స్ రీయూనియన్ పార్టీకి శ్వేత సహాయంతో వెన్నెలను రప్పిస్తుంది కావ్య. వెన్నెల పార్టీకి వస్తోన్న విషయం రాజ్‌కు చెబుతుంది శ్వేత.
ఆమె చెప్పిన మాట వినగానే రాజ్ షాకవుతాడు. వెన్నెల పార్టీకి వస్తోన్న విషయం తెలిసి కూడా ఏం తెలియనట్లుగా రాజ్ ముందు నాటకం ఆడుతుంది కావ్య. మా వారి బిడ్డకు తల్లి వెన్నెలనే అని శ్వేతకు చెప్పబోతుంది కావ్య. కానీ రాజ్ చెప్పకుండా అడ్డుకుంటాడు. వెన్నెల వస్తోన్న విషయం తనకు ఎందుకు చెప్పలేదని శ్వేతపై ఫైర్ అవుతాడు.
రాజ్ టెన్షన్...
వెన్నెల పార్టీకి వస్తే తాను ఆడుతోన్న నాటకం బయటపడుతుందని కంగారు పడతాడు. వెన్నెలను పార్టీకి రాకుండా ఎలా అడ్డుకోవాలా అని ఆలోచిస్తుంటాడు. మీరు చేసిన మోసం మరి కొద్ది సేపట్లో బయటపడబోతుందని రాజ్‌తో అంటుంది కావ్య. ఏం మోసం అని శ్వేత కూడా ఏం తెలియనట్లుగా రాజ్‌ను అడుగుతుంది. ఇద్దరు కలిసి కొద్దిసేపు రాజ్‌ను టార్చర్ పెడతారు. అప్పుడే అక్కడికి వెన్నెల ఎంట్రీ ఇస్తుంది.
స్వప్న డ్యాన్సులు...
స్వప్నకు మత్తు మందు కలిపిన జ్యూస్ తాగిస్తారు రుద్రాణి, రాహుల్. స్వప్న మత్తులోకి జారుకున్న తర్వాత ఆమె దగ్గరున్న ఆస్తి పత్రాలు కొట్టేయాలని ఫిక్సవుతారు. ఎవరికి కనిపించకుండా సైలెంట్‌గా స్వప్న రూమ్‌కు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. నిద్రపోతుంది అనుకున్న స్వప్న...బెడ్‌పై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అది చూసి రుద్రాణి షాకవుతుంది.
దొరికిపోయిన రుద్రాణి..
రాహుల్ మాత్రం నిరాశపరడకుండా తమ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్సవుతాడు. స్వప్నతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు నటించి ఆమె దృష్టిమరలుస్తాడు. ఈ లోపు స్వప్న దాచిపెట్టిన ఆస్తి పత్రాలు కొట్టేయాలని రుద్రాణి అనుకుంటుంది. కానీ తన ప్లాన్ ఫెయిలై స్వప్నకు దొరికిపోతుంది రుద్రాణి. మత్తులో ఉన్న స్వప్న రుద్రాణి కూడా డ్యాన్స్ చేయడానికే తన రూమ్‌కు వచ్చింది అనుకుంటుంది. ఆమెతో కూడా డ్యాన్స్ చేయిస్తుంది. ఇద్దరితో స్టెప్పులు వేయించి చుక్కలు చూపిస్తుంది స్వప్న.
రాహుల్ పొగడ్తలు...
చివరకు రాహుల్ తెలివిగా స్వప్న దగ్గర నుంచి ఆస్తి పేపర్స్ మొత్తం కొట్టేస్తాడు. నీ అందం ముందు పెద్ద మోడల్స్ కూడా పనికి రారు అంటూ మత్తులో ఉన్న స్వప్నను తెగ పొగుడుతాడు రాహుల్. అతడి పొగడ్తలకు పడిపోతుంది స్వప్న. ఆటోగ్రాఫ్ పేరుతో ఆస్తి పేపర్స్‌పై ఆమె చేత సంతకం చేయిస్తారు రాహుల్ రుద్రాణి. మత్తులో ఉండటంతో వారు చెప్పినట్లే చేస్తుంది స్వప్న. ఆస్తి పేపర్స్ తో కోటి రూపాయలు అప్పు తీసుకొచ్చి స్వప్నను ఇంటి నుంచి పంపించేలా ప్లాన్ వేస్తారు రాహుల్, రుద్రాణి.
కళ్యాణ్‌ను ఇరికించడానికి....
స్వప్న తో పాటు కళ్యాణ్‌ను కూడా ఇరికించే ప్లాన్‌ను కూడా ఇంప్లిమెంట్ చేయమని కొడుకుతో అంటుంది రుద్రాణి. పార్టీ నుంచి రాజ్ తిరిగివచ్చేలోపు కళ్యాణ్ చేత చేయించాల్సిన తప్పులు అన్ని చేయిస్తానని రాహుల్ అంటాడు.
వెన్నెల ఎంట్రీ...
వెన్నెల పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో రాజ్ షాకవుతాడు. పార్టీలో రాజ్ కనిపించడంతో వెన్నెల కూడా ఆశ్చర్యపోతుంది. రాజ్ బిడ్డకు తల్లి ఆమెనేనా కాదా అన్నది తెలుసుకోవడానికి కావ్య ఉత్కంఠగా ఎదురుచూస్తుంటుంది. పార్టీలోకి వచ్చి రావడంతోనే రాజ్ బిడ్డను ఎత్తుకొని ఆడిస్తుంది వెన్నెల. ఆ తర్వాత కావ్యను వెన్నెలకు పరిచయం చేస్తుంది శ్వేత.
అసలు వెన్నెల నేను కాదు...
అందరూ వెన్నెలను ప్రేమగా పలకరిస్తారు. ఇన్నాళ్లు ఏమైపోయావని ప్రశ్నల వర్షం కురిపిస్లారు. అప్పుడే వెన్నెల అసలు నిజం బయటపెడుతుంది. అందరూ అనుకుంటున్నట్లు తాను వెన్నెల కాదని అంటుంది. తాను వెన్నెల కవల పిల్లలమని, వెన్నెల అనారోగ్యంతో చాలా రోజుల క్రితమే చనిపోయిందని అందరికి చెబుతుంది. వెన్నెల అసలు ఫొటో చూపిస్తుంది. వెన్నెల చనిపోయిన విషయం రాజ్‌కు తెలుసునని వెన్నెల సిస్టర్ ప్రకటిస్తుంది.
కావ్య కన్నీళ్లు...
వెన్నెల చనిపోయిందని తెలిసి కావ్య షాకవుతుంది. ఆ తర్వాత ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనే వెన్నెల అని నా గుండె ఒక్కసారిగా ఆగిపోయిందని, రాజ్ జీవితంలో నుంచి నేను వెళ్లిపోక తప్పదని అనిపించింది, కానీ మా ప్రేమే మమ్మల్ని గెలిపించిందిదని కన్నీళ్లతో శ్వేతతో అంటుంది కావ్య.
పదేళ్ల క్రితమే చనిపోయిన వెన్నెలకు బిడ్డ ఉండటం అసాధ్యమని, ఏదో ఒక నిజాన్ని దాచడానికే రాజ్ చిన్నారిని తన కొడుకు అంటూ నాటకం ఆడుతున్నాడని శ్వేతతో అంటుంది కావ్య. ఏడడుగులు వేసిన నేను ఉండగా...మరో అమ్మాయికి తన మనసులో స్థానం ఎలా ఇచ్చాడా అని ఇన్ని రోజులు ఆలోచించాను.
ఈ రోజు ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆనందపడుతుంది. కావ్యను చూసి శ్వేత కూడా సంబరపడుతుంది. వెన్నెల విషయంలో తనకున్న అనుమానాలను పార్టీ ద్వారా తొలగిపోయేలా చేసినందుకు శ్వేతకు థాంక్స్ చెబుతుంది కావ్య.
రాజ్ ఆలోచనలు...
బాబుకు జ్వరం రావడంతో కావ్య, రాజ్ కలిసి హాస్పిటల్‌కు తీసుకెళతారు. బాబు కోలుకోవాలంటే ఆ చిన్నారి తల్లి రావాలని డాక్టర్స్ చెబుతారు. డాక్టర్ మాటలతో రాజ్ ఆలోచనలో పడతాడు.