Boys Hostel: బంపర్ ఆఫర్.. ఈ సినిమాకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ-boys hostel movie producer offered buy one get one ticket free ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Boys Hostel Movie Producer Offered Buy One Get One Ticket Free

Boys Hostel: బంపర్ ఆఫర్.. ఈ సినిమాకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ

Hari Prasad S HT Telugu
Aug 29, 2023 07:16 PM IST

Boys Hostel: బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశాడు బాయ్స్ హాస్టల్ మూవీ ప్రొడ్యూసర్. ఈ సినిమా ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని చెప్పడం విశేషం. అయితే ఈ ఆఫర్ స్టూడెంట్స్ కు మాత్రమే అని ట్విస్ట్ ఇచ్చాడు.

బాయ్స్ హాస్టల్ మూవీ
బాయ్స్ హాస్టల్ మూవీ

Boys Hostel: కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిన బ్లాక్ కామెడీ డ్రామా హాస్టల్ హుడుగారు బెకగిద్దరె మూవీ ఈ మధ్యే తెలుగులోనూ బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నితిన్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మంజునాథ్ నాయక, ప్రజ్వల్ బీపీ, శ్రీవత్స శ్యామ్, గగన్ రామ్, శ్రేయస్ శర్మ నటించారు.

ట్రెండింగ్ వార్తలు

అయితే తాజాగా బాయ్స్ హాస్టల్ ప్రొడ్యూసర్లో ఒకడైన శరత్ చంద్ర ఓ బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా అని చెప్పడం విశేషం. బుధవారం (ఆగస్ట్ 30) నుంచి ఈ ఆఫర్ అమల్లోకి రానుంది. అయితే కేవలం స్టూడెంట్స్ కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు ఎవరైనా సినిమా బాలేదంటే వారికి టికెట్ల డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తానని శరత్ చంద్ర చెప్పడం గమనార్హం.

నైజాం ఏరియాలో 34 థియేటర్లలో, సీడెడ్‌లో 5 థియేటర్లలో, కృష్ణా జిల్లాలో రెండు థియేటర్లు, నెల్లూరులో ఒకటి, వైజాగ్ లో ఒక థియేటర్లో ఈ ఆఫర్ అనౌన్స్ చేశారు. థియేటర్ల దగ్గర కౌంటర్లలో టికెట్లు కొనేవాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని కూడా మేకర్స్ చెప్పారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాను సమర్పించగా.. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు.

సెప్టెంబ‌ర్ 1 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కేవ‌లం క‌న్న‌డ వెర్ష‌న్‌ను మాత్ర‌మే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్స్‌లో ఆడుతుండ‌టంతో ఓ వారం ఆల‌స్యంగా స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

అజిత్ అనే యువ‌కుడు తాను చేయ‌బోయే ఓ షార్ట్ ఫిల్మ్ క‌థ‌ను హాస్ట‌ల్‌లోని రూమ్‌మేట్స్‌కు చెబుతుంటాడు. ఆ షార్ట్ ఫిల్మ్ క‌థ‌లో మాదిరిగానే నిజంగానే వారి హాస్ట‌ల్ వార్డెన్ చ‌నిపోతాడు. వార్డెన్ రూమ్‌లో దొరికిన సూసైడ్ లెటెర్‌లో అజిత్‌తో పాటు అత‌డి స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి.

వార్డెన్ డెడ్‌బాడీని అజిత్ అండ్ ఫ్రెండ్స్ ఎలా దాచిపెట్టారు? ఈ క్ర‌మంలో వారికి ఎదురైన అనుభ‌వాలు ఏమిట‌న్న‌దే వినోదాత్మ‌క పంథాలో ద‌ర్శ‌కుడు నితిన్ కృష్ణ‌మూర్తి ఈ సినిమాలో చూపించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.