వెజిటేబుల్స్ తీసుకురావడానికి మార్కెట్ వెళ్లబోతున్నట్లు రాజ్‌కు చెబుతుంది కావ్య. తాను కూరగాయలు కొనడానికే మార్కెట్ వస్తున్నట్లు రాజ్ అబద్ధం ఆడుతాడు. నాకు కూరగాయలు కొనడం తెలియదని, సాయం చేయాలని కావ్యను అడుగుతాడు రాజ్. మీరుంటేనే నేను ఈ రోజు దిగ్విజయంగా వెజిటేబుల్స్ కొనగలను అని చెబుతాడు.
కూరగాయలు కొన్న తర్వాత మీరు ఏది అడిగిన చేస్తానని కావ్యకు మాటిస్తాడు రాజ్. నాకు అదే కావాలని మనసులో కావ్య అనుకుంటుంది. కావ్యతో మాట్లాడే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేస్తాడు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటో ఈ సారి పూర్తిగా తెలుసుకొని తీరుతానని రాజ్ అంటాడు.
కూరగాయల బండి దగ్గరకు వచ్చిన కావ్య...రాజ్ కోసం ఎదురుచూస్తుంది. ఏం కావాలని కావ్యను అడుగుతుంది కూరగాయల బండి ఓనర్. మా ఆయన కావాలని కావ్య సెటైరికల్‌గా సమాధానమిస్తుంది.
మా ఆయన మా ఇంట్లో నెల నుంచి ఉండటం లేదని, మరొకరితో ఉంటున్నారని, ఆయన్ని ఒప్పించి తిరిగి మా ఇంటికి తీసుకెళ్లడానికే ఇక్కడికి వచ్చానని అంటుంది. మొగుడు వేరేదానితో ఉంటే ఒప్పించడం ఏంటి...నాలుగు తగిలించి తీసుకెళ్లక అని కూరగాయల షాప్ ఓనర్ అంటుంది.
అప్పుడే అక్కడికి రాజ్ వస్తాడు. అతడిని విచిత్రంగా చూస్తుంది కూరగాయల షాప్ ఓనర్. నా కంటే ముందే వచ్చారా, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా అని కావ్యను అడుగుతాడు రాజ్. ఇప్పుడే వచ్చానని కావ్య అబద్ధం ఆడుతుంది. నాకో చిన్న డౌట్ అని రాజ్‌ను అడుగుతుంది కావ్య.
నేను ఇంకా ఏం మాట్లాడలేదు...నా మీద అప్పుడే డౌట్ వచ్చిందా ఏంటి అని రాజ్ అనుమానపడతాడు. నిజంగా మీకు కూరగాయలు కొనడం రాదా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు కదా...వాళ్లు కాకుండా మీరు ఎందుకు వచ్చారని రాజ్‌ను అడుగుతుంది కావ్య.
ఇంట్లో ఫంక్షన్ ఉందని, గుడిలో అన్నదానం చేస్తున్నానని రాజ్ అంటాడు. మా అమ్మ బర్త్‌డే అని నోటికి వచ్చిన అబద్ధం కావ్యకు చెబుతాడు. రాజ్‌కు గతం గుర్తొచ్చిందని కావ్య ఆనంద పడుతుంది. చిన్నతనంలో అమ్మ తనకు దూరమైందని, ఆమె జ్ఞాపకార్థం ప్రతి ఎటా అన్నదానం చేస్తున్నానని రాజ్ అంటాడు.
అమ్మతో తనకు అనుబంధం గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతాడు రాజ్. భర్త మాటలతో అతడికి గతం గుర్తుకు రాలేదని కావ్య అర్థం చేసుకుంటుంది. బతికున్న అపర్ణ గురించి చనిపోయినట్లుగా రాజ్ మాట్లాడటం తట్టుకోలేకపోతుంది. రాజ్ మాటలను ఆపేస్తుంది.
కూరగాయల లిస్ట్ చెబుతూనే ఉంటుంది కావ్య. ఆమె చెప్పిన లిస్ట్ చేసిన రాజ్ షాకవుతాడు. కావ్య చెప్పిన కూరగాయలు తీసుకురావాలంటే పెద్ద ట్రాలీ కావాలని కంగారు పడతాడు. ఆమెను ఆపబోతాడు. ఇంటికి తీసుకెళితే యామిని డౌట్ పడుతుందని రాజ్ కంగారు పడతాడు.
మీరు బాగా వంటలు చేస్తారని కావ్యపై పొగడ్తలు కురిపిస్తాడు రాజ్. రేపు గుడిలో వంటలు మీరే చేయాలని అంటాడు. ఏంటి నేనా...200 మందికి వంట చేయాలా అని కావ్య షాకింగ్‌గా అంటుంది. కావ్యను కన్వీన్స్ చేయడానికి బతిమిలాడుతాడు రాజ్... భర్తను గుడికి రావడానికి ఒప్పించాలని కావ్య అనుకుంటుంది. కానీ రాజ్ రివర్స్‌గా కావ్యను గుడికి రమ్మనడం చూసి షాకవుతుంది. కానీ పైకి మాత్రం ఇష్టం లేనట్లుగా నటిస్తుంది.
అంత మందికి వంట చేయడం అంటే కష్టమని, తర్వాత రోజు తన చేతులు పనిచేయమని కావ్య అంటుంది. మీ చేతులకు గాయమైతే అయింట్‌మెంట్ రాస్తా...కానీ గుడికి రానని, వంటలు చేయలేనని అనొద్దని కావ్యను బతిమిలాడుతాడు రాజ్. మీరు అంతగా అడుగుతున్నారు కదా...పైగా మీ అమ్మగారి కోసం అని సెంటిమెంట్‌తో కొట్టారు...అందుకోసమైనా వస్తానని కావ్య అంటుంది.
ఏది గిల్లండి అని రాజ్ అంటాడు. గట్టిగా గిల్లేస్తుంది కావ్య. రాజ్ నొప్పితో అరుస్తాడు. చాలా బ్లడ్ కూడా రావాలా అని కావ్య అడుగుతుంది. ఏ గుడిలో అన్నదానం అని కావ్య అడుగుతుంది. రాజ్ తడబడిపోతాడు. నేను చెప్పనా అని కావ్య అంటుంది. మణికొండ రామాలయం కదా అని అంటుంది. భలే గెస్ చేశారని రాజ్ అంటాడు. ఇద్దరం సింక్‌లో ఉన్నామని అబద్ధం ఆడుతాడు.
రాజ్ కూరగాయల కోసం వెళ్లిన సంగతి యామిని కనిపెడుతుంది. కావాలనే కొత్త డ్రామా మొదలుపెడుతుంది. కూరగాయలు తీసుకురాలేదా అని రాజ్‌ను అడుగుతుంది. కూరగాయలు నేనేందుకు తీసుకొస్తాను? తేస్తానని నేను చెప్పలేదే అని రాజ్ బదులిస్తాడు. నువ్వే కూరగాయల షాప్‌కు వెళ్లావు కదా తెస్తావని అనుకున్నానని యామిని అంటుంది.
నేను కూరగాయల షాప్‌కు వెళ్లానని నీకు తెలుసు ముందు అది చెప్పు అని రాజ్ ఫైర్ అవుతాడు. మార్నింగ్ నేను రెస్టారెంట్‌లో ఉంటే అక్కడికి వచ్చావు. నన్ను స్పై చేస్తున్నావా యామినిని నిలదీస్తాడు రాజ్. నేను ఎక్కడికి వెళుతున్నానో, ఏం చేస్తున్నావో ఆరాలు తీస్తున్నావా అని గట్టిగా అడుగుతాడు. యామినికి నీ మీద ఉన్న ప్రేమ అని ఆమె తల్లిదండ్రులు కవర్ చేస్తారు.
ఓ స్నేహితురాలి ఇంటి నుంచి వచ్చే ముందు నువ్వు కూరగాయల షాప్ దగ్గర కనిపించావని, అందుకే అలా అడిగానని తడబడుతూ సమాధానం చెబుతుంది యామిని. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటుంది. కూరగాయల షాప్ దగ్గర తెలిసిన వాళ్లు కనిపిస్తే మాట్లాడానని రాజ్ సమాధానమిస్తాడు.
ఎవరు వాళ్లు అని యామిని ఆసక్తిగా అడుగుతుంది. వాళ్లు నీకు తెలియదని రాజ్ కోపంగా బదులిచ్చి వెళ్లిపోతాడు. నువ్వు ఎక్కడికి వెళ్లిన నా నుండి తప్పించుకోలేవని యామిని అంటుంది.
తన రూమ్‌లోని కప్‌బోర్డ్ ఓపెన్ చేస్తుంది కావ్య. అందులో రాజ్ షర్ట్ కనిపిస్తుంది. రాజ్‌పై ప్రేమతో ఆ షర్ట్‌పై ఆర్ లెటర్‌ను ఎంబ్రాయిడరీ చేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. గుడికి వెళ్లేందుకు రాజ్ కోసం కావ్య ఆ షర్ట్‌ను సిద్ధం చేస్తుంది. రాజ్ ఆ షర్ట్ వేసుకుంటాడు. అది చూసి కావ్య ఆనందపడుతుంది.
నేను మీకు దూరమైనప్పుడు...నా జ్ఞాపకంగా ఎప్పుడు ఈ షర్ట్ మీ గుండెల మీద ఉండాలి. దీనిని చూడగానే నేనే మీకు గుర్తుకు రావాలి అని రాజ్‌తో అంటుంది కావ్య.
నిన్ను వదిలేసి వెళ్లిపోయేంత అదృష్టం ఉందా నాకు...ముల్లోకాలు దాటినా ముక్కుపిండి లాక్కొస్తావని కార్తీక్ అంటాడు. నాకు దూరంగా ఉండే పరిస్థితి రావచ్చునని కావ్య అంటుంది. అలాంటిదేమి ఉండదని రాజ్ బదులిస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం