Crime Thriller OTT: ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ సైకలాజికల్ థ్రిల్లర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Fahadh Faasil New Movie on OTT: ఫహాద్ ఫాజిల్ నటించిన మూవీ బోగన్ విల్లియా అక్టోబరులో థియేటర్లలో విడుదలై హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇది ఓటీటీలోకి రాబోతోంది. ఎక్కడ చూడొచ్చంటే?
పుష్ప సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్.. ఒకవైపు మలయాళం సినిమాల్లో హీరోగా చేస్తూనే మరోవైపు తెలుగు, తమిళ్ చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన రజినీకాంత్ వేట్టయాన్‌లోనూ ఫహాద్ ఫాజిల్ ఓ కీలక పాత్రలో నటించాడు. డిసెంబరు 5న విడుదలకానున్ను ‘పుష్ప 2: ది రూల్’లో కూడా కనిపించనున్నాడు.
రూ.35 కోట్ల వరకూ వసూళ్లు
ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బోగన్ విల్లియా’ ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబరులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. రూ.35 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బోగన్ విల్లియా.. అభిమానుల్ని థ్రిల్ చేస్తూ పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేసింది. రుతింతే లోకం నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
బోగన్ విల్లియా కథ ఏంటంటే?
కేరళలో భార్యాభర్తలైన రాయిస్ (కుంచకో బోబన్), రీతూ (జ్యోతిర్మయి) తమ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటారు. కానీ.. అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన రీతూ గతం మర్చిపోతుంది. అదే సమయంలో టూరిస్ట్‌లు అక్కడ కనిపించకుండా పోతుంటారు. దాంతో ఏసీపీగా అక్కడికి కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా వచ్చిన డేవిడ్ కోషి (ఫహాద్ ఫాజిల్)కి.. ఆ మిస్సింగ్‌లకి కారణం రీతూ అని సాక్ష్యాలు దొరకుతాయి. నిజంగా ఆ మిస్సింగ్స్‌లతో రీతూకి సంబంధం ఉంటుందా? ఆమె భర్త రాయిస్‌కి ఆ కేసుతో సంబంధం ఉందా? ఏసీసీ డేవిడ్ ఎలా ఆ మిస్సింగ్ కేసులని ఛేదిస్తాడు? అనేది సినిమా. అమల్ నీరద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
బోగన్ విల్లియా ఓటీటీలోకి ఎప్పుడంటే?
బోగన్ విల్లియా మూవీ డిసెంబరు 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. ఫహాద్ ఫాజిల్ ఉన్న క్రేజ్ దృష్ట్యా.. మంచి ఫ్యాన్సీ రేటుకి ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ కొనుగోలు చేసింది. తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబరు 13 నుంచి బోగన్ విల్లియా స్ట్రీమింగ్‌కాబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయవచ్చు.