Brahma Anandam Review: బ్రహ్మా ఆనందం రివ్యూ - బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Brahma Anandam Review: రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా బ్రహ్మా ఆనందం మూవీలో కనిపించారు. శుక్రవారం ప్రేక్షకుల ముదుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బ్రహ్మా ఆనందం. తాతా మనవళ్ల అనుబంధంతో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. శుక్రవారం రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? బ్రహ్మానందం, రాజా గౌతమ్ ప్రేక్షకులను మెప్పించారా? లేదా?
బ్రహ్మానందం కథ...
బ్రహ్మానందం (రాజా గౌతమ్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. తాత ఆనంద మూర్తి ( బ్రహ్మానందం) తో పెద్దగా సంబంధాలు ఉండవు. ఏ పని పాట లేకుండా అప్పులు చేస్తూ స్నేహితుడు గిరి సాయంతో బతికేస్తుంటాడు. గొప్ప థియేటర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని బ్రహ్మానందం కలలు కంటుంటాడు. నేషనల్ లెవెల్‌లో టాలెంట్ చూపించే అవకాశం అతడికి వస్తుంది.
కానీ అందులో పాల్గొనాంటే ఆరు లక్షలు అవసరం అవుతాయి. తాత ఆనంద మూర్తి అతడికి సాయం చేస్తానని అంటాడు. కానీ కొన్ని కండీషన్స్ పెడతాడు. ఆ కండీషన్స్ ఏమిటి? డబ్బు కోసం ఆనంద మూర్తి వెంట పల్లెటూరు వెళ్లిన బ్రహ్మానందానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బ్రహ్మానందాన్ని ప్రాణంగా ప్రేమించిన ప్రియ అతడికి ఎందుకు దూరమైంది? మూర్తి జీవితంలోకి వచ్చిన జ్యోతి ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
ఎమోషనల్ రోల్‌లో...
బ్రహ్మానందం కేవలం కామెడీకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు తనలోని నటనా వైవిధ్యతను చాటిచెప్పే క్యారెక్టర్స్ చేశాడు. ఆయన్ని పూర్తి స్థాయి ఎమోషనల్ రోల్‌లో చూస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు సమాధానమే బ్రహ్మా ఆనందం మూవీ.
జీవితానికి తోడు అవసరం...
ప్రేమకు వయసుతో సంబంధం ఉండదనే పాయింట్‌కు తాతా మనవళ్ల అనుబంధాన్ని జోడిస్తూ డైరెక్టర్ ఆర్‌వీఎస్ నిఖిల్ ఈ మూవీని తెరకెక్కించాడు. టీనేజ్ లవ్ స్టోరీని కాకుండా జీవితపు చరమాంకంలో ఓ వృద్ధ జంట ఎలా ప్రేమలో పడ్డారన్నది వినోదాత్మకంగా ఈ మూవీలో చూపించాడు. ఓ తోడు, నీడ ఉంటేనే జీవితానికి అర్థం, పరమార్థం ఉంటాయనే సందేశాన్ని చెప్పాడు.
కమర్షియల్ సినిమాలకు భిన్నంగా...
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సింపుల్ ఎమోషన్స్, డైలాగ్స్‌తో బ్రహ్మా ఆనందం మూవీ సాగుతుంది. సఫరేట్‌గా కాకుండాలోనే క థలోనే అండర్ లైన్‌గా కామెడీ జనరేట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్. థియేటర్ ఆర్టిస్ట్‌గా బ్రహ్మానందం పరిచయం, సెల్ఫిష్ నేచర్, మిత్రుడు గిరితో అతడి రిలేష్‌ను చూపిస్తూ ఫన్నీగా ఈ మూవీ మొదలవుతుంది. క్యారెక్టర్స్ ఎస్లాబ్లిష్ చేస్తూ ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశాడు డైరెక్టర్. బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెలకిషోర్ పోటీపడి వేసే పంచ్‌లు నవ్విస్తాయి.
ఫీల్‌గుడ్ మూవీ...
తాత చెప్పిన కండీషన్లకు ఒప్పుకున్న బ్రహ్మ ఎదుర్కొనే సమస్యలు...మూర్తి, జ్యోతిల ప్రేమకథతో సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. పొలం విషయంలో మూర్తి ఇచ్చే ట్విస్ట్ బాగుంది. కామెడీతో మొదలుపెట్టిఫీల్‌గుడ్ మూవీగా ఎండ్ చేశారు.
కన్ఫ్యూజ్...
బ్రహ్మానందం మూవీని కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ మంచిదే. కానీ దానిని ఎమోషన్స్, కామెడీతో ఎలా చెప్పాలనే కాస్త కన్ఫ్యూజ్ అయినట్లుగా అనిపిస్తుంది. కీలకమైన సెకండాఫ్‌లో డ్రామా సరిగ్గా పండలేదు. సెల్ఫిస్ అయిన హీరో సింపుల్‌గా మారడం కన్వీన్సింగ్‌గా అనిపించదు. కామెడీ ఎక్స్‌పెక్ట్ చేసినంత వర్కవుట్ కాలేదు.
వెన్నెలకిషోర్ కామెడీ...
మూర్తి గా కామెడీ, ఎమోషన్స్ కలబోసిన పాత్రలో బ్రహ్మానందం మెప్పించాడు. ఆయన కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా బ్రహ్మా ఆనందం నిలుస్తుంది. చాలా రోజుల తర్వాత రాజా గౌతమ్‌కు మంచిపాత్ర దక్కింది. సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెన్నెలకిషోర్ క్యారెక్టర్ ఈ మూవీకి ప్లస్ పాయింట్. అతడు స్క్రీన్‌పై కనిపించే ప్రతి సీన్ నవ్విస్తుంది. ప్రియా వడ్లమాని, దివిజ ప్రభాకర్, సంపత్, రాజీవ్ కనకాలతో పాటు చాలా మంది ఈ మూవీలో నటించారు. శాండిల్య మ్యూజిక్.
బ్రహ్మానందం యాక్టింగ్ కోసం...
బ్రహ్మానందం ఓ భిన్నమైన ప్రయత్నం. చిన్న చిన్న లోపాలున్న బ్రహ్మానందం యాక్టింగ్, వెన్నెలకిషోర్ కామెడీ కోసం ఈ మూవీ చూడొచ్చు.
సంబంధిత కథనం