Amitabh Bachchan Income: 82 ఏళ్ల వయసు.. ఒకే ఏడాది రూ.350 కోట్ల సంపాదన.. దేశంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ..-bollywood mega star amitabh bachchan income in a year 350 crores paid 120 crores tax beats shah rukh khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amitabh Bachchan Income: 82 ఏళ్ల వయసు.. ఒకే ఏడాది రూ.350 కోట్ల సంపాదన.. దేశంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ..

Amitabh Bachchan Income: 82 ఏళ్ల వయసు.. ఒకే ఏడాది రూ.350 కోట్ల సంపాదన.. దేశంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ..

Hari Prasad S HT Telugu

Amitabh Bachchan Income: మెగాస్టార్ 82 ఏళ్ల వయసులోనూ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.350 కోట్లు సంపాదించి.. దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

82 ఏళ్ల వయసు.. ఒకే ఏడాది రూ.350 కోట్ల సంపాదన.. దేశంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ..

Amitabh Bachchan Income: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వయసుతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ స్టార్.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ స్థాయికి చేరుకున్నాడు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అతని సంపాదన ఏకంగా రూ.350 కోట్లు కావడం విశేషం.

అమితాబ్ బచ్చన్ సంపాదన ఇలా..

అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వయసులో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ రెండు చేతులా సంపాదించేస్తున్నాడు. సినిమాలు, ఎండార్స్‌మెంట్లతోపాటు కేబీసీ షోకి ఆతిథ్యమిస్తూ బిగ్ బీ కోట్లలో వెనకేసుకుంటున్నాడు. తాజాగా వచ్చిన ఓ రిపోర్టు ప్రకారం.. ఈ బాలీవుడ్ మెగాస్టార్ ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ.350 కోట్లు సంపాదించడంతోపాటు రూ.120 కోట్లు ట్యాక్స్ కట్టడం విశేషం.

ఈ క్రమంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను వెనక్కి నెట్టి.. దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీగా నిలిచినట్లు కూడా ఆ రిపోర్టు తెలిపింది. గతేడాది షారుక్ రూ.92 కోట్ల ట్యాక్స్ తో తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పుడు బిగ్ బీ ఆ రికార్డును చెరిపేశాడు.

బిగ్ బీ.. అన్నింట్లోనూ బిగ్

అమితాబ్ బచ్చన్ గతేడాది కల్కి 2898 ఏడీలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీతోపాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించాడు. దీనికితోడు ఎన్నో యాడ్స్ చేశాడు. కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ కు హోస్ట్ గానూ ఉన్నాడు. వీటి ద్వారా అతడు రూ.350 కోట్లు సంపాదించినట్లు పింక్‌విల్లా రిపోర్టు తెలిపింది. ఈ మార్చి 15న బిగ్ బీ అడ్వాన్స్ ట్యాక్స్ చివరి దశ పేమెంట్ గా రూ.52.5 కోట్లు కట్టడం విశేషం.

బిగ్ బీ ప్రస్తుతం కేబీసీ 16వ సీజన్ హోస్ట్ గా ఉన్నాడు. గతేడాది వేట్టయాన్, కల్కి 2898 ఏడీ మూవీస్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు సెక్షన్ 84 అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికితోడు కల్కి 2898 ఏడీ సీక్వెల్లోనూ నటించనున్నాడు. కేబీసీ కొత్త సీజన్ కు మొదట అమితాబ్ హోస్ట్ గా తప్పుకున్నాడని వార్తలు వచ్చినా.. చివరికి అతడే కొనసాగనున్నాడు.

కల్కి 2898 ఏడీ మూవీలో అశ్వత్థామ పాత్రలో బిగ్ బీ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. నిజానికి ప్రభాస్ కంటే ఎక్కువగా అమితాబ్ పాత్రకే ప్రేక్షకుల నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావడం విశేషం. ఇప్పుడు సీక్వెల్లో అతని పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం