Boy friend For Hire Trailer: కిరాయికి బాయ్‌ఫ్రెండ్ దొరుకుతాడట? ట్రైలర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి
Boy friend For Hire: విశ్వాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్. విశ్వాంత్ హీరోగా, మాళవిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
Boy friend For Hire Trailer Released: కేరింత, మనమంతా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో విశ్వాంత్. అతడు హీరోగా, మాళవిక జంటగా నటించిన చిత్రం బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను సినిమాపై ఆసక్తి కనబర్చేలా చేశాయి. సరికొత్త కథతో తెరకెక్కినట్లు చిత్ర టైటిల్‌ను చూస్తేనే తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ట్రెండింగ్ వార్తలు
ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. అమ్మాయిలను చూస్తే భయపడే అబ్బాయిగా విశ్వాంత్ నటన ఆకట్టుకున్నాయి. ఇందులోని డైలాగులు వినోదాన్ని అందిస్తున్నాయి. చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కిరాయికి దొరికే బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో విశ్వాంత్ కనపించాడు. ట్రైలర్ ఫన్నీగా ఉంది.
స్వస్తిక సినిమా, ప్రైమ్ షో, ఎంటర్టైన్మెంట్ పతాకంపై వేణుమాధవ్ పెద్ది, కే నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 14వ తేదీన థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేషం స్పందన లభించింది. అంతేకాకుండా ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. విభిన్న నేపథ్యంలో ఉన్న కథాంశం కారణంగా యువతకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్