Brahmaji: ప్రొడ్యూస‌ర్ డ‌బ్బులు ఇవ్వ‌లేదు - నా రెమ్యున‌రేష‌న్ ఇప్పించండి - బ్ర‌హ్మాజీ కామెంట్స్‌-brahmaji interesting comments on his remuneration for bapu movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmaji: ప్రొడ్యూస‌ర్ డ‌బ్బులు ఇవ్వ‌లేదు - నా రెమ్యున‌రేష‌న్ ఇప్పించండి - బ్ర‌హ్మాజీ కామెంట్స్‌

Brahmaji: ప్రొడ్యూస‌ర్ డ‌బ్బులు ఇవ్వ‌లేదు - నా రెమ్యున‌రేష‌న్ ఇప్పించండి - బ్ర‌హ్మాజీ కామెంట్స్‌

Nelki Naresh HT Telugu
Published Feb 19, 2025 03:41 PM IST

Brahmaji: బాపు సినిమా చేసినందుకు ప్రొడ్యూస‌ర్ త‌న‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని యాక్ట‌ర్ బ్ర‌హ్మాజీ అన్నాడు. ఆడియన్స్ టికెట్స్ కొని కలెక్షన్స్ వస్తే అందులో నుంచి రెమ్యున‌రేష‌న్‌ ఇస్తానని చెప్పాడ‌ని బ్ర‌హ్మాజీ పేర్కొన్నాడు. బాపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్ర‌హ్మాజీ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

బ్ర‌హ్మాజీ
బ్ర‌హ్మాజీ

Brahmaji: వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో న‌టించిన మూవీ బాపు. డార్క్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీకి ద‌యా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 21న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు డైరెక్ట‌ర్లు నాగ్ అశ్విన్, చందూ మొండేటి, బుచ్చిబాబు సానాతో పాటు హీరో స‌త్య‌దేవ్ హాజ‌ర‌య్యారు.

క్యూరియాసిటీ క‌లిగింది....

ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... “బాపు ట్రైలర్ చూశాను. ట్రైలర్ చివర్లో ఓ డోర్ దగ్గర ఫ్యామిలీ అంతా చూస్తూ వుంటుంది. అసలు ఏం చూస్తున్నారనే క్యురియాసిటీ కలిగింది. చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం వుంది. సినిమా టాక్ బావుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్ ఫుల్ చేస్తారు. ఈ సినిమాకి అన్నీ గుడ్ వైబ్స్ వున్నాయి” అని అన్నారు. ముఫ్ఫై ఏళ్ళుగా ఎవరికీ కనిపించకుండా దాచుకున్న బ్రహ్మాజీ తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింద‌ని హీరో స‌త్య‌దేవ్ చెప్పారు.

డైరెక్ట‌ర్ హీరోలా...

డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ... “చిన్న సినిమా పెద్ద సినిమా అని వుండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద సినిమానే. బాపు ట్రైలర్ చూస్తే చాలా ఎమోషనల్ గా అనిపించింది” అని తెలిపారు. బాపు సినిమాకు డైరెక్ట‌ర్ హీరోలా క‌నిపించాడ‌ని బుచ్చిబాబుసానా పేర్కొన్నాడు.

రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేదు...

యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ.. “బాపు సినిమాకు ప్రొడ్యూసర్ గారు నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆడియన్స్ టికెట్స్ కొని కలెక్షన్స్ వస్తే అందులో నుంచి ఇస్తానని చెప్పారు. ప్లీజ్ అందరూ థియేటర్స్ కి వెళ్లి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి(నవ్వుతూ). బాపు మూవీలో నేను హీరో కాదు. మెయిన్ రోల్స్‌లో నేను ఒక‌డిగా క‌నిపిస్తా” అని చెప్పాడు.

నా కెరీర్‌లో స్పెష‌ల్ మూవీ...

యాక్టర్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.."బాపు నా కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా నిలుస్తుంది. ఫస్ట్ టైం మా నాన్న ఫోన్ చేసిన నేను చాలా గర్వంగా వున్నానని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటినుంచో వుండేది. ఈ సినిమా నా కెరీర్ లో బిఫోర్ బాపు ఆఫ్టర్ బాపు అన్నట్టుగా వుంటుంది" అని అన్న‌ది.

శుక్ర‌వారం బాపుతో పాటు ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా, ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రెండు డ‌బ్బింగ్ సినిమాల‌తో బాపు పోటీప‌డుతోంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం