OTT Movie: దురాచారంపై అమ్మాయి పోరాటం: ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా.. డేట్ ఇదే
Ek Kori Prem Katha: ‘ఏక్ కోరీ ప్రేమ్ కథ’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. డేట్ కూడా ఖరారైంది.
బాలీవుడ్ యాక్టర్లు అక్షయ్ ఒబెరాయ్, ఖనక్ బుదిరాజా హీరోహీరోయిన్లుగా ‘ఏక్ కోరీ ప్రేమ్ కథ’ చిత్రం వచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సోషల్ డ్రామా సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. సీరియస్ సబ్జెక్టుపై వచ్చిన ఈ మూవీ ప్రశంసలను దక్కించుకుంది. పెళ్లి సందర్భంగా అమ్మాయికి కన్యత్వ పరీక్ష పెట్టే దురాచారానికి వ్యతిరేకంగా ఓ అమ్మాయి పోరాడటం చుట్టూ ‘ఏక్ కోరీ ప్రేమ్ కథ’ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
స్ట్రీమింగ్ డేట్
ఏక్ కోరీ ప్రేమ్ కథ చిత్రం జూలై 25వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ నేడు (జూలై 23) వెల్లడించింది. ట్రైలర్ తీసుకొచ్చి స్ట్రీమింగ్ డేట్‍ను ప్రకటించింది. “కొత్త ఆలోచన.. అమితమైన ధైర్యం గురించిన కథ ఇది. ఏక్ కోరీ ప్రేమ్ కథను జూలై 25 నుంచి జియోసినిమాలో చూసేయండి” అంటూ జియోసినిమా నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఏక్ కోరీ ప్రేమ్ కథ చిత్రానికి చిన్మయ్ పురోహిత్ దర్శకత్వం వహించారు. యథార్ధ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్రామంలో పెళ్లి సందర్భంగా అమ్మాయిలకు కోరీ ప్రథ అనే పేరుతో కన్యత్వ పరీక్ష పెట్టే దురాచారంపై ఈ మూవీని రూపొందించారు. సమాజంలో ఈ విషయంపై అవగాహన కల్పించేలా తీసుకొచ్చారు. అయితే, నరేషన్ అంతగా ఆకట్టుకోకపోవటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయింది.
ఏక్ కోరీ ప్రేమ్ కథ మూవీలో అక్షయ్ ఒబెరాయ్, ఖనక్ బుదిరాజాతో పాటు పూనమ్ థిల్లాన్, రాజ్ బబ్బర్, దర్శన్ జరివాలా కీలకపాత్రలు పోషించారు. సుగంధ్ ఫిల్మ్స్, కెనిల్ వర్త్ ఫిల్మ్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి.
ఏక్ కోరీ ప్రేమ్ కథ స్టోరీ లైన్
ఉత్తర్ ప్రదేశ్‍లోని లక్ష్మణ్‍గంథ్ గ్రామంలో ఏక్ కోరీ ప్రేమ్ కథ స్టోరీ సాగుతుంది. ఈ గ్రామానికి రామ్‍దేవ్ సింగ్ (రాజ్ బబ్బర్) సర్పంచ్‍గా ఉంటాడు. అతడి కుమారుడు లడ్డూ సింగ్ (అక్షయ్ ఒబెరాయ్).. స్వతంత్ర భావాలు ఉన్న సభ్యత (ఖనక్ బుదిరాజా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. సభ్యత బస్ డ్రైవర్‌గా పని చేస్తుంటుంది. లడ్డూ సింగ్, సభ్యత పెళ్లి జరుగుతుంది. అయితే, తొలిరాత్రి సభ్యతకు కోరి ప్రథ (కన్యత్వ పరీక్ష) జరగాల్సిందేనని సర్పంచ్ సహా పెద్దలు చెబుతారు. దీన్ని సభ్యత వ్యతిరేకిస్తుంది. ఈ దురాచారంపై పోరాడుతుంది. ఈ క్రమంలో లడ్డూకు దూరమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. లడ్డు, సభ్యత ఒక్కటయ్యారా అనేదే ఈ మూవీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
టాపిక్