Brahmaji: కామెడీ మూవీతో హీరోగా బ్ర‌హ్మాజీ రీఎంట్రీ - బాపు ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌-brahmaji dark comedy movie bapu first look unveiled by rana daggubati ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmaji: కామెడీ మూవీతో హీరోగా బ్ర‌హ్మాజీ రీఎంట్రీ - బాపు ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Brahmaji: కామెడీ మూవీతో హీరోగా బ్ర‌హ్మాజీ రీఎంట్రీ - బాపు ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 31, 2024 01:13 PM IST

Brahmaji: లాంగ్ గ్యాప్ త‌ర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తోన్నాడు బ్ర‌హ్మాజీ. బాపు పేరుతో ఓ డార్క్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. బాపు మూవీ ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌ల రానా రిలీజ్ చేశాడు. ద‌యా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.

బ్ర‌హ్మాజీ
బ్ర‌హ్మాజీ

Brahmaji: కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సింధూరం మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు బ్ర‌హ్మాజీ. ఆ త‌ర్వాత కూడా కొన్ని తెలుగు సినిమాల్లో క‌థానాయ‌కుడిగా క‌నిపించాడు. హీరోగా అవ‌కాశాలు అంత‌గా రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, క‌మెడియ‌న్‌గా ట‌ర్న్ అయ్యారు. హీరోగా మెప్పించ‌లేక‌పోయిన బ్ర‌హ్మాజీ క‌మెడియ‌న్‌గా మాత్రం స‌క్సెస్ అయ్యారు. ప‌లు సినిమాల్లో త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.

yearly horoscope entry point

బాపు మూవీ...

లాంగ్ గ్యాప్ త‌ర్వాత బ్ర‌హ్మాజీ హీరోగా మారారు. బాపు పేరుతో డార్క్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాలో బ్ర‌హ్మాజీతో పాటు ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మ‌ణి ఏగుర్ల కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

రానా ద‌గ్గుబాటి రిలీజ్‌...

బాపు సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేశాడు. ఈ పోస్ట‌ర్‌లో బ‌ల‌గం సుధాక‌ర్‌రెడ్డి టేబుల్‌పై చేతులు ఆనించి కూర్చొని క‌నిపిస్తున్నాడు. అత‌డికి ఓ వైపు ఆమ‌ని, ధ‌న్య బాల‌కృష్ణ మ‌రోవైపు బ్ర‌హ్మాజీ, మ‌ణి ఏగుర్ల క‌నిపిస్తోన్నారు.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో...

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో బాపు మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో డైరెక్ట‌ర్ ద‌యా బాపు సినిమాను రూపొందిస్తోన్నాడు. వ్య‌వ‌సాయ‌మే జీవ‌నాధారంగా బ‌తికే ఓ కుటుంబంలో చోటుచేసుకునే సంఘ‌ట‌న‌ల‌కు కామెడీ, ఎమోషన్స్ జోడిస్తూ రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తోంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. ఈ సినిమాలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధించిన ఓ మెసేజ్‌ను ట‌చ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

గ‌త సినిమాల‌కు భిన్నంగా...

గ‌త సినిమాల‌కు భిన్నంగా బ్ర‌హ్మాజీ బాపు సినిమాలో ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాపు మూవీకి వాసు పెండెం డీవోపీగా పని చేస్తున్నారు. RR ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో ర‌చ్చ‌ర‌వి, బిగ్‌బాస్ గంగ‌వ్వ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. బాపు మూవీ రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌బోతున్నారు.

అల్లు అర్జున్ పుష్ప 2లో

ఇటీవ‌ల రిలీజైన అల్లు అర్జున్ పుష్ప 2లో బ్ర‌హ్మాజీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాడు. పుష్ప 2తో పాటు ఈ ఏడాది గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, చారి 111తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు బ్ర‌హ్మాజీ.

Whats_app_banner