OTT Telugu Comedy Movie: ఓటీటీలో వచ్చేసిన ‘బ్రహ్మా ఆనందం’ సినిమా.. కానీ ఓ ట్విస్ట్!
Brahma Anandam OTT: బ్రహ్మా ఆనందం చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, కొందరికే అందుబాటులోకి వచ్చింది. పూర్తిస్థాయి స్ట్రీమింగ్ కూడా సమీపించింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మా ఆనందం’ చిత్రం అనుకున్న స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం లీడ్ రోల్ చేయడంతో ఈ మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. మిక్స్డ్ టాక్ రావటంతో పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. ఈ బ్రహ్మా ఆనందం చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
వీరికి స్ట్రీమింగ్
బ్రహ్మా ఆనందం చిత్రం నేడు (మార్చి 19) ఆహా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం ఆహా గోల్డ్ ప్లాన్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. సాధారణ ప్లాన్‍లతో ఉన్న వారికి ఇంకా ఈ చిత్రం యాక్సెస్‍కు రాలేదు. ప్రకటించిన తేదీ కంటే 24 గంటల ముందే బ్రహ్మా ఆనందం చిత్రం ఆహా గోల్డ్ యూజర్లకు స్ట్రీమింగ్ అవుతోంది.
అందరకీ ఈ అర్ధరాత్రి నుంచే..
బ్రహ్మా ఆనందం చిత్రం ఆహా ఓటీటీలో పూర్తిస్థాయి స్ట్రీమింగ్ ఈ అర్ధరాత్రి (మార్చి 20) నుంచే మొదలుకానుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆహా సబ్‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లందరూ ఈ చిత్రాన్ని చూసేయవచ్చు. ఈ చిత్రాన్ని మార్చి 20న స్ట్రీమింగ్‍కు తెస్తామని ఇటీవలే ఆహా వెల్లడించింది. అయితే, గోల్డ్ యూజర్లకు ఒకరోజు ముందుగా నేడు తీసుకొచ్చింది. రేపటి నుంచి సబ్‍స్కైబర్లంతా ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని చూసేయవచ్చు.
బ్రహ్మా ఆనందం చిత్రం తాతమనవళ్ల సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్ల మధ్య సాగుతుంది. నిజజీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజాగౌతమ్ ఈ చిత్రంలో తాతమనవళ్లుగా నటించారు. ఈ చిత్రానికి ఆర్‌వీఎస్ గౌతమ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్,ప్రియా వడ్లమాని, తాళ్లూరి రాజేశ్వరి, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘుబాబు, ప్రభాకర్, దయానంద్ రెడ్డి కీరోల్స్ చేశారు.
పెద్ద నటుడు కావాలని అనుకునే బ్రహ్మ (రాజా గౌతమ్) డబ్బు అవసరమై.. పొలం అమ్మేసి ఇవ్వాలని ఓల్డేజ్ హోమ్‍లో ఉన్న తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం)ను అడుగుతాడు. ఇందుకోసం బ్రహ్మను తన గ్రామానికి తీసుకెళతాడు ఆనంద్. ఆ తర్వాత ఓ ట్విస్ట్ ఉంటుంది. బ్రహ్మను ఆ గ్రామానికి ఆనంద్ ఎందుకు తీసుకెళ్లాడు.. పొలం అమ్మేశాడా.. ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాల చుట్టూ ఈ బ్రహ్మానందం చిత్రం సాగుతుంది. ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ప్రొడ్యూజ్ చేశారు. శాండిల్య పీసపాటి మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీకి మితేశ్ పరవతనేని సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం