ఐపీఎల్ 18వ సీజన్ శనివారం (మార్చి 22) స్టార్ట్ అవుతుంది. సాయంత్రం రాత్రి 7.30కు ఆరంభ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంతకంటే ముందే బాలీవుడ్ స్టార్స్ క్రికెట్ గ్రౌండ్ లో సత్తాచాటేందుకు సై అంటున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి అగ్రశ్రేణి బాలీవుడ్ హీరోలు ఈ మ్యాచ్ కు అటెండ్ కాబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ నిర్వహించడం వెనుక ఓ మంచి కారణం ఉంది.
టీబీ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. శనివారం ముంబయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ఎంసీఏ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ టీమ్ తో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి జట్టు తలపడనుంది. 50 మందికి పైగా సెలబ్రిటీలు ఈ మ్యాచ్ కు హాజరు కానున్నారు, వారిలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ తదితర బాలీవుడ్ నటులున్నారు.
క్షయ రహిత ఇండియానే లక్ష్యంగా టీబీపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీబీ ముక్త్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఈ క్రికెట్ మ్యాచ్ కు ఆమిర్ ఖాన్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, అనిల్ కపూర్, సన్నీ దేవోల్, హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్, సైఫ్ అలీ ఖాన్, రణ్ బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా, అభిషేక్ బచ్చన్, రోహిత్ శెట్టి, షాహిద్ కపూర్, రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, రణ్ దీప్ హుడా, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ తదితర బాలీవుడ్ స్టార్లు అటెండ్ కాబోతున్నారు.
షాన్, సోను నిగమ్, గురు రంధావా, మీకా, హిమేష్ రేష్మియా లాంటి మ్యూజిక్ ఆర్టిస్ట్స్ కూడా ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. సూరజ్ పంచోలి, పంకజ్ త్రిపాఠి, అర్బాజ్ ఖాన్, రోహిత్ రాయ్, విక్రాంత్ మసే, డైనో మోరియా, అర్జున్ రాంపాల్, సునీల్ గ్రోవర్, అహన్ శెట్టి, విజయ్ వర్మ, అనుపమ్ ఖేర్, హర్షవర్ధన్ రానే, అర్షద్ వర్సి వంటి వాళ్లు కూడా మ్యాచ్ కు హాజరవుతున్నారు.
ఈ మ్యాచ్ గురించి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎక్స్ లో పోస్టు చేశారు.“క్షయవ్యాధి ఓడిపోతుంది. దేశం గెలుస్తుంది! రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు మైదానంలో దిగబోతున్నారు. ప్రధానమంత్రి మోడీ ‘క్షయ రహిత భారత్’ ఆశయం కోసం క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు’’ అని కేంద్ర మంత్రి ఎక్స్ లో పోస్టు చేశారు.
సంబంధిత కథనం