Krrish 4 Director: క్రిష్ 4 కూడా వచ్చేస్తోంది.. డైరెక్టర్‌గా మారిన బాలీవుడ్ స్టార్ హీరో..-bollywood star hero hrithik roshan to direct krrish 4 movie announced officially ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krrish 4 Director: క్రిష్ 4 కూడా వచ్చేస్తోంది.. డైరెక్టర్‌గా మారిన బాలీవుడ్ స్టార్ హీరో..

Krrish 4 Director: క్రిష్ 4 కూడా వచ్చేస్తోంది.. డైరెక్టర్‌గా మారిన బాలీవుడ్ స్టార్ హీరో..

Hari Prasad S HT Telugu

Krrish 4 Director: బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ క్రిష్ మరో మూవీతో వస్తోంది. ఈ మూవీని స్టార్ హీరో హృతిక్ రోషన్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. హిందీ సినిమాలో పెద్ద హీరో అయిన అతడు తొలిసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు.

క్రిష్ 4 కూడా వచ్చేస్తోంది.. డైరెక్టర్‌గా మారిన బాలీవుడ్ స్టార్ హీరో..

Krrish 4 Director: క్రిష్ ఫ్రాంఛైజీ తెలుసు కదా. అప్పుడెప్పుడో 22 ఏళ్ల కిందట కోయి మిల్ గయా మూవీ నుంచి మొదలైన సూపర్ హీరో మూవీస్ ఫ్రాంఛైజీ.. ఇప్పుడు నాలుగో సినిమాతో వస్తోంది. క్రిష్ 4ను అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా కోసం తొలిసారి డైరెక్టర్ గా మారనున్నాడు స్టార్ హీరో హృతిక్ రోషన్.

హృతిక్ రోషన్ డైరెక్షన్‌లో క్రిష్ 4

2003లో వచ్చిన కోయి మిల్ గయాతోపాటు తర్వాత వచ్చిన క్రిష్, క్రిష్ 3 సినిమాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేశాడు. కానీ ఈ నాలుగో మూవీని మాత్రం హృతిక్ రోషనే డైరెక్ట్ చేయనుండటం విశేషం. ఆదిత్య చోప్రా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని రాకేష్ రోషన్ వెల్లడించాడు.

25 ఏళ్ల కిందట తాను డైరెక్టర్ గా హృతిక్ ను హీరోగా పరిచయం చేశానని, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత డైరెక్టర్ గా అతన్ని తనతోపాటు మరో డైరెక్టర్ ఆదిత్య చోప్రా లాంచ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ పోస్టుకు హృతిక్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేసింది.

12 ఏళ్ల తర్వాత క్రిష్ 4

నిజానికి క్రిష్ ఫ్రాంఛైజీలో చివరి మూవీ క్రిష్ 3 ఎప్పుడో 2013లో రిలీజైంది. అప్పటి నుంచీ నెక్ట్స్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనౌన్స్‌మెంట్ రావడం, అందులోనూ హృతిక్ డైరెక్షన్ లోనే మూవీ వస్తుండటంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇదో క్రేజీ న్యూస్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు.

డైరెక్టర్ గా హృతిక్ రోషన్ ఉన్నాడంటే ఈ సినిమా ఓ అద్భుతం కాబోతోందని మరొకరు అన్నారు. పుష్ప 2 రికార్డు బ్రేక్ కాబోతోందని ఇంకో అభిమాని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్రిష్ 4లోనూ హృతికే లీడ్ రోల్లో ఉంటాడా లేక మరో నటుడిని తీసుకుంటారా అన్నది చూడాలి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

క్రిష్ మూవీస్ ఇలా..

2003లో ఏలియన్ మూవీగా కోయి మిల్ గయా వచ్చింది. అందులో హృతిక్ రోషన్ ఓ భిన్నమైన పాత్రలో కనిపించాడు. మంద బుద్ధి కలిగిన ఓ యువకుడిని ఓ ఏలియన్ ఎలా మార్చేసిందన్నది అందులో చూపించారు. అందులోని రోహిత్ మెహ్రా (హృతిక్), నిషా (ప్రీతి జింటా)లకు క్రిష్ణా అనే అబ్బాయి పుట్టినట్లుగా క్రియేట్ చేసి ఈ క్రిష్ ఫ్రాంఛైజీని మొదలుపెట్టారు.

2006లో తొలిసారి క్రిష్ మూవీ రిలీజైంది. అందులో హృతిక్ రోషన్ సరసన ప్రియాంకా చోప్రా నటించింది. ఆ మూవీని రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. ఏకంగా రూ.126 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2013లో క్రిష్ 3 వచ్చింది. ఇప్పుడు 12 ఏళ్ల తర్వా త క్రిష్ 4ను అనౌన్స్ చేశారు. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడన్నది చూడాలి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం