OTT Tamil Comedy Movie: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న తమిళ కామెడీ డ్రామా.. తంగలాన్ డైరెక్టర్ నిర్మించిన మూవీ ఇది
OTT Tamil Comedy Movie: ఓటీటీలోకి ఇప్పుడో మరో ఇంట్రెస్టింగ్ తమిళ కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. తంగలాన్ డైరెక్టర్ పా.రంజిత్ నిర్మించిన సినిమా ఇది.

OTT Tamil Comedy Movie: తమిళ కామెడీ డ్రామా ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు బాటిల్ రాధా (Bottle Radha). గురు సోమసుందరం నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం విశేషం.
బాటిల్ రాధా ఓటీటీ రిలీజ్ డేట్
తంగలాన్ మూవీ డైరెక్టర్ పా.రంజిత్ తన బ్యానర్ నీలమ్ ప్రొడక్షన్స్, బెలూన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ బాటిల్ రాధా. ఈ మూవీ నవంబర్ 4, 2023లో ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇక గత నెల 24న థియేటర్లలో రిలీజైంది.
ఇప్పుడు శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. సినిమా ఓటీటీ రిలీజ్ తేదీని ఆ ప్లాట్‌ఫామ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను దినకరన్ శివలింగం డైరెక్ట్ చేశాడు. గురు సోమసుందరం, సంచన నటరాజన్ లాంటి వాళ్లు నటించారు.
బాటిల్ రాధా మూవీ గురించి..
బాటిల్ రాధా అనే వెరైటీ టైటిల్ తోనే మేకర్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదొక కామెడీ జోడించిన సోషల్ డ్రామా. ఈ సినిమా టైటిల్ రోల్లో గురు సోమసుందరం నటించాడు. ఆల్కహాల్ కు బానిసై, రీహ్యాబిలిటేషన్ సెంటర్లో మళ్లీ కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న ఓ ప్లంబర్ చుట్టూ తిరిగే కథ ఇది. జనవరి 24న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో గురు సోమసుందరంతోపాటు సంచన నటరాజన్, జాన్ విజయ్, మారన్, ఆంటోనీ, ఆర్ముగవేల్ లాంటి వాళ్లు నటించారు. మందుకు బానిసైన ఓ ప్లంబర్ కొత్త జీవితం కోసం సాగించే ప్రయత్నమే ఈ బాటిల్ రాధా మూవీ. ఈ కథకే కామెడీని జోడించి సామాజిక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.
సంబంధిత కథనం