Most Expensive Wedding: 50 మంది గెస్టులకు 100 కోట్ల ఖర్చు.. అత్యంత ఖరీదైన వివాహం ఇదే!-bollywood most expensive wedding is virat kohli anushka sharma with 100 cr cost for 50 guests ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Expensive Wedding: 50 మంది గెస్టులకు 100 కోట్ల ఖర్చు.. అత్యంత ఖరీదైన వివాహం ఇదే!

Most Expensive Wedding: 50 మంది గెస్టులకు 100 కోట్ల ఖర్చు.. అత్యంత ఖరీదైన వివాహం ఇదే!

Sanjiv Kumar HT Telugu

Virat Kohli Anushka Sharma Wedding Cost: బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పెళ్లికి దాదుపుగా రూ. 100 కోట్ల ఖర్చు చేశారని సమాచారం. అది కూడా కేవలం 50 మంది అథితుల కోసమే అని తెలుస్తోంది.

50 మంది గెస్టులకు 100 కోట్ల ఖర్చు.. అత్యంత ఖరీదైన వివాహం ఇదే!

Anushka Sharma Virat Kohli Marriage Cost: బాలీవుడ్‌లో జరిగే పెళ్లి వేడుకలు అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. ఇద్దరు స్టార్ సెలబ్రెటీలు పెళ్లి చేసుకునేందుకు వచ్చినప్పుడు, ఆ వివాహపు వివరాలు, వెడ్డింగ్ ఫోటోలు చిటికలో వైరల్ అవుతుంటాయి. ఇక ఆ వైరల్ ఫొటోలకు, పెళ్లి ముచ్చట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అభిమానులు అమితంగా ఆసక్తిగా చూపిస్తుంటారు. ఇక వారి ఆసక్తికి తగినట్లే పాపులర్ సెలబ్రిటీల పెళ్లిళ్లు, వాటి ఖర్చులు, వెడ్డింగ్ డ్రెస్సెస్, వేదికలు ఉంటాయి.

50 మంది అతిథులు

అలా దాదాపు రూ. 100 కోట్ల ఖర్చుతో జరిగిన బాలీవుడ్‌లోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డుకెక్కింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వివాహం. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ తమ వివాహానికి ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు తాజాగా బాలీవుడ్ మీడియా పేర్కొంది. అది కూడా కేవలం 50 మంది అతిథుల కోసమే అని తెలుస్తోంది. అయితే, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే వివాహానికి ఆహ్వానించింది విరుష్క జంట.

కొత్త ట్రెండ్

2017లో జరిగిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 50 మంది మాత్రమే హాజరయ్యాని సమాచారం. వీరికే రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసి ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు డీఎన్‌ఏ ఇండియా మీడియా పేర్కొంది. తన పెళ్లి కోసం అనుష్క శర్మ ఖరీదైన పాస్టెల్ లెహంగాను ధరించి కొత్త ట్రెండ్‌ను ప్రారంభించింది. అలాగే భారత జట్టు స్టార్ క్రికెటర్ కోహ్లీ తెల్లటి షేర్వాణీని వేసుకున్నాడు.

800 ఏళ్ల నాటి గ్రామం

బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం.. అనుష్క శర్మ ధరించిన సబ్యసాచి వెడ్డింగ్ లెహంగా ఒక్కదానికే రూ. 30 లక్షలు అని సమాచారం. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బోర్గో ఫినోచిటో అనే విల్లాగా మారిన 800 ఏళ్ల నాటి గ్రామంలో వివాహం చేసుకున్నారు. 800 ఏళ్ల కాలం నాటి ఆ గ్రామాన్ని పునరుద్ధరించి బోటిక్ ప్రాపర్టీగా మర్చేశారట. ఈ బోర్గో ఫినోచిటో ఇటలీలోని టుస్కానీలో ఉంది. కాబట్టి విరాట్ అండ్ అనుష్క పెళ్లికి ఇటలీలోని బోర్గో ఫినోచిటో వేదికైంది.

కోటి వరకు ఖర్చు

అయితే, ఈ బోర్గో ఫినోచిటోకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలోని 20 అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్స్ అని ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో బోర్గో ఫినోచిటో (Borgo Finocchieto) కూడా స్థానం సంపాదించింది. ఈ బ్రహ్మాండమైన విల్లాలో ఒక వారం ఉంటే కనీసం రూ. 1 కోటి ఖర్చు అవుతుంది. ఒక రాత్రికి రూ. 6,50,000 నుంచి రూ. 14,00,000 వరకు ధరలు ఉంటాయి. కాబట్టి, ఇది పక్కా స్టార్ సెలబ్రిటీల వెడ్డింగ్ కోసమే అని తెలుస్తోంది.

రెండో జంటగా రణ్ వీర్-దీపికా

అనుష్క శర్మ, విరాట్ కోహ్లిల వివాహానికి సంబంధించిన డెకరేషన్‌ను దేవికా నారాయణ్ అండ్ కంపెనీకి చెందిన దేవికా నరైన్ చేయించారు. ఈ డెకరేషన్ కోసం హాలండ్ నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించారు. ఇన్ని స్పెషాలిటీస్‌తో బాలీవుడ్‌లోనే అత్యంత ఖరీదైన వివాహంగా విరాట్ అండ్ అనుష్క పెళ్లి నిలిచింది. వీరి తర్వాత రెండో ఖరీదైన పెళ్లి చేసుకున్న జంటగా రణ్ వీర్ సింగ్-దీపికా పదుకొణె నిలిచారు.

79 కోట్ల వరకు

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి వెడ్డింగ్‌కు రూ. 77-79 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం. దీంతో ఇది బాలీవుడ్‌లో రెండవ అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డుల్లో నిలిచింది. కాగా ఇటీవలే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు రణ్ వీర్ సింగ్-దీపికా పదుకొణె సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.