SSMB 29: మహేశ్ బాబు - రాజమౌళి చిత్రంలో నటించనున్న ఈ బాలీవుడ్ స్టార్ హీరో!
SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‍లో రూపొందనున్న గ్లోబల్ రేంజ్ మూవీలో వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఈ చిత్రంలో నటించనున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‍లో గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మహేశ్ బాబు పాస్‍పోర్ట్ సీజ్ చేసేశానంటూ రాజమౌళి సరదాగా ఇటీవల చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. షూటింగ్ మొదలైందనేలా ఆయన హింట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రాజెక్ట్ పేరు ఎస్ఎస్ఎంబీ29గా పిలుస్తున్నారు. ఈ గ్లోబల్ రేంజ్ మూవీలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఉండడం కచ్చితం. ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ ఫిక్స్ అయ్యారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

పృథ్విరాజ్ స్థానంలో జాన్ అబ్రహాం
మహేశ్ - రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించనున్నారనే సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఆయన షూటింగ్‍లో పాల్గొననున్నారని వెల్లడైంది. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమార్ ఈ మూవీలో నటించనున్నారని గతంలో రూమర్లు వచ్చాయి. పృథ్వితో సినిమా టీమ్ చర్చలు కూడా జరిపిందని, ఆయన ఓకే కూడా చెప్పినట్టు తెలిసింది. అయితే, పృథ్వి ఇప్పుడు ఈ ప్రాజెక్టులో లేరని తెలుస్తోంది. ఆ ప్లేస్‍లోనే జాన్ అబ్రహాం ఈ చిత్రంలో నటించనున్నారని న్యూస్24 రిపోర్ట్ వెల్లడించింది.
ఈ చిత్రంలో పృథ్విరాజ్ చేయాల్సిన పాత్రను జాన్ అబ్రహాం పోషిస్తారని ఆ రిపోర్ట్ పేర్కొంది. “ప్రియాంక చోప్రాతో జాన్ అబ్రహాం స్క్రీన్ పంచుకోనున్నారు. ప్రియాంకతో ఆయనకు కొన్ని సీన్లు ఉంటాయి. వీటికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‍లో జరుగుతుంది” అని ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం ఉందని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆమె హైదరాబాద్‍కు కూడా వచ్చారు. ఈ మూవీ కోసమే ఆమె ఇక్కడి వచ్చారని, గ్లోబల్ రేంజ్‍లో గుర్తింపు ఉన్న ప్రియాంక ఈ చిత్రం నటిస్తున్నారనే సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
షూటింగ్ మొదలైందా!
ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ హైదరాబాద్‍లో ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రాజమౌళి కూడా హింట్ ఇచ్చేశారు. మహేశ్ బాబు పాస్‍పోర్ట్ లాగేసుకున్నానని, ఎక్కడికీ వెళ్లలేడనేలా ఓ సరదా పోస్ట్ చేశారు. షూటింగ్ మొదలైందని చెప్పేందుకే రాజమౌళి ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రస్తుతం షూటింగ్‍లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే జాన్ అబ్రహాం కూాడా షూటింగ్‍కు వస్తారని టాక్.
ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి గ్లోబల్ రేంజ్‍లోనూ పాపులర్ అయ్యారు. హాలీవుడ్‍లోనూ ఆనలు చాలా క్రేజ్ వచ్చింది. దీంతో ఎస్ఎస్ఎంబీ 29 మూవీని గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. కొందరు హాలీవుడ్ సహా వివిధ దేశాలకు చెందిన నటీనటుు కూడా ఈ చిత్రంలో ఉంటారనే రూమర్లు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
సంబంధిత కథనం