Shah Rukh Khan: షారూక్ ఖాన్ ఆ అలవాటుకి సడన్‌గా పుల్‌స్టాప్.. రోజుకి 100 నుంచి ఇప్పుడు జీరో!-bollywood superstar shah rukh khan announces he has quit smoking ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan: షారూక్ ఖాన్ ఆ అలవాటుకి సడన్‌గా పుల్‌స్టాప్.. రోజుకి 100 నుంచి ఇప్పుడు జీరో!

Shah Rukh Khan: షారూక్ ఖాన్ ఆ అలవాటుకి సడన్‌గా పుల్‌స్టాప్.. రోజుకి 100 నుంచి ఇప్పుడు జీరో!

Galeti Rajendra HT Telugu
Nov 03, 2024 07:37 PM IST

షారూక్ ఖాన్ రెండేళ్ల క్రితం వచ్చిన పఠాన్ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన జవాన్ కూడా అభిమానుల్ని మెప్పించగా.. ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

షారూక్ ఖాన్
షారూక్ ఖాన్ (AFP)

బాలీవుడ్ బాద్‌ షా షారూక్ ఖాన్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు. శనివారం (నవంబరు 2)న తన 59వ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న షారూక్ ఖాన్.. ఫ్యాన్స్ కోసం ఈరోజు మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశాడు.

ఈ కార్యక్రమంలో షారూక్ ఖాన్ మాట్లాడుతూ నేను సిగరెట్లు తాగడం మానేశానంటూ ప్రకటించాడు. దాంతో ఫంక్షన్ హాల్ అభిమానుల కేరింతలు, చప్పట్లతో మార్మోగిపోయింది. వాస్తవానికి షారూక్ ఖాన్ ఇప్పటికే పలు సందర్భాల్లో తనకి ఉన్న ఈ చెడు అలవాటు గురించి బహిరంగంగానే మాట్లాడాడు.

రోజుకి 100 సిగరెట్లు

ఒత్తిడిని తట్టుకోవడానికి రోజుకి 100కి పైగా కూడా సిగరెట్లు తాగినట్లు చెప్పుకొచ్చాడు. ఒకానొక దశలో కేవలం సిగరెట్లు, బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతూ రోజులను గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో షారూక్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. పఠాన్ సినిమా కోసం షారూక్ ఖాన్ సిక్స్ ప్యాక్ చేసిన విషయం తెలిసిందే.

సిగరెట్లు అతిగా తాగడం వల్ల షారూక్ ఖాన్‌కి అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ బాలీవుడ్ హీరో శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే.. సిగరెట్లు తాగడం ఆపేశాక కూడా ఈ సమస్య పూర్తిగా తొలగిపోలేదని స్వయంగా షారూక్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు

షూటింగ్‌లో అప్పుడప్పుడు ఇప్పటికీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతోందన్న షారూక్ ఖాన్.. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశాడు. అప్పట్లో రోజుకి 100 సిగరెట్లతో పాటు 30 కప్పుల వరకు బ్లాక్ కాఫీలను షారూక్ ఖాన్ తాగేవాడు.

సిగరెట్లు తాగే అలవాటుకి దూరం కావాలని చాలా ఏళ్లుగా షారూక్ ఖాన్ ప్రయత్నిస్తున్నాడు. మధ్యలో కొన్ని రోజులు మానేసినా.. మళ్లీ అలవాటు అయ్యింది. అయితే.. ఎట్టకేలకు ఆ వ్యసనంపై తాను విజయం సాధించినట్లు ఈ బాలీవుడ్ బాద్‌షా అభిమానులతో చెప్పుకొచ్చాడు.

కింగ్ సినిమాతో షారూక్ బిజీ

2022లో విడుదలైన పఠాన్ మూవీతో మళ్లీ ట్రాక్‌లో పడిన షారూక్ ఖాన్.. ఆ తర్వాత జవాన్‌తో జోరు పెంచాడు. ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ కింగ్ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ విలన్‌గా నటిస్తుండగా.. సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్ ఖాన్‌తో కలిసి ఒక సినిమా కూడా షారూక్ ఖాన్ చేయబోతున్నాడు.

Whats_app_banner